
30 నిమిషాల్లో ఇంట్లో ఈ బేసన్ బర్ఫీ తయారు చేసుకోండి
గణేష్ చతుర్థి వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్న సమయంలో, వేడుకలకు సంబంధించిన భోగ్ తాలీని పూర్తి చేయడానికి ఒక వేగవంతమైన ఇంటి తయారైన మిఠాయి అత్యంత స్వీట్ మార్గం. ఈ సులభ

గణేష్ చతుర్థి వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్న సమయంలో, వేడుకలకు సంబంధించిన భోగ్ తాలీని పూర్తి చేయడానికి ఒక వేగవంతమైన ఇంటి తయారైన మిఠాయి అత్యంత స్వీట్ మార్గం. ఈ సులభ

ఈ వంటకాన్ని మసాలా అన్నం, చపాతీ, రోటీ లేదా నీర్ దోసతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది. అయితే ఖలేజా గట్టిపడకుండా వండటం చాలా ముఖ్యం. అందుకోసం ముందుగా అధిక మంటపై కొద్దిసేపు వేయించి, ఆ తర్వాత తక్కువ మంటపై మూత పెట్టి ఉడికించాలి. ఎక్కువసేపు ఉడికిస్తే ఖలేజా గట్టిగా మారుతుందని రెసిపీలో ప్రత్యేకంగా సూచించారు. ముందుగా చికెన్ ఖలేజాను బాగా శుభ్రం చేయాలి. అందులోని నీరు పూర్తిగా పోయేలా తుడిచి, మధ్యస్థ పరిమాణంలో ముక్కలుగా కోసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత టమాటా, పసుపు, కారం, ధనియాల పొడి వేసి మసాలా బాగా ఉడికే వరకు కలుపుతూ ఉంచాలి. నూనె పైకి తేలినప్పుడు మసాలా సిద్ధమైనట్లు. ఇప్పుడు ఖలేజా ముక్కలు, ఉప్పు వేసి అధిక మంటపై 3–4 నిమిషాలు బాగా వేయించాలి. తర్వాత మంట తగ్గించి మూత పెట్టి 8–10 నిమిషాలు ఉడికించాలి. ఖలేజాను ఎక్కువసేపు ఉడికించకూడదు. అలా చేస్తే అది గట్టిగా మారుతుంది. ఖలేజా ఉడికిన తర్వాత గరం మసాలా వేసి మరో 2–3 నిమిషాలు వేయించాలి. చివరగా కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అంతే.. నోరూరించే చికెన్ ఖలేజా మసాలా సిద్ధం. వేడి వేడి చికెన్ ఖలేజా మసాలాను నెయ్యి అన్నం, చపాతీ, రోటీ లేదా నీర్ దోసతో వడ్డించవచ్చు. చివర్లో కొద్దిగా కసూరి మెంతులు జోడిస్తే రుచి మరింత పెరుగుతుందని రెసిపీలో పేర్కొన్నారు

వేడి నీళ్లు, డిష్ వాష్ సోప్ లిక్విడ్ తో మొండి మరకలను ఈజీగా వదిలించొచ్చు. దీని కోసం, పాన్ కొద్దిగా చల్లారిన తర్వాత, చెక్క గరిటెతో పైన ఉన్న మాడిన ఆహారాన్ని తీసేయండి. ఆ తర్వాత మాడిన భాగానికి సరిపడా నీళ్లు పోసి, కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్ వేసి స్టవ్ మీద 10-15 నిమిషాలు మరిగించండి. వేడి నీరు, సబ్బు కలిసి మాడిన పొరను మెత్తగా చేస్తాయి. స్టవ్ ఆపి చల్లారాక మెత్తటి స్పాంజితో తుడిస్తే మరకలు సులభంగా ఊడిపోతాయి. మొండిగా మారిన నల్లటి పొరను తొలగించడానికి బేకింగ్ సోడా అద్భుతంగా సహాయం చేస్తుంది. దీని కోసం, మాడిన ప్రాంతంలో బేకింగ్ సోడాను ఎక్కువగా చల్లి, కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి పేస్ట్‌లా చేయండి. దీనిని 15 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. బేకింగ్ సోడా పాత్రకు గీతలు పడకుండానే మాడిన పదార్థాన్ని వదిలిస్తుంది. ఆ తర్వాత నైలాన్ బ్రష్ లేదా స్పాంజితో రుద్దితే సరిపోతుంది. స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలపై ఉన్న మొండి మాడు మరకలకు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. పాన్ నిండేలా సగం నీరు, సగం వైట్ వెనిగర్ పోసి స్టవ్‌పై మరిగించి దించేయండి. ఇప్పుడు ఆ నీటిని వంపేసి, పాన్‌లో బేకింగ్ సోడా చల్లండి. వెనిగర్, బేకింగ్ సోడా కలిస్తే నురుగు వస్తుంది. దీంతో.. తర్వాత ఈజీగా ఆ మొండి మరకలు వదులుతాయి. గిన్నె మాడిన వెంటనే శుభ్రం చేయడానికి సమయం లేకపోతే. మీరు రాత్రంతా నానపెట్టి.. మరుసటి రోజు శుభ్రం చేయచ్చు.. దీనికోసం, మాడిన పాత్రలో వేడి నీళ్లు, కొద్దగా డిష్ సోప్ వేసి.. రాత్రంతా నానపెట్టాలి. రాత్రంతా నానపెట్టి.. ఉదయాన్నే శుభ్రం చేస్తే.. సులభంగా మాడు పోతుంది. మీ పాత్రలు మళ్లీ కొత్త వాటిలా కనిపిస్తాయి. నాన్-స్టిక్ లేదా కోటింగ్ ఉన్న పాత్రలు మాడిపోయినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీటిని శుభ్రం చేయడానికి స్టీల్

భారతీయులు రెగ్యులర్ గా ఇష్టంగా తినే బ్రేక్ ఫాస్ట్ లలో దోశ ఒకటి. దోశలు ఇంట్లో చేసుకోవడం కూడా చాలా సులువు. కానీ, హోటల్ లో తిన్న ఫీలింగ్ ఇంట్లో తింటే రాదు. హోటల్ మాదిరిగా మంచి షేప్, రంగు, రుచి ఇంట్లో చేసినప్పుడు రావు. అంతేకాదు, ఎప్పుడు దోశ వేద్దామని చూసినా.. పెనానికి అతుక్కుపోతూ ఉంటుంది. మీరు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? అయితే.. పెనానికి అతుక్కోకుండా.. దోశ హోటల్ స్టైల్ లో మంచిగా రావాలి అంటే.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది. దోశ పెనానికి అతుక్కోకుండా మంచిగా రావాలంటే.. పిండిలో స్పెషల్ గా ఏమీ కలపాల్సిన అవసరం లేదు. చిన్న ఉల్లిపాయతో మీరు మ్యాజిక్ చేసేయచ్చు. మీ ఇంట్లో ఉన్న ఐరన్ పెనాన్ని.. ఈ ఉల్లిపాయతో నాన్ స్టిక్ పెన్ లా మార్చేయచ్చు. అసలు దోశలు వేయడం రానివారు కూడా చాలా ఈజీగా దోశలు వేసేసుకోవచ్చు. అయితే, అలా ఉల్లిపాయను ఎలా వాడాలో చూద్దాం... ఉల్లిపాయను ముందుగా సగానికి కోయాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయకు ఫోర్క్ గుచ్చి, దానికి 2 నుంచి 3 చుక్కల నూనె రాయాలి. తర్వాత.. ఐరన్ పెనాన్ని వేడి చేయాలి. పెనం బాగా వేడిగా మారిన తర్వాత నూనె రాసిన ఉల్లిపాయను పెనం మొత్తం సర్కిల్ షేప్ లో రుద్దాలి. ఉల్లిపాయలోని సహజ రసాలు, నూనె కలిసి ఇనుప నేలపై ఒక కోటింగ్ లా ఏర్పడతాయి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు చల్లి శుభ్రమైన గుడ్డతో తుడిచి పిండి వేయండి. దోశ రవ్వల్లా పరుచుకుని, అస్సలు అంటుకోకుండా లేచి వస్తుంది. ఒకవేళ ఉల్లిపాయ అందుబాటులో లేకపోతే, గ్లాసు నీళ్లలో అరస్పూన్ ఉప్పు కలిపి ఆ నీటిని పెనంపై చల్లి తుడిచినా దోశలు అంటుకోవు. పిండి పెనంపై రుద్దేటప్పుడు మంట ఎప్పుడూ సిమ్‌లో ఉండాలి. రుద్దడం పూర్తయ్యాక మంటను మీడియం-హైకి పెంచితేనే దోశ కరకరలాడుతుంది. ఐరన్

ఆరోగ్యంగా ఉండాలని, బరువు తగ్గాలి అనుకునేవారు ఈ రోజుల్లో తాము చేసే వంటలో నూనె తగ్గించడం మొదలుపెడుతున్నారు. కానీ, నూనె తగ్గించి, వంట చేయడం వల్ల కూర రుచిగా ఉండదు అనే భావన చాలా మందికి ఉంటుంది. కానీ, ప్రముఖ సెలబ్రెటీ షెఫ్ రణ్ వీర్ బ్రార్ రీసెంట్ గా ఓ సీక్రెట్ బయట పెట్టారు. వంటలో రుచి కొంచెం కూడా తగ్గకుండా, అతి తక్కువ నూనెతో కూడా రుచిగా, ఆరోగ్యకరంగా ఎలా చేయాలో ఆయన చెప్పారు. ఆ ట్రిక్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దాదాపు అందరి ఇంట్లోనూ... పెద్ద పెద్ద ఆయిల్ క్యాన్లు, బాటిల్స్ వాడుతూ ఉంటారు. వాటితోనే నేరుగా.. కూరలోని నూనె పోసేస్తూ ఉంటారు. లేదంటే.. ఆ నూనె డబ్బాల్లో పెద్ద గరిటెలు పెడుతూ ఉంటారు. దీని వల్ల మనకు తెలీకుండానూ కూరలో నూనె ఎక్కువ వాడేస్తూ ఉంటాం. దీని వల్ల, మనం తెలీకుండానే నూనె ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అందుకే, ముందు.. ఆ నూనె డబ్బాను మార్చేయాలి. పెద్ద మూత ఉన్న నూనె డబ్బాను తీసేసి.. దాని ప్లేస్ లో చిన్న లేదా సన్న మూతి ఉన్న నూనె బాటిల్ పెట్టాలి. దీని వల్ల.. కాస్త తక్కువ నూనె గా వాడతాం. అనుకోకుండా, నూనె ఎక్కువగా పడే అవకాశమే ఉండదు. మనం కూరకు పోపు లేదా తాలింపు వేసేటప్పుడు పోపు గింజలు మాడిపోకుండా ఉండటానికి మనం ఎక్కువ నూనెలు వాడుతూ ఉంటాం. కానీ, అలా జరగకుండా ఉండేందుకు సింపుల్ చిట్కా వాడొచ్చు. తాలింపు వేసేటప్పుడు నూనె చాలా తక్కువగా వేసి, గింజలు చిటపటలాడాక కొద్దిగా నీటిని చిలకరించండి. ఇలా చేయడం వల్ల మసాలాలు మాడిపోవు, పైగా నూనె తక్కువైనా మసాలా సువాసన, రుచి వంటకానికి బాగా పడతాయి. కర్రీలు, కూరలు లేదా పులుసులు వండిన తర్వాత పైభాగంలో నూనె తేలుతూ కనిపిస్తుంది. వంట పూర్తయి సర్వ్ చేసే ముందు, పైన

భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణాన, సాంబార్ ఒక సంప్రదాయ వంటకం. దీనిని ఉదయం అల్పాహారంతో పాటు, మధ్యాహ్నం భోజనంలోనూ ఆనందిస్తారు. అనేక రకాల సాంబార్ వంటకాలు ఉన్నప్పటికీ, ఈ రెసిపీలో ఉల్లిపాయ, టమాటోను మాత్రమే ఉపయోగించి, సులభమైన పద్ధతిలో రుచికరమైన సాంబార్‌ను ఎలా తయారు చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం... ఇది ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో తక్కువ సమయంలోనే సిద్ధం చేసుకోవచ్చు. టమాటాలు: 2 చిన్నవి (పప్పు ఉడికించడానికి), 2 చిన్నవి (తరిగినవి), 3 చిన్నవి (పొడవుగా కట్ చేసినవి) ఉల్లిపాయలు: 3 చిన్నవి (పొడవుగా కట్ చేసినవి) కరివేపాకు: కొద్దిగా (మరిగించేటప్పుడు, పోపులో) పప్పు ఉడికించుకోవడం: ముందుగా 100 గ్రాముల కందిపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. దానిలోకి రెండు చిన్న సైజు టమాటాలను పొడవుగా కట్ చేసి వేయాలి. పప్పు తీసుకున్న గ్లాస్ తో రెండు గ్లాసుల నీరు పోసి, కుక్కర్లో మూత పెట్టి మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. పప్పు చల్లారిన తర్వాత, మూత తీసి మ్యాషర్తో లేదా పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. కావాలంటే చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కూరగాయలు - మసాలాలు కలపడం: మెత్తగా మెదుపుకున్న పప్పులోకి పొడవుగా కట్ చేసిన మూడు చిన్న సైజు ఉల్లిపాయలు, మూడు పచ్చిమిర్చి, సన్నగా తరిగిన రెండు టమాటాలు వేయాలి. రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఉడికించడం: ఇప్పుడు దీనిలోకి అర కప్పు నీరు పోసి, మూత కొద్దిగా క్రాస్‌గా పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. ఉల్లిపాయలు, టమాటాలు సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత, నిమ్మ సైజు చింతపండును నానబెట్టి తీసిన రసాన్ని సాంబార్‌లోకి కలపాలి. మీ రుచికి తగ్గట్టు పులుపును అడ్జస్ట్ చేసుకోవచ్చు. నీరు - సుగంధ ద్రవ్యాలు: తర్వాత ఒకటిన్నర కప్పుల వరకు నీరు

వంట పూర్తయ్యాక ఒక్కసారి రుచి చూస్తే ఉప్పు కాస్త ఎక్కువైందని తెలిసి గుండె ఆగినంత పనవుతుందా? రోజూ ఎంతో ఇష్టంగా వండే కూరలు లేదా ఫ్రైలలో పొరపాటున ఉప్పు ఎక్కువ కావడం సర్వసాధారణం. అయితే ఉప్పు ఎక్కువైందని ఆ కూరను పడేయాల్సిన పని లేదు. అమ్మమ్మల నాటి సింపుల్ చిట్కాలతో ఆ ఉప్పును బ్యాలెన్స్ చేయడమే కాకుండా… కూరను మరింత రుచిగా మార్చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. పచ్చి బంగాళాదుంప ముక్కలు (Raw Potato)… గ్రేవీలో లేదా కర్రీలో పచ్చి బంగాళాదుంపను పెద్ద ముక్కలుగా కోసి వేసి, 10-15 నిమిషాలు ఉడికించండి. బంగాళాదుంపలో ఉండే స్టార్చ్ గ్రేవీలోని నీటితో పాటు ఉప్పును కూడా పీల్చుకుంటుంది. వడ్డించే ముందు ఈ ముక్కలను తీసివేస్తే సరిపోతుంది. 2. గోధుమ పిండి ఉండలు …మనం చపాతీకి కలుపుకునే గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉడుకుతున్న గ్రేవీలో వేయండి. ఈ పిండి ఉండలు కూరలోని అదనపు ఉప్పును, నీటిని వేగంగా పీల్చుకుంటాయి. వంట పూర్తయ్యాక వీటిని బయటకు తీయవచ్చు. 3. నిమ్మరసం లేదా వెనిగర్.. పులుపు అనేది ఉప్పు తీవ్రతను తగ్గిస్తుంది. కూరలో ఉప్పు ఎక్కువైతే కొన్ని చుక్కల నిమ్మరసం లేదా కొద్దిగా వెనిగర్ కలపండి. ఇది ఉప్పును పూర్తిగా తీసివేయకపోయినా, నాలికపై ఉప్పు ఘాటు తెలియకుండా రుచిని కవర్ చేస్తుంది. 4. పెరుగు లేదా మీగడ.. గ్రేవీ కూరల్లో ఉప్పు ఎక్కువైతే రెండు చెంచాల చిలికిన పెరుగు లేదా ఫ్రెష్ క్రీమ్ కలపడం అద్భుతమైన మార్గం. పెరుగులో ఉండే ఫ్యాట్స్, పులుపు ఉప్పు తీవ్రతను తగ్గించడమే కాకుండా, కూరకి మంచి టెక్స్చర్ , క్రీమీ రుచిని ఇస్తాయి. 5. తియ్యటి పదార్థాలు.. కారంగా లేదా మసాలా ఎక్కువ ఉన్న కూరల్లో ఉప్పు తగ్గించడానికి చిటికెడు పంచదార లేదా కొన్ని చుక్కల తేనె కలపవచ్చు. ఇది స్వీట్నెస్ను ఇవ్వడంతో పాటు ఉప్పు, కారాల సమతుల్యతను .. పెంచుతుంది

'మా విలేజ్ షో' నుంచి పాప్యులర్ అయిన నటుడే అంజిమామ. తనదైన యాసతో చాలా సహజంగా నటించే అంజిమామ, ఆడియన్స్ కి చాలా త్వరగా కనెక్ట్ అవుతూ ఉంటాడు. అలాంటి అంజిమామ తాజాగా 'ఐ డ్రీమ్'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించాడు." కష్టపడటం నాకు మొదటి నుంచి అలవాటే. ప్లంబర్ గా .. ఎలక్ట్రీషియన్ గా .. ఆర్ ఎంపీ గా డాక్టర్ పనిచేశాను. ఆ తరువాత వాటర్ ప్లాంట్ పెట్టాను. అయినా ఎక్కడా నిలదొక్కుకోలేకపోయాను" అని అన్నారు. "ఆ తరువాత స్నేహితులతో కలిసి ఈజీమని కోసం ఒక స్కీమ్ లో పెట్టుబడి పెట్టాను. దాంతో 24 లక్షల నష్టం వచ్చింది. మంచి జీవితం కోసం .. త్వరగా ఎదగాలనే కోరికతో ఈజీమని దిశగా ఆలోచన చేయడం జరిగింది. కానీ అనుభవంతో చెబుతున్నాను. ఈజీమని దిశగా ఎవరూ వెళ్లకూడదు. ఆ దిశగా ఎవరినీ ఎంకరేజ్ చేయకూడదు. ఆ ఎఫెక్ట్ కారణంగా జీవితంలో నేను మరిన్ని కష్టాలు పడవలసి వచ్చింది" అని ఆయన చెప్పారు. " ఒక వైపున నటుడిగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూనే, మరో వైపున హైదరాబాద్ లో క్యాబ్ నడుపుతున్నాను. ఎందుకంటే నెల కాగానే ఇంటికి 50 వేలు పంపించవలసి ఉంటుంది. క్యాబ్ నడిపేటప్పుడు మాస్క్ పెట్టుకున్నా నన్ను కొంతమంది గుర్తుపడుతున్నారు. ఈ కష్టాలన్నీ ఎందుకు .. నా ఊరెళ్లిపోవాలని అనిపిస్తుంది. ఒక ఎకరం పొలం .. నాలుగు బర్రెలు ఉంటే హాయిగా బ్రతకొచ్చని అనిపిస్తుంది" అంటూ ఆయన ఉద్వేగానికి లోనయ్యారు

10 నిమిషాల్లో వేడి వేడి వెజ్ సూప్.. సాయంత్రం స్నాక్‌కు బెస్ట్!10 నిమిషాల్లో వేడి వేడి వెజ్ సూప్.. సాయంత్రం స్నాక్‌కు బెస్ట్! Prasanna Yadla 18 August 2026 Pic credit - Pinterest వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకోవాలి. వాటిలో ఈ వెజ్ సూప్ కూడా ఒకటి. వెజ్ సూప్ ముందుగా ఒక పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో తరిగిన వెల్లుల్లి, అల్లం కూడా వేయించాలి వెల్లుల్లి, అల్లం ఆ తరువాత దీనిలో కట్ చేసిన క్యారెట్, బీన్స్, క్యాబేజీ వంటి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. క్యారెట్, బీన్స్ ఇంకా దీనిలో మీరు వేయించిన కూరగాయలన్నీ కూడా వేసి 5 నిముషాల పాటు వేయించాలి. 5 నిముషాల పాటు ఇంకా ఈ కూరగాయలు మొత్తం మునిగేంత వరకు మంచి నీటిని పోసి వీటిని మరిగించాలి. మంచి నీటిని పోసి ఇంకా దీనిలో రుచికి తగినంత ఉప్పు, అలాగే మిరియాల పొడి కూడా వేసి కలుపుకోవాలి మిరియాల పొడి ఇంకా దీనిలో మీరు సోయా సాస్ కానీ కొంచం నిమ్మరసం వేసి ఈ టేస్ట్ ను పెంచొచ్చు. నిమ్మరసం ఈ కూరగాయలు మరి మెత్తగా వీటిని ఉడికించకండి కొంచం ఉడికిస్తే చాలు. అంతే సూప్ రెడీ అంతే సూప్ రెడీ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

చికెన్, మటన్.. రోటిన్ కర్రీలు బోర్ కొట్టినప్పుడు.. నోటికి పుల్లగా టేస్టీగా ఉండి.. మొత్తం అన్నంలోకి అద్భుతంగా తినే సాంబార్ ను చేసుకుంటే ఆ మజానే వేరు.. వాస్తవానికి సాంబార్.. దక్షిణాది వంటకాలలో ఒక ముఖ్యమైన, ప్రసిద్ధ వంటకం. ఇది అన్నంతో, ఇడ్లీ, దోశ, వడ వంటి టిఫిన్లతో అద్భుతమైన కాంబినేషన్. హోటల్స్‌లో లభించే ప్రత్యేకమైన రుచితో కూడిన సాంబార్‌ను ఇంట్లోనే సులభంగా, వేగంగా తయారు చేసుకునే విధానాన్ని ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.. ఈ వంటకం కొత్తగా పెళ్ళైన వారికి, బ్యాచిలర్స్‌కు, లేదా ఇంటికి ఎక్కువ మంది అతిథులు వచ్చినప్పుడు తక్కువ సమయంలో రుచికరమైన సాంబార్ సిద్ధం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. పచ్చిశెనగపప్పు: ¼ కప్పు (మొత్తం 1 కప్పు పప్పు) నీళ్లు: సుమారు 2 లీటర్లు (పప్పు ఉడికించడానికి 1 లీటరు, సాంబార్కి 1 లీటరు) కళ్ళుప్పు: 1 టేబుల్ స్పూన్ (లేదా రుచికి సరిపడా) కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగినది) క్యారెట్: 1, ముల్లంగి: 1, పచ్చిమిరపకాయలు: 4-5, టమాటాలు: 2, చిన్న ఉల్లిపాయలు: ½ కప్పు, సొరకాయ: చిన్న ముక్క, మునక్కాయలు: 2 (ముక్కలుగా తరిగినవి, ఐచ్ఛికం: బెండకాయలు, వంకాయలు, దొండకాయలు నూనె: 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు: ½ టేబుల్ స్పూన్, జీలకర్ర: ½ టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు: 4-6 (తుంచినవి), వెల్లుల్లి రెబ్బలు: 5-6 (తొలగొట్టినవి), కరివేపాకు: 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ: ½ టీస్పూన్ పప్పు ఉడికించడం: ముందుగా ఒక కుక్కర్లో ¾ కప్పు కందిపప్పు, ¼ కప్పు పచ్చిశెనగపప్పు తీసుకుని రెండు, మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఈ పప్పుల కలయిక సాంబార్‌కు హోటల్ రుచిని అందిస్తుంది. కడిగిన పప్పులో 1 లీటరు నీళ్లు, ½ టీస్పూన్ పసుపు, కొద్దిగా నూనె వేసి మూత పెట్టి మూడు నుండి ఆరు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించాలి. పప్పు పలుకు

సాయంత్రం వేళ ఏదైనా స్పెషల్‌గా తినాలనిపిస్తే ఈ క్రిస్పీ చికెన్ కట్లెట్ మంచి ఆప్షన్. బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ కట్లెట్స్ పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చుతాయి. చికెన్‌ను ఉడికించి, ఎముకలు లేకుండా మెత్తగా తురుముకోవాలి. ఇందులో ఉప్పు, కారం, గరం మసాలా, మిరియాల పొడి వేసి కలపాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాలి. అనంతరం చికెన్, ఉడికించిన బంగాళాదుంప, కొత్తిమీర వేసి బాగా కలపాలి. మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నూనె రాసుకుని చిన్న ఉండలుగా తీసుకుని కట్లెట్ ఆకారంలో చేసుకోవాలి. ముందుగా కట్లెట్ను గుడ్డులో ముంచి, ఆ తర్వాత బ్రెడ్ క్రంబ్స్‌లో బాగా కోట్ చేయాలి. పాన్‌లో నూనె వేడి చేసి కట్లెట్స్ను మీడియం మంటపై రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. క్రిస్పీగా మారిన చికెన్ కట్లెట్స్ను టిష్యూపైకి తీసి అదనపు నూనెను తొలగించాలి. టొమాటో సాస్ లేదా గ్రీన్ చట్నీతో వేడిగా సర్వ్ చేస్తే రుచి అదిరిపోతుంది. చికెన్‌ను పూర్తిగా ఉడికించిన తర్వాతే ఉపయోగించండి. వేయించేటప్పుడు నూనెను ఎక్కువగా వేడి చేయకుండా మీడియం మంటపై కట్లెట్స్ను క్రిస్పీగా వేయించడం మంచిది

సాయంకాలం తినాల్సిన టమాటా, ఉల్లి మిక్చర్.. ఎలా చేయాలంటే సాయంకాలం తినాల్సిన టమాటా, ఉల్లి మిక్చర్.. ఎలా చేయాలంటే Prasanna Yadla 15 August 2026 Pic credit - Pinterest సాయంకాలం బయట జంక్ ఫుడ్స్ కన్నా ఈ మిక్చర్ తినడం మంచిది. ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం.. ఈ మిక్చర్ తినడం మంచిది ఇంకా వీటిలో ఒక టమాటా, ఒక చిన్న ఉల్లిపాయను కూడా దీనిలో వేసుకోవాలి. ఉల్లిపాయ ఇంకా ఈ టమాటాలను తీసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి టమాటాలను ఆ తరువాత దీనిలో మరమరాలు, బూందీ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మరమరాలు, బూందీ ఇంకా మిక్చర్ లో రుచికి తగినంత ఉప్పు, ఇంకా కొద్దిగా కారం , మిరియాల పొడిని వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు అంతే కాదు, దీనిలో కొంచం నిమ్మరసం కూడా వేస్తే పిండితే ఈ మిక్చర్‌కు మంచి రుచి వస్తుంది. నిమ్మరసం ఇంకా దీనిలో కొద్దిగా కొత్తిమీరను కలిపితే తిన్న కొద్దీ సేపటికే మంచి రుచి వస్తుంది. కొత్తిమీర (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

వేడి నూనెలో పోపు వేయగానే నూనె వెంటనే చింది గ్యాస్, గోడలపై పడుతుంది. లేదంటే చేతులపై పడి కాలిపోతుంది. తాళింపు వేసినా, కరివేపాకు వేసినా నూనె ఎగరకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గం. అదే ఉప్పు. బాణలిలో తాలింపు కోసం నూనె వేసి, అది వేడెక్కగానే అందులో చిటికెడు పొడి ఉప్పు కలపండి. నూనెలో చిటికెడు ఉప్పు కలిపిన తర్వాత మీరు ఆవాలు లేదా మరే ఇతర పదార్థం వేసినా నూనె అస్సలు బయటకు చిందదు. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే వంటగది టైల్స్, గోడలు జిడ్డు మరకల నుంచి క్లీన్‌గా ఉంటాయి. మీ పని కూడా ఈజీ అయిపోతుంది. Chapati: గ్యాస్ పై నేరుగా చపాతీ కాల్చుతుంటే..ఇది తెలుసుకోండి ఫస్ట్ Oil Free Poori: ఈ పూరీలను డైట్ చేసే వాళ్లు కూడా హాయిగా తినొచ్చు Eggs: కోడి గుడ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే Dosa: నీర్ దోశలు మెత్తగా రావాలా? ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు

Soya Chunks Recipe: శ్రావణ మాసంలో నాన్‌వెజ్‌కి దూరంగా ఉండే మాంసాహార ప్రియుల కోసం సోయా చంక్స్ డ్రై (Soya Chunks Dry) అద్భుతమైన ప్రత్యామ్నాయం. చికెన్, మటన్ ముక్కల్లాగే నమలడానికి వీలుగా ఉండే ఈ రెసిపీ రుచిలోనే కాదు.. ప్రొటీన్లు అందించడంలోనూ సాటిలేనిది. ఇంట్లోనే అత్యంత సులభంగా, తక్కువ సమయంలో దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం! మిల్ మేకర్ (సోయా చంక్స్): ¾ నుంచి 1 కప్పు (చిన్నవి) ఉల్లిపాయ: 1 (పెద్దది – నిలువుగా తరిగినవి) టమాటాలు: 2 (సన్నగా తరిగినవి) అల్లం వెల్లుల్లి పేస్ట్: ¾ నుంచి 1 టీస్పూన్ పచ్చిమిర్చి: 1 నుంచి 2 (పొడవుగా కోసినవి) జీలకర్ర: ½ టీస్పూన్ కరివేపాకు: ఒక గమ్మ ఇంగువ: చిటికెడు కారం: ½ టీస్పూన్ గరం మసాలా (లేదా కిచెన్ కింగ్ మసాలా): ½ నుంచి ¾ టీస్పూన్ పసుపు: చిటికెడు నూనె: 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర: కొద్దిగా (గార్నిష్ కోసం) ఉప్పు: రుచికి సరిపడా ముందుగా ఒక పాత్రలో 3 కప్పుల నీటిని మరిగించి, అందులో సోయా చంక్స్ వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేసి కాసేపు నీటిలోనే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో రెండుసార్లు శుభ్రంగా కడిగి, నీరు ఏమీ లేకుండా గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. పిండిన సోయా చంక్స్‌లో ½ టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ¼ టీస్పూన్ కారం, ½ టీస్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు పక్కన ఉంచితే ముక్కలకు మసాలా బాగా పడుతుంది. పాన్‌లో నూనె వేడి చేసి జీలకర్ర, కరివేపాకు వేయాలి. జీలకర్ర చిటపటలాడాక ఇంగువ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు దోరగా మారే వరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు

భారతీయులు రెగ్యులర్ గా చేసుకునే వంటల్లో పప్పు ముందు వరసలో ఉంటుంది. సీజన్, టైమ్ తో సంబంధం లేకుండా ఎప్పుడైనా అందరూ పప్పును ఇష్టంగా తింటారు. పప్పు తినడానికి కమ్మగానే ఉంటుంది. కానీ.. పప్పు వండటానికే చాలా ఎక్కువ సమయం పడుతుంది. కుక్కర్ లో వండినా కూడా.. పప్పు ఉడకడానికి చాలా ఎక్కువ సమయమే పడుతుంది. టైమ్ ఎక్కువగా లేనప్పుడు పప్పు వండటం కష్టం అని ఫీల్ అవుతున్నారా? అయితే.. సింపుల్ చిట్కాలతో పప్పు తొందరగా, టేస్టీగా వండొచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఓసారి చూద్దాం... వండే ముందు పప్పును నూనె లేకుండా పొడిగా 2–3 నిమిషాలు వేయించడం వల్ల అందులోని తేమ తగ్గుతుంది. తర్వాత నీటిలో పప్పును నానపెట్టినప్పుడు అది తొందరగా మెత్తగా మారుతుంది. దీనివల్ల వంట సమయం తగ్గడమే కాకుండా, పప్పుకు మంచి గుమగుమలాడే కమ్మని రుచి వస్తుంది. పప్పు తొందరగా ఉడకాలి అనుకున్నప్పుడు.. పొట్టు ఉన్న పప్పు కాకుండా... పొట్టు లేని పప్పును ఎంచుకోవాలి. ఇలాంటి పప్పును ఎంచుకుంటే చాలా తొందరగా ఉడుకుతుంది. పప్పు ఎప్పుడైనా సరిగా ఉడకకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ పప్పును కాస్త ఆరనిచ్చి.. బ్లెండర్ లో తిప్పితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల.. పప్పు చాలా క్రీమీగా మారుతుంది. రుచి కూడా కమ్మగా ఉంటుంది. చాలామంది వండేటప్పుడే ఉప్పు వేస్తారు. కానీ మొదట్లోనే ఉప్పు వేస్తే పప్పు పైపొర గట్టిపడి ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే పప్పు సగంపైగా ఉడికిన తర్వాతే ఉప్పు కలపాలి. 5. టమోటాలు, పులుపును ఆఖరులో మాత్రమే కలపండి: టమోటాలు, చింతపండు, నిమ్మకాయ వంటి ఆమ్ల (Acidic) గుణం ఉన్న పదార్థాలు పప్పు మెత్తగా మారకపోగా, గట్టిగా మారుతుంది. కాబట్టి పప్పు బాగా ఉడికిన తర్వాత, తాలింపు వేసే సమయంలో మాత్రమే టమోటాలను కలపడం మంచిది. ఇది పాతకాలపు సీక్రెట్ ట్రిక్! పప్పు ఉడికించేటప్పుడు చిటికెడు (సుమారు

ఈ పచ్చడిని ఉదయం అల్పాహారంతో పాటు సర్వ్ చేయవచ్చు. ఇడ్లీ, దోశతో పాటు వేడి అన్నంలో కూడా తింటే మంచి రుచిని ఇస్తుంది. మరి నోరూరించే బెండకాయ పచ్చడిని ఇంట్లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి పూర్తిగా తుడిచిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయిలో నూనె వేసి వేడయ్యాక బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. బెండకాయలోని జిగురు తగ్గి ముక్కలు మెత్తగా, కొద్దిగా వేగినట్లు అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు వేసి మరో నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత తగినంత ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. ఈ తాలింపును బెండకాయ పచ్చడిపై వేసి బాగా కలపాలి. అంతే.. రుచికరమైన బెండకాయ పచ్చడి రెడీ. వేడి వేడి ఇడ్లీ, దోశ లేదా అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు. బెండకాయను కట్ చేసే ముందు పూర్తిగా తేమ లేకుండా తుడుచుకోవడం మంచిది. అలాగే పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేస్తే రుచి మరింత బాగుంటుంది

ఇది తయారు చేయడానికి పెద్దగా పదార్థాలు కూడా అవసరం లేదు. ఇంట్లో సులభంగా దొరికే వస్తువులతోనే త్వరగా తయారు చేసుకోవచ్చు. మరి బెల్లం, కొబ్బరి పాలతో రుచికరమైన సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. సేమియా – 1 కప్పు బెల్లం – 1 కప్పు కొబ్బరి పాలు – 2 కప్పులు నీరు – 1 కప్పు నెయ్యి – 2 టేబుల్‌స్పూన్లు జీడిపప్పు – 10 ఎండు ద్రాక్ష – 1 టేబుల్‌స్పూన్ ఏలకుల పొడి – ½ టీస్పూన్ కొబ్బరి తురుము – కొద్దిగా ముందుగా కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మిగిలిన నెయ్యి వేసి సేమియాను దోరగా వేయించాలి. సేమియాకు మంచి వాసన వచ్చి లేత బంగారు రంగులోకి మారిన తర్వాత నీరు పోసి మెత్తగా ఉడికించాలి. ఇప్పుడు బెల్లాన్ని కొద్దిగా నీటిలో కరిగించి వడకట్టాలి. సేమియా మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం పాకాన్ని అందులో వేసి బాగా కలపాలి. బెల్లం, సేమియా బాగా కలిసిన తర్వాత మంటను తగ్గించాలి. ఇప్పుడు కొబ్బరి పాలను పోసి నెమ్మదిగా కలుపుతూ కొద్దిసేపు వేడి చేయాలి. అయితే కొబ్బరి పాలు వేసిన తర్వాత పాయసాన్ని ఎక్కువసేపు మరిగించకూడదు. చివరగా ఏలకుల పొడి, వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కొబ్బరి తురుము వేసి కలపాలి. అంతే.. ఎంతో రుచికరమైన బెల్లం కొబ్బరి పాల సేమియా పాయసం రెడీ. వేడిగా లేదా చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. కొబ్బరి పాలు వేసిన తర్వాత పాయసాన్ని ఎక్కువగా మరిగిస్తే అవి విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చివర్లో కొబ్బరి పాలు వేసి తక్కువ మంటపై వేడి చేయడం మంచిది

చికెన్‌తో ఏదైనా కొత్తగా, స్పైసీగా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ క్రిస్పీ చికెన్ వింగ్స్ మీకు మంచి ఆప్షన్. బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ చికెన్ వింగ్స్ సాయంత్రం స్నాక్‌గా, పార్టీల్లో స్టార్టర్‌గా చాలా బాగుంటాయి. మరి వీటిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్ ముందుగా చికెన్ వింగ్స్‌ను శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా లేకుండా తుడుచుకోవాలి. ఒక గిన్నెలో చికెన్ వింగ్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మిరియాల పొడి, పసుపు, గరం మసాలా, సోయా సాస్, చిల్లీ సాస్, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో గుడ్డు, కార్న్‌ఫ్లోర్, మైదా వేసి చికెన్ ముక్కలకు మసాలా మొత్తం బాగా పట్టేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 30 నిమిషాలు పక్కన పెట్టాలి. మరింత రుచి రావాలంటే 1–2 గంటలు ఫ్రిజ్‌లో మారినేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసి, మారినేట్ చేసిన చికెన్ వింగ్స్‌ను ఒక్కొక్కటిగా వేసి మీడియం మంటపై వేయించాలి. బయట మంచి గోల్డెన్ కలర్ వచ్చి కరకరలాడే వరకు వేయించాలి. చివరగా టిష్యూపైకి తీసి అదనపు నూనె పోయేలా ఉంచాలి. వేడివేడిగా చిల్లీ సాస్ లేదా మయోనైస్‌తో సర్వ్ చేస్తే స్పైసీ అండ్ క్రిస్పీ చికెన్ వింగ్స్ రెడీ! చిట్కా: చికెన్ వింగ్స్‌ను వేయించేటప్పుడు నూనె మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. ముందుగా మీడియం మంటపై ఉడికించి, చివర్లో మంట కాస్త పెంచితే బయట మరింత క్రిస్పీగా వస్తాయి

కప్పు గోధుమ పిండితో అదిరిపోయే పకోడీ కప్పు గోధుమ పిండితో అదిరిపోయే పకోడీ Prasanna Yadla 08 August 2026 Pic credit - Pinterest వర్షంలో గోధుమ పిండి పకోడీలను ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని లాగిస్తారు. ఎలా చేయాలో ఇక్కడ చదివి చూద్దాం.. గోధుమ పిండి పకోడీ ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకుని పకోడీలా వీటిని మంచిగా రెడీ చేసి పెట్టుకోవాలి పకోడీ వాటిలో వేసే ఉల్లిపాయలను సన్నగా తరిగిన పక్కన పెట్టాలి ఉల్లిపాయలను ఇంకా దీనిలో 5 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా వేసి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కొత్తిమీర దీనిలో రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కారం, ఇంకా దీనిలో కొంచం వామును కూడా కలపాలి. కొంచం వామును ఇంకా దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఇది గట్టిగా ఉండేలా ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి. పిండిని తీసుకుని చేతితో చిన్న పకోడీల్లా తీసుకుని నూనెలో వీటిని బాగా వేయించాలి వీటిని బాగా వేయించాలి (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

Vegetable Chips: ఈ వర్షాకాలం సాయంత్రం కాస్త క్రిస్పీగా ఏదైనా తినాలి అనిపిస్తుంటుంది. బయట నుంచి ఏమైనా స్నాక్స్, ఫుడ్స్ తెచ్చుకుందామంటే.. ముందే వర్షాకాలం. ఎలాంటి నూనెలు వాడుతున్నారో, క్వాలిటీ ఎలా ఉందో అనే భయం మొదలవుతుంది. చిన్న పిల్లలకు బయట ఫుడ్స్ పెట్టాలంటే ఆ భయం కాస్త రెట్టింపు అవుతోంది. అందుకే ఇంట్లోనే కేవలం 30 నిమిషాల్లో క్రిస్పీగా, రుచిగా ఉండే వెజిటెబుల్ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎలాంటి నూనె వాడకుండా(జీరో ఆయిల్) చేసుకునే ఈ చిప్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. * మీకిష్టమైన కూరగాయలు (బంగాళాదుంపలు, బీట్రూట్, క్యారెట్, జుకినీ, స్వీట్ పొటాటో మొదలైనవి) * రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి ముందుగా మీరు తీసుకున్న కూరగాయలను వీలైనంత పల్చగా (సుమారు 1/6 ఇంచ్ మందంలో) స్లైస్ చేయండి. ముక్కలు సమానంగా రావడం కోసం మండోలిన్ స్లైసర్ (Mandoline Slicer) వాడటం మంచిది. బంగాళాదుంప ముక్కలను కనీసం 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. బీట్రూట్ ముక్కలను 10 నిమిషాలు వేరే గిన్నెలోని నీటిలో నానబెట్టండి. ఇలా చేస్తే వీటి రంగు వేరే కూరగాయలకు అంటుకోకుండా ఉంటుంది. నానిన తర్వాత నీటిని పూర్తిగా వంపేసి, పొడి గుడ్డతో ముక్కలను తడి లేకుండా తుడుచుకోవాలి. క్యారెట్, జుకినీ వంటి కూరగాయలను నీటిలో నానబెట్టాల్సిన అవసరం లేదు. తడి లేని కూరగాయల ముక్కలను బేకింగ్ ట్రేపై ఒకదానికొకటి తగలకుండా పరచండి. ఇక, ఓవెన్‌ను 300°F (సుమారు 150°C) దగ్గర ప్రీ-హీట్ చేయండి. బేకింగ్ ట్రేపై పార్చ్మెంట్ పేపర్ లేదా సిలికాన్ మ్యాట్ వేసి పక్కన పెట్టుకోండి. వీటిని ఓవెన్లో పెట్టి 15 నిమిషాలు బేక్ చేయండి. తర్వాత ట్రే బయటకు తీసి, ముక్కలను జాగ్రత్తగా తిరగేసి (flip) మరో 15 నిమిషాలు బేక్ చేయండి. కొన్ని కూరగాయలు వేగంగా, మరికొన్ని కాస్త నిమ్మదిగా కాలవచ్చు. క్రిస్పీగా అవ్వని ముక్కలను మరో