
పాపన్నపేట, సెప్టెంబర్ 13 : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుభాష్‌గౌడ్ సతీమణి అనురాధ అంత్యక్రియలు పాపన్నపేట లో నిర్వహించగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ అంతిమయాత్రలో మాజీ జెడ్పీటీసీ, సీనియర్ నాయకులు మినుపూర్ బాలగౌడ్, టిఆర్ఎస్ యువజన నాయకుడు చంద్రం బాబా గౌడ్, ఏడుపాయల మాజీ చైర్మన్ లు పట్లోళ్ల విష్ణువర్ధన్‌రెడ్డి, సాతేల్లి బాలగౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరామిరెడ్డి, పాపన్నపేట పావని నరేందర్ గౌడ్, మాజీ సర్పంచులు గురుమూర్తిగౌడ్, లింగారెడ్డి, తాజా సర్పంచ్ సాయిరెడ్డి, బిఆర్ఎస్ నాయకులు అంతోని, అనిల్‌రెడ్డి, దుర్గయ్య, శ్రీనివాస్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.





