
అనురాధకు నివాళులు అర్పించిన మాజీ డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
అనురాధ అంత్యక్రియలు పాపన్నపేట లో నిర్వహించగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

అనురాధ అంత్యక్రియలు పాపన్నపేట లో నిర్వహించగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్‌గా మోహిత్ జైన్ ఎన్నికయ్యారు. బెన్నెట్ కోల్మన్ అండ్ కో లిమిటెడ్ (బీసీసీఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పబ్లిషింగ్), బోర్డు... న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్‌గా మోహిత్ జైన్ ఎన్నికయ్యారు. బెన్నెట్ కోల్మన్ అండ్ కో లిమిటెడ్ (బీసీసీఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పబ్లిషింగ్), బోర్డు సభ్యుడిగా ఉన్న మోహిత్ జైన్ 2026-27 సంవత్సరానికి గాను ఏబీసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 43 ఏళ్ల తర్వాత బీసీసీఎల్‌కు చెందిన ప్రతినిధి మరోసారి ఏబీసీ చైర్మన్ పదవిని చేపట్టినట్లయింది. ప్రింట్ మీడియా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న మోహిత్ జైన్.. ప్రచురణ, వ్యాపార కార్యకలాపాలు, పరిశ్రమ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కెమికల్ ఇంజనీరింగ్‌తో పాటు ఎంబీఏ చదివిన జైన్.. 2021-22లో ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) అధ్యక్షుడిగా సేవలందించారు. రెండు దశాబ్దాలకు పైగా ఐఎన్ఎ్సతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రపంచ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ గ్లోబల్ సూపర్వైజరీ బోర్డులోనూ మోహిత్ జైన్ మూడేళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ దక్షిణాసియా విభాగం బోర్డు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కాగా, ఏబీసీ డిప్యూటీ చైర్మన్‌గా విక్రమ్ సఖుజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

Chittoor: చిత్తూరులో పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు: భారీ స్కూటర్ ర్యాలీ! చిత్తూరు: డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను చిత్తూరులో జనసేన పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి అరణి కవిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకల్లో భాగంగా చిత్తూరు నగరంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం నుంచి మురకంబట్టు వరకు సాగిన ఈ ర్యాలీకి చిత్తూరు జనసేన సీనియర్ నాయకులు పగడాల శశికాంత్ నాయకత్వం వహించారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలు చేతబట్టి పవన్ కళ్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. అలాగే చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల మండలం నుంచి సుమారు 100 మంది జనసేన నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వేడుకలకు తరలివచ్చారు. దీంతో కార్యక్రమ ప్రాంగణం జనసేన శ్రేణులతో సందడిగా మారింది

Pawan Kalyan Birthday : పవన్ కల్యాణ్... తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరిది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారు ఉండరు... ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరిది. సినీ అభిమానులకు 'పవర్ స్టార్' గా... రాజకీయ అభిమానులకు 'జనసేనాని' గా.. ఆడబిడ్డలకు 'పవనన్న' గా... మరికొందరికి 'కల్యాణ్ బాబు'గా సుపరిచితమే. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యధికమంది అభిమానులకు కలిగిన హీరో పవన్ కల్యాణ్ అనడంలో అతిశయోక్తి లేదు. పొలిటికల్ గా కూడా ఆయన ఎంత స్ట్రాంగో గత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పలితమే తెలియజేసింది. మొత్తంగా పవన్ కల్యాణ్ అంటే ఓ పేరు కాదు ఓ బ్రాండ్ గా మారిపోయింది. ఈ పేరు వినిపిస్తే చాలు అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి... అభిమానం కట్టలుతెంచుకుంటుంది. చాలామంది తమ పిల్లలకు పవన్ కల్యాణ్ అని పేరు పెట్టుకుంటున్నారంటేనే ఈ పేరులో మ్యాజిక్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అయితే నిజానికి పవన్ కల్యాణ్ అసలుపేరు ఇది కాదట.. తల్లిదండ్రులు వేరే పేరు పెట్టారట. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అసలు పేరు ఏంటి? పవన్ కల్యాణ్ గా ఎలా మారారు? వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. సెప్టెంబర్ 2, 1971 లో ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్లలో పవన్ కల్యాణ్ జన్మించారు. ఆయన తండ్రి కొణిదెల వెంకటరావు, తల్లి అంజనా దేవి... వీరికి చివరి సంతానంగా పుట్టారు. తమ బిడ్డకు ఈ దంపతులు కల్యాణ్ కుమార్ అని పేరు పెట్టారు. తండ్రి వెంకటరావు ఎక్సైజ్ పోలీస్ కావడంతో కొణిదెల ఫ్యామిలీ అనేక ప్రాంతాలు తిరగాల్సి వచ్చింది. ఇలా బాపట్లలో పుట్టిన కల్యాణ్ కుమార్ నెల్లూరులో విద్యాబ్యాసం చేశారు. తర్వాత అన్న చిరంజీవితో కలిసి చెన్నైలో ఉన్నారు... ఇక్కడే ఉన్నత విద్యాబ్యాసం చేశారు. సినిమా ఇండస్ట్రి చెన్నై నుండి హైదరాబాద్ కు మారినతర్వాత అన్నతోపాటే పవన్ కూడా

అమలాపురంలో విద్యుత్ షాక్‌తో జన సైనికుడి మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రేమ్ కుమార్ మృతి కలిచివేసిందన్నారు. అమరావతి, సెప్టెంబర్ 2: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్‌కు గురై ప్రేమ్‌కుమార్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉపముఖ్యమంత్రి స్పందిస్తూ.. యువకుడి మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై జనసైనికుడు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. యువకుడి కుటుంబానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. జీవితం ఎంతో అమూల్యమైనదని పవన్ అన్నారు. ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో మన కోసం కుటుంబం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఎత్తైన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో, ర్యాలీల్లో స్వీయ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలు చేశారు. జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. పిఠాపురంలో లోగో ఆవిష్కరణ అన్నమయ్య ప్రాజెక్ట్ విపత్తు క్రెడిట్ జగన్‌కే దక్కుతుంది: పట్టాభి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 2వ తేదీన తన 55వ జన్మదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేవలం రాష్ట్ర నాయకులే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షల సందేశాలు పంపించారు. సినిమా రంగంలో పవర్ స్టార్‌గా కోట్ల మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న పవన్ కల్యాణ్, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజాసేవలో బిజీగా మారారు. జనసేన పార్టీని స్థాపించి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే ఆయన తన 55వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం చంద్రబాబు తన పోస్టులో పవన్ కల్యాణ్‌ను ప్రియ మిత్రుడిగా సంబోధిస్తూ ఆయన సేవా నిరతిని కొనియాడారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ రోడ్ల నిర్మాణం, పచ్చదనం పెంపొందించడం మరియు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టారని కొనియాడారు. దీంతో రాష్ట్ర పునర్నిర్మాణ హామీలను నెరవేర్చేందుకు పవన్ నిరంతరం శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మంత్రి నారా లోకేశ్ కూడా పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని ప్రత్యేక పోస్ట్ ద్వారా చాటుకున్నారు. పవన్ కల్యాణ్‌ను దేవుడిచ్చిన అన్నయ్యగా అభివర్ణించిన లోకేశ్, సినీ అభిమానులకు ఆయన పవర్ స్టార్ అయితే జనసైనికులకు మార్గదర్శకుడైన సేనాని అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పవన్ జన్మదిన వేడుకలు ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయని చెప్పారు. ఫలితంగా అభిమానులు, నాయకులు భారీ ఎత్తున సేవా

Mega wishes: మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నదమ్ములుగా మాత్రమే కాకుండా.. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవాన్ని వారు ఎన్నో సందర్భాల్లో చాటుకున్నారు. ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ చిరంజీవి చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు” అంటూ తన తమ్ముడిపై ఉన్న ప్రేమను, గర్వాన్ని చిరంజీవి చాటుకున్నారు. చిన్నప్పటి నుంచే పవన్‌లో నిబద్ధతతో కూడిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, ప్రజలకు మంచి చేయాలనే తపనను చూస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమై.. ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే ఉద్దేశంతో వేస్తారని కొనియాడారు. తమ కుటుంబంపై పవన్ ఎంత ప్రేమ చూపిస్తారో.. తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తారని చిరంజీవి అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ.. అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకెళ్తున్న తీరు తనకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోందని చిరంజీవి తెలిపారు. ముఖ్యంగా తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు పవన్ ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నారని అన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే పవన్ కళ్యాణ్.. తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటూ.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని

టీటీడీలో అవినీతి ఆరోపణలు కలకలం రేపాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈవో) ఎం. లోకనాథం నివాసం, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. తిరుపతి, తిరుమలతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఏడు బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ఈరోజు ఉదయం 6 గంటలకే అధికారులు తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లో ఉన్న లోకనాథం నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉండగా తనిఖీలు ప్రారంభించారు. అదే సమయంలో తిరుమలలోని ఆయన కార్యాలయంలో మరో బృందం సోదాలు చేపట్టింది. ఈ దాడులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా జరుగుతున్నాయని ఏసీబీ వర్గాలు తెలిపాయి.ఈ సోదాలను అధికారులు బహుళ ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. తిరుపతిలో లోకనాథం ఇద్దరు బావమరుదుల ఇళ్లలో, యెర్పేడు మండలం చెల్లూరులో ఉన్న ఆయన సోదరి నివాసంలోనూ తనిఖీలు చేపట్టారు. తిరుమలలో లోకనాథంకు సంబంధం ఉందని భావిస్తున్న ఒక గెస్ట్ హౌస్‌లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. విచారణలో భాగంగా తిరుపతి ఎస్టీవీ నగర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలో ఉన్న లోకనాథం బ్యాంక్ లాకర్లను కూడా అధికారులు తెరిచి పరిశీలిస్తున్నారు. లోకనాథం ప్రస్తుతం శ్రీవారి ఆలయం టెంపుల్ డిప్యూటీ ఈవోగా కీలక బాధ్యతల్లో ఉండగా, గతంలో టీటీడీలో వివిధ హోదాల్లో పనిచేశారు.గత దశాబ్ద కాలంలో ఒక టీటీడీ ఉన్నతాధికారిపై ఏసీబీ సోదాలు నిర్వహించడం ఇది రెండోసారి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Pawan kalyan fan dies due to electric shock in amalapuram: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసైనికులు తమ అభిమాన హీరో, డిప్యూటీ సీఎం పేరు మీదుగా పలు ఆలయాల్లో అర్చనలు, పూజలు, అన్నదానాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా పలు చోట్ల ఆస్పత్రులలో పండ్లను కూడా పంపిణి చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తన కుడి భూజానికి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే.. పవన్ కళ్యాణ్ బర్త్ డే నేపథ్యంలో అమలాపురంలో ఫ్లెక్సీలు కడుతుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. అమలాపురంలో పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఒక యువకుడు స్పాట్ లోనే మృతిచెందాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని బెండమూర్లంకకు చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ కు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అతను హైదరాబాద్ లో ఉంటూ అక్కడ ప్రైవేటు జాబ్ చేసుకుంటున్నాడు. ఇటీవల సెలవులపై స్వగ్రామానికి వచ్చిన ప్రేమ్ కుమార్..తన స్నేహితులతో కలిసి తమ అభిమాన నేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలలో పాల్గొన్నాడు. స్థానికంగా ఉన్న ఒక కాలేజీ గోడ మీద ఎక్కి పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా అతనికి విద్యుత్ తీగ తగలడంతో కరెంట్ షాక్ కు గురయ్యాడు. దీంతో అతను స్పాట్ లోనే మృతిచెందాడు. Read more

Anakapalle: జనసేనాని బర్త్‌డే జోష్.. బైక్ నడిపిన ఎమ్మెల్యే కొణతాల! ఈ వార్తకు సంబంధించిన

1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ ప్రయాణం ప్రారంభమైంది. 'తొలిప్రేమ', 'తమ్ముడు', 'బద్రి', 'ఖుషి' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో టాలీవుడ్లో తిరుగులేని ఇమేజ్ను, సొంత మేనరిజమ్స్‌తో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు పవన్. దాదాపు 30 ఏళ్ల సినీ కెరీర్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా నిలిచారు. పలు నివేదికల ప్రకారం ఆయన ఒక్కో సినిమాకు ₹50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం. 2008లో చిరంజీవి స్థాపించిన 'ప్రజారాజ్యం' పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయారంగేట్రం చేసిన పవన్.. 2014లో 'జనసేన' పార్టీని స్థాపించారు. 2019 ఎన్నికల్లో ఓటములు ఎదురైనా కుంగిపోకుండా, ప్రజా సమస్యలపై నిలకడగా పోరాడారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమితో కలిసి పోటీ చేసిన జనసేన, పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ సాధించింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ తన మార్క్ చూపిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, పవన్ కళ్యాణ్ దగ్గర ₹165 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. అలాగే దాదాపు ₹65.76 కోట్ల అప్పులు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే, మీడియా నివేదికల ప్రకారం ఆయన మొత్తం బ్రాండ్ వ్యాల్యూ, సినిమాలు, స్థిరాస్తుల మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటే నెట్‌వర్త్ దాదాపు ₹450 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. హైదరాబాద్‌లో ఆయనకు విలువైన స్థిరాస్తులతో పాటు ఒక ఫామ్‌హౌస్ కూడా ఉంది. వాహనాల పట్ల ఇష్టమున్న పవన్ గ్యారేజీలో మెర్సిడెస్ బెంజ్ జీ-క్లాస్ (Mercedes-Benz G-Class), ఆడి క్యూ7 (Audi Q7), బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 (BMW X5), టయోటా ల్యాండ్ క్రూజర్ వంటి పలు హై టెక్నాలజీ కలిగిన లగ్జరీ కార్లు ఉన్నాయి. ప్రస్తుతం ఒకవైపు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా

ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. మరి మెగా స్టార్ చిరంజీవికి ఉండే ఆనందం అంతా ఇంతా కాదు. ప్రతి సంవత్సరం పవన్ కి తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్తూ అభిమానుల్లో జోష్ నింపుతూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం మాత్రం అంతకు మించిన ట్వీట్ తో సోషల్ మీడియాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడం టూ డే టాక్ అఫ్ ది డే. 'ఎక్స్' వేదికగా 'సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.కేవలం చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగానే కాకుండా ప్రజా జీవితంలో జనసేనానిగా, ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నాడు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించని గుణం, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే తత్వం పవన్ సొంతం. కళ్యాణ్ బాబు ఆయురారోగ్యాలతో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ప్రజలకు మరింతగా సేవ చేసే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలి" అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఘనంగా జరుగుతున్నాయి. అభిమానుల్లో మరింత జోష్ నింపేలా 'పంజా' మూవీ ఈ రోజు రీ రిలీజై థియేటర్స్ లో సందడి చేస్తుంది. అంతర్జాతీయ సినిమా వేదికగా జమ్మూకశ్మీర్.. రూ. 96 లక్షల ప్రైజ్ మనీతో వైభవంగా వేడుకలు.!

తిరుమల తిరుపతి దేవస్థానం వర్గాల్లో ఉదయాన్నే ఒక వార్త పిడుగులా పడింది. టీటీడీ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే బలమైన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేయడమే కాకుండా, తిరుపతితో పాటు వివిధ ప్రాంతాల్లోని ఆయన నివాసాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. శనివారం తెల్లవారుజామున 6 గంటలకే రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు ఒకేసారి పలు చోట్ల తనిఖీలు చేపట్టడంతో తిరుమలలో తీవ్ర సంచలనం వ్యక్తమవుతోంది.ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో మొత్తం 7 ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు ఈ దాడులను అత్యంత రహస్యంగా నిర్వహించారు. తిరుపతిలోని పెదకాపు లేఅవుట్లో ఉన్న లోకనాథం ప్రధాన నివాసంలో సోదాలు చేస్తున్న సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. దీంతో పాటు తిరుపతి ఎస్టీవీ నగర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఉన్న ఆయన లాకర్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం ఆయన ఇల్లే కాకుండా.. తిరుమలలోని ఆయన డిప్యూటీ ఈవో ఆఫీస్, వసతిగృహంతో పాటు బంధువుల ఇళ్లను కూడా ఏసీబీ వదల్లేదు. అవినీతి ముత్యం @రూ.200 కోట్లు.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 14రోజుల రిమాండ్ బంధువుల ఇళ్లపైనా విరుచుకుపడ్డ బృందాలులోకనాథంకు చెందిన బినామీ ఆస్తులు, కీలక పత్రాల అన్వేషణలో భాగంగా ఆయన నెట్‌వర్క్‌పై ఏసీబీ నిఘా పెట్టింది. తిరుపతిలోని ఆయన ఇద్దరు బావమరుదుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా.. ఏర్పేడు మండలం చెల్లూరులోని ఆయన సోదరుడి ఇంట్లో కూడా ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. కీలక ఆధారాలు, నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పాస్తుల డాక్యుమెంట్లను సీజ్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.డీఎస్పీ భీంరెడ్డి ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే షాక్.. తొలిరోజే రూ.200 కోట్లకు పైనే 15 ఏళ్ల తర్వాత టీటీడీలో మళ్లీ ఏసీబీ ప్రకంపనలు!తిరుమల శ్రీవారి దేవస్థానంలో దాదాపు 15 సంవత్సరాల సుదీర్ఘ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కల్యాణ్ 55వ పుట్టినరోజు సందర్భంగా ఆయన భార్య అన్నా కొణిదెల ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంతో మంది హృదయాల్లో, ఆలోచనల్లో, ప్రార్థనల్లో ఉన్నారని పేర్కొన్నారు. భర్తతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.‘‘ఈ రోజు నిన్ను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నువ్వు ఎంతోమంది హృదయాల్లో, ఆలోచనల్లో, ప్రార్థనల్లో ఉన్నావు. ఎంతోమంది జీవితాలను నువ్వు ప్రభావితం చేశావనడానికి ఇది నిదర్శనం. ఇతరులకు ఎంతో ఇచ్చావు. పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అంటూ అన్నా పోస్టు చేశారు.అన్నా పంచుకున్న ఫొటోలో దంపతులిద్దరూ కిటికీ పక్కన కూర్చున్నారు. పవన్ పక్కనే అన్నా కూర్చొని ఆయన వైపు ఆప్యాయంగా చూస్తూ కనిపించారు. ఈ పోస్టు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.పవన్ కల్యాణ్ 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషి’ వంటి వరుస విజయాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘జల్సా’, ‘గబ్బర్‌సింగ్’, ‘అత్తారింటికి దారేది’, ‘గోపాల గోపాల’, ‘భీమ్లా నాయక్’ చిత్రాలతోనూ విజయాలు అందుకున్నారు.ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. నటుడిగా ఆయనకు ప్రత్యేకమైన శైలి, మేనరిజమ్స్ ఉన్నాయి. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఆయనకు పుస్తకాలు చదవడం కూడా ఇష్టం
సినీ పరిశ్రమలో అభిమానం అనేది సహజమే... కానీ ఆ అభిమానాన్ని ఆరాధనగా, భక్తిగా మార్చుకున్న అతి కొద్దిమందిలో ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఒకరు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఆయనకు కేవలం ఒక హీరో మాత్రమే కాదు.. సాక్షాత్తూ ప్రత్యక్ష దైవం. మైక్ దొరికితే చాలు పవన్‌ను ఆకాశానికెత్తేస్తూ బండ్ల గణేష్ ఇచ్చే ఎనర్జిటిక్ స్పీచ్‌లు టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించాయి. పవన్‌పై ఆయన చూపించే ఈ నిస్వార్థ ప్రేమని సినీ జనాలు వీరభక్తి అని పిలుస్తుంటారు. తాజాగా పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఒక ప్రత్యేక పోస్ట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.* అల్లు అర్జున్‌ని పక్కనపెట్టి యష్‌తో లోకేష్ కనకరాజ్ సినిమానా?... అల్లు, యష్ ఫ్యాన్ వార్ వేళ మరో బాంబ్హాస్య నటుడిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత అగ్ర నిర్మాతగా మారిన బండ్ల గణేష్ ఎదుగుదలలో పవన్ కల్యాణ్ పాత్ర ఎంతో కీలకం. పవన్‌తో ఆయన నిర్మించిన ‘గబ్బర్ సింగ్’ మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి వారి అనుబంధాన్ని మరింత దృఢం చేసింది. ఆడియో వేడుకల్లో, ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో బండ్ల గణేష్ వేదికపైకి వచ్చారంటే అభిమానుల్లో పూనకాలు రావడం ఖాయం. 'వకీల్ సాబ్' ఈవెంట్లో పవన్ వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ... ‘ఈశ్వరా… పవనేశ్వరా… పవరేశ్వరా’ ఆయన ఇచ్చిన స్పీచ్ తెలుగు సినీ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా, పవన్ కల్యాణ్ సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుంటూ ఆపదలో ఉన్న అభిమానులకు, పేదలకు ఎన్నో సందర్భాల్లో ఆయన ఆర్థిక సహాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు.మరోసారి 'పవనేశ్వర' జపంబుధవారం (సెప్టెంబర్ 2) పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని బండ్ల గణేష్ తన ఆరాధ్య దైవానికి తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. గతంలో 'వకీల్ సాబ్' వేదికపై గర్జించిన డైలాగును గుర్తుచేస్తూ ఆయన రాసిన

మెగాస్టార్ చిరంజీవి పెళ్లి జరిగిన టైమ్ కు పవన్ కళ్యాణ్ చాలా చిన్నవాడు. దాంతో పవన్ ను కూడా చిరంజీవితో కలిసి చెన్నైలోనే ఉండేవాడు. చిరంజీవి భార్య సురేఖ పవన్ కళ్యాణ్ ను కన్న కోడుకులా చూసుకుంది. పిల్లలు పుట్టిన తరువాత కూడా తన పిల్లలో సమానంగా పవర్ స్టార్ ను ఆమె ప్రేమించేది. అందుకే పవన్ కళ్యాణ్ కూడా సురేఖను తల్లితో సమానంగా చూసుకుంటాడు. అసలు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం కూడా సురేఖ తీసుకున్న నిర్ణయమే. ఆమే పవన్ కళ్యాణ్ ను హీరోను చేయాలని చిరంజీవితో చెప్పి పట్టుబట్టి ఒప్పించిందట. వదిన సురేఖ తనకు ద్రోహం చేసిందని పవన్ కళ్యాణ్ గతంలో జరిగిన ఓ ఈవెంట్ లో వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో మూవీలో పవన్ కూడా నటించారు.ఈ సినిమా ఈవెంట్ లో పవర్ స్టార్ ఈ కామెంట్స్ చేశారు. తనకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని, తాను ఎప్పుడూ అనుకోలేదని, ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ, పొలం పనులు చేసుకోవాలనుకున్నా. అన్నయ చిరంజీవి మెగాస్టార్‌గా ఇమేజ్ పొంది పీక్‌లో ఉన్నప్పుడు హీరో అవుతావా? అని అడినప్పుడు భయమేసింది. తాను చేయగలనా అనిపించింది. కానీ మనల్ని నమ్మేవ్యక్తులు ఇంపార్టెంట్. వదిన సురేఖ నన్ను నమ్మింది. ఆమె సినిమాలు చేయమని ప్రోత్సహించింది. ఓ సారి జగదాంబ థియేటర్ వద్ద బస్ ఎక్కి డాన్సు చేయమన్నారు. ఆ రోజు డాన్సు చేయడానికి నేను చచ్చిపోయాను. ఆ రోజు ఫోన్ చేసి మా వదినని అడిగాను. నన్ను ఎందుకు ఇలా చేశావని నిలదీశాను. ఆమె ఆ రోజు చేసిన తప్పు కారణంగానే ఇప్పుడు నేను ఇలా మీ ముందు నిల్చున్నాను. దీనంతటికి కారణం వదిన చేసిన ద్రోహమే అని కామెంట్స్ చేశారు. తన ఎదుగుదలకు వదిన తీసుకున్న నిర్ణయమే కారణం అని పవన్ కళ్యాణ్ ఫన్నీ వేలో

Pawan Kalyan: టాలీవుడ్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో తనదైన స్టైల్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన ఐదు విషయాలను ఒకసారి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ప్రేమగా పవర్‌స్టార్ అని పిలుస్తుంటారు. ఆయన సినిమాల్లో కనిపించే ప్రత్యేకమైన స్టైల్, యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో పవర్‌స్టార్ అనే పేరు ఆయనకు బలమైన గుర్తింపుగా మారింది. పవన్ సినిమా విడుదలైతే అభిమానులు పండుగలా సెలబ్రేట్ చేసుకోవడం సాధారణంగా మారిపోయింది. పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆయన కరాటేలో శిక్షణ తీసుకున్నారు. ఆయనకు కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. సినిమాల్లోని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపించే ప్రత్యేకమైన శైలి వెనుక ఈ శిక్షణ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. మార్షల్ ఆర్ట్స్ తనకు క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మ నియంత్రణ నేర్పాయని పవన్ గతంలో చెప్పారు. సినిమా రంగంలో స్టార్‌గా కొనసాగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో జనసేన పార్టీని స్థాపించారు. సామాన్య ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు చిరంజీవికి తమ్ముడు. మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. సినిమాల్లో తనదైన శైలితో ప్రత్యేక అభిమాన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ సాధారణ జీవనశైలిని ఇష్టపడతారని ఆయనను దగ్గరగా చూసిన వారు చెబుతుంటారు. అవసరం లేని ఆర్భాటాలకు దూరంగా ఉండటం ఆయన వ్యక్తిత్వంలో కనిపించే ప్రత్యేకత

చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంత పరిధిలోని పాపిరెడ్డిగారిపల్లె వద్ద ఓ మామిడి తోటలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మగ ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. అమరావతి, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంత పరిధిలోని పాపిరెడ్డిగారిపల్లె వద్ద ఓ మామిడి తోటలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మగ ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోర్వెల్ మోటార్‌కు అనుసంధానించిన తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగ ఏనుగుకు తగలడం, ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండటంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చనేది ప్రాథమికంగా అంచనా వేశామని అధికారులు చెప్పారని అన్నారు. ఈ మేరకు ఎక్స్(X)లో పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు. విద్యుత్ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.. ఏనుగు మృతి ఘటనపై విచారణ చేపట్టి, నివేదికను సమర్పించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. వన్యప్రాణి నిబంధనలు, నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఏనుగును ఖననం చేయాలని సూచించారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టింది: సీఎం చంద్రబాబు పవన్ కల్యాణ్ ఆదేశాలు.. ఏపీలో పర్యావరణ పరిరక్షణకు స్పెషల్ డ్రైవ్ రోశయ్య స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేశ్

Pawan Kalyan : నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో అభిమానులు, సెలబ్రిటీలు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ అన్నదమ్ముల మధ్య ఎంత అనుబంధం ఉందొ అందరికి తెలిసిందే. పవన్ గతంలో అనేకమార్లు అన్నయ్య చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని, ఆయన దగ్గర పెరిగినప్పటి జ్ఞాపకాలను పంచుకున్నాడు. నేడు చిరంజీవి పుట్టిన రోజు కావడంతో పవన్ కళ్యాణ్.. చిరంజీవి కష్టాన్ని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు మోడీ, చిరంజీవిలతో వైరల్ అయిన వీడియోని షేర్ చేస్తూ అనేక మాటలు రాశారు. పవన్ ఆలయం తన ట్వీట్ లో.. ఆయన ఎప్పుడూ ఆనందానికి మూలం. ఈ ప్రత్యేకమైన రోజున నేను జ్ఞాపకాల దారిలో నడుస్తుండగా, నాకు తారసపడిన కొన్ని జ్ఞాపకాలు ఇవి. మా చిన్నతనంలో ఆయన నర్సాపూర్‌లో కళాశాల విద్యను అభ్యసించడానికి ఇంటి నుండి దూరంగా వెళ్లారు. వేసవి సెలవుల్లో ఆయన ఇంటికి తిరిగి రావడం ఒక పండుగలా ఉండేది. ఆయన కళాశాల చదువుల కోసం తిరిగి వెళ్ళినప్పుడు, ఒక పెద్ద బాధ, నిరాశ మమ్మల్ని వెంటాడేవి. మేమందరం ఆయన లేని లోటును తలుచుకుని ఆ శూన్యాన్ని అనుభవించేవాళ్ళం. ఆయన తిరిగి వచ్చేవరకు మా ఇల్లు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది కాదు. నా పాఠశాల రోజుల్లో ఆయన పక్కన నడవడమే ఒక గర్వించదగిన క్షణం. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తితో నడుస్తున్నట్లు నాకు అనిపించేది. అప్పటికి ఆయన ఇంకా కళాశాలలోనే ఉన్నారు. ఆయన తన ఉంగరాల పొడవాటి జుట్టుతో, బెల్ బాటమ్ ప్యాంటు, కళ్ళద్దాలతో, దృఢమైన ఎన్సిసి క్యాడెట్ శరీరంతో మా నాన్నగారి బైక్ (బుల్లెట్ – 350 సిసి) నడుపుతున్నప్పుడు.. ఓహ్! అది ఒక వీరాభిమానిని ఆరాధించే క్షణం. నా అన్నయ్య హీరో కాకముందే నాకు ఎప్పుడూ హీరోనే. ఆయన సినీ జీవితం

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Pawan kalyan to visit kerala for rotator cuff treatment: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం గత కొన్నినెలలుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని నెలల క్రితం ముక్కుకు సంబంధించిన సర్జరీని హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో సర్జరీ చేసుకున్నారు. ఆతర్వాత కూడా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడ్డారు. దీంతో వైద్యులు సైనసైటిస్‌కు సంబంధించి సర్జరీ చేశారు. కొన్నినెలల తర్వాత భూజాలకు చెందిన రోటెటర్ కఫ్ సమస్యలతో ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అక్కడ సర్జరీని వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. అయితే మరోవైపు.. పవన్ కు రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఉన్నాయి. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉందన్నారు. పవన్ కళ్యాణ్ భుజానికి గబ్బర్ సింగ్ మూవీ షూటింగ్ సమయంలో గాయమైన విషయం తెలిసిందే. ఆతర్వాత 2018లో పోరాట యాత్ర సమయంలో.. ఆ సమయంలో పవన్ కళ్యాణ్‌తో కరచాలనం, గట్టిగా లాగడం వంటి వాటితో భూజాల సమస్యలు ఎక్కువయ్యాయి. ఇక ముంబైలో సర్జరీ తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొవాలని చెప్పిన పవన్ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో భూజాలవాపు, జ్వరంకు గురయ్యారు. ఇక పదే పదే అనారోగ్యం బారిన పడటం, కండరాల వాపుతో తీవ్రసమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రేపు శనివారం రోజున కేరళకు వెళ్లనున్నారు. అక్కడే 20 రోజుల పాటు ఉండనున్నారు. Read more: Nellore: మిమ్మల్ని చూసి బండి దాచిపెట్టిండు.. నెల్లూరులో తండ్రి బండారం బైటపెట్టిన బుడ్డొడు.. ఫన్నీ వీడియో.. అక్కడే ఉండి కేరళలో ప్రసిద్ది

Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం కేరళకు వెళ్లనున్నారు. 20రోజుల పాటు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా పవన్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత నెలలో భుజానికి సర్జరీ చేయించుకున్న పవన్.. వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. వరుస అనారోగ్య సమస్యల నేపథ్యంలో కేబినెట్ సమావేశాలతోపాటు పలు కార్యక్రమాలను పవన్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అయితే, కేరళ రాష్ట్రంలోని ప్రకృతి వైద్య చికిత్స కేంద్రానికి పవన్ వెళ్లనున్నారు.. అక్కడే ఇరువై రోజులపాటు ఉండి చికిత్స పొందనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. గురువారం శాసనసభ ప్రాంగణంలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభా పక్ష సమావేశం జరిగింది. మున్సిపల్, పంచాయతీ రాజ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై పవన్ నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరపున అనుసరించాల్సిన విధివిధానాల రూపకల్పన, క్షేత్ర స్థాయిలోని పార్టీ శ్రేణుల ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులతో ప్రత్యేక కమిటీ నియమిస్తామని అన్నారు. ప్రజాప్రతినిధులు చెప్పిన అంశాలను నోట్ చేసుకున్న పవన్ కల్యాణ్ ఎన్నికల సంసిద్ధతపై వారికి దిశానిర్దేశం చేశారు. మరోవైపు… జనసేన పార్టీ సంస్థాగత కమిటీల జాబితాను సమీక్షించిన పవన్ కల్యాణ్.. పార్లమెంట్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు వచ్చిన 36 వేలకు పైగా దరఖాస్తులను, ఆయన స్వీయ పర్యవేక్షణలో పనిచేస్తున్న కమిటీ బృందం పరిశీలించిన అనంతరం సమర్పించిన జాబితాలో అవసరమైన పలు మార్పులు, సవరణలు చేయాలని నిర్ణయించారు. ఈక్రమంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడు, జనసైనికుడు, వీరమహిళకు తగిన గుర్తింపు, ప్రాతినిధ్యం దక్కేలా ఎంపిక ప్రక్రియను మరింత సమగ్రంగా, పారదర్శకంగా పరిశీలించి కమిటీలను ఏర్పాటు చేసేందుకు మరికొద్ది వారాల సమయం తీసుకుని పూర్తిచేయాలని నిర్ణయించారు

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. స్థానిక ఎన్నికల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మూడు పార్టీలు సమన్వయంతో సీట్ల పంపకాల పైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాయి. ఇదే సమయంలో అటు వైసీపీ సైతం ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. అక్టోబర్ నెలాఖరు నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. సీట్ల సర్దుబాటు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న వేళ స్థానిక ఎన్నికల పై పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.ఏపీలో ఇప్పుడు స్థానిక ఎన్నికల రాజకీయం మొదలైంది. స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు పైన జనసేన నుంచి ఈ సారి వాయిస్ బలంగా వినిపిస్తోంది. 2024 ఎన్నికల ఫార్ములా ఇప్పుడు ఈ ఎన్నికలకు వర్తించదని పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు. తమకు బలం ఉన్న చోట్ల పోటీ చేసి తీరుతామని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో, కూటమి లోని మూడు పార్టీల అధినేత లు కలిసి కూర్చొని సీట్ల పంపకాల పైన మాట్లాడుకుందామని చంద్రబాబు సూచించారు. కాగా.. ఇక, ఇప్పుడు జనసేన నుంచి సీట్ల పైన పెరుగుతున్న ఒత్తిడి వేళ అసెంబ్లీలోని జనసేన కార్యాలయ ప్రాగణంలో పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పవన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. స్థానిక ఎన్నికల పైన చర్చించారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్దం కావాలని సూచించారు. ఇదే సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.పాఠశాలలకు, కార్యాలయాలకు వరలక్ష్మీ వ్రతం సెలవు- తాజా ఉత్తర్వులు..!!పవన్ సంకేతాల వెనుకసమావేశం తరువాత పవన్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో..జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద అంతా కలసి లోతుగా చర్చించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు తీసుకువెళ్తాం.. అని పవన్ స్పష్టం చేసారు. ఇందులో ప్రత్యేకంగా జనసైనికుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా అని చెప్పటం ద్వారా సీట్ల

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక ప్రక్రియను బహిష్కరిస్తూ అధికార కూటమి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.మండలి ఛైర్మన్ మోషేనురాజు డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియను చేపట్టగానే, టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో సభలో వైసీపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమే మిగిలారు. వైసీపీ తరఫున మాధవరావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఛైర్మన్ ప్రకటించారు.అనంతరం పలువురు సభ్యులు 'జై జగన్' అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మంత్రి అచ్చెన్నాయుడిపై అభ్యంతరకర పదజాలం ఉపయోగించడం వివాదాస్పదమైంది. అయితే, ఆ తర్వాత ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఛైర్మన్‌ను కోరారు.కూటమి సభ్యుల వాకౌట్‌పై బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సభా సంప్రదాయాలకు విరుద్ధమని, రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు. రాజకీయాల్లో కక్షలు ఉండకూడదని, సభా గౌరవాన్ని కాపాడాలని హితవు పలికారు. ఎన్నిక ముగిసిన అనంతరం, నూతన డిప్యూటీ ఛైర్మన్ మాధవరావు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు

Tiruchanur: తిరుచానూరు అమ్మవారి సేవలో మాజీ టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మాజీ టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బుధవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, సూపరింటెండెంట్లు సురేష్, రమేష్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవరావు ఎన్నికను మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. అమరావతి, ఆగస్టు 19: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవరావు ఎన్నికను మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. అనంతరం మాధవరావును చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. మాధవరావును అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేందుకు అన్ని పార్టీల సభ్యులు కలిసి రావాలని మండలి చైర్మన్ కోరారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి పూర్తి వివరాలను పై వీడియోలో వీక్షించండి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవరావు ఎన్నికను మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. అనంతరం మాధవరావును చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. మాధవరావును అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేందుకు అన్ని పార్టీల సభ్యులు కలిసి రావాలని మండలి చైర్మన్ కోరారు. అయితే కూటమి పార్టీలకు చెందిన సభ్యులు చైర్మన్ సీటు వద్దకు రాలేదు. దీంతో వారి తీరుపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, అన్ని పార్టీల సభ్యులు కలిసి కొత్తగా ఎన్నికైన డిప్యూటీ చైర్మన్‌ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడం సభా సంప్రదాయంలో భాగమని చైర్మన్ మోషేన్ రాజు పేర్కొన్నారు. అయితే కూటమి సభ్యులు ఆ కార్యక్రమానికి దూరంగా ఉండటంపై మండలిలో చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. మాధవరావు డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బొత్స సత్యనారాయణతో పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండలిలో డిప్యూటీ చైర్మన్‌గా మాధవరావు ఎన్నిక కావడం పట్ల వైఎస్సార్సీపీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మాధవరావు ఎన్నికతో మండలి డిప్యూటీ చైర్మన్ పదవి వైఎస్సార్సీపీకి దక్కింది. అనంతరం సభలో బొత్స మాట్లాడుతూ..‘అన్ని పక్షాలను సమదృష్టితో చూడాలని కోరుకుంటున్నా. డిప్యూటీ చైర్మన్‌ను చైర్‌పై కూర్చోబెట్టడానికి అధికార పార్టీ రాకపోవడం దురదృష్టం. మంత్రులు సభ రూల్స్ గురించి చెప్తున్నారు.. డిప్యూటీ చైర్మన్‌కి గౌరవం ఇవ్వరా?. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా జరగలేదు. ప్రజలు చూస్తున్నారు.. చైర్ పట్ల అగౌరవంగా వ్యవహరిస్తే మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి సహజం. సభా సాంప్రదాయాలు, గౌరవాలు శాశ్వతం. వెన్నుపోటు పార్టీ తీరు మరోసారి రుజువైంది. రాబోయే రోజుల్లో ఇలాంటి అగౌరవ ఘటనలు జరగకూడదు. మంత్రులు రూల్స్ బుక్స్ పట్టుకుని నీతులు చెప్పడం కాదు. విలువలు, సాంప్రదాయాలు

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Sardar Sarvai Papanna Goud Jayanti: తెలంగాణ మట్టి బానిసత్వాన్ని భరించదని, అణచివేతను అసలే సహించదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 17వ శతాబ్దంలోనే అణచివేతపై తిరుగుబాటు చేసి, బహుజనులను ఏకం చేసి గోల్కొండ కోటను సాధించిన వీర యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చూపిన బాటలోనే నేటి ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లోని సచివాలయం ఎదుట, ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. అనంతరం సచివాలయం ప్రాంగణంలో నిర్వహించిన పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సామాన్యులు సైతం కలలు కనే ఉన్నత స్థానాలకు ఎదగొచ్చని నాడే సర్వాయి పాపన్న నిరూపించారని భట్టి విక్రమార్క కొనియాడారు. 'కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి' అనే లక్ష్యంతో చిన్న చిన్న కోటలను గెలుచుకుంటూ ముందుకు సాగిన గొప్ప ధీరుడని, ఆయన ఆత్మగౌరవ పోరాటం మనందరికీ నిత్య స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా బహుజనులు, దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని, ఇటీవలే నెక్లెస్ రోడ్లో సావిత్రీబాయి పూలే, జ్యోతిరావు పూలే విగ్రహాలను కూడా ఆవిష్కరించుకున్నామని గుర్తుచేశారు. ఈ రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాలు ఎవరి దగ్గరా 'దేహీ' అని అడగకుండా, స్వశక్తితో తల ఎత్తుకొని బతికేలా ఆర్థికంగా నిలబెట్టడమే ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం తెలిపారు. అందులో భాగంగానే ఒక్కో ఇంటికి రూ.5 లక్షల సాయంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

ప్రకాశం జిల్లాలోని మైనింగ్ క్వారీలో జరిగిన ప్రమాదం కేసులో అనుకూల నివేదిక కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో పలువురి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను అరెస్ట్ చేసింది. అతడితో పాటు ప్రైవేట్ మైనింగ్ సంస్థ ప్రతినిధి, కన్సల్టెంట్‌ను అరెస్ట్ చేశారు. అమరావతి, ఆగస్టు 18: ప్రకాశం జిల్లాలో మైనింగ్ క్వారీలో జరిగిన ప్రమాదం కేసులో అనుకూల నివేదిక కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో పలువురి ప్రమేయం ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గుర్తించింది. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే ప్రైవేట్ మైనింగ్ సంస్థ ప్రతినిధి, కన్సల్టెంట్‌ను అరెస్ట్ చేశారు. వీరిని విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. గతంలో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌కు రూ. లక్ష లంచం ఇచ్చినట్లు కూడా సీబీఐ గుర్తించింది. అనుకూల నివేదికతో పాటు మైనింగ్ సంస్థ నుంచి త్రైమాసిక లంచాల కోసం రూ. 2 లక్షలు ఏర్పాటు చేసినట్లు కనుగోంది. మైనింగ్ క్వారీ ప్రమాదంలో అనుకూల నివేదిక కోసం రూ. 2 లక్షల నగదు తీసుకుంటూ డిప్యూటీ డైరెక్టర్‌ను సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ నగదును సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒంగోలు, కడప, హైదరాబాద్‌లలో నిందితులకు చెందిన ఇళ్లలో కూడా సీబీఐ సోదాలు చేపట్టింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ అధికారులు ఈ సందర్భంగా వివరించారు. ఆలయ ఉద్యోగాల్లో జోనల్ విధానం లేదు.. మెరిట్‌కే ప్రాధాన్యం: మంత్రి ఆనం రామనారాయణ ఆ మున్సిపాలిటీల విలీన ప్రక్రియ... స్థానిక ఎన్నికల తర్వాతే: సీఎం చంద్రబాబు

Ajay Arasada : ఆయ్, సేవ్ ది టైగర్స్, వికటకవి, గుర్తుకొస్తున్నాయి.. లాంటి పలు సినిమాలు, సిరీస్ లతో మంచి మ్యూజిక్ అందించి ఇటీవల వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు సంగీత దర్శకుడు అజయ్ అరసాడ. ఇటీవల పవన్ కళ్యాణ్ పిలిచి మరీ అభినందించారు ఈ సంగీత దర్శకుడిని. త్వరలోనే పవన్ కళ్యాణ్ కోసం పనిచేయబోతున్నాను అంటూ అజయ్ మీడియాతో మాట్లాడుతూ తన జర్నీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అజయ్ అరసాడ తన గురించి చెప్తూ.. మా ఫ్యామిలీ, నా రక్తంలోనే ఆర్ట్, మ్యూజిక్ ఉంది. వైజాగ్ లో బిటెక్ పూర్తిచేసి టీసీఎస్‌లో ఏడేళ్లు జాబ్ చేశాను. జాబ్ చేస్తూనే రెండు సినిమాలకు పని చేశాను. నా భార్య సపోర్ట్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ గూఢచారి సినిమాకు పిలవడంతో కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా మొదలుపెట్టాను. ఓ రెండు సినిల తర్వాత సొంతంగా సినిమాలు చేస్తున్నాను. నేను అన్ని రకాల జానర్లు చేస్తాను. నా వద్దకు వచ్చిన కథకు నేను న్యాయం చేయాలని చూస్తాను అని తెలిపారు. Also See : Shiva Jyothi : కూతురు పుట్టిన తరువాత తొలి భోనం.. ఫోటోలు షేర్ చేసిన శివ జ్యోతి.. సల్లగా ఉండాలే పవన్ కళ్యాణ్ ని కలిసిన విషయం మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ వెంకట్ చిక్కాల జనసేనలో ఎడిటర్‌గా పని చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితమే జనసేనకు కొన్ని సాంగ్స్, వీడియోస్ కి మ్యూజిక్ చేశాను. నా వర్క్ నచ్చి బన్నీ వాస్ గారు నాకు ఆయ్ సినిమా అవకాశం ఇచ్చారు. ఇటీవల మోదీ గారిని పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఆ వీడియోకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాను. అది పవన్ గారి దగ్గరకు వెళ్లడంతో నన్ను పిలిపించారు. నాతో ఆయన పర్సనల్‌గా ఎందుకు మాట్లాడతారు అని అనుకున్నాను కానీ మళ్లీ ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అని

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరంగా అత్యధిక కాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సేవలందిస్తున్నారని వ్యాఖ్యానించారు. అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు (Nirmala Sitharaman) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరంగా అత్యధిక కాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సేవలందిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత ఆర్థిక ప్రస్థానం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది.. నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. నారీ శక్తికి ప్రతీకగా నిర్మలా సీతారామన్ ప్రస్థానం కొనసాగుతోందని కితాబు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆర్థిక ప్రగతికి ఆమె సకాల సహకారం అందిస్తున్నారని కొనియాడారు. నిర్మలా సీతారామన్‌కు అమ్మ దుర్గ ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యం, శక్తి, దీర్ఘాయువు కలగాలని ఆకాంక్షించారు. దేశ సేవలో నిర్మలా సీతారామన్ మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని పవన్ కల్యాణ్ అభిలాషించారు. నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Deputy cm Pawan kalyan key directions to officials: తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని ప్రాంతంలో ఇటీవల ఏనుగుల గుంపు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీనిపై తాజాగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏనుగుల కదలికలపై ఎప్పటికప్పుడు డ్రోన్లతో నిఘా ఉంచాలన్నారు. అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ గస్తీ పెంచాలన్నారు. రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో ప్రజలకు సమాచారం అందించా లన్నారు. హనుమాన్ బృందాలను మోహరించాలని ఉప ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏనుగుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, డ్రోన్ల సహాయంతో వాటి సంచార మార్గాలను గుర్తించి సమీప గ్రామాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలోని ఏనుగులు రెండు గుంపులుగా సంచరిస్తూ రాత్రివేళ అటవీ సరిహద్దుల్లోని పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయన్నారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని పవన్ కళ్యాణ్ గారు అటవీశాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అంతే కాకుండా.. అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ ప్రత్యేక గస్తీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలు రాత్రివేళ పొలాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలన్నారు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Pawan Kalyan Chandrababu News: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో చీలికలు మొదలయ్యయా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే గత నెల రోజులుగా ఏపీలోని కూటమి పార్టీల్లో లుకలుకలు మొదలైనట్లు తెలుస్తోంది. అందుకు రుజువుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూరంగా ఉండటమే అని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గవర్నర్ నివాసంలో జరిగిన 'ఎట్ హోమ్' విందుకు కూడా ఆయన హాజరుకాలేదు. 'ఎట్ హోమ్' కార్యక్రమానికి గైర్హాజరు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోక్‌భవన్‌లో సంప్రదాయంగా నిర్వహించే 'ఎట్ హోమ్' విందు కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకావడం లేదని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. కాకినాడలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల తర్వాత, రాజమహేంద్రవరంలో అటవీశాఖకు చెందిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను ప్రారంభించే సమయంలో పవన్‌కు తీవ్ర జ్వరం వచ్చిందని, అందుకే కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించాల్సి వచ్చిందని జనసేన తెలిపింది. రాజమహేంద్రవరంలో జనసేనాని పవన్ కళ్యాణ్‌ను వైద్యులు పరీక్షించి తగిన విశ్రాంతి సూచించడంతో, ఆయన అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఇటీవల కుడి భుజానికి జరిగిన శస్త్రచికిత్సకు సంబంధించి ఫిజియోథెరపీపై వైద్యుల సూచనలు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ ఇటీవల కాలంలో అమరావతిలో జరిగిన స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం వంటి పలు అధికారిక కార్యక్రమాలకు చంద్రబాబుతో పాటు పవన్ హాజరుకాకపోవడం, విశాఖపట్నంలో ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చకు దారితీసింది. అంతేకాకుండా, గతంలో
.webp)
వికసిత్ భారత్ సంకల్పంలో ఏపీ భాగస్వామ్యం..! భారతదేశం ప్రపంచ స్థాయిలోనే అగ్రగామిగా ఎదుగుతోందని, ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్న 'వికసిత్ భారత్' సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భాన్ని పురస్కరించుకుని కాకినాడలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మువ్వన్నెల జాతీయ పతాకాన్ని సగర్వంగా ఆవిష్కరించారు. అంతకుముందు మైదానంలో జరిగిన పరేడ్‌లో భాగంగా సాయుధ బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. వేడుకల్లో పాల్గొన్న అధికారులు, ప్రజలను ఉద్దేశించి ఆయన ఉద్వేగపూరితమైన సందేశాన్ని ఇచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఒక తరం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడితే, ఆ త్యాగాల ఫలమైన స్వేచ్ఛను ఆ తర్వాతి తరాలు ఎంతో బాధ్యతగా కాపాడుకుంటూ వచ్చాయని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వంతో సంపూర్ణ సమన్వయాన్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటామని వెల్లడించారు. రాష్ట్ర పునర్నిర్మాణంతో పాటు 'స్వర్ణాంధ్ర-2047' లక్ష్యాల సాధనకు ప్రభుత్వం పటిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతున్న తరుణంలో, కేంద్రం అందిస్తున్న మద్దతు రాష్ట్ర వికాసానికి ఎంతో తోడ్పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పాఠశాలల విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని పంద్రాగస్టు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సమర్థవంతమైన పాలన, వేగవంతమైన ఆర్థిక ప్రగతి ద్వారా వికసిత్ భారత్ మిషన్‌లో ఆంధ్రప్రదేశ్ తనదైన ముద్ర వేస్తుందని కూటమి ప్రభుత్వం మరింత ధీమా వ్యక్తం చేస్తోంది. ఆటోపై కుక్క మూత్రం పోసిందని ఘర్షణ.. యువకుడి దారుణ హత్య..! ఉత్తమ ఉపాధ్యాయులకు 17 నుంచి ఫిన్లాండ్లో శిక్షణ : మంత్రి
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోతున్నట్లు డిప్యూటీ సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్న విషయాన్ని లోక్ భవన్ అధికారులకు కూడా తెలియజేశారు. శనివారం ఉదయం కాకినాడలో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత రాజమహేంద్రవరంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సతీమణి అన్నా కొణిదెలతో కలిసి పవన్ కళ్యాణ్ ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించారు, చేతి వృత్తి కళాకారులు రూపొందించిన పలు కళాఖండాలను సతీమణితో కలిసి పరిశీలించారు. కొన్నింటిని కొనుగోలు చేసి కళాకారులను అభినందించారు. అయితే క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనే పవన్ కళ్యాణ్‌కు జ్వరం తీవ్రమైనట్లు సమాచారం. దీంతో కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించుకున్నట్లు తెలిసింది. అనంతరం రాజమహేంద్రవరంలోని డాక్టర్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరీక్షించారు. కొద్దిసేపటి తర్వాత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.మరోవైపుపవన్ కళ్యాణ్ రొటేటర్ కఫ్ గాయానికి వైద్యులు ఇటీవల శస్త్ర చికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే. ముంబైలోని కోకిలా బెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రి వైద్యులు పవన్ కళ్యాణ్ కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. కోలుకోవడానికి కొన్ని నెలలు పడుతుందని.. అప్పటి వరకూ ఫిజియోథెరపీ చేయించుకోవాలని సూచించారు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు విరామం తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఇటీవలే తిరిగి అధికారిక కార్యక్రమాల్లో బిజీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి జ్వరం రావటంతో సర్జరీ అనంతరం చేయించుకోవాల్సిన ఫిజియో థెరపీ గురించీ వైద్య నిపుణుల సూచనలను పవన్ కళ్యాణ్ స్వీకరించనున్నట్లు డిప్యూటీ సీఎంవో వర్గాలు

తెలంగాణ ప్రజల అవసరాలే పరమావధిగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలు, విద్యార్థులు, రైతులు సహా అన్ని వర్గాలకూ సంక్షేమం అందుతోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. ఖమ్మం: తెలంగాణ ప్రజల అవసరాలే పరమావధిగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలు, విద్యార్థులు, రైతులు సహా అన్ని వర్గాలకూ సంక్షేమం అందుతోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో కాలయాపన చేసిందని విమర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని భట్టి చెప్పుకొచ్చారు. విద్యా రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రైతు భరోసాతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు అండగా నిలుస్తూ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana Fee Reimbursement: స్వాతంత్ర్య దినోత్సవం వేళ తెలంగాణ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని అందజేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులకు విద్యా బోధనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్త కూడదనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రూ. 2,400 కోట్ల నిధులు ముందస్తుగానే బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు రేవంత్ ప్రకటించారు. విద్యార్థులు ఎవరినీ ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా, డబ్బులు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోనే స్కాలర్ షిప్ సొమ్మ జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు సాధించాలంటే కేవలం డిగ్రీలు ఉంటే సరిపోవని, టెక్నికల్ స్కిల్స్ కడా ఎంతో సీఎం రేవంత్ విద్యార్థులకు సూచించారు. 10వ తరగతి పూర్తైన వెంటనే విద్యార్థులు ITI కోర్సుల ద్వారా వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకోవచ్చని సీఎం చెప్పారు. నర్సింగ్ విద్య అభ్యసించిన వారికి జపాన్, జర్మనీ, కొరియా తదితర విదేశాలలో లక్షల రూపాయల ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. యువతలో తగిన నైపుణ్యం, సామర్థ్యం ఉంటే.. వారిని విదేశాలకు పంపించి మంచి ఉద్యోగావకాశాలు కల్పించే బాధ్యతను తనదేనని రేవంత్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యా రంగానికి ప్రాధాన్యతనిచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్వాన్స్ ఫీజు రీయింబర్స్మెంట్లను అందించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ చొరవలో భాగంగా, ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ల మొదటి విడతగా రూ.250 కోట్లను నేరుగా బ్యాంకుల్లో జమ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని అర్హులైన పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు

కేంద్ర సహకారంతో, వికసిత్ భారత స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కేంద్ర సహకారంతో రాష్ట్రం అన్ని విధాల ముందుకు వెళుతుంది అని అన్నారు.బలమైన, సమర్థవంతమైన దేశంగా భారతదేశంఒక తరం స్వాతంత్రం కోసం పోరాడితే ఒక తరం స్వాతంత్రాన్ని కాపాడింది అన్నారు. బలమైన, సమర్థవంతమైన దేశంగా భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలు, యువత పాటించాల్సిన బాధ్యతలపై కీలక వ్యాఖ్యలు చేశారు.గిరిజన ప్రాంతాలకు రహదారుల సౌకర్యాన్ని కల్పిస్తున్నాంఅడవి తల్లి బాట కార్యక్రమం కింద గిరిజన ప్రాంతాలకు రహదారుల సౌకర్యాన్ని కల్పిస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. మారుమూల ప్రాంతాలలోని గిరిజనులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం పైన ప్రభుత్వం దృష్టి సారించిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇదే సమయంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై మాట్లాడుతూ పులివెందుల, డోన్ ప్రాంతాలలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసినట్టు పేర్కొన్నారు.వేగంగా రాజధాని అమరావతి, పోలవరం పనులురైతులకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించడంతోపాటు, రాష్ట్రంలో నీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. అటవీ భూములలో ఆక్రమణలను నిరోధిస్తున్నామని, ఆక్రమిత భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్న ఆయన పోలవరం పైన ప్రత్యేక దృష్టి పెట్టామని, ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి అన్నారు.పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి వెయ్యి కోట్లుపిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అని తెలిపారు. 1000 కోట్లతో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇదే సమయంలో స్వేచ్ఛను ఇతరులను దూషించటానికి ఉపయోగించవద్దు అని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. ఏదైనా సమాచారాన్ని షేర్

ఆమె లక్నోలో చదువుకున్న ఓ ఉన్నత విద్యావంతురాలు.. బాబా అణు పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా ఉద్యోగం.. ఆ తర్వాత సివిల్స్ వైపు అడుగులు.. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా కీలక బాధ్యతలు. ఇదీ నిధి తివారీ ప్రయాణం. శాస్త్రవేత్తగా మొదలైన ఆమె కెరీర్.. విదేశాంగం, భద్రతా వ్యవహారాల్లో పనిచేసే స్థాయికి ఎలా చేరిందో చూస్తే ఆసక్తికరమే.నిధి తివారీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోకు చెందినవారు. అక్కడే పాఠశాల విద్య, డిగ్రీ పూర్తి చేశారు. బీఎస్సీ తర్వాత బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు. ఈ కోర్సులో గోల్డ్ మెడల్ సాధించారు.బార్క్‌లో శాస్త్రవేత్తగా..చదువు పూర్తయ్యాక బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్)లో శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు. అయితే సివిల్స్ సర్వీసులోకి వెళ్లాలన్న పట్టుదలతో ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. 2008లో బార్క్ నుంచి బయటకు వచ్చి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యారు.ఒక్కసారి కాదుసివిల్స్ ప్రయాణం ఆమెకు వెంటనే విజయాన్ని అందించలేదు. 2012లో జరిగిన పరీక్షలో ఆమె పేరు వెయిటింగ్ లిస్ట్‌లో వచ్చింది. అయినా ప్రయత్నం ఆపలేదు. 2013లో మళ్లీ పరీక్ష రాశారు. ఈసారి ఆల్ ఇండియా స్థాయిలో 96వ ర్యాంకు సాధించారు. దీంతో ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికై 2014 బ్యాచ్‌లో చేరారు.విదేశాంగం నుంచి పీఎంవోకుఐఎఫ్ఎస్ అధికారిగా పనిచేసే సమయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖలో నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై పనిచేశారు. విదేశాంగ విధానం, అంతర్జాతీయ భద్రతపై ఆమెకు వచ్చిన అనుభవం తర్వాత పీఎంవోలో కీలకంగా ఉపయోగపడింది.2022 నవంబర్‌లో పీఎంవోలో అండర్ సెక్రటరీగా చేరారు. ఆ తర్వాత

మహారాష్ట్రలోని నాందేడ్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. శిరోమణి అకాలీదళ్ సీనియర్ నాయకుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై ప్రాణాంతక దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, సహచరులు ఆయనను చికిత్స నిమిత్తం సమీపంలోని యశోసాయి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తోన్నారు.సుఖ్బీర్ సింగ్ బాదల్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం నాందేడ్‌కు వచ్చారు. ఇక్కడి మాతా సాహిబ్ కౌర్ ప్రాంతంలో ఉన్న ఓ గురుద్వారాను సందర్శించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురుద్వారా లోపల ఒక నిహంగ్ సిక్ ఒకరు కృపాణ్తో బాదల్‌పై అకస్మాత్తుగా దాడికి తెగబడ్డాడు. బాదల్ తో పాటు భద్రత సిబ్బంది, సహచరులు అప్రమత్తంగా ఉండటంతో అతన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పెనుగులాట చోటు చేసుకుంది. బాదల్ కుడి చేతికి గాయాలయ్యాయి. బాదల్‌ను రక్షించడానికి ప్రయత్నించిన ఓ ఎస్ఐ కూడా గాయపడ్డారు.దాడికి పాల్పడిన నిందితుడిని భద్రతా సిబ్బంది అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో నాందేడ్ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై నాందేడ్ జిల్లా కలెక్టర్ రాహుల్ కర్దిలే స్పందించారు. సుఖ్బీర్ సింగ్ బాదల్ పర్యటనకు సంబంధించి ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం పూర్తి స్థాయి రక్షణ చర్యలు చేపట్టామని, స్థానిక పోలీసు బందోబస్తు కూడా కల్పించినట్లు తెలిపారు.హైవేల విషయంలో ఎన్హెచ్ఏఐ నూతన నిబంధనలు: రూ. 10,000 ఫైన్నిందితుడు గురుద్వారాలోకి ప్రవేశించి అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాడని, దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై ఇలాంటి దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. 2024 డిసెంబర్ 4న అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ సమీపంలో కూడా ఆయనపై దాడి యత్నం చోటు చేసుకుంది. ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో కూడా ఆయన ప్రాణాపాయం

అకాలీ దళ్ అధినేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో దాడి జరిగింది. అక్కడి ఒక గురుద్వారాను సందర్శించిన తర్వాత నగర శివార్లలో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. నాందేడ్, ఆగస్టు 13: శిరోమణి అకాలీదళ్ (SAD) అధినేత, పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో దాడి జరిగింది. గురుద్వారాను సందర్శించి వస్తుండగా నగర శివార్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడి అనంతరం బాదల్‌ను నాందేడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. కుటుంబ సమేతంగా దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన సుఖ్బీర్ సింగ్ బాదల్ తన భార్య, అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్, కుటుంబ సభ్యులతో కలిసి నాందేడ్‌లోని ప్రసిద్ధ 'తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్' గురుద్వారాను సందర్శించారు. దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో బాదల్ భద్రతా సిబ్బందిలో ఒకరికి కూడా గాయాలయ్యాయి. దాడి వెనుక ఉన్న కారణాలు, దాడి చేసిన వారి సమాచారంపై పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. సమాజంలో దళితులకు స్థానం లేదు.. ఖర్గే ఆగ్రహం హఫీజ్ సయీద్‌కు మద్దతు ప్రకటించి.. భారత్‌పై విషం కక్కిన పాక్ మాజీ మంత్రి

ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా అవయవదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక సందేశాన్ని విడుదల చేశారు. అవయవాలను దానం చేయాలనే ఒక చిన్న నిర్ణయం మరొకరికి పునర్జన్మను ప్రసాదిస్తుందని, ఇది అత్యంత శక్తివంతమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.అవయవదానం ప్రాముఖ్యతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, తద్వారా మరింత మంది పౌరులు అవయవదాతలుగా మారేలా స్ఫూర్తిని నింపాలని పవన్ కల్యాణ్ కోరారు. "ఒక వ్యక్తి తన జీవిత కాలాన్ని పొడిగించుకోలేని స్థితిలో, మరొకరికి ప్రాణదానం చేయడం ద్వారా తన జీవితానికి ఒక సార్థకతను చేకూర్చుకోవచ్చు" అని ఆయన వ్యాఖ్యానించారు.ప్రతి దానం ఒక నిరీక్షణకు భరోసా అని, ప్రతి దాత తమ మరణానంతరం ఒక గొప్ప వారసత్వాన్ని విడిచి వెళ్తారని పవన్ పేర్కొన్నారు. సమాజంలో అవయవదానం పట్ల ఉదారతను పెంపొందించే సంస్కృతిని అందరం కలిసి నిర్మిద్దామని ఆయన పిలుపునిచ్చారు. "ప్రాణదానం చేయండి.. ఆశను నింపండి, జీవితాలను కాపాడండి" అంటూ తన సందేశంలో పేర్కొన్నారు

భారతదేశ స్వాతంత్య్ర పోరాట సమరంలో నిర్భయ విప్లవకారిణిగా నిలిచిన మేడమ్ బికాజీ కామా వర్ధంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. అమరావతి, ఆగస్టు 13: భారతదేశ స్వాతంత్య్ర పోరాట సమరంలో నిర్భయ విప్లవకారిణిగా నిలిచిన మేడమ్ బికాజీ కామా వర్ధంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. స్వదేశంలోనే కాకుండా సరిహద్దులు దాటించి, అంతర్జాతీయ వేదికలపై భారత స్వాతంత్య్ర కలను చాటిచెప్పిన గొప్ప దేశభక్తురాలు బికాజీ కామా అని ఆయన కొనియాడారు. బ్రిటిష్ వలసవాద పాలనలో మన దేశ గొంతుకను అణచివేస్తున్న తరుణంలో, ఆమె ప్రపంచం ముందు నిర్భయంగా నిలబడి భారతదేశపు స్వేచ్ఛ, గౌరవం, సార్వభౌమత్వం కోసం ధైర్యంగా గళమెత్తారని గుర్తుచేసుకున్నారు. 1907వ సంవత్సరంలో జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సదస్సులో మేడమ్ బికాజీ కామా చారిత్రాత్మకంగా తొలి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అణచివేతకు లొంగక, మౌనంగా ఉండటానికి నిరాకరించిన భారత జాతి ఆత్మగౌరవానికి ఆ పతాకావిష్కరణ ఒక శక్తివంతమైన చిహ్నంగా నిలిచిందని తెలిపారు. ఆమె చూపిన తెగువ, దార్శనికత.. నేటికీ మన దేశ ఐక్యతను, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతి తరానికీ నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని వ్యాఖ్యానించారు. ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్

ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా, మరొక మానవునికి జీవన దానాన్ని అందించగల ఒక నిర్ణయం అపారమైన శక్తిని ఇస్తోందనే విషయాన్ని మనం గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అమరావతి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా, మరొక మానవునికి జీవన దానాన్ని అందించగల ఒక నిర్ణయం అపారమైన శక్తిని ఇస్తోందనే విషయాన్ని మనం గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) వ్యాఖ్యానించారు. అవయవ దానంపై మరింత అవగాహనను కల్పిద్దామని పేర్కొన్నారు. దాతలుగా మారడానికి అవగాహనతో కూడిన నిబద్ధతను కనబరిచేలా ఎక్కువ మంది పౌరులను ప్రేరేపిద్దామని తెలిపారు. ఒకరి జీవితాన్ని పొడిగించలేనప్పుడు, మరొకరికి జీవితాన్ని ఇవ్వడం ద్వారా దానికి కొత్త అర్థాన్ని ఇవ్వవచ్చని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. ప్రతి దానం ఒక ఆశకు వాగ్దానంగా మారేలా, ప్రతి దాత చిరకాలం నిలిచిపోయే వారసత్వాన్ని వదిలి వెళ్లేలా మనం ఉదారత సంస్కృతిని నిర్మిద్దామని తెలిపారు. జీవితాన్ని దానం చేయాలని.. ఆశను ఇవ్వండి, ప్రాణాలను కాపాడండి అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. YS Jagan AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సమావేశాల వ్యూహం, పార్టీ ఎమ్మెల్యేల హాజరు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నియామకంపై జగన్ పార్టీ నేతలతో ప్రత్యేకంగా చర్చించి స్పష్టతనిచ్చారు. అసెంబ్లీ సమావేశాలు - జగన్ వ్యూహం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్ల తమ గొంతు నొక్కుతున్నారని, సభలో మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాలకు వెళ్లాలనుకునే ఎమ్మెల్యేలు హాజరుకావచ్చని ఆయన సూచించారు. ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసే క్రమంలో.. శాసనమండలిలో డీఎస్పీ (DSC) నియామకాలు, రాష్ట్రంలో శాంతిభద్రతల (Law & Order) తీరుపై తీవ్రంగా చర్చించాలని ఎమ్మెల్సీలను జగన్ ఆదేశించారు. అయితే సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై ప్రభుత్వం వేటు వేస్తుందనే ప్రచారంపై స్పందిస్తూ.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా తూమాటి మాధవరావు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన జకియా ఖానం పదవీకాలం ముగియడంతో, ఆ స్థానానికి కొత్త అభ్యర్థి ఎంపిక అనివార్యమైంది. సీనియారిటీ, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకున్న వైఎస్ జగన్.. ఈ పదవికి తూమాటి మాధవరావు పేరును ఖరారు చేశారు. శాసనమండలిలో వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో తూమాటి మాధవరావు ఎన్నిక ఏకగ్రీవంగా లాంఛనప్రాయం కానుంది. మండలిలో పార్టీ

అసెంబ్లీ సమావేశాలకు ఈసారి కూడా హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. అయితే శాసనమండలి సమావేశాలకు మాత్రం హాజరు కావాలని నిర్ణయించింది. అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు ఈసారి కూడా హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. అయితే శాసనమండలి సమావేశాలకు మాత్రం హాజరు కావాలని నిర్ణయించింది. వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావును ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీలో వైసీపీకి తగిన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై ఆ పార్టీ మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. అసెంబ్లీలో ప్రస్తుతం రెండు పక్షాలే ఉన్నాయని, మూడో పక్షం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. టార్చ్‌లైట్లతో బెదిరించబోతే జనంపైకి దూసుకొచ్చిన ఏనుగు.. వీడియో వైరల్ తెలంగాణలో ఈ జలపాతం అందాలు చూస్తే మైమరచిపోవాల్సిందే.!

ఏనుగుల సంరక్షణకు కట్టుబడి ఉన్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పవన్ స్పందిస్తూ.. ఏనుగుల ఆవాసాలు, కారిడార్ల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అమరావతి, ఆగస్టు 12: ఏనుగుల సంరక్షణకు కట్టుబడి ఉన్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పవన్ స్పందిస్తూ.. ఏనుగుల ఆవాసాలు, కారిడార్ల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఏనుగు కేవలం అడవిలో జీవి మాత్రమే కాదని, పర్యావరణ సమతులత్యకు ప్రతీక అన్నారు. భారతదేశ వారసత్వంలో ఏనుగులు అంతర్భాగమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కుంకీ ఏనుగులు, H.A.N.U.M.A.N. చొరవతో వన్యప్రాణుల రక్షణ రక్షణను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తామని పవన్ వెల్లడించారు. శిక్షణ పొందిన సిబ్బంది, రెస్క్యూ మౌలిక వసతులు, సాంకేతికతతో వేగవంతంగా స్పందించే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సురక్షిత సమాజాలు, రక్షిత అడవులు, ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యమని స్పష్టం చేశారు. ఏనుగులను కాపాడాలి.. అడవులను రక్షించాలి.. భవిష్యత్తును భద్రపరచాలి అంటూ ఎక్స్‌లో పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు. వేంకటేశ్వర స్వామిని అవమానించిన వారిపై క్రిమినల్ కేసులు: భానుప్రకాశ్ రెడ్డి వైసీపీ హయాంలో గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు.. సిట్ ఏం తేల్చిందంటే

Bhimavaram: భీమవరంలో ఘనంగా 'వందేమాతరం' 150 ఏళ్ల వేడుకలు రఘురామకృష్ణంరాజు! ఈ వార్తకు సంబంధించిన

సినీనటి త్రిషను తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా ఎప్పుడు నియమిస్తారో అంటూ అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. సినీనటి త్రిష (Trisha)పై అన్నాడీఎంకే సీనియర్ నేత, తమిళనాడు మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ (RB Udhayakumar) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ నెల 8న తూత్తుకుడిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విజయ్‌కు ప్రియమైన త్రిషను ఉపముఖ్యమంత్రిగా (Deputy CM) ఎప్పుడు నియమిస్తారోనని తమిళనాడు ప్రజలు ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీవీకే కార్యకర్తలు, త్రిష అభిమాన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉదయకుమార్ వ్యాఖ్యలను ఖండిస్తూ మదురై జిల్లా వ్యాప్తంగా త్రిష అభిమాన సంఘాల ప్రతినిధులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో విజయ్‌తో సినీ సంబంధాలు ఉన్నవారికి ప్రభుత్వ పదవులు ఇవ్వడంపైనా ఉదయకుమార్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. విజయ్ సినిమా తీస్తే ప్రభుత్వ పదవి ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. విజయ్ సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరించిన వారికి, ఆయనతో వ్యాపార సంబంధాలు ఉన్నవారికి ప్రభుత్వ కమిటీల్లో పదవులు కల్పిస్తున్నారని ఆరోపించారు. ఆలయాల ట్రస్టీల ఎంపిక కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీలో సినీ నిర్మాతకు అవకాశం కల్పించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇప్పటికే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ చిత్ర నిర్మాత, కర్ణాటకకు చెందిన వెంకట్ కె. నారాయణను ప్రభుత్వం నియమించిందని గుర్తుచేశారు. తాజాగా మరో సినీ నిర్మాత అర్చన కల్పాతికి ప్రభుత్వ కమిటీలో చోటు కల్పించారని పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా లియో చిత్ర సహ నిర్మాత జగదీష్ పళనిస్వామిని, తమిళనాడు ప్రభుత్వ ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్‌గా బీస్ట్ చిత్ర కెమెరామెన్ మనోజ్ పరమహంసను నియమించారని ఉదయకుమార్ విమర్శించారు.ముఖ్యమంత్రితో సినిమా చేస్తే ప్రభుత్వ పదవులు దక్కుతాయనే పరిస్థితి తమిళనాడులో

Kurnool: ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో లయన్స్ క్లబ్ వ్యాసరచన పోటీలు! కర్నూలు: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో “క్రిటికల్ థింకింగ్ మరియు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఆలోచనా సామర్థ్యాన్ని, పర్యావరణ పరిరక్షణపై అవగాహనను ప్రదర్శించారు. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయిక్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ మెల్విన్ జోన్ గవర్నర్ రాయపాటి శ్రీనివాస్, డిప్యూటీ కలెక్టర్ త్రినాథ్, లయన్స్ క్లబ్ సభ్యులు మురారి శంకర్ అప్ప తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనా విధానం, సృజనాత్మకతతో పాటు పర్యావరణ పరిరక్షణపై బాధ్యతను పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మల్లికార్జున, విజయశేఖర్, సోమేశ్, ఉల్గోజి రావు, చిన్న మల్లేష్, శ్రీధర్ మూర్తి, బాలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. కేవలం 18 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ఖుదీరామ్ బోస్ ప్రాణత్యాగం చేశారన్నారు. అమరావతి, ఆగస్టు 11: స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. కేవలం 18 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ఖుదీరామ్ బోస్ ప్రాణత్యాగం చేశారన్నారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా భయంలేకుండా పోరాడిన వీరుడు ఖుదీరామ్ బోస్ అంటూ కొనియాడారు. ఆయన ధైర్యం, దేశభక్తి.. యువతకు నేటికీ ఆదర్శమని వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతాన్ని చూడలేకపోయినా.. ఆయన త్యాగం స్వాతంత్ర్యానికి బలమైన పునాదిగా నిలిచిందని పవన్ పేర్కొన్నారు. మాతృభూమిపై ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఖుదీరామ్ బోస్ జీవితం చాటిచెబుతోందన్నారు. దేశ యువతలో ధైర్యం, దేశభక్తి, మాతృభూమిపై అంకితభావాన్ని ఖుదీరామ్ బోస్ పేరు ఎల్లప్పుడూ ప్రేరేపిస్తుందని తెలిపారు. ‘భారత్ మాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్. జై హింద్’ అంటూ ఎక్స్‌లో పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు. కస్టమర్‌కు ఊహించని షాక్.. సమోసాలో బొద్దింక