© 2026 nimisham.in
ప్రీ డయాబెటిస్ ఉన్నవారిపై జరిగిన పరిశోధనలో మనం బ్రేక్‌ఫాస్ట్ చేసే టైమ్‌లో ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎఫెక్ట్ అవుతుందని తేలింది. ప్రీ డయాబెటిస్ ఉన్న 297 మంది పెద్దవారిపై జరిగిన పరిశోధనలో శక్తి వినియోగం, శరీర కొవ్వు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా ఆలస్యంగా భోజనం ప్రారంభించడం, హై ఫాస్టింగ్ ఇన్సులిన్, హై ఇన్సులిన్ రెసిస్టెన్స్, లో ఇన్సులిన్ సెన్సిటివిటీతో సంబంధం కలిగి ఉందని తేలింది. కొన్నిసార్లు సెకండ్ మీల్ ఎఫెక్ట్ కూడా అవుతుంది. అదేంటంటే ప్రీ డయాబెటిస్ ఉన్న ఆసియాలోని మగవారిపై జరిగిన ఓ నియంత్రిత అధ్యయనంలో బ్రేక్‌ఫాస్ట్ మానేసిన వారి కంటే బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నవారిలో మధ్యాహ్నా లంచ్ టైమ్‌కి గ్లూకోజ్, ఇన్సులిన్ ప్రతిస్పందన తగ్గింది. దీనిని బట్టి, మార్నింగ్ సరైన ఫుడ్ తింటే ఆ రోజు తర్వాత శరీర జీవక్రియ ప్రతిస్పందనకి సహాయపడుతుందని తెలుస్తోంది. అయితే, బ్రేక్‌ఫాస్ట్ చేస్తే చాలు. అందులో ఏమైనా తినొచ్చు అంటే పొరపాటే. ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్, షుగర్ కలిపిన తృణధాన్యాలు, స్వీట్ డ్రింక్స్, హై గ్లైసెమిక్ ఫుడ్‌తో నిండిన హెవీ బ్రేక్‌ఫాస్ట్ అనేది గ్లూకోజ్, ఇన్సులిన్‌లో పెరుగుదలకి దారితీస్తుంది. వాస్తవానికి, ప్రీ డయాబెటిస్ ఉన్నవారిపై జరిగిన పరిశోధనలో హై ఎనర్జీ ఫుడ్ ఏదైనా ఉందంటే అది బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గ్లూకోజ్, ఇన్సులిన్ ప్రతిస్పందనలని ఎక్కువగా ఉత్పత్తి చేయగలదని తేలింది. అయినప్పటికీ మొత్తం 24 గంటల గ్లూకోజ్‌పై ఆ ఎఫెక్ట్ తక్కువగానే ఉంటుంది. ప్రీ డయాబెటిస్ ఉన్నవారు కేవలం బ్రేక్‌ఫాస్ట్ చేస్తే చాలు అనుకోకుండా ఎప్పుడు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారో గమనించుకోవాలి. మార్నింగ్ కేలరీలని తీసుకోవడం కంటే ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, లో ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ ఉన్న భోజనాన్ని తీసుకోవడం చాలా మంచిది. బ్రేక్‌ఫాస్ట్ అనేది ఓ భాగం మాత్రమే. అదే ప్రీ డయాబెటిస్‌కి ట్రీట్మెంట్ కాదు. మంచి ఫిజికల్ వర్కౌట్, హెల్దీ వెయిట్ మెంటెయిన్ చేస్తూ
, మంచి నిద్ర, నాణ్యమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అదే విధంగా, బ్రేక్‌ఫాస్ట్ ఏ టైమ్‌లో చేయాలనే వార్తల్ని గుడ్డిగా నమ్మకుండా బ్యాలెన్స్డ్ గ్లూకోజ్ లెవల్స్‌ని, మంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని అందించే ఆహారపు అలవాట్లు చేసుకోవడం ముఖ్యం.
లీడ్ కన్సల్టెంట్ - ఎండోక్రినాలజీ & డయాబెటాలజీ
రచయిత గురించిఅమల రావులఅమల రావుల సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకి మీడియా సంస్థల్లో 12 సంవత్సరాలకి పైగా పనిచేసిన అనుభవం ఉంది. 2019లో సమయం తెలుగులో చేరిన అమల హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ రైటర్‌గా పనిచేస్తున్నారు. అమలకి లైఫ్‌స్టైల్ విభాగంలో చాలా మంచి పట్టు ఉంది. ఆ సెక్షన్‌తో పాటు ఆస్ట్రాలజీ, సినిమా, పొలిటికల్ వార్తలు కూడా అందించారు. తాను ఆరోగ్యం విభాగంలో 7000కు పైగా ఆర్టికల్స్, మిగతా సెక్షన్లలో 3000కి పైగా కథనాలు మొత్తంగా 10000కు పైగా ఆర్టికల్స్‌ని అందించారు. ఆరోగ్య సంబంధిత వార్తలకి వైద్యసమాచారాన్ని కూడా జోడిస్తూ అందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో వార్తల్ని ప్రేక్షకులకి అందించగలరు. ఈ ప్రక్రియలో ఎప్పుడు కూడా తొందరపడి తప్పుడు సమాచారం అందించకుండా జాగ్రత్తపడాలని అమల నమ్ముతుంది. అమలకు ఆరోగ్య విభాగంలోనే కాకుండా ఫిట్నెస్, బ్యూటీ, ఫిట్నెస్, ఫ్యాషన్, ప్రెగ్నెన్సీ పేరేంటింగ్, హోమ్ డెకార్, రిలేషన్‌షిప్‌కి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండడంతో ఆయా సెక్షన్‌లోనూ వార్తల్ని రాశారు. అంబేద్కర్ యూనివర్సిటీలో బి.ఎ తెలుగు పూర్తి చేసిన తర్వాత మీడియా సంస్థల్లో పనిచేశారు. తనకి కథనాలు రాయడం, ఇతర భాషల నుంచి అనువదించినా స్పష్టమైన సమచారాన్ని అందించడం వంటి వాటిపై మంచి పట్టు ఉంది. ప్రేక్షకులకి నేరుగా సలహాలు ఇవ్వకుండా ఏమైనా సమస్య ఉన్నప్పుడు కచ్చితంగా అనుభవం ఉన్న ప్రొఫెషనల్, లైసెన్స్ పొందిన వైద్య నిపుణులని సంప్రదించమని చెబుతున్నారు అమల. సమయం తెలుగులో చేరడానికి ముందు అమల న్యూస్ 18 వంటి వెబ్సైట్లో 02.08.2018 నుంచి 02.07.2019 వరకూ డిజిటల్ రచయితగా చేశారు. అంతకుముందు టీవీ మీడియాలో పాలిటిక్స్ వార్తలు రాయడమే కాకుండా బులెటిన్ ప్రొడ్యూసర్, సినిమా వార్తలు రాయడం, సినిమా రివ్యూలని తెలంగాణ యాసలో అందించడం, యాంకరింగ్, పొలిటికల్ సెటైర్ ప్రోగ్రామ్‌లో యాంకరింగ్ చేశారు. తను ఖాళీ సమయంలో సినిమాలు చూడడం, కొత్త ప్రదేశాలను చూడడం, తెలియని అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఇష్టపడతారు.... ఇంకా చదవండి