© 2026 nimisham.in
రోజులో కాసేపు ప్రకృతిలో సమయం గడపండి. ఎండలో నిల్చోండి. దీని వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు. నీరు ఎక్కువగా తాగడం వల్ల బాడీ హైడ్రేట్ అవుతుంది. బద్దకం వదులుతుంది. డీహైడ్రేషన్ వల్ల నీరసం వస్తుంది. కాబట్టి యాక్టివ్‌గా ఉండేందుకు నీరు పుష్కలంగా తాగండి. ఆఫీస్‌లో పని చేస్తున్నప్పుడు రెగ్యులర్‌గా బ్రేక్‌లు తీసుకోండి. ప్రతి అరగంటకు ఒకసారి బ్రేక్ తీసుకోండి. దీంతో ఒత్తిడి, అలసట తగ్గుతాయి. డీప్ బ్రీతింగ్ తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఉత్సాహంగా ఉండొచ్చు. బాదం, వాల్నట్స్ వంటి హెల్తీ స్నాక్స్ తినండి. పండ్లు, చిక్కీలు తినండి. ఇవి మిమ్మల్ని ఎనర్జిటిక్‌గా ఉంచుతాయి. మీకు బద్దకంగా, నిద్ర వచ్చినట్లు అనిపిస్తే వెంటనే చల్లని నీటితో ముఖాన్ని కడగండి. దీని వల్ల నిద్ర మత్తు వదులుతుంది. యాక్టివ్‌గా ఉండొచ్చు. ఫోన్ ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కళ్లు అలసిపోతాయి. ఫోన్‌కు దూరంగా ఉంటే యాక్టివ్‌గా ఉండొచ్చు. రోజులో కాసేపు నచ్చిన వారితో సమయం గడపండి. మీకు నచ్చిన వారికి ఫోన్ చేయండి. దీని వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఉత్సాహం వస్తుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత కాసేపు వ్యాయామం చేయండి. దీని వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు. వ్యాయామం చేస్తే మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది
.