© 2026 nimisham.in

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. MP School Urine Controversy: మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సదరు స్కూల్లో 5వ తరగతి చదువుతున్న ఓ బాలుడు వాటర్ బాటిల్లో మూత్రం కలిపి తన క్లాస్‌లో ఉన్న ఇద్దరు బాలికలతో తాగించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని వారు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వారికి ఊరట కోసం రూ.10 విలువైన చాక్లెట్ తినమని చెప్పారని ఒక అధికారి తెలిపారు. గుణా జిల్లాలోని అరోన్ డెవలప్మెంట్ బ్లాక్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో సోమవారం అనగా ఆగస్టు 17న ఈ ఘటన జరిగింది. దీనిపై అధికారులు విచారణ ప్రారంభించి, ప్రిన్సిపాల్‌కు నోటీసు జారీ చేశారు. బాధిత బాలికల కుటుంబ సభ్యులు, స్థానికులు మంగళవారం పాఠశాల వద్ద ఆందోళన చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. "కొంతమంది విద్యార్థులు నీళ్ల బాటిళ్లలో ఉన్న మూత్రాన్ని తమతో తాగించారని ఇద్దరు బాలికలు ఆరోపించారు. వారు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినప్పుడు, ఆయన అమానుషంగా ప్రవర్తిస్తూ 'మీ నోటి రుచి బాగోలేకపోతే, రూ.10 చాక్లెట్ తినండి' అని అన్నారని తెలిసింది" అని గునా జిల్లా మేజిస్ట్రేట్ కిషోర్ కుమార్ కన్యాల్ చెప్పారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే తహసీల్దార్, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO)ను అక్కడికి పంపించామని, ప్రిన్సిపాల్‌కు నోటీసు జారీ చేశామని అరోన్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) మంజుషా ఖత్రీ తెలిపారు. రెండు రోజుల్లోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని BEOను ఆదేశించారు. ఆ నివేదిక
ఆధారంగా కఠిన చర్యలు తీసుకోనున్నారు.
జిల్లా మేజిస్ట్రేట్ కన్యాల్ మాట్లాడుతూ.. "నేను విచారణకు ఆదేశించాను. అదే తరగతికి చెందిన ఒక విద్యార్థి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఆ విద్యార్థిని, అతని తల్లిదండ్రులను పిలిపించాము. ప్రిన్సిపాల్‌కు నోటీసు జారీ చేశాము" అని చెప్పారు. ఈ ఘటనలో మరికొందరు బాలురు కూడా ప్రమేయం కలిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
మంగళవారం నాడు, బాధిత బాలికల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాఠశాలను సందర్శించి, తప్పు చేసిన బాలురు, ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అలాగే పాఠశాల ప్రాంగణానికి తాళం వేశారు.
ఈ క్రమంలో ఆందోళన తీవ్రం కావడంతో పరిపాలనా అధికారులు భారీ పోలీసు బలగాలతో గ్రామానికి చేరుకుని, బాధితులైన విద్యార్థులు, వారి కుటుంబాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల నుండి వివరమైన వాంగ్మూలాలను నమోదు చేశారని ఖత్రీ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.