
రాష్ట్రంలో పెనమలూరుప్రభుత్వ బడులు టాప్-10లో నిలవాలి
Penamaluru: రాష్ట్రంలో పెనమలూరు ప్రభుత్వ బడులు టాప్-10లో నిలవాలి: ఎమ్మెల్యే ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Penamaluru: రాష్ట్రంలో పెనమలూరు ప్రభుత్వ బడులు టాప్-10లో నిలవాలి: ఎమ్మెల్యే ఈ వార్తకు సంబంధించిన

Paderu: ‘బడి కోసం డొనేట్’ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ నిశాంతి ఈ వార్తకు సంబంధించిన

‘‘పుట్టామా..ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ లాంటి చదువులు చదివామా? మంచి ఉద్యోగం సంపాదించామా... జీవితం సక్సెస్’’ ఇది ఒకప్పటి బతుకు ఫిలాసఫీ. కానీ జెన్-జీలు ఇలా కాదంటోంది తాజా అధ్యయనం. అంతర్జాతీయ విద్యా సంస్థ ఎమిరైటస్ ‘‘ఇండియాస్ జెన్-జీ ఔట్లుక్ 2026: రీ కాల్కులేటింగ్ ఎడ్యుకేషన్, ఆంబీషన్ అండ్ సక్సెస్’’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనం నవతరం గురించి పలు ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. 1997- 2012 మధ్య పుట్టిన వాళ్లను మనం జెన్-జీ అని పిలుస్తున్నాం కదా.. వీరు దేశంలోని ప్రధాన మెట్రోల్లోని 15 - 28 ఏళ్ల మధ్య వయసున్న సుమారు వెయ్యి మందిని ప్రశ్నించి వారి ఆశలు, ఆశయాలు, విజయానికి నిర్వచనాలను సేకరించింది. ముందు తరం నడిచిన బాటను కాదని కొత్త అడుగులు వేస్తున్న వారి గురించి స్థూలంగా. మునుపటిలా చిన్న ఉద్యోగంతో మొదలుపెట్టి అంచలంచెలుగా పైకి ఎదగాలన్న సూత్రానికి వీరు విరుద్ధం. ఉద్యోగమిచ్చే మేనేజర్, జీఎం, వీపీ, ఛైర్మన్ వంటి హోదాల కంటే పనికి - జీవితానికి మధ్య బ్యాలెన్స్ ఉండాలనుకుంటున్న జెన్-జీలు సుమారు 74 శాతం. అసలు సక్సెస్ఫుల్ కెరియర్‌కు ఎగ్జిక్యుటివ్ లీడర్ కావాల్సిన అవసరమే లేదన్నది 65 శాతం మంది నమ్మకం. వీరి దృష్టిలో విజయం అంటే... నైపుణ్యాలు. అవసరానికి తగ్గట్టు మారిపోగలగడం. సంతృప్తినిచ్చే, అర్థవంతమైన పని లోకలే మేలు... ఒకప్పుడు ఎంతో పాప్యులర్ అయిన విదేశీ చదువులపై జెన్-జీకి పెద్ద ఆశలేం లేవు. పెరిగిపోతున్న ఖర్చులు, వీసా నిబంధనల్లో వస్తున్న మార్పులు, చదువు తరువాత ఉద్యోగాలు వస్తాయన్న గ్యారెంటీ లేకపోవడం వంటి కారణాల వల్ల నాణ్యమైన లోకల్ విద్యే మేలని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాలేజీ ముందునాటి చదువులు చదువుతున్న వారిలో 87 శాతం, కాలేజీల్లోకి అడుగుపెడుతున్న వారిలో 92 శాతం లోకల్ కోర్సులకు జై అంటున్నారు. విదేశీ విద్యా సంస్థలు స్థానికంగా అందించే కోర్సుల్లో చేరేందుకు అభ్యంతరం లేదని సుమారు 69

విధి చేసిన గాయం ఆ పసిపాప కాళ్లను తుంచేసింది. వయసు ఏడేళ్లు.. ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన సమయంలో ఒక కాలు లేక నరకం అనుభవిస్తోంది. ఊతకర్ర లేదు, చక్రాల కుర్చీ అంతకంటే లేదు.. కానీ, చదువుకోవాలనే ఆ చిన్నారి సంకల్పం ముందు ఆ వైకల్యం కూడా ఓడిపోయింది! విపరీతమైన పేదరికం, ఒంటికాలితో కుంటుతూ వెళ్లాల్సి వస్తున్నా సరే.. చదువుపై ఉన్న ఆరాటంతో రోజూ వందల మీటర్లు దూకుతూ బడి బాట పడుతోంది ఉత్తరప్రదేశ్ బాలిక రాగిణి. ఈ పసిపాప కష్టాన్ని చూసి ఇటు ఊరి జనం, అటు నెటిజన్లు కన్నీటి పర్యంతమవుతున్నారు.ఆరు నెలల వయసులోనే కోలుకోలేని దెబ్బ!యూపీలోని బల్లియా జిల్లా దిఘేడా గ్రామ పంచాయతీ పరిధిలోని రాణీపూర్ గ్రామానికి చెందిన ఏడేళ్ల రాగిణి కథ ఇది. ఈ చిన్నారికి కేవలం ఆరు నెలల వయసు ఉన్నప్పుడే ఒక దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో పాప ఒక కాలు తీవ్రంగా దెబ్బతింది. తండ్రి రెక్కాడితే గానీ డొక్కాడని కూలీ. తీవ్రమైన పేదరికం వల్ల ఆ చిన్నారికి సరైన వైద్యం చేయించలేకపోయారు. కాలక్రమేణా ఒక కాలు పూర్తిగా పాడైపోయింది. అలాగని రాగిణి ఇంట్లో కూర్చోలేదు. తోటి పిల్లలు బడికి వెళ్తుంటే తాను కూడా వెళ్తానని ఏడ్చేది. అలా స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో చేరింది. Viral Video: వరదలో చిక్కుకున్న బైకర్.. చున్నీతో ప్రాణాలు కాపాడిన నవ వధువురోడ్డుపై ఏడుస్తూనే పాఠశాలకు..ఇంటి నుంచి బడికి ఉన్న 400 మీటర్ల దూరాన్ని రాగిణి ఒంటికాలితో ఎగురుతూ, కుంతుతూ చేరుకుంటుంది. ఈ ప్రయాణం ఆ చిన్నారికి నరకప్రాయంగా మారింది. దారి మధ్యలో అలసిపోయి, నొప్పి తట్టుకోలేక రోడ్డుపైనే కూర్చుని ఏడుస్తూ నాకే ఎందుకీ శిక్ష దేవుడా అని ప్రశ్నిస్తుంటుంది. మళ్లీ కాసేపటికి కన్నీళ్లు తుడ్చుకుని ఒంటికాలితోనే బడి వైపు అడుగులు వేస్తుంది. ఈ దయనీయ స్థితిని చూసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమిత్ పాల్ యాదవ్

అక్షర ఆంధ్రలో శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయండి బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవ చూపాలి మధ్యాహ్న భోజన పథకంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఫీడ్ బ్యాక్ అందించాలి పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖలపై మంత్రి నారా లోకేష్ సమీక్ష అమరావతి: రాష్ట్రంలో గత ఏడాది చేపడుతున్న అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్పలితాలనిస్తోంది. ఉద్యమంలా పనిచేసి వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనకు అధికారులంతా కలసికట్టుగా కృషిచేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… 2024నాటికి రాష్ట్రంలో అక్షరాస్యత శాతం దేశంలోనే అట్టడుగున కేవలం 72.6శాతం ఉండగా, గత ఏడాదిగా కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా 25లక్షలమంది అక్షరాస్యులుగా మారారు, ఒక్క ఏడాదిలో ఇంత భారీగా అక్షరాస్యత సాధించడంపై ఎపి కృషిని కేంద్రప్రభుత్వం అభినందించినట్లు అధికారులు తెలుపగా, మంత్రి లోకేష హర్షం వ్యక్తంచేశారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన వయోజన విద్య పరీక్షా ఫలితాల్లో 10శాతం పెరిగి 82.1శాతానికి చేరుకుంది, 2027 సెప్టెంబర్ నాటికి నూరుశాతం అక్షరాస్యత సాధన దిశగా పనిచేయాలని మంత్రి కోరారు. 2027 మార్చినాటికి మరో 25లక్షలమందిని, సెప్టెంబర్ నాటికి మిగిలిన 27లక్షలమంది అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు చెప్పారు. ఇందుకోసం 11 ప్రభుత్వశాఖల సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంలో శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి, పెద్దఎత్తున ప్రజలను చైతన్యవంతం చేయాలని మంత్రి సూచించారు. ఈ ఏడాది ఇంటర్మిడియట్ రెండో సంవత్సరంలో మంచి ఉత్తీర్ణత సాధించామని ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఇంటర్మడియట్ లో సుమారు 10వేల అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. సంకల్ప్ అకడమిక్ సపోర్ట్ ప్రోగ్రామ్

Dakshinamurthy Worship : కేవలం అక్షర జ్ఞానమే కాదు, జీవితంలో ఏ రంగంలోనైనా పూర్ణ విజయాన్ని, ఉన్నత స్థాయిని సాధించాలన్నా దక్షిణామూర్తి ఆరాధన అత్యంత విశిష్టమైనది. పరమశివుని జ్ఞాన అవతారమైన దక్షిణామూర్తి సకల విద్యలకు, సమర్థతకు, సనాతన గురు పరంపరకు ఆద్యుడు. మౌన వ్యాఖ్యానంతోనే సనకాది మునుల సంశయాలను పటాపంచలు చేసి జ్ఞానోదయం కలిగించిన ఈ దివ్య స్వరూపం వెనుక ఉన్న నిగూఢ అంతరార్థం, మంత్రశాస్త్రం విశ్లేషించిన 16 దక్షిణామూర్తి స్వరూపాల ప్రాశస్త్యం నేటి సమాజానికి ఎంతో ఆవశ్యకం. మౌన వ్యాఖ్యానం... సనకాది ఋషుల బ్రహ్మజ్ఞానం బ్రహ్మదేవుని మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు నలుగురు ఋషులు బ్రహ్మజ్ఞానం కోసం ఎంతగానో తపస్సు చేశారు. తమ సందేహ నివృత్తికై పరమేశ్వరుని ఆశ్రయించగా, స్వామివారు ఒక మర్రిచెట్టు కింద యోగభంగిమలో ఆసీనులయ్యారు. ఎటువంటి శబ్దాలు, ప్రవచనాలు లేకుండా నిశ్శబ్దంగా 'మౌన వ్యాఖ్యానం' ద్వారానే ఆ నలుగురు మహర్షులకు పరిపూర్ణ బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారు. అనుభవ పూర్వకమైన ఆ దివ్య జ్ఞానానికి దక్షిణామూర్తి ప్రతీకగా నిలిచారు. దక్షిణామూర్తి అనగా 'దక్షిణ' అనగా సర్వ సమర్థత కలిగినవాడు అని అర్థం. దుఃఖాలకు మూలకారణమైన అజ్ఞానాన్ని నాశనం చేసే పరమ దయా దాక్షిణ్యమూర్తి ఈయన. సాంబశివుడికి ఎడమవైపు పార్వతీదేవి లేని ఏకైక జ్ఞాన స్వరూపమిది. ఒక కాలుతో అపస్మార పురుషుడిని అంటే అజ్ఞాన రాక్షసుడిని తొక్కిపట్టి, మరో కాలును మడిచి, అక్షమాల, పుస్తకం, జ్ఞానముద్ర, వీణను ధరించి దర్శనమిస్తారు. తత్వదృష్టిలో దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి ఒక్కటే అయినప్పటికీ, ఉపాసనా, వ్యవహార దృష్టిలో విభిన్న రూపాలుగా భావిస్తారు. ఇదే 'భిన్నత్వంలో ఏకత్వం'. మంత్రశాస్త్రం ... 16 దక్షిణామూర్తి స్వరూపాలు మంత్రశాస్త్రం, ఆగమ ప్రమాణాల ప్రకారం దక్షిణామూర్తి స్వామివారు 16 దివ్య రూపాల్లో ఉపాసకులకు ఫలాన్ని అందిస్తారు. శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి¸ హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి

అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అమరావతి, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. అక్షర ఆంధ్రలో శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఫీడ్ బ్యాక్ అందించాలని ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖలపై మంత్రి నారా లోకేశ్ ఈరోజు (మంగళవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. 2027 సెప్టెంబర్‌కు వందశాతం అక్షరాస్యత లక్ష్యమని ఉద్ఘాటించారు. ఏడాదిలో 25 లక్షల మంది అక్షరాస్యులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఏపీని అభినందించిందని అన్నారు. రాష్ట్ర అక్షరాస్యత 72.6శాతం నుంచి 82.1శాతానికి పెరిగిందని అధికారులు వివరించారు. 2027 మార్చిలో మరో 25 లక్షలు.. సెప్టెంబర్‌కు మరో 27 లక్షల మందికి అక్షరాస్యత కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బడిబయట ఉన్న ప్రతి చిన్నారిని స్కూళ్లలో చేర్చాలి.. 11 ప్రభుత్వ శాఖల సమన్వయంతో అక్షరాస్యత ఉద్యమం కొనసాగుతోందని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. బడిబయట ఉన్న ప్రతి చిన్నారిని స్కూల్లో చేర్పించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీలో ఇంకా 1,64,821 మంది బడిబయట పిల్లలు ఉన్నారని.. వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని మార్గనిర్దేశం చేశారు. ఈ ఏడాది 33 వేల మంది బడిబయట పిల్లలను స్కూల్లో విద్యాశాఖ చేర్చిందని వివరించారు. లీప్ యాప్ ద్వారా మిగిలిన పిల్లల వివరాలు ప్రధానోపాధ్యాయులకు అందించాలని నిర్ణయించామని అన్నారు. ఉపాధ్యాయుల హాజరు 98.97శాతం.. విద్యార్థుల హాజరు 85.41శాతం ఉందని వివరించారు. మూడు రోజులు వరుసగా గైర్హాజరైతే తల్లిదండ్రులను

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న అక్షర ఆంధ్ర కార్యక్రమంపై అధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో తీసుకోల్సిన తదుపరి చర్యలపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను ఖరారు చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అక్షర ఆంధ్ర కార్యక్రమం ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఇదే ఉత్సాహంతో వచ్చే ఏడాది నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత వైపు వేగంగా తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో మార్పులు వేగవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో కేవలం అధికారులే కాకుండా ప్రజాప్రతినిధులను సైతం పూర్తిస్థాయిలో భాగస్వాములను చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. దీంతో స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ బృహత్తర కార్యక్రమంలో నేరుగా పాలుపంచుకోనున్నారు. ఇదిలా ఉండగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే బడి బయట ఉండిపోయిన పిల్లలను తక్షణమే గుర్తించి వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఫలితంగా ప్రతి చిన్నారికి విద్య అందుబాటులోకి వస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేస్తూ నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులను పురమాయించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత మరియు ఇతర

భారత వైమానిక దళంలో ఓ చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. నాన్-మెడికల్ విభాగంలో 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్‌ను సాధించిన మొదటి మహిళా అధికారిణిగా శక్తి శర్మ చరిత్ర సృష్టించారు. ఢిల్లీ, సెప్టెంబర్ 1: భారత వైమానిక దళంలో ఓ చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. నాన్-మెడికల్ విభాగంలో 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్‌ను సాధించిన మొదటి మహిళా అధికారిణిగా శక్తి శర్మ చరిత్ర సృష్టించారు. ఇవాళ ఆమె ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో 'అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (ఎడ్యుకేషన్)'గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. IAFలో చేరిక: జూన్ 18, 1994న భారత వైమానిక దళానికి చెందిన ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లో ఆమె అధికారిణిగా విధుల్లో చేరారు. దాదాపు ముప్పై ఏళ్లకు పైగా విశిష్ట సేవలు అందించిన ఆమె ట్రైనింగ్ సెంటర్లు, ఫీల్డ్ స్టేషన్లు, కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో పలు కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. విద్యా రంగానికి ప్రాధాన్యం: ఐఐటీ కాన్పూర్, పుణె యూనివర్సిటీలలో డిఫెన్స్ సహకారాన్ని పెంచేలా 'IAF చైర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేయడంలో శక్తి శర్మ ప్రముఖ పాత్ర పోషించారు. అంతేకాదు, సైనిక దళాల (Tri-services) చరిత్రలోనే ఒక సైనిక స్కూల్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా (కపూర్తలా సైనిక స్కూల్ ప్రిన్సిపాల్‌గా) వ్యవహరించిన తొలి మహిళా అధికారిణిగా కూడా ఆమె రికార్డు సాధించారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంతో ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ సాధించిన ఈ ఘనత సాయుధ దళాల్లోని భావి మహిళా అధికారులకు స్ఫూర్తిదాయకం. పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. GO 25 Problems: నల్గొండ-హైదరాబాద్-ఖమ్మం ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పింగిలి శ్రీపాల్ రెడ్డిని కలిసిన ఉపాధ్యాయులు.. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీ (SGT)లు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విద్యా వ్యవస్థకు పునాది వంటి ప్రాథమిక పాఠశాలల పరిరక్షణకు, మౌలిక వసతుల కల్పనకు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బడులు మూతపడకుండా కాపాడుకోవడంతో పాటు ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను శాసనమండలి వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బ్రతికించుకోవడానికి, నాణ్యమైన విద్యను అందించడానికి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు (SGT) విజ్ఞప్తి చేస్తున్నారు. జీఓ నెంబర్ 25 వల్ల ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబోధన తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 1 నుండి 5 తరగతుల్లో 20 మంది విద్యార్థులు ఉంటే ఒక్కరినే ఉపాధ్యాయుడిగా ఇస్తున్నారు. ఇలా రాష్ట్రంలో దాదాపు 4,800 పాఠశాలలు ఒక్క టీచర్‌తోనే నడుస్తున్నాయని వాపోతున్నానరు. 21 నుండి 60 మంది పిల్లలు ఉంటే ఇద్దరు టీచర్లను ఇస్తున్నారు. కానీ, ఇద్దరు టీచర్లు ఒకే సమయంలో ఐదు తరగతులకు పాఠాలు చెప్పడం అసాధ్యంగా మారింది. దీనినే బహుళ తరగతి బోధన అని పిలుస్తున్నప్పటికీ, ఆచరణలో ఇది విఫలమవుతోందని.. దీనివల్లే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,100 పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉందంటున్నారు. ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం: పాఠాలు చెప్పడంతో పాటు ఉపాధ్యాయులపై ప్రభుత్వం తీవ్రమైన బోధనేతర భారం మోపుతోందని వాపోతున్నారు. ప్రతిరోజూ యాప్‌లలో విద్యార్థుల, ఉపాధ్యాయుల

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ (ఫిమేల్) పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరింది. మొత్తం 1,931 పోస్టుల భర్తీకి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) మంగళవారం సాయంత్రం రెండో ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది. 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 16 నుంచి 26వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం తుది మెరిట్ లిస్ట్, సెలక్షన్ జాబితాలను విడుదల చేస్తారు. ఈ పోస్టుల భర్తీ కోసం 2023 జులై 26న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది మే 14న ప్రొవిజినల్ లిస్ట్ విడుదల చేసి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం జులై 10న తొలి తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేశారు. మరోసారి అభ్యంతరాలను స్వీకరించి వాటిని పరిశీలించాక తాజాగా రెండో తాత్కాలిక జాబితాను విడుదల చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు హైదరాబాద్‌లోని వెంగళరావునగర్‌లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఈ నెల 28వ తేదీని రిజర్వ్‌డేగా నిర్ణయించారు. తమకు కేటాయించిన తేదీన వెరిఫికేషన్‌కు హాజరు కాలేకపోయిన వారు ఆ రోజు వెళ్లే అవకాశం కల్పించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

హైదరాబాద్ నగరం గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా ఎదిగే క్రమంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. బ్రిటన్‌కు చెందిన ప్రతిష్టాత్మక 'యూనివర్సిటీ ఆఫ్ లండన్', అమెరికాలోని బోస్టన్‌కు చెందిన 'నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ' తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో నెలకొల్పనున్నాయి. ఈ రెండు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు భారత్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' ప్రతినిధి బృందం బ్రిటన్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే, రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో, అధికారుల బృందం అగ్రరాజ్యంలో పర్యటించింది. ఈ పర్యటనల్లో భాగంగా నిర్వహించిన ఉన్నత స్థాయి చర్చలు సఫలీకృతం కావడంతో, ఈ ప్రఖ్యాత విద్యాసంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు అంగీకరించాయి.వీటితో పాటు, ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం సైతం తెలంగాణలో స్వల్పకాలిక 'ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లు', విభిన్న కోర్సులను అందించేందుకు ఆసక్తి కనబరిచినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి అగ్రశ్రేణి విద్యాసంస్థలతో జరిపిన చర్చలు కూడా ఫలవంతమయ్యాయి.ఈ పరిణామంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు తెలంగాణతో భాగస్వామ్యం కావడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన కొనియాడారు. నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, విద్యపై ప్రత్యేక దృష్టి సారించి, రాష్ట్ర యువత విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్‌లోనే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన

పట్నా: బిహార్‌లో ప్రభుత్వ పాఠశాలలు ఎటువంటి దుస్థితిలో ఉన్నాయో అక్కడి సమస్తిపూర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను చూస్తే అర్థమవుతుంది. పేద, దళిత బస్తీకి చెందిన చిన్నారులు కనీస సౌకర్యాలు లేకుండా ఈ బడిలో చదువుకుంటున్నారు. సమస్తిపూర్ నగరంలోని బీఈడీ కాలేజ్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న పిల్లలకు కనీస విద్యా సదుపాయాలు కూడా అందుబాటులో లేవు. పక్కా తరగతి గదులు లేకపోవడంతో పిల్లలు గుడిసెలాంటి రెండు గదుల్లో నేలపై కూర్చొని చదువుతున్నారు. ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఐదు తరగతులకు కేవలం రెండు గదులు మాత్రమే ఉన్నాయి. ఒక గదిలో 1, 2, 3 తరగతుల పిల్లలకు కలిపి బోధిస్తున్నారు. మరో గదిలో 4, 5 తరగతుల పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. పిల్లలు ఎక్కువగా నేలపైనే కూర్చుంటున్నారు. సరైన బెంచీలు, డెస్కులు లేవు. బ్లాక్‌బోర్డు కూడా సరిగా లేదు. వేసవిలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. పాఠశాలలో తగినన్ని ఫ్యాన్లు లేకపోవడంతో తరగతి గదుల్లో వేడి, ఉక్కపోతతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. పాముల భయం పాఠశాలలో విద్యార్థులు పాముల భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. పాఠశాలలో సరైన బెంచీలు, డెస్కులు లేకపోవడంతో పిల్లలు నేలపైనే కూర్చోవాల్సి వస్తోంది. దీంతో పాములు లోపలికి వస్తే వారిని కరిచే ప్రమాదం ఉంది. పాఠశాల చుట్టుపక్కల పాములు కనిపిస్తున్న ఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. గుడిసెలాంటి నిర్మాణం, చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా పిల్లల్లో భయం నెలకొంది. తమ చిన్నారులను పాఠశాలకు పంపుతున్న తల్లిదండ్రులు కూడా భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు సురక్షితంగా ఉండాల్సిన పాఠశాలలోనే పాముల భయం ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భద్రతపై పాఠశాల యాజమాన్యం, అధికారులు

Nirmal: ఆచరణాత్మక విద్యతోనే సృజనాత్మకత కేజీబీవీ తనిఖీలో కలెక్టర్ మిశ్రా ఈ వార్తకు సంబంధించిన

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ ఏడాది జులై నెలలో ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకుందని నడ్డా పేర్కొన్నారు. కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి, విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు నడ్డా తెలిపారు. విద్యార్థులు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. దేశ యువత, విద్యార్థుల అభ్యున్నతి, వికాసమే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని నడ్డా చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్ 5న నిర్వహించాల్సిన ర్యాలీని విరమించుకుంటున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించడాన్నీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్వాగతించారు. కాగా, నీట్ పేపర్ లీక్‌తో దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లో సీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. కొన్ని వారాలపాటు ఆందోళనలు కొనసాగగా.. జులై 20 నుంచి 25 మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో నిరసనకారులపై కేసులు నమోదయ్యాయి. అయితే, విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను సుప్రీంకోర్టు నేడు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీజేపీ నిరసనలకు సంబంధించిన కేసులను ఉపసంహరించుకుంటామని, కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు

తెలుగు ఓటిటి రంగంలో సరికొత్త అధ్యాయానికి నెట్‌ఫ్లిక్స్ వేదికైంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ తన తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొదటి ఒరిజినల్ వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు' జూలై 2న అనగా ఈరోజే మధ్యాహ్నం 12:30 గంటల నుండి స్ట్రీమింగ్ కానుంది. సమాజంలో నేటికీ ఒక టాబూగా లేదా రహస్యంగా మిగిలిపోయిన సెక్స్ ఎడ్యుకేషన్ అనే ప్రధానాంశాన్ని బేస్ చేసుకుని ఈ సిరీస్‌ను నిర్మించారు. హాస్యం మరియు హృదయానికి హత్తుకునే కథాంశంతో ఈ కామెడీ-డ్రామా సిరీస్ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కథ అంతా మాకిపూర్ అనే ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో సాగుతుంది. జీవితంలో పెద్దగా అదృష్టం లేని సుబ్రహ్మణ్యం 'సుబ్బు' చిల్లుకూరి రావు అనే ఒక యువకుడు అనుకోకుండా ఆ ఊరి సెక్స్ ఎడ్యుకేషన్ అధికారిగా నియమితుడవుతాడు. సాంప్రదాయాలు ఎక్కువగా పాటించే తన తండ్రి ఆగ్రహానికి గురికాకుండా మరియు గ్రామస్థుల నుండి వచ్చే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటూ సుబ్బు తన విధులను ఎలా నిర్వహించాడనేది ప్రధాన కథాంశం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే హాస్యం, భావోద్వేగాలు మరియు సామాజిక సందేశాలు వీక్షకులను ఆకట్టుకుంటాయి. ప్రముఖ దర్శకుడు మల్లిక్ రామ్ ఈ సిరీస్‌ను అద్భుతంగా సృష్టించి దర్శకత్వం వహించారు. గతంలో 'తిల్లు స్క్వేర్' వంటి భారీ విజయవంతమైన చిత్రాలను అందించిన మల్లిక్ రామ్ ఈ ప్రాజెక్ట్ ద్వారానే డిజిటల్ లేదా ఓటిటి స్పేస్‌లోకి అడుగుపెట్టడం విశేషం. రమేష్ ఎలిగేటి మరియు శివాని ధోబాల్తో కలిసి ఆయన ఈ సిరీస్ స్క్రిప్ట్‌ను పకడ్బందీగా సిద్ధం చేశారు. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌ను చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు రాజీవ్ చిలక మరియు భరత్ లక్ష్మీపతి ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఈ సిరీస్‌లో సుందీప్ కిషన్ కథానాయకుడు సుబ్బు పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకోనున్నారు. మంచి ఉద్దేశాలు ఉన్నప్పటికీ ఎప్పుడూ సమస్యల్లో చిక్కుకుపోయే ఒక

హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’గా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇటీవల బ్రిటన్, అమెరికా దేశాల్లో చేపట్టిన సుదీర్ఘ పర్యటన విజయవంతమైంది. ఈ విదేశీ పర్యటనలో సాధించిన చారిత్రాత్మక పురోగతి, ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలతో కుదిరిన కీలక ఒప్పందాలు, అవగాహనా ఒప్పందాలు (MoUs), లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI)ల సమగ్ర వివరాలతో కూడిన ప్రత్యేక నివేదికను ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసింది. ఐటీ, పరిశ్రమలు, ఫార్మా, లైఫ్ సైన్సెస్, పరిశోధన, డిఫెన్స్ రంగాల్లో ఇప్పటికే ప్రపంచ పటంలో ప్రత్యేక ముద్ర వేసిన హైదరాబాద్ నగరాన్ని, ఇప్పుడు అంతర్జాతీయ విద్యా, నైపుణ్య రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. కమిటీ నివేదిక ప్రకారం అమెరికాలోని అత్యుత్తమ ‘నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ’తో పాటు బ్రిటన్‌లోని 17 స్వతంత్ర విద్యాసంస్థల సమాఖ్య అయిన ‘యూనివర్సిటీ ఆఫ్ లండన్’ భారత్‌లోనే తమ తొలి ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు స్పష్టమైన అంగీకారం తెలిపాయి. ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ వర్సిటీ తమ క్యాంపస్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ఏర్పాటు చేసే అవకాశాలను ముమ్మరంగా పరిశీలిస్తోంది. దీనికితోడు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచే ‘హార్వర్డ్ యూనివర్సిటీ’ హైదరాబాద్‌లోని డాక్టర్ MCR HRD ఇన్స్టిట్యూట్ వేదికగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ రంగ ప్రతినిధుల కోసం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను నిర్వహించేందుకు పచ్చజెండా ఊపింది. ఈ అంతర్జాతీయ కోర్సులు రాబోయే నవంబర్ నెల నుంచే నగరంలో ప్రత్యక్షంగా ప్రారంభం కానున్నాయి. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రతినిధి బృందం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE), స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS), ఆక్స్ఫర్డ్

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక ఉపాధ్యాయుడి నిర్వాకం విద్యార్థి ప్రాణాల మీదికి తెచ్చింది. నికోల్ ప్రాంతంలోని ఓస్కూల్లో టీచర్ కొట్టిన చెంపదెబ్బకు పదో తరగతి విద్యార్థి చెవి రంధ్రం తీవ్రంగా దెబ్బతిని పాపం సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. స్థానిక స్కూల్ ప్రాంగణంలో విద్యార్ధులంతా నేలపైన కూర్చుని ఉన్నారు. ముగ్గురు ఉపాధ్యాయులు ఆ విద్యార్ధులకు ఏదో చెబుతున్నారు. వారిలో కొందరు విద్యార్ధులను పిలిచి నిలబెడుతున్నారు.. విద్యార్ధులు ఆలస్యంగా వచ్చారా.. లేక హోంవర్క్ చేయలేదా ఎందుకు అలా నిలబెడుతున్నారు అనే విషయం పక్కన పెడితే.. ఆ విద్యార్ధుల్లో పదో తరగతి చదువుతున్న నిజ్ అనే విద్యార్థిని, లక్ష్మణ్ పరాటే అనే ఉపాధ్యాయుడు పిలిచి అక్కడ నిలబడమని చెబుతూ విద్యార్ధి చెంపపై గట్టిగా కొట్టాడు. ఇంటికి వెళ్లాక చెవి విపరీతంగా నొప్పి రావడంతో విద్యార్ధి విలవిలలాడిపోయాడు. దాంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఈఎన్టీ సర్జన్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి, చెవి పొర పూర్తిగా చిట్లిపోయినట్లు నిర్ధారించారు. మందులు ఇచ్చి, పది రోజుల పరిశీలన తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడకపోతే సదరు విద్యార్థికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు స్పష్టం చేశారు. ఈ ఘోర ఉదంతంపై విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల ట్రస్టీలను కలిసి నిలదీయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పాఠశాల యాజమాన్యం నిందితుడైన టీచర్ లక్ష్మణ్ పరాటేను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈ ఘటనను జిల్లా విద్యాశాఖ అధికారి తీవ్రంగా పరిగణించారు. పాఠశాల అంతర్గత విచారణ నివేదికతో పాటు, టీచర్ వివరాలను సమర్పిస్తూ 24 గంటల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలని స్కూల్ యాజమాన్యానికి ‘షోకాజ్’ నోటీసులు జారీ చేశారు. Suriya: రాజకీయాల్లోకి సూర్య? క్లారిటీ ఇదే.. Maa Inti Bangaram: గుడ్ న్యూస్.. OTTలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ ఫిల్మ్ ఇండస్ట్రీకి మోదీ గుడ్‌న్యూస్!ఇక ఊరూరా థియేటర్లే! Nandini Reddy: సమంత ప్రెగ్నెంట్ అని తెలిశాకే.. ఆ సీన్లన్నీ షూట్

విద్యాశాఖలో సంస్కరణలు కొనసాగించాలని సూచన యువతలో స్ఫూర్తి నింపేలా లోకేష్ ప్రసంగించారని అభినందించిన రాష్ట్రపతి విద్యాశాఖ మంత్రిగా దేశానికే ఆదర్శంగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం కృషి చేస్తూ, ఎన్నో సంస్కరణలు విజయవంతంగా అమలు చేస్తున్న నారా లోకేష్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. ఈ సంస్కరణలు కొనసాగాలని సూచించారు. అనంతపురంలోని ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరై తిరిగి వెళుతున్నప్పుడు రాష్ట్రపతికి వీడ్కోలు పలికేందుకు హెలికాప్టర్ వరకు మంత్రి లోకేష్ వెళ్లారు. తన దగ్గరకు మంత్రిని పిలిచిన రాష్ట్రపతి.. ఏపీలో విద్యాసంస్కరణలు, విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు చాలా బాగున్నాయని అభినందించారు. వీటిని కొనసాగించాలని సూచించారు. విద్యార్థులు కేంద్రంగా సాగుతున్న విద్యా వ్యవస్థ మార్పులు వారికి బంగారు భవిష్యత్తుకు మార్గం వేస్తాయన్నారు. స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్ ప్రసంగం స్ఫూర్తివంతంగా సాగిందని రాష్ట్రపతి అభినందించారు. సభకు హాజరైన గ్రాడ్యుయేట్స్‌కు మంచి సందేశం ఇచ్చారని ప్రశంసించారు

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Thalliki Vandanam:శ్రీకాళహస్తిలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేశ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అదే తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (PTM) కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఆ సమావేశాల అనంతరం రెండో విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. అంతేకాకుండా, జులై 15 నుంచి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించే డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై కూడా మంత్రి లోకేశ్ విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలు, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ప్రజలకు వివరించే బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని అన్నారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. 'తల్లికి వందనం' పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం వల్ల విద్యార్థుల చదువుకు ప్రోత్సాహం లభించడంతో పాటు కుటుంబాలపై ఆర్థిక భారం కూడా తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు మంత్రి చేసిన తాజా ప్రకటనతో లబ్ధిదారుల్లో స్పష్టత వచ్చింది. జులై 16 నుంచి 18 మధ్య తమ బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అవుతాయని వారు ఆశిస్తున్నారు. పథకానికి అర్హులైన వారు తమ బ్యాంకు ఖాతా వివరాలు, అవసరమైన పత్రాలు

ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన విప్లవాత్మక మార్పులపై దేశ అత్యున్నత అధినేత ప్రశంసలు కురిపించారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన సెంట్రల్ యూనివర్సిటీ మొదటి కాన్వొకేషన్ వేడుకకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీసుకుంటున్న చర్యలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులే కేంద్రంగా సాగుతున్న ఈ నూతన విధానాలు రాష్ట్ర భవిష్యత్తును పూర్తిగా మార్చేయనున్నాయని కొనియాడారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి విద్యా రంగంలో అనేక స్టూడెంట్ సెంట్రిక్ మార్పులు ప్రవేశపెట్టారు. ఈ సంస్కరణలు విద్యార్థుల మేధో వికాసానికి ఎంతో దోహదం చేస్తాయని రాష్ట్రపతి స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విద్యా విధానాలు అత్యంత అద్భుతంగా ఉన్నాయని ఆమె ప్రశంసించారు. యువత ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ తరహా సంస్కరణలను ఇలాగే నిరంతరాయంగా కొనసాగించాలని మంత్రి లోకేశ్‌కు సూచించారు. నాణ్యమైన విద్య ద్వారానే సమాజంలో శాశ్వత మార్పులు సాధ్యమవుతాయని అభిప్రాయపడ్డారు. ఈ అధికారిక కార్యక్రమం ముగిసిన అనంతరం హెలిప్యాడ్ వద్ద ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో మంత్రి నారా లోకేశ్‌ను ప్రత్యేకంగా పక్కకు పిలిచారు. విద్యా రంగంలో ఆయన చూపిస్తున్న చొరవ, పట్టుదలను వ్యక్తిగతంగా అభినందిస్తూ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఒక రాష్ట్ర విద్యా శాఖ మంత్రికి దేశ ప్రథమ పౌరురాలి నుండి ఈ స్థాయి గుర్తింపు లభించడం విశేషం. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఆంధ్రప్రదేశ్ యువత అంతర్జాతీయ నైపుణ్యాలను సాధించాలనే లక్ష్యాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణల వల్ల ఏపీ యువత ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా ఎదుగుతుందని భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునేలా స్థానిక విద్యార్థులను తీర్చిదిద్దడం అత్యంత ప్రశంసనీయమని
ప్రభుత్వ నియామక ప్రక్రియలో దొర్లే జాప్యానికి ఝార్ఖండ్‌లో చోటుచేసుకున్న ఈ ఉదంతమే నిదర్శనం. దశాబ్దాలుగా పారా టీచర్‌గా సేవలందించిన ఒక వ్యక్తికి, తన పదవీ విరమణకు కేవలం ఒక్కరోజు ముందు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా శాశ్వత నియామక పత్రం అందింది. ఫలితంగా, ఆ హోదాలో విధుల్లో చేరకుండానే ఆయన ఉద్యోగ విరమణ చేయాల్సి రావడం గమనార్హం.జమ్తారా జిల్లాకు చెందిన నంద్లాల్ రవాణీ (60) 2006 నుంచి పారా టీచర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో ఆయన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం 2023లో పారా టీచర్ల క్రమబద్ధీకరణ కోసం చేపట్టిన నియామక ప్రక్రియకు ఆయన దరఖాస్తు చేసుకోగా, అప్పటికి ఆయన వయసు 57 ఏళ్లు. మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం, 2026 జూన్ 29న ఆయనకు శాశ్వత అసిస్టెంట్ టీచర్‌గా నియామక ఉత్తర్వులు అందాయి. అయితే, సరిగ్గా మరుసటి రోజే (జూన్ 30న) ఆయన 60 ఏళ్ల పూర్తి కావడంతో పదవీ విరమణ పొందారు.జూన్ 29న రాంచీలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మొత్తం 1,042 మంది నూతన ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందజేశారు. రవాణీ సైతం ఇదే వేదికపై ముఖ్యమంత్రి నుంచి పత్రం అందుకున్నారు. కాగా, ఇదే తరహాలో పాలము జిల్లాకు చెందిన నియుమ్ అన్సారీ అనే మరో ఉపాధ్యాయుడికి, ఆయన మే 31న పదవీ విరమణ చేసిన తర్వాత నియామక పత్రం అందడం గమనార్హం.ఈ ఉదంతంపై నంద్లాల్ రవాణీ స్పందిస్తూ, "2006 నుంచి విద్యాబోధన చేస్తున్నాను. శాశ్వత ఉద్యోగం కోసం

AP EAPCET 2026: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ ఫలితాలు విడుదలైన సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ ఏడాది ఇంజనీరింగ్ విభాగంలో 1,82,317 మంది (70.52%) అర్హత సాధించగా, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో రికార్డు స్థాయిలో 63,546 మంది (89.59%) ఉత్తీర్ణత సాధించారు. ఈ విజయాలు రాష్ట్ర ప్రగతికి సరికొత్త ఊతాన్నిస్తాయని ఆయన ఆకాంక్షించారు. CM Chandrababu: నాకు ‘మావిగన్’ అంటే ఏంటో తెలీదు.. గొడ్డలి పార్టీపై నమ్మకం పోయింది.. జగన్ పై సీఎం చంద్రబాబు ఆగ్రహం ఈ ఫలితాల్లో విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంలో ఆడబిడ్డలు 71.65 శాతం ఉత్తీర్ణతతో అబ్బాయిల కంటే ముందంజలో నిలవడం విశేషం. సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మన విద్యార్థుల నైపుణ్యాలు ఏపీ భవిష్యత్తును మరింత ఉజ్వలంగా మారుస్తాయన్నారు. పరీక్ష(AP EAPCET 2026) రాసిన అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్సైట్ cets.apsche.ap.gov.in/EAPCET నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే, ఫలితాలు మరియు కౌన్సెలింగ్ వివరాల కోసం 9552300009 అనే ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని తదుపరి విద్యా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు

AP EAPCET Results Out | ఇంటర్నెట్ డెస్క్: ఏపీ ఎప్‌సెట్ ఫలితాలు (AP EAPCET 2026 Results) విడుదలయ్యాయి. లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఈ ఫలితాలను ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ విభాగంలో 2,76,572మంది దరఖాస్తు చేసుకోగా.. 2,58,545 మంది హాజరయ్యారు. వీరిలో 1,82,317మంది (70.52%) క్వాలిఫై అయినట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. అలాగే, అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో 79,231మంది దరఖాస్తు చేసుకోగా.. 70,929మంది హాజరయ్యారు. వీరిలో 63,546 మంది (89.59%) క్వాలిఫై అయినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఫలితాలను eenadu.netలో చూడొచ్చు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఒడిశాలో విద్యావ్యవస్థలో జరిగిన ఓ భారీ తప్పిదం తీవ్ర దుమారం రేపుతోంది. ఐదో తరగతి విద్యార్థుల కోసం ముద్రించిన ప్రభుత్వ పాఠ్యపుస్తకంలో ఏకంగా ఓ ప్రముఖ బాలీవుడ్ సినిమా పాటను అచ్చు వేయడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో విద్యాశాఖపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ఈ పొరపాటును ట్రోల్ చేయగా, మరికొందరు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అసలేం జరిగింది?ఒడిశా ప్రభుత్వ పాఠశాలల్లో వినియోగిస్తున్న 5వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఓ పాఠంలో ఈ పొరపాటు చోటుచేసుకుంది. 1999లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిందీ చిత్రం 'హమ్ దిల్ దే చుకే సనమ్'లోని సూపర్ హిట్ పాట 'నిమ్మూడ నిమ్మూడ'ను యథాతథంగా ముద్రించారు. ఐశ్వర్య రాయ్‌పై చిత్రీకరించిన ఈ పాట, వాస్తవానికి ఓ రాజస్థానీ జానపద గీతం. పుస్తకాల ప్రింటింగ్ లేదా ప్రచురణ దశలో జరిగిన తీవ్రమైన నిర్లక్ష్యం కారణంగానే ఈ భారీ తప్పిదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్ర విద్యావ్యవస్థ, పాఠ్యపుస్తకాల సమీక్షా కమిటీల పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.తప్పుల జాతర.. ఇదొక్కటే కాదు!అయితే, ఈ సినిమా పాట ముద్రణ ఒక్కటే పొరపాటు కాదని, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) పుస్తకాల్లో ఇలాంటివి వేల సంఖ్యలో ఉన్నాయని తేలడం గమనార్హం. మొత్తం పాఠ్యపుస్తకాల్లో 1,600కు పైగా తప్పులు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో 8వ తరగతి పుస్తకాల్లోనే అత్యధికంగా 705 తప్పులు ఉన్నాయి. ఈ తప్పుల్లో కొన్ని విస్తుపోయేలా ఉన్నాయి. ఉదాహరణకు, కర్ణాటక అసెంబ్లీ భవనాన్ని ఒడిశా విధాన

ఏపీలో విద్యాభివృద్ధికి మంత్రి లోకేశ్ చేస్తున్న కృషి బాగుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు భోగాపురంలో పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్ సందర్శన విజయనగరం, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ఏపీలో విద్యాభివృద్ధికి మంత్రి లోకేశ్ చేస్తున్న కృషి బాగుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్‌ను ధర్మేంద్ర ప్రధాన్, లోకేశ్‌లు మంగళవారం సందర్శించారు. ఆధునిక విద్యాబోధన, మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ అందిస్తున్న విద్యార్థి ప్రోగ్రెస్ కార్డ్, అసె్‌సమెంట్ బుక్లెట్ గురించి కేంద్రమంత్రికి లోకేశ్ వివరించారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్ర కిట్, స్నాక్స్‌లను కేంద్రమంత్రి పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని కేంద్రమంత్రి రుచి చూశారు. ‘కానా అచ్చాహై (ఆహారం బాగుంది)’ అని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు
.webp)
దేశాన్ని వికసిత భారత్‌గా మార్చే అద్భుత లక్ష్య సాధనలో నవతరానికి చెందిన యువతదే అత్యంత కీలకమైన పాత్ర అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. విద్య, స్వీయ సాధికారతలే యువతకు శ్రీరామరక్ష అని ఆమె పేర్కొన్నారు. విశాఖపట్నంలో మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) ప్రథమ స్నాతకోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ చారిత్రాత్మక వేడుకలో పట్టాలు అందుకున్న విద్యార్థి లోకాన్ని ఉద్దేశించి ప్రథమ పౌరురాలు స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. సాంకేతిక రంగంలో వస్తున్న సమూల మార్పులను అందిపుచ్చుకుంటూనే, మన మూలాలు మరిచిపోకుండా గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను, గొప్ప వారసత్వాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. తొలి స్నాతకోత్సవంలో భాగంగా విద్యార్థులకు, శ్రమించిన అధ్యాపక బృందానికి, చేదోడుగా నిలిచిన తల్లిదండ్రులకు ఆమె హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విద్యా సంస్థ సాధించిన ప్రగతిపై రాష్ట్రపతి ముర్ము హర్షం వ్యక్తం చేస్తూ.. ఇక్కడ డిగ్రీలు పొందిన వారిలో సుమారు 40 శాతం మంది, బంగారు పతకాలు కైవసం చేసుకున్న వారిలో ఏకంగా 70 శాతం మంది విద్యార్థినులే ఉండటం ఒక అద్భుత పరిణామమన్నారు. ఈ ఫలితాలు దేశంలో మహిళా సాధికారతకు, విద్యా రంగంలో లింగ సమానత్వానికి అద్దం పడుతున్నాయని కొనియాడారు. గిరిజన విశ్వవిద్యాలయాల ప్రాధాన్యతను వివరిస్తూ.. ఇవి కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే సాధారణ విద్యా కేంద్రాలుగా మాత్రమే మిగిలిపోకూడదని హితవు పలికారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు ఆత్మవిశ్వాసం కల్పించి, వారిలో సరికొత్త నాయకత్వ లక్షణాలను పెంపొందించే అద్భుత కేంద్రాలుగా రూపాంతరం చెందాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఆరోగ్యం, ఉపాధి, అటవీ హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై ఇటువంటి సంస్థలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. విద్యార్థి జీవితంలో స్నాతకోత్సవం అనేది ఒక కీలకమైన మైలురాయి అని, ఇది కేవలం సంబరాల రోజు మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తు కోసం

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తన కుటుంబం గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ప్రముఖ టాక్ షో 'కాఫీ విత్ కరణ్'లో మాట్లాడుతూ, కపూర్ కుటుంబంలో అత్యంత విద్యావంతుడిని తానేనని సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి గల కారణాన్ని కూడా ఆయన వివరించారు.పదో తరగతి ఫలితాలు వచ్చినప్పుడు తాను అమెరికాలో ఉన్నానని, తన తండ్రి రిషి కపూర్ దర్శకత్వంలో వస్తున్న 'ఆ అబ్ లౌట్ చలే' సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్లు గుర్తుచేసుకున్నారు. తనకు పదో తరగతిలో 54.3 శాతం మార్కులు వచ్చాయని తల్లి నీతూ కపూర్ ఫోన్ చేసి చెప్పగానే ఆమె ఆనందంతో కేకలు వేశారని తెలిపారు.కపూర్ కుటుంబంలో ఒక్క ఏడాది కూడా ఫెయిల్ కాకుండా పదో తరగతి పాసైన మొదటి అబ్బాయిని తానే కావడంతో, అమెరికాలోనే తన కోసం పెద్ద పార్టీ ఇచ్చారని రణ్‌బీర్ వెల్లడించారు. "ఆ వార్త విని మా నానమ్మ కళ్లలో ఆనందభాష్పాలు చూశాను. అందుకే మా కుటుంబంలో అందరికంటే నేనే ఎక్కువ చదువుకున్నా" అని ఆయన నవ్వుతూ చెప్పారు.ఇక రణ్‌బీర్ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఆయన సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'లవ్ & వార్' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన భార్య అలియా భట్, విక్కీ కౌశల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీనితో పాటు నితేశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రామాయణ' చిత్రంలో రాముడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు

దేశ నిర్మాణంలో విద్యావంతులైన యువతదే అత్యంత కీలక భూమిక అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖపట్నం, జూన్ 30: దేశ నిర్మాణంలో విద్యావంతులైన యువతదే అత్యంత కీలక భూమిక అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ఇవాళ(మంగళవారం) విశాఖపట్నంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. 'నేను కూడా ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన మొదటి గ్రాడ్యుయేట్‌ను. ఈరోజు ఇంతమంది యువతీయువకులకు పట్టాలు అందించడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది' అని భావోద్వేగంగా పేర్కొన్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో సమాజంలో ఇంకా వెనుకబడి ఉన్న అట్టడుగు వర్గాలను మరవకూడదని ఆమె విద్యార్థులకు హితవు పలికారు. 'మీరు జీవితంలో ముందుకు వెళ్లడమే కాదు.. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న ఎందరో పేదలు, అట్టడుగు వర్గాల వారు కనిపిస్తారు. వారిని ప్రోత్సహించడంలో మీ వంతు సహకారం అందించాలి' అని పిలుపునిచ్చారు. 'వికాసిత్ భారత్' లక్ష్య సాధన దిశగా యువత పాత్ర ఎంతో కీలకమని, దేశ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం లాంటి మహానుభావుల జీవితాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఐపీఎస్ సునీల్ కుమార్‌కు చుక్కెదురు.. పిటిషన్‌ను కొట్టివేసిన ‘క్యాట్’ విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారితో పాటు ఇద్దరి మృతి

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలని ఆకాంక్షించారు. విశాఖపట్నం, జూన్ 30: ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలని ఆకాంక్షించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ కల సాకారం అవుతుందన్నారు. స్వయంకృషితో రాష్ట్రపతిగా ఎదిగిన వ్యక్తి ద్రౌపది ముర్ము అని కొనియాడారు. విద్యార్థులను భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఈరోజు(మంగళవారం) విశాఖలోని కేంద్రీయ గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా13 మందికి రాష్ట్రపతి బంగారు పతకాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మంత్రి సంధ్యారాణి, ట్రైబల్ యూనివర్సిటీ ఛాన్సలర్, వీసీ పాల్గొన్నారు. ఐపీఎస్ సునీల్ కుమార్‌కు చుక్కెదురు.. పిటిషన్‌ను కొట్టివేసిన ‘క్యాట్’ విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారితో పాటు ఇద్దరి మృతి

రాష్ట్ర విద్యా వ్యవస్థలో సంస్కరణల శకం పూర్తయిందని, ఇకపై నూరు శాతం ఫలితాలు సాధించడమే అందరి లక్ష్యం కావాలని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విజయనగరం దాసన్నపేటలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జరిగిన క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజాప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు పూర్తయ్యాయని, ఇప్పుడు పూర్తిగా అభ్యసన ఫలితాలపైనే దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.గత ఏడాది సంస్కరణల ఫలితంగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, అయితే ఇది తొలిమెట్టు మాత్రమేనని లోకేశ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఫలితాలతో సంతృప్తిగా లేరని, నూరు శాతం ఫలితాలనే ఆశిస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల క్షేత్రస్థాయి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఇకపై ప్రతినెలా ఒక క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరవుతానని హామీ ఇచ్చారు. విద్యార్థుల్లో ఒత్తిడి లేని విధంగా వినూత్న పద్ధతుల్లో మెళకువలు నేర్పాలని సూచించారు.యువగళం పాదయాత్ర సమయంలో కర్నూలు జిల్లాలో వలస కుటుంబాలను, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను చూసి చలించిపోయానని, అప్పుడే విద్యారంగంలో సంస్కరణలు తేవాలని నిర్ణయించుకున్నానని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. విద్యాశాఖ ఎంతో సవాలుతో కూడుకున్నదైనా, సమాజంలో మార్పు విద్య ద్వారానే సాధ్యమని తాను నమ్ముతానని పేర్కొన్నారు.విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక 10 వేల పాఠశాలల్లో 'వన్ క్లాస్ వన్ టీచర్' విధానం తెచ్చామని, డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని వివరించారు. ఈ ఏడాది మరో డీఎస్సీ ద్వారా అదనంగా 3

రాష్ట్రంలో ఈ ఏడాది డీఎస్సీ ద్వారా మరో 3వేల పోస్టులు భర్తీ చేయబోతున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. విజయనగరం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ ఏడాది డీఎస్సీ ద్వారా మరో 3వేల పోస్టులు భర్తీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ప్రకటించారు. విద్యామంత్రిగా తాను బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో 10వేల స్కూళ్లలో వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇప్పటికే డీఎస్సీ ద్వారా 16వేల టీచర్ పోస్టులు భర్తీచేశామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను దేశంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఉద్ఘాటించారు ఇందుకోసం ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులంతా కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు (శనివారం) విజయనగరం దాసన్నపేట జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి మంత్రి లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అభ్యసనా ఫలితాలపైనే ఉపాధ్యాయులంతా దృష్టి సారించాలి.. విద్యావ్యవస్థలో ప్రజాప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు పూర్తి అయ్యాయని మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఇక పూర్తిగా అభ్యసనా ఫలితాలపైనే ఉపాధ్యాయులంతా దృష్టిసారించాలని సూచించారు. ఇకపై నెలకోసారి క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్‌లో పాల్గొని ఉపాధ్యాయుల క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుంటానని చెప్పుకొచ్చారు. సంస్కరణల కారణంగా గత ఏడాది అద్భుతమైన ఫలితాలు వచ్చాయని వివరించారు. ఇది తొలిమెట్టు మాత్రమేనని అన్నారు. నూరుశాతం ఫలితాల సాధనపై దృష్టిసారించాలని ఆదేశించారు. ఇన్నోవేటివ్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి లేని విధంగా మెళకువలు నేర్పాలని దిశానిర్దేశం చేశారు. యువగళం పాదయాత్ర సమయంలో ఈ సంస్కరణల ఆలోచన.. యువగళం పాదయాత్ర సమయంలో కర్నూలు జిల్లాలో తాను పర్యటిస్తున్న సమయంలో ఉపాధి కోసం పిల్లాపాపలతో వలస వెళ్లే కుటుంబాలను చూశానని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. ‘పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను గమనించాను. విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావాలని ఆనాడే నిర్ణయించుకున్నా. అత్యంత సవాళ్లతో కూడిన
తెలంగాణను ప్రపంచ స్థాయి ఎడ్యూకేషన్ హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులకు ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంలో శుక్రవారం 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. తెలంగాణతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్య అవకాశాలు, రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలు కల్పించే అంశాలపై ప్రముఖ విద్యావేత్తలతో విస్తృతంగా చర్చించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిధిలోని బ్లోవాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌కు చెందిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బేలియోల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్‌ను వారికి సమగ్రంగా వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలు, చేపడుతున్న చర్యలను వివరించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తమ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, ప్రత్యేక పరిశోధన సామర్థ్యాలు, విస్తృతమైన విద్యా వ్యవస్థను హైదరాబాద్‌కు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. తెలంగాణ యువతకు, ఉద్యోగ నిపుణులకు ప్రపంచస్థాయి విద్యా, పరిశోధన అవకాశాలు అందించేందుకు ముందుకు రావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం కింద విదేశీ విశ్వవిద్యాలయాలకు అందుబాటులో ఉన్న అవకాశాలపై ఆయన సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్, తెలంగాణలో విదేశీ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు ఉన్న అవకాశాలు, వాటికి లభించే ప్రయోజనాలను వివరించారు.తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్‌జీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర యువత, ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యానికి ఉన్న పలు అవకాశాలను ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రతినిధి బృందాన్ని పంపాలని ఆక్స్ఫర్డ్

తెలంగాణను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో పర్యటిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి సందర్శించారు. దాదాపు 900 ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయంలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌ను సందర్శించి, ప్రొఫెసర్ మాయా ట్యూడర్, ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీలతో పాలన, విద్య, ప్రజా విధానాలపై విస్తృతంగా చర్చించారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చదువుకున్న ఈ విశ్వవిద్యాలయంతో భారత్‌కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.హైదరాబాద్ కు ఆక్స్ఫర్డ్ బృందంతెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్‌జీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర యువత, ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యానికి ఉన్న పలు అవకాశాలను ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రతినిధి బృందాన్ని పంపాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులను తెలంగాణ బృందం ఆహ్వానించింది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చారిత్రక సోమర్విల్ కాలేజీని సందర్శించారు. ఈ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటాన్ని సందర్శించారు. 2002లో సోనియా గాంధీ ఈ చిత్రపటాన్ని సోమర్విల్ కాలేజీకి బహూకరించిన విషయం తెలిసిందే. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి అందుకే ఇవ్వలేదు- రేవంత్ కీలక వ్యాఖ్యలు..!!అనంతరం ముఖ్యమంత్రి, అక్కడే జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న యుటిలిటా బౌల్‌ను సందర్శించారు. జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథితో కలిసి అక్కడి సమగ్ర క్రీడా సదుపాయాలను పరిశీలించారు. ఈ ప్రాంగణంలో గోల్ఫ్ కోర్స్‌తో పాటు వివిధ క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, హోటల్ ఉన్నాయి. తెలంగాణలో ప్రపంచస్థాయి క్రీడా

మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజీత్ దీప్కే తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల కంటే మంత్రుల పెంపుడు కుక్కలు మెరుగైన వసతులు... లాతూర్, ఆగస్ట్ 20: మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజీత్ దీప్కే తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల కంటే మంత్రుల పెంపుడు కుక్కలు మెరుగైన వసతులు పొందుతున్నాయని వ్యాఖ్యానించారు. పాఠశాలల అభివృద్ధిలో విఫలమైన మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదా భూసే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల అభివృద్ధి కోరుతూ ‘స్కూల్ ఠీక్ కరో’ పేరుతో సీజేపీ గతవారం ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా దీప్కే గురువారం.. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉజని గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్‌ను సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి ప్రజాప్రతినిధులు, మంత్రులను బాధ్యులుగా చేయాలన్నారు. చాలా పాఠశాలల్లో సరైన తరగతి గదులు, బెంచీలు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు లేవని, ఇక కొన్ని పాఠశాలల్లో విద్యార్థులను జంతువుల కంటే దారుణంగా చూస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని.. అప్పుడు సగటు విద్యార్థులు పడే బాధలు వారికి తెలిసి వస్తాయన్నారు. పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్ బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై గురువారం రాస్తారోకో చేస్తున్న సంజయ్‌గాంధీ మెమోరియల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యలో గందరగోళం... ప్రవేశాలు, ఫీజులపై స్కిల్స్ వర్సిటీ పట్టు ప్రైవేటు పెత్తనంపై విద్యార్థి సంఘాలు, ఉద్యోగుల ఆందోళన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి విభాగం (కార్మిక శాఖ)లోకి తీసుకురావడంతోపాటు ఆయా కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుసంధానిస్తూ ప్రభుత్వం జీవో నం. 97 జారీ చేయడం గందరగోళానికి దారితీస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఓవైపు విద్యార్థి సంఘాలు, సాంకేతిక విద్యామండలి ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే మరోవైపు స్కిల్స్ వర్సిటీ పాలక మండలి పాలిటెక్నిక్ విద్యపై పట్టు కోసం ప్రయత్నిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగుల వ్యతిరేకత తీవ్రతరమైతే దాన్ని దారికి తేవడం కష్టమని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు గురువారం సమీక్షించారు. పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాకే ఈ విషయంలో విధివిధానాలు ఖరారు చేయాలని నిర్ణయించారు. అధికారాలు కోరుతున్న స్కిల్స్ వర్సిటీ... స్కిల్స్ యూనివర్సిటీ పాలకవర్గం బహుళజాతి సంస్థల ప్రతినిధుల కనుసన్నల్లో ఉంది. విద్యార్థులకు అవసరమైన నైపుణ్యం అందించే కోర్సులు, సిలబస్ రూపకల్పనను ప్రత్యేకంగా రూపొందిస్తోంది. పారిశ్రామిక భాగస్వామ్యంపై దృష్టి పెట్టాలని భావిస్తోంది. ప్రభుత్వం కేవలం మౌలిక వసతులు సమకూరిస్తే నైపుణ్య శిక్షణ స్కిల్స్ వర్సిటీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన నిధులనూ సమకూర్చుకోవాల్సిందే. ఈ తరహా ఆర్థిక పరమైన బాధ్యత ఉంది కాబట్టి అన్ని అధికారాలూ తమకు ఉండాలని పాలక మండలి ప్రభుత్వానికి సూచించింది. తాజాగా పాలిటెక్నిక్ కాలేజీల నిర్వహణ, ఫీజులు, సిలబస్, బోధన ప్రణాళిక మొత్తం తమ చేతుల్లో ఉండాలని ప్రతిపాదిస్తోంది. రాష్ట్రంలో 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలతోపాటు 53 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వడం తమ పరిధిలో ఉండాలని కోరుతోంది. అలాగే పాలిటెక్నిక్ విద్యకు అవసరమైన ఫీజుల నిర్ణయం తమకే ఉండాలని, సర్టిఫికెట్లు జారీ చేసే అధికారం కూడా కోరుతోంది

ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లినప్పుడు అక్కడి జీవన విధానం ఎన్నో కొత్త అనుభవాలను పరిచయం చేస్తుంది. జింబాబ్వేకు చెందిన కలుంబా మ్వాలేకు కూడా భారత్‌కు వచ్చిన తర్వాత ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. ఇక్కడికి రాకముందు సాధారణంగా భావించిన కొన్ని విషయాలు.. భారత్‌లో అడుగుపెట్టాక తనకు పూర్తిగా భిన్నంగా అనిపించాయని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. భారత్‌లోని యూనివర్సిటీలు, కాలేజీల సంఖ్య తనను బాగా ఆశ్చర్యపరిచిందని మ్వాలే చెప్పారు. జింబాబ్వేలో యూనివర్సిటీలో సీటు దక్కించుకోవడం చాలా పోటీతో కూడుకున్న వ్యవహారమని, కానీ భారత్‌లో వందలాది విద్యాసంస్థలు, వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అలాగే తన యూనివర్సిటీలో ఎన్నో దేశాలకు చెందిన విద్యార్థులను కలిసే అవకాశం దక్కిందని తెలిపారు. జింబాబ్వేలో ఇంత వైవిధ్యమైన అంతర్జాతీయ విద్యార్థుల సమూహాన్ని తాను చూడలేదని చెప్పారు. భారతీయ ఆహారం కూడా తనకు కొత్త అనుభూతిని ఇచ్చిందని మ్వాలే తెలిపారు. జింబాబ్వేలో సద్జా, అన్నం, స్ట్యూ వంటి ఆహారం ఎక్కువగా ఉంటే.. భారత్‌లో ప్రాంతానికో రకమైన వంటకం, రుచులు కనిపించాయని చెప్పారు. ముఖ్యంగా ‘స్పైస్’ అంటే కేవలం కారం అనుకున్న తనకు.. భారతీయ వంటల్లో అది ఎన్నో రుచులు, సుగంధ ద్రవ్యాల కలయిక అని అర్థమైందన్నారు. వైద్యం విషయంలోనూ తన అభిప్రాయం మారిందని, విదేశాల నుంచి చికిత్స కోసం భారత్‌కు వచ్చే వారిని చూసిన తర్వాత భారత వైద్య రంగంపై కొత్త అవగాహన వచ్చిందని తెలిపారు. ఇక విదేశాల్లో అవకాశాలంటే బ్రిటన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి పాశ్చాత్య దేశాలే గుర్తొచ్చేవని మ్వాలే చెప్పారు. అయితే

తమిళనాడు ముఖ్యమంత్రి సీ. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం విద్యార్థులు మరియు యువతపై విధించిన వివాదాస్పద నిషేధ ఆదేశాలను వెనక్కి తీసుకుంటూ సంచలన నిర్ణయం ప్రకటించింది. ఎడమపక్ష పార్టీలు మరియు కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించే నిరసనల్లో విద్యార్థులు పాల్గొనకూడదంటూ జారీ చేసిన ఆదేశాలను ఆగస్టు 19న రద్దు చేసింది. జెన్ జీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో విజయ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం చివరికి దిగిరాక తప్పలేదు. ఈ వివాదానికి సంబంధించిన నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆగస్టు 14న స్కూల్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగాలకు ప్రభుత్వం కొన్ని సూచనలు ఇచ్చింది. ప్రతిపక్షాలు మరియు విపక్ష విద్యార్థి సంఘాల నిరసనలకు యువత లొంగకుండా విద్యా శాఖలు, పోలీసులు, జిల్లా పరిపాలన యంత్రాంగం నిరోధించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీనికి కొనసాగింపుగా ఆగస్టు 17న కాలేజియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ప్రిన్సిపాల్స్‌కు లేఖ రాస్తూ ఆగస్టు 20లోగా నివేదిక సమర్పించాలని కోరింది. అత్యవసరంగా పంపిన ఈ కమ్యూనికేషన్ బయటకు రావడంతో తమిళనాడు వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. దీంతో విద్యాసంస్థలు మరియు విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమై వాతావరణం వేడెక్కింది. ఇదిలా ఉండగా జూలై 28న జరిగిన లా అండ్ ఆర్డర్ సమావేశంలో చీఫ్ సెక్రటరీ ఇచ్చిన సూచనల మేరకే విద్యాశాఖ ఈ చర్యలు చేపట్టినట్లు కథనాలు వెలువడ్డాయి. ప్రత్యేకంగా కొన్ని రాజకీయ సంస్థలను లక్ష్యంగా చేసుకుని నిరోధించడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనని విద్యార్థి లోకం భగ్గుమంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో జెన్ జీ మద్దతుతోనే టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని యువత గుర్తుచేస్తూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర నిరసనలు తెలిపింది. ఫలితంగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగి రాజకీయంగా రచ్చ సాగింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 19న

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు ప్రక్రియను సరళతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ మేరకు 'ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026'ను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. నిబంధనలను సరళతరం చేసి, ఉన్నత విద్యా రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తిగా తీసుకొచ్చిన 'జన్ విశ్వాస్' విధానంలో భాగంగానే ఈ సవరణలు చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను అన్ని రంగాలకు విస్తరింపజేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఉన్నత విద్యా రంగంలో నియంత్రణలను సులభతరం చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో వర్సిటీల సంఖ్య తక్కువగా ఉందని, ఈ సవరణల ద్వారా కొత్త సంస్థలను ప్రోత్సహించవచ్చని తెలిపారు.ఈ బిల్లులో పలు కీలక సవరణలు ప్రతిపాదించారు. ప్రధానంగా, ప్రైవేటు వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని 50 ఎకరాల నుంచి సీఆర్డీఏ, విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో 10 ఎకరాలకు, ఇతర ప్రాంతాల్లో 15 ఎకరాలకు తగ్గించారు. కనీస పెట్టుబడి నిబంధనను పూర్తిగా తొలగించి, కేసును బట్టి నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకునేలా మార్పు చేశారు. ఎండోమెంట్ ఫీజును రూ.5 కోట్లకు పరిమితం చేశారు. బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీగా మారాలంటే యూజీసీ నిబంధనల ప్రకారం కనీసం 3.01 సీజీపీఏ తప్పనిసరి చేశారు.ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలో రెండో మహిళా విశ్వవిద్యాలయంగా 'విష్ణు మహిళా విశ్వవిద్యాలయం' ఏర్పాటుకు మార్గం సుగమమైందని మంత్రి తెలిపారు

ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు సీడబ్ల్యూసీ సభ్యులు.. కేసీ వేణుగోపాల్, పి.చిదంబరం, వీరప్ప మొయిలీ, అంబికా సోనీ, జైరామ్ రమేశ్, సచిన్ పైలట్, దామోదర రాజనర్సింహ, దిగ్విజయ సింగ్, ఎన్.రఘువీర రెడ్డి, పల్లంరాజుతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నీట్ పేపర్ లీక్‌తోపాటు విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహాంపై ఈ భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే అయోధ్య రామమందిర విరాళాల ‘చోరీ’ ఆరోపణలపై పోరాటం చేసేందుకు ఈ సమావేశంలో కార్యాచరణకు రూపకల్పన జరగనుందని సమాచారం. మరోవైపు వచ్చే ఏడాది 7 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా అనుసరించాల్సిన వ్యూహాంపై సమీక్షించనున్నారు. ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన అంశాలపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడీ సతీశన్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు హాజరయ్యారు. నీట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోపాటు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్త ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనకు విద్యార్థులతో ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో జులై 20వ తేదీన న్యూఢిల్లీలో ఛలో పార్లమెంట్ ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. దీంతో దేశ
బధిర విద్యార్థులకు రాష్ట్రంలో తొలిసారిగా డిగ్రీ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు బధిర విద్యార్థులకు ఇంటర్మీడియట్ వరకు మాత్రమే మన దగ్గర కోర్సులు ఉన్నాయి. తొలిసారి డిగ్రీ కోర్సులు కూడా బోధించాలని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలో ఉన్న బధిరుల ఆశ్రమ పాఠశాల, జూనియర్ కళాశాలలోనే ఇకపై డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు జూలై 22న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ఆశ్రమ పాఠశాల, జూనియర్ కళాశాలలోని తాత్కాలిక భవనాల్లోనే ప్రస్తుతం డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. తొలి ఏడాది బీకాం కంప్యూటర్ సైన్స్‌లో 30 సీట్లతో ప్రవేశాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ మేరకు అధ్యాపకుల నియామకం, వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. కళాశాల ప్రిన్సిపల్ రజియా మాట్లాడుతూ బీకాం కంప్యూటర్స్‌లో చేరిన విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం, పాఠ్య, రాత పుసక్తాలు, కాస్మొటిక్స్ ఖర్చులకు నగదు, వినికిడి పరకాలు అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు.అర్హత ఉన్న బధిర విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ రజియా తెలిపారు. అర్హులు సంబంధిత సర్టిఫికెట్లతో కాలేజీ దగ్గరకు వచ్చి అడ్మిషన్స్ పొందాలని సూచించారు. సందేహాలు ఉంటే 9000013633 నెంబర్లో సంప్రదించాలని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని బధిర విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి 1987లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు బధిరుల కోసం ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేశారు. 14 ఎకరాల విస్తీర్ణంలో బధిరుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వెదుళ్లపల్లిలో ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. 1987లో ఎన్టీఆర్ బధిరుల ఆశ్రమ పాఠశాలను ప్రారంభించగా.. 1990లో చంద్రబాబు నాయుడు హయాంలో ఆశ్రమ పాఠశాలకు జూనియర్ కళాశాల హోదా కల్పించారు. మళ్లీ 2026లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే డిగ్రీ కళాశాలగా చేయడం విశేషం. బధిర విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలనేదే ప్రభుత్వం ఆకాంక్ష

హైదరాబాద్‌కు చెందిన అవినాశ్ ఓ ప్రముఖ కాలేజీ నుంచి బీటెక్ పూర్తిచేశాడు. ఎంటెక్‌లో ప్రవేశం కోసం పీజీఈసెట్ రాసి మంచి ర్యాంకు సాధించాడు.. పీజీఈసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలంటే ప్రొవిజినల్ మెమో, టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించాలి. ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న యాజమాన్యాలు పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సర్కారు ఇవ్వకపోవటంతో విద్యార్థులను అడుగుతున్న కాలేజీలు సర్టిఫికెట్ల కోసం నిరీక్షిస్తున్న రెండు లక్షల మంది విద్యార్థులు మంచి ర్యాంకులు వచ్చినా ఉన్నత చదువుల కోసం వెళ్లలేని పరిస్థితి ప్రభుత్వం తక్షణం చెల్లించాల్సిన బకాయిలు రూ.2,500 కోట్ల పైనే పాత బకాయిలు రూ.7,000 కోట్ల వరకు ఉంటాయంటున్న ఫాతీ హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన అవినాశ్ ఓ ప్రముఖ కాలేజీ నుంచి బీటెక్ పూర్తిచేశాడు. ఎంటెక్‌లో ప్రవేశం కోసం పీజీఈసెట్ రాసి మంచి ర్యాంకు సాధించాడు.. పీజీఈసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలంటే ప్రొవిజినల్ మెమో, టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించాలి. వీటిని ఇచ్చేందుకు కాలేజీ నిరాకరిస్తోంది. ఏడాదికి రూ.35 వేల చొప్పున మూడేళ్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 1.05 లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సర్కారు సకాలంలో ఇవ్వకపోవడంతో ఈ ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో కౌన్సెలింగ్‌లో అవినాశ్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నాడు. ఇలాంటి సమస్యనే రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర యూజీ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు భారీగా పెండింగులో ఉండటంతో కాలేజీలు సర్టిఫికేట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. గత నాలుగేళ్లలో ప్రభుత్వం కాలేజీలకు బకాయి పడిన ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం రూ.10 వేల కోట్ల వరకు ఉందని తెలంగాణ ఉన్నత విద్య ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమాఖ్య (ఫాతీ) అంటోంది. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని ఫాతీ ఏడాది కాలంగా కోరుతోంది. గత ఏడాదిలో ప్రభుత్వం దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు విడుదల చేసింది

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. MP School Urine Controversy: మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సదరు స్కూల్లో 5వ తరగతి చదువుతున్న ఓ బాలుడు వాటర్ బాటిల్లో మూత్రం కలిపి తన క్లాస్‌లో ఉన్న ఇద్దరు బాలికలతో తాగించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని వారు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వారికి ఊరట కోసం రూ.10 విలువైన చాక్లెట్ తినమని చెప్పారని ఒక అధికారి తెలిపారు. గుణా జిల్లాలోని అరోన్ డెవలప్మెంట్ బ్లాక్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో సోమవారం అనగా ఆగస్టు 17న ఈ ఘటన జరిగింది. దీనిపై అధికారులు విచారణ ప్రారంభించి, ప్రిన్సిపాల్‌కు నోటీసు జారీ చేశారు. బాధిత బాలికల కుటుంబ సభ్యులు, స్థానికులు మంగళవారం పాఠశాల వద్ద ఆందోళన చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. "కొంతమంది విద్యార్థులు నీళ్ల బాటిళ్లలో ఉన్న మూత్రాన్ని తమతో తాగించారని ఇద్దరు బాలికలు ఆరోపించారు. వారు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినప్పుడు, ఆయన అమానుషంగా ప్రవర్తిస్తూ 'మీ నోటి రుచి బాగోలేకపోతే, రూ.10 చాక్లెట్ తినండి' అని అన్నారని తెలిసింది" అని గునా జిల్లా మేజిస్ట్రేట్ కిషోర్ కుమార్ కన్యాల్ చెప్పారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే తహసీల్దార్, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO)ను అక్కడికి పంపించామని, ప్రిన్సిపాల్‌కు నోటీసు జారీ చేశామని అరోన్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) మంజుషా ఖత్రీ తెలిపారు. రెండు రోజుల్లోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని BEOను ఆదేశించారు. ఆ నివేదిక

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు తమను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, 2026 నుంచి 'ఉత్తమ లైబ్రేరియన్ అవార్డు' పేరుతో ప్రత్యేక కేటగిరీని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లైబ్రేరియన్లు ప్రభుత్వాన్ని కోరారు. ఉన్నత విద్యావ్యవస్థలో తమ పాత్ర అత్యంత కీలకమని, తమ సేవలను గుర్తించి ప్రోత్సహించాలని కోరుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లైబ్రేరియన్ల తరఫున డాక్టర్ ఎం. శ్రీనివాస ప్రసాద్ ప్రభుత్వానికి ఒక వినతిపత్రం సమర్పించారు.యూజీసీ నిబంధనల ప్రకారం విద్యార్హతలు, పదోన్నతులు, పరిశోధనల విషయంలో తమకు అధ్యాపకులతో సమానంగా అకడమిక్ హోదా ఉందని లైబ్రేరియన్లు తమ వినతిపత్రంలో పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రంథాలయాలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, డిజిటల్ విజ్ఞాన కేంద్రాలుగా రూపాంతరం చెందాయని తెలిపారు. జాతీయ నూతన విద్యా విధానం (NEP 2020) అమలులో, కళాశాలలకు న్యాక్ (NAAC) అక్రిడిటేషన్ కల్పించడంలో లైబ్రేరియన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని వారు వివరించారు.పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో 2017లోనే 'ఉత్తమ లైబ్రేరియన్ అవార్డు'ను ఏర్పాటు చేశారని, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ అవార్డును ప్రవేశపెట్టడం సాధ్యమేనని వారు గుర్తుచేశారు. లైబ్రేరియన్ల సేవలను గుర్తించేందుకు అవసరమైన మూల్యాంకన పరామితులను రూపొందించాలని కూడా కోరారు. ఇప్పటికే ఈ అంశాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించిన విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు.లైబ్రేరియన్లకు ప్రత్యేక అవార్డును ఏర్పాటు చేయడం వల్ల వారిలో నూతనోత్సాహం నింపడమే కాకుండా, ఉన్నత విద్యలో నాణ్యతను మరింత పెంచేందుకు దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. అందువల్ల, తమ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి, 2026

ఇంటరాక్టివ్ సాహిత్య కార్యక్రమాలతో విద్యార్థుల్లో పఠనాసక్తి ఈ వార్తకు సంబంధించిన

ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ పాఠశాలలను మూసివేసే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) శాసనమండలిలో స్పష్టం చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ.. ఈ పాఠశాలల నిర్వహణపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనే సంకేతాలు ఇచ్చారు. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు (అడ్మిషన్లు) తగ్గడంపై వచ్చిన ప్రశ్నలకూ మంత్రి లోకేష్ పూర్తి గణాంకాలతో సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు 1.69 శాతం తగ్గినట్లు ఆయన అంగీకరించారు. అయితే, ఆ తర్వాతి విద్యా సంవత్సరం లోనే లోపాలను సరిదిద్ది మౌలిక వసతులు మెరుగుపరచడంతో.. ప్రస్తుత 2026-27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు 0.94 శాతం పెరిగాయని మంత్రి సభకు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మారుస్తూ, నాణ్యమైన విద్యను అందిస్తుండటం వల్లే మళ్లీ విద్యార్థులు ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపుతున్నారని లోకేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అడ్మిషన్ల శాతాన్ని మరింతగా పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచేలా ప్రభుత్వ విద్యా ప్రమాణాలను మరింత ఉన్నతీకరిస్తామని సభ సాక్షిగా హామీ ఇచ్చారు

ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌కు చిరునామాగా నిలిచిన జేఎన్టీయూలో పరిశోధనలకు తగినంత ప్రాధాన్యం లభిస్తుందా అంటే.. విద్యార్థి వర్గాల నుంచి లేదనే జవాబు వస్తోంది. ఏడాదిన్నరగా పీహెచ్డీ నోటిఫికేషన్ వేయని జేఎన్టీయూ హైదరాబాద్ సిటీ: ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌కు చిరునామాగా నిలిచిన జేఎన్టీయూలో పరిశోధనలకు తగినంత ప్రాధాన్యం లభిస్తుందా అంటే.. విద్యార్థి వర్గాల నుంచి లేదనే జవాబు వస్తోంది. ప్రతియేటా రెండు పీహెచ్డీ నోటిఫికేషన్లను జారీ చేస్తామని వివిధ సందర్భాల్లో వైస్ చాన్స్‌లర్ చేసిన ప్రకటనలు అధికారుల అలసత్వం కారణంగా అమలుకు నోచుకోవడం లేదని ఆయా సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పిన వర్సిటీ ఉన్నతాధికారులు ఆర్నెల్లు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదని ఆశావహ అభ్యర్థులు వాపోతున్నారు. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ జారీచేసినా దరఖాస్తుల పరిశీలన, పరీక్షల నిర్వహణ, ఇంటర్వ్యూల పేరిట అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఏడాదికిపైగా అధికారులు సమయం తీసుకుంటుండడం ఆశావహ అభ్యర్థులను తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు గురిచేస్తోంది. పీహెచ్డీ ప్రవేశాల నిమిత్తం ఈ ఏడాది (2026) నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారో ఎవరికీ అంతుబట్టడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న పలువురు అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం అడ్మిషన్ల విభాగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు యూనివర్సిటీ అఫిలియేటెడ్ (ప్రైవేటు) ఇంజనీరింగ్ కళాశాలల్లో మూడేళ్ల క్రితమే రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆయా కేంద్రాలకు అడ్మిషన్లలో ప్రాధాన్యతను ఇవ్వక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైస్ చాన్స్‌లర్ కిషన్‌కుమార్‌రెడ్డి.. ఈ ఏడాది ప్రారంభంలో ప్రైవేటు కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో జరిపిన భేటీలో రానున్న నోటిఫికేషన్లో ప్రిన్సిపాల్స్‌కు సైతం స్కాలర్స్‌ను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ, నోటిఫికేషన్ జారీపై అటు అర్అండ్డీ విభాగం నుంచి గానీ, ఇటు అడ్మిషన్ల విభాగం నుంచి గానీ స్పష్టమైన సమాచారం లేకపోవడంతో

"గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి సవాల్ విసురుతున్నా. డీఎస్సీ-2025పై చర్చకు నేను సిద్ధం. సభ లోపలైనా, బయటైనా సరే.. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయండి" అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, వైసీపీ అధినేత జగన్ కు బహిరంగ సవాల్ విసిరారు. మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై శాసనసభలో సుదీర్ఘ ప్రకటన చేసిన ఆయన, ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను బెయిల్‌పై లేనని, తనపై సీబీఐ, ఈడీ కేసులు లేవని, విదేశాలకు వెళ్లేందుకు తనకేమీ కోర్టు అనుమతులు అవసరంలేదని ఎద్దేవా చేశారు. చర్చకు వస్తే వాస్తవాలు తేలుతాయని అన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని లోకేశ్ గుర్తుచేశారు. ఈ నియామక ప్రక్రియను కేవలం 148 రోజుల్లో పూర్తి చేసి 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. 3.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, టీసీఎస్ అయాన్ వంటి సురక్షిత ప్లాట్‌ఫామ్ ద్వారా అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని వివరించారు. ఈ డీఎస్సీని అడ్డుకోవడానికే వైసీపీ నాయకులు 141 కేసులు వేశారని, సీఎం తొలి సంతకం అమలు కాకుండా అడ్డుకోవాలని కుట్ర పన్నారని ఆరోపించారు.ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రిమెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ప్రశ్నపత్రం లీక్ అయిందన్నది అవాస్తవమని, 42 వేల ప్రశ్నలతో కూడిన క్వశ్చన్ బ్యాంక్ నుంచి ర్యాండమ్‌గా ప్రశ్నలు వస్తాయని, లీకేజీకి ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ప్రశ్నపత్రం

తెలంగాణ ప్రజా పాలనలో విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు, పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైదరాబాద్: తెలంగాణ ప్రజా పాలనలో విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు, రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పేదల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత 32 నెలల్లో ఆరోగ్యశ్రీ కోసం రూ.2,600 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వ ఆస్పత్రుల సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నామని తెలిపారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రులు పేదలకు ఎంతో ఉపయోగపడతాయని సీఎం అన్నారు. గత పాలకులు టిమ్స్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పనులను మర్చిపోయారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో మూడు టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాన్ని వేగంగా చేపట్టామని తెలిపారు. అదే విధంగా వరంగల్లోనూ ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. 2027 డిసెంబర్ నాటికి ఆస్పత్రుల నిర్మాణం పూర్తి 2027 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఆస్పత్రులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి ఆరు నెలలకు ఒక ఆస్పత్రిని ప్రారంభించే దిశగా ప్రణాళిక రూపొందించామని సీఎం వెల్లడించారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తోందని తెలిపారు. ఆస్పత్రుల నిర్మాణ పనులు వేగంగా, నాణ్యతతో పూర్తయ్యేలా ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణ చేపడుతున్నామని సీఎం
.webp)
ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పిస్తామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రతిభ ఉన్న విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేయకూడదని, అలాంటి వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. తాడేపల్లిలోని సీఎస్ఆర్ కల్యాణ మండపంలో నిర్వహించిన 'షైనింగ్ స్టార్స్' కార్యక్రమంలో మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత విద్యాసంవత్సరంలో టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఈ సందర్భంగా ఆయన ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి సదస్సులో వారి సమస్యలను, ఉన్నత ఆశయాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ వేదికపై విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సానుకూలంగా స్పందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో భాగంగా రాష్ట్ర విద్యా రంగంలోకి త్వరలోనే ‘ఏఐ ట్యూటర్’ (కృత్రిమ మేధస్సు ఆధారిత ట్యూటర్)ను తీసుకురాబోతున్నట్లు లోకేశ్ వెల్లడించారు. అలాగే రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవాన్ని తట్టుకునేలా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఏఐ ల్యాబ్స్, ఫండమెంటల్స్‌పై శిక్షణ ఇస్తామని ప్రకటించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు రాష్ట్రంలోని గ్రంథాలయాలన్నింటినీ ప్రక్షాళన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిల్లో లైబ్రరీలను బలోపేతం చేయడంతో పాటు, ఏడాది వ్యవధిలోనే రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రపంచ స్థాయి గ్రంథాలయాన్ని నిర్మించనున్నట్లు హామీ ఇచ్చారు. అటు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకంగా ఎన్సీసీ స్టేట్ డైరెక్టరేట్‌ను కూడా మంజూరు చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల వ్యక్తిగత గాథలు అందరినీ కదిలించాయి. తండ్రి అనారోగ్యం కారణంగా కార్డియాలజిస్ట్ కావాలనుకుంటున్న చాందిని అనే విద్యార్థినికి నీట్ కోచింగ్ ఇప్పిస్తామని, కుటుంబ ఆర్థిక పరిస్థితుల