
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

అనురాధ అంత్యక్రియలు పాపన్నపేట లో నిర్వహించగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఏపీలో రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ తనదైన శైలిలో పాలన సాగిస్తోంది. సీఎం చంద్రబాబు కూడా గతానికి భిన్నంగా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. కేబినెట్లో మంత్రులు కూడా తనతో పోటీ పడాలని ఆయన పదే పదే చెప్తుంటారు. అయితే ఆయన కేబినెట్లో తనతో పాటు కుమారుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే ఎక్కువగా ఫోకస్ అవుతుంటారు. మిగతా మంత్రుల పాత్ర నామమాత్రమే అన్న విమర్శలు వినిపిస్తుంటాయి. ఇదే విషయం తాజాగా మరోసారి రుజువైంది.పోలవరం లోపాల పుట్ట- హైకోర్టు ముందు స్వయంగా వాదించబోతున్న మాజీ ఐపీఎస్ ..!పోలవరం కుడి కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లు విడుదల చేసే కార్యక్రమాన్ని ఇవాళ సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాన పత్రికల్లో ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో సీఎం చంద్రబాబుతో పాటు ప్రధాని మోడీ, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. సాగునీటిపారుదల ప్రాజెక్టు ప్రారంభోత్సవం అయినా ఆ శాఖను చూస్తున్న జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఫొటో మాత్రం లేదు. దీనిపై చంద్రబాబు మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్, మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) వ్యంగాస్త్రాలు సంధించారు. Bhogapuram Airport: భోగాపురం క్రెడిట్ వారిదే ? ఆధారాలతో తేల్చేసిన మాజీ ఇంటెల్ ఛీఫ్ ..!ముఖ్యమంత్రి గారూ,.. మీరు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పించి కాబినెట్ లోని మంత్రులందరూ నామమాత్రులే అనేది లోక విదితం అంటూ ఏబీ వెంకటేశ్వరావు ఇవాళ ట్వీట్ చేశారు. అయినా ఏదో సంప్రదాయాలంటూ ఉంటాయి కదా!

Adilabad: మాజీ నక్సలైట్ కుర్సంగె మోతి బాయి (రాధాక్క) కన్నుమూత ఆదిలాబాద్: విప్లవోద్యమంలో దాదాపు మూడు దశాబ్దాలపాటు పనిచేసిన కుర్సంగె మోతి బాయి (రాధాక్క) సోమవారం సాయంత్రం 6 గంటలకు ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతికి ఉద్యమ సహచరులు సంతాపం తెలిపారు. రాధాక్క చంద్రన్న సహచరిగా ఉన్నారు. 1984లో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్ వార్‌లో చేరిన ఆమె సిర్పూర్ దళంలో సభ్యురాలిగా పనిచేశారు. 1986లో పార్టీ సభ్యత్వం పొందగా.. 1989లో ఏరియా కమిటీ సభ్యురాలిగా, 2000లో ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2003లో దండకారణ్యానికి బదిలీపై వెళ్లి క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘానికి నాయకత్వం వహించారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె చికిత్స కోసం దండకారణ్యం నుంచి వెళ్తుండగా పాల్వంచలో అరెస్టయ్యారు. 2013 నుంచి 2016 వరకు తెలంగాణలోని వివిధ జైళ్లలో ఉన్నారు. 2016లో విడుదలయ్యారు. అనంతరం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో సహచరుడితో కలిసి ఉంటూ.. కొంతకాలంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం మృతి చెందారు. రాధాక్క అంత్యక్రియలు సెప్టెంబరు 1న ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి రోడ్లో వాన్వాట్–మామిడిగూడ మధ్యలోని లింగూగూడలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

దాదాపు మూడు దశాబ్దాల క్రితం కానిస్టేబుల్‌ను హత్య చేసి పరారైన మాజీ నక్సలైట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. నంద్యాల, ఆగస్టు21: దాదాపు మూడు దశాబ్దాల క్రితం కానిస్టేబుల్‌ను హత్య చేసి పరారైన మాజీ నక్సలైట్‌ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. 1992లో నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్ల కాలువ వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సును అడ్డుకుని హెడ్ కానిస్టేబుల్ షేక్ అబ్దుల్ కరీంను మాజీ నక్సలైట్ మాడుగుల సుబ్బన్న కాల్చి చంపాడు. అనంతరం అతడు పరారైయ్యాడు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఏ1గా మాడుగుల సుబ్బన్న పేరును పోలీసులు చేర్చారు. నాటి నుంచి అతడి కోసం గాలించినా.. ఆచూకీ లభ్యం కాలేదు. అయితే అతడు కర్ణాటకలోని చిత్రదుర్గలో నివాసం ఉంటున్నట్లు పోలీసులకు ఇటీవల రహస్య సమాచారం అందింది. దీంతో ఆత్మకూరు సీఐ సురేశ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఓ బృందం కర్ణాటక వెళ్లింది. చిత్రదుర్గలో మాడుగుల సుబ్బన్న అలియాస్ గుంటూరు గద్దర్ అలియాస్ మంజునాథ్ పాటిల్‌ను వారు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని నంద్యాల జేఎంఎఫ్‌సీ (JMFC) కోర్టులో హజరుపరిచారు. 34 ఏళ్లుగా పరారిలో ఉన్న మాజీ నక్సలైట్ మాడుగుల సుబ్బన్న అరెస్ట్‌తో ఆత్మకూరు మండల కేంద్రంలో కలకలం రేగింది. సీఎం రేవంత్ యూఎస్ పర్యటనకు నో క్లియరెన్స్.. స్పందించిన కేంద్రం ఉయ్యూరులో డయేరియాపై అసత్యాలు ప్రచారం: మంత్రి నారాయణ ఫైర్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కోర్టు ఆదేశాల మేరకు అడియాలా జైలు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇమ్రాన్ సోదరి ఉజ్మా ఖాన్ స్పందిస్తూ... నిరంతరం డెత్ సెల్లో ఉంచి, బయటి ప్రపంచంతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడనివ్వకుండా సుదీర్ఘకాలం పాటు ఏకాంత నిర్బంధంలో ఉంచడం వల్లే తన ఆరోగ్యం క్షీణించిందని తన సోదరుడు తనతో చెప్పారని తెలిపారు. ఇది తనకు ఎంతో ఆవేదన కలిగిస్తోందని చెప్పారు. మరోవైపు, ఇమ్రాన్ ఖాన్‌ను సుదీర్ఘంగా ఒంటరిగా ఉంచడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి బీపీ, గుండె సంబంధిత తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇమ్రాన్ కు పూర్తిస్థాయి మెరుగైన వైద్యం అందించాలని, రాజకీయ కక్షసాధింపులకు స్వస్తి చెప్పాలని పీటీఐ నాయకులు, ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు

బీఆర్ఎస్ నేత, నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా రాస్తారోకో నిర్వహించి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే... నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిన్న ధర్నా, రాస్తారోకో చేపట్టారు. సుమారు గంటపాటు రహదారిని దిగ్బంధించడంతో సాధారణ ప్రజలకు, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతరం వీరు అనుమతి లేకుండా ఆర్డీఓ కార్యాలయంలోకి ప్రవేశించి నిరసన వ్యక్తం చేశారు.ఈ క్రమంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కానిస్టేబుల్ పాత్లావత్ దేవేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు మరో 38 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు

భారత్‌కు భవిష్యత్తులో చైనాతోనే ప్రధాన పోటీ ఉంటుందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే వ్యాఖ్యానించారు. భారత్‌పై పాక్ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నందున దాయాదిపై దృష్టిపెట్టాల్సి వస్తోందని చెప్పారు. ఇంటర్నెట్ డెస్క్: భారత్‌కు భవిష్యత్తులో చైనాతోనే ప్రధాన పోటీ ఉంటుందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే వ్యాఖ్యానించారు. భారత్‌పై పాక్ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నందున దాయాదిపై దృష్టిపెట్టాల్సి వస్తోందని చెప్పారు. పలు రంగాల్లో చైనా భారత్‌కు ప్రధాన పోటీగా మారుతోందని అన్నారు. తాను రచించిన నూతన పుస్తకం ‘ది క్యూరియస్ అంది క్లాసిఫైడ్: అన్ఎర్తింగ్ మిలిటరీ మిథ్స్ అండ్ మిస్టరీస్’ విడుదల సందర్భంగా జనరల్ నరవణే ఈ వ్యాఖ్యలు చేశారు. 2019-22 మద్య నరవణే భారత ఆర్మీ చీఫ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. పాక్, చైనాలతో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలు భిన్నమైనవని జనరల్ నవరణే అన్నారు. ‘రెండు దేశాలతోనూ మనం యుద్ధాలు చేశాము. వాళ్లతో ఎప్పటికీ ముప్పు ఉంటూనే ఉంటుంది. పాక్‌తో నాలుగు యుద్ధాలు జరిగాయి. ఉగ్రవాదం ఎగదోస్తున్న పాక్‌పై దృష్టి పెట్టాల్సి వస్తోంది. కానీ నా అభిప్రాయం ప్రకారం, దీర్ఘకాలంలో చైనాతోనే భారత్‌కు ప్రధాన పోటీ ఉంటుంది. నేను చైనాను శత్రువుగా కాకుండా పోటీదారుగా పేర్కొనడానికి కారణం కూడా ఉంది. కేవలం యుద్ధరంగంలోనే కాకుండా రాజకీయాలు, ఆర్థికరంగం, వాణిజ్య రంగాల్లో కూడా చైనాతో పోటీ ఉంటోంది’ ‘పోటీ ఉన్న చోట ఎంతో కొంత ఘర్షణ ఉంటూనే ఉంటుంది. అయితే, ఈ పొరపొచ్చాలను దౌత్యం, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. మరో మార్గం లేనప్పుడే బలప్రయోగానికి దిగాలి. ఒక్కోసారి ఈ పరిస్థితి ఎదురు కావొచ్చు. అలాంటి సమయాల్లో ప్రత్యర్థి ఒకింత వెనకడుగు వేసేలా మిలిటరీ సామర్థ్యాలను అందిపుచ్చుకోవాలి. భౌగోళిక రాజకీయాల్లోనైనా, వ్యక్తిగత జీవితంలో అయినా మన ఇరుగుపొరుగుగా ఎవరు ఉంటారనేది చెప్పలేము. కాబట్టి, అందుబాటులో ఉన్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి’ అని జనరల్ నరవణే అన్నారు. దేశాభివృద్ధికి దక్షిణ రాష్ట్రాలే మూలస్తంభాలు మహారాష్ట్ర

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలయ్యారు. ఇస్లామాబాద్‌లోని షిఫా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను మళ్లీ పోలీసులు జైలుకు తరలించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలయ్యారు. ఇస్లామాబాద్‌లోని షిఫా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను మళ్లీ పోలీసులు జైలుకు తరలించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పీటీఐ సభ్యులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇమ్రాన్ ఆరోగ్యం దృష్ట్యా ఆయనను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాలని ఇటీవల పాక్ సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ దాదాపు మూడేళ్లుగా జైల్లో ఉంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. అనంతరం మళ్లీ రావల్పిండిలోని అడియాలా జైలుకు తరలించింది. ఆరోగ్యం చక్కబడే వరకూ ఇమ్రాన్ ఖాన్‌ను ప్రైవేటు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు ఓ మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌కు త్వరలో తన ఇంట్లో ఉండి చికిత్స తీసుకునే అవకాశం కూడా రావొచ్చని అక్కడి విశ్లేషకులు కామెంట్ చేశారు. రాజకీయాల్లోకి ఇమ్రాన్ రీఎంట్రీకి ఇది తొలి అడుగు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఇమ్రాన్ విడుదల వెనుక ఏదో డీల్ జరిగే ఉంటుందని కొందరు అన్నారు. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుకెళ్లడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది

22 ఏళ్ల క్రితం నమోదైన ఓ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ నిర్దోషిగా తేలాడు. అతడిపై వచ్చిన అభియోగాలకు సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ జేకబ్ మార్టిన్‌ను 22 ఏళ్ల క్రితం నమోదైన క్రిమినల్ కేసు నుంచి పాటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2004లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఐపీసీ సెక్షన్లు 420, 468, 471, 120బీ, పాస్‌పోర్ట్ చట్టం సెక్షన్ 12 కింద అతడిపై అభియోగాలు మోపబడ్డాయి. అయితే యూకే ఇమ్మిగ్రేషన్ స్టాంప్ ఫోర్జరీ, ప్రయాణ ఏర్పాట్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మార్టిన్‌పై వచ్చిన ఫిర్యాదులకు ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు తేల్చిచెప్పింది. ఆర్థిక లావాదేవీలపై లేదా 'అజ్వా స్పోర్ట్స్ క్లబ్' యాజమాన్య నియంత్రణపై ఎటువంటి సరైన సాక్ష్యాలు లభించలేదని కోర్టు పేర్కొంది. పలువురు సాక్షులు కూడా ఈ ఆరోపణలను రుజువు చేయలేకపోవడంతో కోర్టు జేకబ్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం జేకబ్ మార్టిన్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. 2004లో ఇంగ్లండ్‌లో ఆడేందుకు వెళ్లిన తన జట్టులోని ఒక ప్లేయర్ వీసా గడువు ముగిసినా యూకేలోనే ఉండిపోయాడని పేర్కొన్నాడు. తప్పుడు స్టాంపింగ్ చేయించుకుని భారత్‌కు తిరిగొచ్చే క్రమంలో ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డాడని జేకబ్ వివరించాడు. అసలు ఎఫ్ఐఆర్లో తన పేరు లేకపోయినా, తానొక ఇంటర్నేషనల్ క్రికెటర్ కావడం వలనే విచారణ సమయంలో తన పేరును ఈ కేసులోకి బలవంతంగా చేర్చాని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ 22 ఏళ్ల సుదీర్ఘ కాలం తనను తీవ్రమైన మానసిక ఆందోళనకు గురిచేసిందని, చివరకు రైల్వే ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చిందని జేకబ్ మార్టిన్ వాపోయాడు. తనపై ఆరోపణలు వచ్చిన సమయంలో బీసీసీఐ నుంచి కూడా ఎటువంటి స్పందన లభించలేదని తెలిపాడు. ఏదేమైనా కోర్టు ఇచ్చిన ఈ తీర్పు తన జీవితానికి ఒక పెద్ద మలుపు అని

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని తేల్చారు. దీంతో ఆయన్ను తిరిగి అడియాలా జైలుకు తరలించారు. గురువారం అర్ధరాత్రి కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇమ్రాన్‌ను ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రత్యేక వైద్య పరీక్షలు చేయాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. 48 గంటల్లో ప్రత్యేక ఆసుపత్రికి తరలించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు.73 ఏళ్ల ఇమ్రాన్‌కు ఆరుగురు నిపుణులైన వైద్యులతో కూడిన బృందం పరీక్షలు చేసింది. రక్తపోటులో హెచ్చుతగ్గులు, గుండె దడ, తలనొప్పి, ఆందోళన వంటి సమస్యలను పరిశీలించారు. కుడి కంటికి గతంలో తలెత్తిన సమస్యపై కూడా పరీక్షలు నిర్వహించారు.పరీక్షల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సిన అవసరం లేదని తేల్చారు. జైలులోనే ఉండటం సురక్షితమని వైద్య బృందం సూచించింది.ఆసుపత్రి పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఇమ్రాన్ రాకపోకల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. పరీక్షలు పూర్తయిన వెంటనే ఆయనను తిరిగి అడియాలా జైలుకు తరలించారు.ఆగస్టు 2023లో అరెస్టైన ఇమ్రాన్ ఖాన్ వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన ఆరోగ్యం, నిర్బంధం పాకిస్థాన్ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారాయి

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ వేకువ జామున ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇస్లామాబాద్ లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి చేర్చారు. 73 ఏళ్ల వయసున్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించడానికి ఓ స్వతంత్ర వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు.2023 ఆగస్ట్ నుంచి ఆయన రావల్పిండి లోని అడియాలా జైలులోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటివరకు ఆయనకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా వెలుగులోకి రాలేదు. ఆరోగ్య పరిస్థితి గురించి కూడా బయటి ప్రపంచానికి తెలియదు. ఆ దేశ సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే.. ఇమ్రాన్ ఖాన్ ను తాజా ఆసుపత్రికి తరలించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనను తరలించే సమయంలో కూడా ఫొటోలు, వీడియోలు రాకుండా భద్రత సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.2022 ఏప్రిల్ వరకు ఆ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు ఇమ్రాన్ ఖాన్. అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి పదవిని కోల్పోయారు. అనంతరం తోషాఖానా కేసులో దోషిగా తేలడంతో జైలు పాలు కావాల్సొచ్చింది. ఆ తర్వాత ఆయన సతీమణి బుష్రా బీబీపై కూడా పలు రకాల కేసులు నమోదయ్యాయి. ఈ ఆరోపణలు, కేసులన్నీ కూడా పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని పీటీఐ వాదిస్తోంది. బెయిల్ కోసం చేసిన ఏ ప్రయత్నం కూడా సఫలం కాలేదు.పాకిస్తాన్ కు చుక్కలే: కేంద్రం డేగకన్ను: ఏకంగా రూ. 1,943 కోట్లతో మెరుపు తీగెలు లీజ్శిక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలు వెలుపలికి రావడం ఇదే మొదటిసారి. అడియాలా జైలు గోడల మధ్య దాదాపు 1,111 రోజుల పాటు అంటే మూడేళ్లకు పైగా సుదీర్ఘ ఖైదు అనుభవిస్తూ వస్తోన్నారాయన. ఆరోగ్యం క్షీణించడంతో వైద్య పరీక్షలు, చికిత్స కోసం ఇన్ని రోజుల తర్వాత మొదటిసారిగా బయటికొచ్చారు. హైబీపీ

భారత్‌కు ప్రస్తుతం పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద ముప్పు ఎక్కువగా ఉందని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె అన్నారు. అయితే రాబోయే రోజుల్లో భారత్‌కు చైనానే ప్రధాన పోటీదారుగా మారుతుందని చెప్పారు. రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, సైనిక రంగాల్లో చైనాతో పోటీ పెరుగుతుందని అంచనా వేశారు.తన కొత్త పుస్తకం ‘ది క్యూరియస్ అండ్ ది క్లాసిఫైడ్’ ఆవిష్కరణ కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడారు. పాకిస్థాన్, చైనాలతో భారత్ గతంలో యుద్ధాలు చేసిందని గుర్తు చేశారు. రెండు దేశాలతోనూ సరిహద్దు సమస్యలు ఇంకా ఉన్నాయని తెలిపారు.ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు కొనసాగుతుండటంతో ప్రస్తుతం పశ్చిమ సరిహద్దుపైనే భారత్ ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తోందన్నారు. అందుకే పాకిస్థాన్ తక్షణ భద్రతా సవాలుగా ఉందని చెప్పారు.అయితే దీర్ఘకాలంలో చైనాతో పోటీ మరింత పెరుగుతుందని నరవణె అన్నారు. చైనాను తాను ‘శత్రువు’గా కాకుండా ‘పోటీదారు’గా చూస్తున్నట్లు చెప్పారు. పోటీ ఉన్నచోట విభేదాలు రావడం సహజమేనన్నారు.చైనాతో ఉన్న సమస్యలను చర్చలు, సంభాషణల ద్వారానే పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సూచించారు. బలప్రయోగం చివరి మార్గంగా ఉండాలని చెప్పారు. అదే సమయంలో దేశ భద్రత కోసం బలమైన సైనిక శక్తి అవసరమని స్పష్టం చేశారు. ఎలాంటి దుస్సాహసాన్నైనా అడ్డుకునే స్థాయిలో సైన్యం సిద్ధంగా ఉండాలని అన్నారు.నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి పొరుగు దేశాల్లో స్థిరత్వం ఉండేలా భారత్ సహకరించాలని నరవణె పేర్కొన్నారు. పొరుగు దేశంలో అశాంతి పెరిగితే శరణార్థులు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాల సమస్యలు భారత్‌పైనా ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.శాంతే భారత్ ప్రధాన

సుమంత్‌పై 109 సెక్షన్ కింద కేసు నమోదు రాడ్లతో దాడి చేసినట్టు గొంగడి హరికృష్ణ ఫిర్యాదు జీరో FIR నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు Former OSD Sumanth : తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై హైదరాబాద్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మేడిపల్లి పోలీసులు సుమంత్ సహా మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 109 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హరికృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. సుమంత్ గతంలో తనను కలవాలని ఫోన్ చేశాడు. అప్పుడు తాను (Former OSD Sumanth) అందుబాటులో లేకపోవడంతో తర్వాత కలుస్తానని హరికృష్ణ చెప్పానన్నారు. అనంతరం తన స్నేహితుడు రాము ఆఫీసుకు వెళ్లిన సమయంలో సుమంత్ అక్కడే ఉన్నాడని పేర్కొన్నారు. Read Also : Konda Surekha : సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం.. నాకేం సంబంధం? కొండా సురేఖ వివరణ అయితే, అక్కడ తన పేరు అడ్డుపెట్టుకుని బయట డబ్బులు వసూలు చేస్తున్నావంటూ సుమంత్ ప్రశ్నించినట్లు హరికృష్ణ ఆరోపించారు. తాను ఎలాంటి వసూళ్లకు పాల్పడలేదని చెప్పినా వినలేదని, పైగా దుర్భాషలాడుతూ ఇనుప రాడ్డుతో కాళ్లు, చేతులపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. అలాగే సుమంత్‌తో ఉన్న మరో ఐదుగురు కూడా తనపై దాడికి పాల్పడ్డారని హరికృష్ణ ఆరోపించారు. తనపై దాడి చేసిన విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా బెదిరించినట్లు హరికృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును తీసుకున్న మేడిపల్లి పోలీసులు ముందుగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత తదుపరి దర్యాప్తు కోసం కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అయితే, ఈ ఆరోపణలపై సుమంత్ ఇప్పటివరకూ స్పందించలేదు. ఘటనకు సంబంధించిన అసలు కారణాలేంటి? దాడిలో ఎవరి పాత్ర ఎంత ఉందనే విషయాలు
Former Congress MP Sajjan Kumar Death : వేలాది మంది ప్రాణాలను బలిగొన్న 1984 నాటి ఘోర సిక్కు వ్యతిరేక హింసాకాండ కేసులో ప్రధాన దోషిగా జైలు శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు సజ్జన్ కుమార్ గురువారం నాడు తుదిశ్వాస విడిచారు. 80 ఏళ్ల వయస్సు కలిగిన ఆయన, ఢిల్లీలోని ప్రసిద్ధ తీహార్ జైలులో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించడంతో వెంటనే జైలు అధికారులు అత్యవసరంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే సమయానికే ఆయన మరణించినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించి అధికారికంగా ప్రకటించారు.సిక్కు అల్లర్ల కేసు ఏమైందంటే?మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దారుణ హత్య అనంతరం 1984 నవంబర్ 1, 2 తేదీలలో దేశ రాజధానిలోని పాలం కాలనీ ప్రాంతంలో తీవ్ర స్థాయిలో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఆ భయానక ఘటనల్లో ఐదుగురు నిర్దోషులు ప్రాణాలు కోల్పోవడానికి సజ్జన్ కుమార్ ప్రత్యక్షంగా కారణం అయ్యాడని ఆరోపణలు వచ్చాయి. ఈ అల్లర్ల వ్యవహారంపై సుదీర్ఘంగా జరిగిన విచారణ అనంతరం.. ఆయనను తీవ్ర నేరస్థుడిగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు 2018 డిసెంబర్ 17న సంచలన తీర్పును ఇచ్చింది. ఈక్రమంలోనే జీవిత ఖైదు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆనాటి నుంచి ఆయన తీహార్ జైలులోనే శిక్షను అనుభవిస్తున్నారు. హైకోర్టు విధించిన ఈ కఠినమైన శిక్షను సవాలు చేస్తూ ఆయన దేశ అత్యున్నత నాయస్థానమైన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ఇన్నాళ్లూ సుప్రీం కోర్టులో విచారణ దశలోనే పెండింగ్‌లో ఉండిపోయింది.1984 నాటి సిక్కుల వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన పలు చోట్ల నమోదైన అనేక కేసులలో సజ్జన్ కుమార్ పేరు ప్రధానంగా వినిపించింది. రాజధాని పరిధిలోని జానక్‌పురి, వికాస్పురి ప్రాంతాల్లో అల్లర్లను తీవ్రంగా రెచ్చగొట్టారనే తీవ్రమైన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అయితే ఈ కేసులను విచారించిన ఢిల్లీలోని స్థానిక

Vizianagaram: ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠా గుట్టురట్టు.. నిందితుల అరెస్ట్! ఈ వార్తకు సంబంధించిన

Tiruchanur: తిరుచానూరు అమ్మవారి సేవలో మాజీ టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మాజీ టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బుధవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, సూపరింటెండెంట్లు సురేష్, రమేష్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు
తిరుమలలో విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన అధికారికంగా ప్రకటించారు. ప్రజల తరఫున నిలబడి, వారి గొంతుకను అటు అసెంబ్లీతో పాటు ఇటు పార్లమెంట్‌లోనూ గట్టిగా వినిపించడమే తన ప్రధాన ధ్యేయమని తెలిపారు. రాష్ట్రంలో వర్షాభావం, ఎల్‌నినో ప్రభావం లేకుండా రైతాంగం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు. విజయవాడ వేదికగా నిర్వహించే మీడియా సమావేశంలో ఈ నెలలోనే భవిష్యత్ రాజకీయ ప్రణాళిక, పార్టీ కార్యాచరణను పూర్తి వివరాలతో వెల్లడిస్తానని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఈ వార్తకు సంబంధించిన

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు సంబంధించిన కోకాపేట్‌లోని నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు (Harish Rao) సంబంధించిన కోకాపేట్‌లోని నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆస్పత్రిని సందర్శించేందుకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. హరీశ్‌రావు నివాసం వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రి సందర్శనకు సంబంధించి హరీశ్‌రావు పిలుపునివ్వడంతో పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. కోకాపేట్‌లోని ఆయన నివాసం వద్దకు పోలీసులు చేరుకోవడంతో రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. హరీశ్‌రావు హౌస్ అరెస్ట్ వార్తతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్ సర్కార్‌కు కవిత వార్నింగ్ కేబీఆర్ చుట్టూ వన్ వే.. వాహనదారులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు

తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijay Sai Reddy) దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలు, ప్రజావాణిని చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ఓ రాజకీయ పార్టీని ప్రారంభించాలని సంకల్పించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నానని చెప్పారు. రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే కీలక ప్రకటన చేయనున్నట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు. విజయవాడ వేదికగా ఈ నెలలోనే తన రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తానని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ కార్యాచరణను రూపొందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు, దాని లక్ష్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై విజయవాడలో స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రం, దేశంలో కరువు పరిస్థితులు లేకుండా సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థించినట్లు విజయసాయి రెడ్డి చెప్పారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆయన ప్రకటించబోయే రాజకీయ ప్రణాళికపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. విజయవాడలో జరిగే ప్రకటనలో పార్టీ పేరు, విధివిధానాలు, రాజకీయ లక్ష్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్

Devarkadra: దేవరకద్రలో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఈ వార్తకు సంబంధించిన

David Warner Drink Driving: తన అగ్రెసివ్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. ఇప్పుడు మైదానం వెలుపల అనూహ్యంగా ఒక ఊహించని వివాదంలో ఇరుక్కున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నేరాన్ని అంగీకరించి కోర్టు ముందు నిలబడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం మత్తులో కారు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో అతను దొరికిపోయాడు. సాధారణంగా చట్టం అనుమతించిన ఆల్కహాల్ పరిమితి కంటే రెట్టింపు మోతాదులో అతను మద్యం సేవించినట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారం స్థానిక సిడ్నీ కోర్టుకు చేరింది. పోలీసుల విచారణలో తన తప్పును అంగీకరించిన వార్నర్‌పై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఏకంగా 1,500 ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ.1,02,004లు) భారీ ఫైన్ విధించింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే.. ఆస్ట్రేలియా పోలీసుల ప్రకారం వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు శరీరంలో ఆల్కహాల్ శాతం ఒక నిర్దిష్ట పరిమితికి లోబడి మాత్రమే ఉండాలి. కానీ డేవిడ్ వార్నర్ ఆ చట్టబద్ధమైన పరిమితిని దాటి మిడ్-రేంజ్ డ్రంక్ డ్రైవింగ్‌కు పాల్పడినట్లు పోలీసుల రికార్డుల్లో నమోదైంది. చట్టబద్ధంగా అనుమతించిన స్థాయి కంటే కచ్చితంగా రెండు రెట్లు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నట్లు వెల్లడైంది. ఒక ప్రముఖ అంతర్జాతీయ క్రీడాకారుడిగా సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యతాయుతమైన వ్యక్తి, పబ్లిక్ రోడ్లపైన ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం పట్ల స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, విచారణ సమయంలో తన తప్పును ఏమాత్రం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకుండా వార్నర్ తన నేరాన్ని కోర్టులో పూర్తిగా అంగీకరించాడు. ఎక్కువమంది చదివినది: 59 ఫోర్లు, 1 సిక్స్.. ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేసిన దిగ్గజాలు..! డేవిడ్ వార్నర్ ఇలాంటి తీవ్రమైన వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని

నీట్ పరీక్షలో చోటు చేసుకున్న అక్రమాల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ గత నెలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దాదాపు నెలరోజుల పాటు నిరసనలు (CJP Protests) చేపట్టింది. ఆ తర్వాత గత నెల 20న పార్లమెంట్ మార్చ్ కు కూడా పిలుపునిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు వచ్చి ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసులు వీరిని అడ్డుకునేందుకు బలప్రయోగం కూడా చేశారు. ఆ తర్వాత కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ ఇవాళ బిగ్ ట్విస్ట్ ఎదురైంది. కాక్రోచ్ దెబ్బకు బీజేపీలో రెండో వికెట్..! కొత్త టీమ్ లో కీలక నేతపై వేటు..!జంతర్ మంతర్ సహా ఢిల్లీలో జరిగిన నిరసనలపై స్వతంత్ర విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఇవాళ ఢిల్లీలో విద్యార్ధుల నిరసనలు, పోలీసుల బల ప్రయోగంపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. ఈ మేరకు తుది అంచనాకు రావడానికి సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ న్యాయమూర్తితో కూడిన కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని నిర్ణయించింది. దీంతో ఇన్నాళ్లూ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్దులపై కేసులు ఉండవని కేంద్రం ఇచ్చిన హామీ ప్రమాదంలో పడింది. ఉరికి బదులు ఇంజెక్షన్ తో మరణశిక్ష- తేల్చేసిన సుప్రీంకోర్టు..!జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిర్వహించిన నిరసనల వల్ల తలెత్తిన సమస్యలు, ఆరోపణలను పరిశీలించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలనే దానిపై సంబంధిత వర్గాలు, పిటిషనర్ల సూచనలను చేర్చిన తర్వాత రేపు తుది ఉత్తర్వులను విడుదల చేస్తామని పేర్కొంది. తమవైపు నుంచి సీబీఐ మాజీ డైరెక్టర్ ఒకరిని, అలాగే మాజీ న్యాయమూర్తి ఒకరిని ఈ కమిటీలో చేర్చింది. విద్యార్ధుల నిరసన ప్రదర్శన, పోలీసుల చర్యలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఈ

క్రికెట్లో అద్భుతమైన ఆరంభం.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.. కానీ రిటైర్మెంట్ తర్వాత మాత్రం ఉద్యోగం కోసం తలుపులు తట్టాల్సిన పరిస్థితి. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మాథ్యూ సింక్లెయిర్ జీవితం ఈ రెండు భిన్నమైన దశలకు నిదర్శనంగా నిలిచింది. టెస్టు అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ చేసిన ఈ బ్యాటర్.. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కొద్దికాలానికే ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారు. 1999లో వెస్టిండీస్‌పై టెస్టు అరంగేట్రం చేసిన సింక్లెయిర్ 214 పరుగులతో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌పై మరో టెస్టులో 204 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ తరఫున 33 టెస్టులు, 54 వన్డేలు ఆడిన ఆయన.. దేశవాళీ క్రికెట్లోనూ అద్భుతమైన రికార్డు సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 36 సెంచరీలు, 50కి పైగా బ్యాటింగ్ సగటు ఉన్నప్పటికీ.. రిటైర్మెంట్ తర్వాత ఆ అనుభవం ఉద్యోగ మార్కెట్లో పెద్దగా ఉపయోగపడలేదు. 2013లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సింక్లెయిర్‌కు ఊహించని సమస్య ఎదురైంది. ఆయనకు స్థిరమైన ఉద్యోగం దొరకలేదు. యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేయకపోవడం, వ్యాపార రంగంలో అనుభవం లేకపోవడం ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న సమయంలో పెద్ద అడ్డంకిగా మారాయి. క్రికెట్లో 20 ఏళ్ల అనుభవం ఉన్నా.. కంపెనీలకు కావాల్సింది డిగ్రీ, వృత్తిపరమైన అనుభవం కావడంతో వరుసగా తిరస్కరణలు ఎదురయ్యాయి. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే.. తన ఇద్దరు చిన్న పిల్లలను పోషించేందుకు సింక్లెయిర్ న్యూజిలాండ్ ప్రభుత్వ నిరుద్యోగ భృతి కోసం కూడా నమోదు చేసుకున్నారు. తాను అంతర్జాతీయ క్రికెటర్‌నని చెప్పుకుని ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లడం తన జీవితంలో అత్యంత కష్టమైన అనుభవాల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు వేలాది మంది అభిమానించిన క్రికెటర్.. కుటుంబాన్ని నడిపించేందుకు ఉద్యోగం కోసం వెతకాల్సి వచ్చింది. ఒక దశలో మాజీ న్యూజిలాండ్ ఓపెనర్ మార్క్ రిచర్డ్సన్ నిర్వహించిన రేడియో కార్యక్రమానికి ఫోన్ చేసిన సింక్లెయిర్.. “నా అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ చేశాను” అంటూ తనను పరిచయం చేసుకుని, ఏదైనా

ఒకప్పుడు దట్టమైన అడవుల్లో తుపాకులు చేతబట్టి తిరిగిన చేతులు.. ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఫ్యాషన్ ర్యాంప్‌పై అడుగులేశాయి. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఘనంగా జరిగిన జాతీయ చేనేత దినోత్సవం ఈ అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఆయుధాలను విడిచిపెట్టిన మాజీ మహిళా నక్సలైట్లు, అందమైన చేనేత చీరలు ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేశారు. వారి ముఖాల్లోని చిరునవ్వులు, నడకలోని ధీమాను చూసి సభికులు మంత్రముగ్ధులై చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి సీఎం విష్ణు దేవ్ సాయ్ హాజరై వారిని అభినందించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టుల హింసతో అట్టుడికిన బస్తర్ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా నక్సల్ రహితంగా మారిందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అక్కడ అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవలే సీఎం విష్ణు దేవ్ సాయ్, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ.. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి బస్తర్ అభివృద్ధికి ప్రత్యేక రాయితీలు కల్పించాలని కోరారు. సుమారు 40-50 ఏళ్ల తర్వాత బస్తర్ ప్రశాంతంగా మారిందని, ముఖ్యంగా కనెక్టివిటీని మెరుగుపరచాల్సి ఉందని సీఎం వెల్లడించారు. ఒకప్పుడు దేశ అంతర్గత భద్రతకు పెను సవాల్‌గా నిలిచిన బస్తర్.. మావోయిస్టులకు వ్యూహాత్మక కేంద్రంగా ఉండేది. అయితే, ‘ఆపరేషన్ కగర్’ వంటి ప్రత్యేక ఆపరేషన్లతో భద్రతా బలగాలు మావోయిస్టుల వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి. ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలతో భారీ సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోయారు. గత మే నెలలో బస్తర్‌ను సందర్శించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఈ ప్రాంతం పూర్తిగా నక్సల్ రహితంగా మారిందని ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో భద్రత నుంచి అభివృద్ధి దిశగా ఈ ప్రాంతాన్ని నడిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సానుకూల పరిణామాలన్నీ బస్తర్‌లో సరికొత్త శకానికి నాంది పలుకుతున్నాయి. ఆధార్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. అప్డేట్కు ఇక సెంటర్ అవసరం లేదు ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ

మాజీ ప్రధాని, దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి 8వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) 8వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి వాజ్‌పేయి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ మేరకు ఇవాళ (ఆదివారం) ఎక్స్ వేదికగా పోస్టులు చేశారు. దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన అసాధారణ రాజనీతిజ్ఞుడు అటల్జీ అని ప్రధాని మోదీ కొనియాడారు. వాజ్‌పేయికి అపారమైన దూరదృష్టి ఉందని ప్రశంసించారు. ఆయన మాటలు, కృషి తరతరాలకు స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు. మాజీ ప్రధాని నాయకత్వం దేశాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు. సుపరిపాలన, ప్రజా సంక్షేమంపై అటల్జీ చూపిన దృష్టి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. మరోవైపు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ఘనంగా నివాళులు అర్పించారు. న్యూఢిల్లీలోని ‘సదైవ అటల్’ సమాధి వద్దకు ఆమె చేరుకున్నారు. ఈ సందర్భంగా పుష్పాంజలి ఘటించారు. అనంతరం దేశానికి వాజ్‌పేయి అందించిన సేవలను రాష్ట్రపతి స్మరించుకున్నారు. మమతా బెనర్జీ సన్నిహితుడు ఆశిష్ బెనర్జీ అనుమానాస్పద మృతి.. పార్టీ కార్యాలయంలో మృతదేహం.. జర్మనీతో రూ.70 వేల కోట్ల ఒప్పందం దిశగా భారత్.. కీలక భేటీకి రంగం సిద్ధం

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష (APPSC Group 1) మూల్యాంకనంలో అక్రమాలపై సిట్ రిపోర్ట్ కలకలం రేపుతున్న వేళ రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్ని ప్రశ్నిస్తూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఇవాళ ట్వీట్ చేశారు. తాజాగా బయటపడిన యూపీఎస్సీ పరీక్ష అక్రమాలను ఆయన ఇందులో ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి, సమగ్రంగా నియామక సంస్కరణలు తీసుకురావాలని సాయిరెడ్డి కోరారు.Vijayasai Reddy: జెన్ జీకి ఇన్ని కష్టాలున్నాయా ?- సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్ ..!ప్రభుత్వ నియామక పరీక్షలలో అవకతవకలపై పదేపదే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, దివ్యాంగుల కోటాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోటాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలకు సంబంధించిన ఇటీవలి కేసులు, యూపీఎస్సీ వ్యవస్థపై కూడా మరింత పటిష్టమైన పరిశీలన అవసరమని స్పష్టం చేశాయని సాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఇలాంటి సమస్యలు మరింత విస్తృతంగా, నిరంతరంగా కొనసాగుతున్నట్లు కనిపిస్తున్నాయన్నారు. ప్రతిభను తక్కువ చేసి చూసినప్పుడు, రిజర్వేషన్ ప్రయోజనాలు అర్హులైన వారికి చేరనప్పుడు, నియామక వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందన్నారు. UPI పేమెంట్స్ పై ఛార్జీలు ? కేంద్రానికి సాయిరెడ్డి హెచ్చరికలు..!అలాగే పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు ప్రకటించడం నుండి అర్హత, రిజర్వేషన్ల క్లెయిమ్‌లను ధృవీకరించడం వరకు ప్రతి దశలోనూ పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో భారతదేశానికి సమగ్ర నియామక సంస్కరణలు అవసరమని సాయిరెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇది స్వాతంత్ర్యదినోత్సవ ప్రతిజ్ఞగా మారాలన్నారు. పటిష్టమైన భారతదేశ నిర్మాణానికి స్వచ్ఛమైన, విశ్వసనీయమైన, ప్రతిభ ఆధారిత నియామక వ్యవస్థ అత్యవసరమని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు

ఒకప్పుడు బస్తర్ అడవులు అంటేనే ఎదురుకాల్పులు, తుపాకుల మోతలు, మావోయిస్టుల అంబూష్లే గుర్తుకువచ్చేవి. కానీ ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయ్‌పూర్‌లోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆడిటోరియంలో దృశ్యం పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు ఆకుపచ్చ యూనిఫామ్ వేసుకుని భుజాన తుపాకులు మోసిన మాజీ మహిళా మావోయిస్టులు, ఇప్పుడు బస్తర్ సంప్రదాయ చేనేత, కోసా సిల్క్ దుస్తులు ధరించి రంగురంగుల వెలుగుల్లో ర్యాంప్ వాక్ చేశారు. స్వదేశీ ఫ్యాషన్ షోలో భాగంగా జరిగిన ఈ ఈవెంట్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బస్తర్ లోని పునరావాస కేంద్రాల నుంచి వచ్చిన ఈ మహిళలకు రాయ్‌పూర్‌లో ప్రత్యేకంగా వారం రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. ముంబైకి చెందిన ఒక ప్రొఫెషనల్ మోడలింగ్ ట్రెయినర్ వీరికి ర్యాంప్‌పై ఎలా నడవాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, కాన్ఫిడెన్స్‌తో ఎలా ప్రెజెంట్ చేయాలనే విషయాలపై శిక్షణ ఇచ్చారు. పాల్గొన్న వారిలో మాద్వి మల్లే అనే మహిళ మాట్లాడుతూ.. ప్రారంభంలో భయపడ్డాననీ, కానీ ప్రాక్టీస్ చేశాక కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పారు. ఇంత పెద్ద క్రౌడ్ ముందు ర్యాంప్ వాక్ చేస్తానని కలలు కూడా కనలేదని పూనం దేవీ సంతోషం వ్యక్తం చేశారు. వీరిలో చాలామందికి రాయ్‌పూర్ నగరాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ కూడా పాల్గొని వారితో ముచ్చటించారు. మావోయిస్టు బాట వీడిన వారికి లోంగుబాటు అనేది సివిలియన్ లైఫ్‌లోకి రావడానికి పడే మొదటి అడుగు మాత్రమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతా బలగాల ఆపరేషన్లతో పాటు లోంగుబాటు, పునరావాసం, వృత్తి విద్యా శిక్షణ, ఆర్థిక సహాయం అందిస్తూ వారిని సమాజంలోకి కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రాయ్‌పూర్ ఫ్యాషన్ షో అనేది ఈ రీ-ఇంటిగ్రేషన్ ప్రసారంలో ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రాణాలమీదికి తెచ్చే అడవి పోరాటాల నుంచి బయటపడి, తమ

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కర్నూలులో ఎమ్మెల్యే విరుపాక్షితో ములాఖత్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం, పోలీసులపై జగన్ ఆరోపణలు చేశారు. కర్నూలు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నిన్న(గురువారం) కర్నూలులో ఎమ్మెల్యే విరుపాక్షితో ములాఖత్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం, పోలీసులపై జగన్ ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలపై కర్నూలు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి (Venu Gopal Reddy) స్పందించారు. జైలు నిబంధనల ప్రకారమే జగన్ ఫొటోను తీసుకొని ములాఖత్‌కు అనుమతించామని స్పష్టం చేశారు. ములాఖత్ సమయంలో అమర్యాదగా ప్రవర్తించలేదని వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. మాజీ సీఎం హోదాకు భంగం కలిగించలేదని వెల్లడించారు. ములాఖత్‌కు వచ్చే ప్రతి ఒక్కరి ఫొటో తీసుకోవడం తప్పనిసరని తెలిపారు. ఆయన ఫొటో కూడా అలాగే తీసుకున్నామని వెల్లడించారు. జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరుపాక్షి, ఆయన తమ్ముడు శ్రీరాములను కలుస్తానని జగన్ కోరారని తెలిపారు. ఈ- ప్రిజన్స్ సాఫ్ట్వేర్ ప్రకారం ఎంతమంది ముద్దాయిలను కలుస్తానంటే అన్నిసార్లు ఫొటో తీసుకోవాలని చెప్పుకొచ్చారు. ఆ విధంగానే మాజీ సీఎం జగన్ ఫొటోను రెండుసార్లు తీశామని వెల్లడించారు. ఏ అధికారి, సిబ్బంది జగన్ గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించలేదని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సింగపూర్ మోడల్‌తో అమరావతిని నిర్మిస్తున్నాం: సీఎం చంద్రబాబు వన్యప్రాణుల సంరక్షణ ప్రజా ఉద్యమంగా మారాలి: పవన్ కల్యాణ్ సీడ్ యాక్సెస్ రోడ్డులో S ఆకారపు మలుపుపై అపోహలు వద్దు: ఏపీ సర్కార్

మహారాష్ట్రలోని నాందేడ్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. శిరోమణి అకాలీదళ్ సీనియర్ నాయకుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై ప్రాణాంతక దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, సహచరులు ఆయనను చికిత్స నిమిత్తం సమీపంలోని యశోసాయి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తోన్నారు.సుఖ్బీర్ సింగ్ బాదల్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం నాందేడ్‌కు వచ్చారు. ఇక్కడి మాతా సాహిబ్ కౌర్ ప్రాంతంలో ఉన్న ఓ గురుద్వారాను సందర్శించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురుద్వారా లోపల ఒక నిహంగ్ సిక్ ఒకరు కృపాణ్తో బాదల్‌పై అకస్మాత్తుగా దాడికి తెగబడ్డాడు. బాదల్ తో పాటు భద్రత సిబ్బంది, సహచరులు అప్రమత్తంగా ఉండటంతో అతన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పెనుగులాట చోటు చేసుకుంది. బాదల్ కుడి చేతికి గాయాలయ్యాయి. బాదల్‌ను రక్షించడానికి ప్రయత్నించిన ఓ ఎస్ఐ కూడా గాయపడ్డారు.దాడికి పాల్పడిన నిందితుడిని భద్రతా సిబ్బంది అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో నాందేడ్ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై నాందేడ్ జిల్లా కలెక్టర్ రాహుల్ కర్దిలే స్పందించారు. సుఖ్బీర్ సింగ్ బాదల్ పర్యటనకు సంబంధించి ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం పూర్తి స్థాయి రక్షణ చర్యలు చేపట్టామని, స్థానిక పోలీసు బందోబస్తు కూడా కల్పించినట్లు తెలిపారు.హైవేల విషయంలో ఎన్హెచ్ఏఐ నూతన నిబంధనలు: రూ. 10,000 ఫైన్నిందితుడు గురుద్వారాలోకి ప్రవేశించి అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాడని, దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై ఇలాంటి దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. 2024 డిసెంబర్ 4న అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ సమీపంలో కూడా ఆయనపై దాడి యత్నం చోటు చేసుకుంది. ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో కూడా ఆయన ప్రాణాపాయం

అకాలీ దళ్ అధినేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో దాడి జరిగింది. అక్కడి ఒక గురుద్వారాను సందర్శించిన తర్వాత నగర శివార్లలో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. నాందేడ్, ఆగస్టు 13: శిరోమణి అకాలీదళ్ (SAD) అధినేత, పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో దాడి జరిగింది. గురుద్వారాను సందర్శించి వస్తుండగా నగర శివార్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడి అనంతరం బాదల్‌ను నాందేడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. కుటుంబ సమేతంగా దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన సుఖ్బీర్ సింగ్ బాదల్ తన భార్య, అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్, కుటుంబ సభ్యులతో కలిసి నాందేడ్‌లోని ప్రసిద్ధ 'తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్' గురుద్వారాను సందర్శించారు. దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో బాదల్ భద్రతా సిబ్బందిలో ఒకరికి కూడా గాయాలయ్యాయి. దాడి వెనుక ఉన్న కారణాలు, దాడి చేసిన వారి సమాచారంపై పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. సమాజంలో దళితులకు స్థానం లేదు.. ఖర్గే ఆగ్రహం హఫీజ్ సయీద్‌కు మద్దతు ప్రకటించి.. భారత్‌పై విషం కక్కిన పాక్ మాజీ మంత్రి

పాకిస్థాన్ రాజకీయ నాయకులకు, ఉగ్రవాదులకు ఉన్న అనుబంధం మరో సారి వెల్లడైంది. ఆ దేశ మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ ఉగ్రవాదులతో వేదిక పంచుకున్నారు. నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు చెందిన కీలక ఉగ్ర నేతలతో ఒకే వేదికపై ప్రత్యక్షమైన పాకిస్థాన్ మాజీ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అంతర్జాతీయంగా నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన కీలక నాయకులతో కలిసి ఒకే వేదికపై ప్రత్యక్షమైన ఆయన షేక్ రషీద్ అహ్మద్ ఇండియాపై విషం కక్కారు. విద్వేష పూరిత వ్యాఖ్యతో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ మాజీ మంత్రి, రాజకీయ నాయకుడు ఉగ్రవాదులతో ఒకే వేదికపై కూర్చుని భారత్ అంతు చూస్తామంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక బహిరంగ సభలో షేక్ రషీద్ అహ్మద్ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఆ ఉగ్ర సంస్థ కేంద్ర సలహా మండలి సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆ సందర్భంగా ప్రసంగించిన ఆయన తాను లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు బానిసనని బాహాటంగా ప్రకటించారు. భారత్ గనుక పాకిస్థాన్ వైపు కన్నెత్తి చూస్తే.. ఆ దేశాన్ని దేవుడు నాశనం చేస్తాడంటూ శాపనార్ధాలు పెట్టారు. భారత్‌పై దాడి జరిగితే అక్కడ పక్షులు కూయవని, ఆలయాల్లో గంటలు డా మోగవనీ హెచ్చరికలు జారీ చేశారు. గతంలో తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో తన ఫోన్లో హఫీజ్ సయీద్ ఫోన్ నంబర్ ఉండటంతో అమెరికా అధికారులు తనను ఆ దేశం నుంచి బహిష్కరించారని రషీద్ స్వయంగా వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వంలో 2020 నుంచి 2022 వరకు మంత్రిగా షేక్ రషీద్ కీలక

బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌తో పట్టుబడటం కలకలం రేపింది. జైలు అధికారులు జరిపిన తనిఖీల్లో ప్రజ్వల్ రేవణ్ణ వద్ద అభ్యంతరకరమైన మొబైల్ ఫోన్ లభ్యమైంది. ఈ ఫోన్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా, అందులో భారీగా అశ్లీల కంటెంట్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. జైలు నిబంధనలను ఉల్లంఘించి మాజీ ఎంపీ ఈ తరహా చర్యలకు పాల్పడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం తనపై నమోదైన పనిమనిషి అత్యాచారం కేసులో జీవితఖైదు అనుభవిస్తున్నారు. ఈ కేసులో విచారణ ముగిసిన అనంతరం ఆయనకు శిక్ష ఖరారవ్వడంతో పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ జైలులోకి సెల్ ఫోన్ ఎలా వచ్చిందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అధికారులు ఇప్పటికే దీనిపై అంతర్గత విచారణను వేగవంతం చేశారు. అధికారులు స్వాధీనం చేసుకున్న ఆ ఫోన్లో సుమారు 80 నుంచి 90 వరకు అశ్లీల వీడియోలు ఉన్నట్లు తెలిసింది. కేవలం వీడియోలే కాకుండా, మహిళల అసభ్యకర ఫోటోలతో కూడిన కొన్ని పేపర్ క్లిప్పింగ్స్‌ను కూడా ఫోన్లో దాచి ఉంచారు. దీంతో జైలులో ఉంటూ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు చూడటం అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. ఇది జైలు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైలులో నిషిద్ధ వస్తువులు దొరకడంతో అధికారులు ఆయనపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఫలితంగా ప్రజ్వల్ రేవణ్ణకు కల్పించే సౌకర్యాలపై కోత విధించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో జైలులోని భద్రతా లోపాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఫోన్ ఎలా అందిందనే కోణంలో జైలు సిబ్బంది పాత్రపై కూడా లోతైన విచారణ జరగనుంది. రాబోయే రోజుల్లో ఈ ఘటనపై జైలు శాఖ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఆయనపై అదనపు కేసులు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అటు రాజకీయంగా కూడా

పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ వివాదంలో చిక్కుకున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులతో కలిసి ఆయన ఓ బహిరంగ సభలో వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌ను పొగడ్తలతో ముంచెత్తడమే కాకుండా, భారత్‌పై తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది.ఈ వీడియోలో, లష్కరే సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఉగ్రవాద సంస్థ కేంద్ర సలహా కమిటీ సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి రషీద్ వేదికపై కనిపించారు. సభను ఉద్దేశించి మాట్లాడుతూ "నేను హఫీజ్ సాహెబ్‌కు బానిసను (గులాంను)" అని రషీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "మేము పాకిస్థాన్‌తో ఉన్నాం, హఫీజ్ సయీద్‌తో ఉన్నాం" అని బహిరంగంగా ప్రకటించారు.అంతటితో ఆగకుండా భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "భారత్ గనుక పాకిస్థాన్ వైపు కన్నెత్తి చూస్తే అల్లానే ఆ దేశాన్ని నాశనం చేస్తాడు" అని హెచ్చరించారు. "భారత్‌లో పక్షులు కూడా కూయవు, గుళ్లలో గంటలు కూడా మోగవు" అంటూ విషం కక్కారు. తాను అమెరికాలో ఉన్నప్పుడు తన ఫోన్లో హఫీజ్ సయీద్ నంబర్ కనిపించిందని, ఆ కారణంతోనే తనను ఆ దేశం నుంచి బహిష్కరించారని కూడా రషీద్ చెప్పుకొచ్చారు.షేక్ రషీద్ అహ్మద్, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో 2020 నుంచి 2022 వరకు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. గతంలో దేశ అంతర్గత భద్రతకు బాధ్యత వహించిన

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (CJI)పనిచేసి పదవీ విరమణ చేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud)కు అంతర్జాతీయంగా అరుదైన గౌరవ లభించింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్దం (Russia-Ukraine War)నేపధ్యంలో ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేసే అవకాశం ఆయనకు దక్కింది. ఈ మేరకు రష్యా ప్రభుత్వం ఆయన్ను ఓ కీలక వివాదంలో మధ్యవర్తిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఓ అంతర్జాతీయ కేసులో భారతీయ న్యాయమూర్తి మధ్యవర్తిగా వ్యవహరించబోతున్నారు.మోడీపై ఒత్తిడి తెస్తే..! ఏం జరుగుతుందో చెప్పేసిన పుతిన్..!ఉక్రెయిన్ ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ ఆర్థిక సంస్థ ఓషాడ్బ్యాంక్ (Oschadbank) దాఖలు చేసిన భారీ పెట్టుబడి వివాదంలో రష్యా దేశం తరఫున ప్రతినిధిగా (ఆర్బిట్రేటర్) వ్యవహరించేందుకు మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ నియమితులయ్యారు. రెండు దేశాల మధ్య కొన్నేళ్లుగా సాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వ్యవహారం అంతర్జాతీయ న్యాయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన సైనిక చర్యల కారణంగా డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజ్జియా వంటి సరిహద్దు ప్రాంతాల్లోని తమ ఆస్తుల్ని, వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా కోల్పోయామని ఓషాడ్బ్యాంక్ ఆరోపిస్తోంది. దీంతో ఈ భారీ నష్టానికి పరిహారం కోరుతూ 1998 నాటి ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం కింద రష్యాపై దావా వేసింది. ట్రంప్ కు ఎంత కష్టం ?- ఫుడ్ ట్రక్కులో దాక్కుని-తన విమానం వదిలేసి..!దాదాపు వందల మిలియన్ డాలర్ల విలువైన ఈ కేసు విషయంలో జూలై 2025లో తాము పంపిన నోటీసులకు రష్యా స్పందించకపోవడంతో బ్యాంకు ఈ ఆర్బిట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దీంతో వివాద పరిష్కారానికి ముగ్గురు సభ్యుల ప్రత్యేక అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. కోస్టారికాకు చెందిన మాజీ వాణిజ్య మంత్రి, అంతర్జాతీయ నిపుణురాలు ద్యాలా జిమెనెజ్ ఈ ట్రిబ్యునల్‌కు అధ్యక్షత వహిస్తారు. ఆమెను రష్యా , ఉక్రెయిన్ బ్యాంకు రెండు కలిసి పరస్పర అంగీకారంతో సంయుక్తంగా ఎంపిక చేసుకున్నాయి. ఇక గ్రీస్‌కు చెందిన

లైంగిక వేధింపుల కేసుల్లో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని ఆయన సెల్లో అక్రమంగా వాడుతున్న మొబైల్ ఫోన్‌ను జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర సంచలనం రేపింది. జైలు నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపై కొత్తగా మరో కేసు నమోదు చేశారు.జైలు ఉన్నతాధికారులు, సిబ్బంది కలిసి ప్రజ్వల్ రేవణ్ణ ఉన్న సెల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆయన రహస్యంగా దాచిన స్మార్ట్‌ఫోన్ బయటపడింది. జైలులోకి నిషేధిత ఎలక్ట్రానిక్ పరికరాన్ని తీసుకెళ్లి, వినియోగించినందుకు గాను ఆయనపై పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), జైళ్ల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటనను కర్ణాటక హోంశాఖ చాలా తీవ్రంగా పరిగణించింది. జైలు భద్రతను దాటి సెల్‌లోకి ఫోన్ ఎలా చేరిందనే దానిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ప్రజ్వల్‌కు ఈ ఫోన్‌ను ఎవరు అందించారు? జైలు లోపలి నుంచి ఆయన ఎవరెవరితో మాట్లాడారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనికోసం ఫోన్ కాల్ డేటా రికార్డులను (సీడీఆర్), ఇతర డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు.అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే జైలులోకి స్మార్ట్‌ఫోన్ చేరడం వెనుక జైలు సిబ్బంది ప్రమేయం ఉందనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు జైలు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు

సిరియా(Syria)లో తిరుగుబాటు తర్వాత పదవీచ్యుతుడై, అజ్డాతంలో ఉంటున్న మాజీ అధ్యక్షుడు, నియంతగా పేరున్న బషర్ అల్ అస్సాద్ (Bashar al-Assad)కు ఇవాళ భారీ షాక్ తగిలింది. సొంత ప్రజలపై నరమేథానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు మరణశిక్ష విధిస్తూ సిరియా రాజధాని డెమాస్కస్ లోని క్రిమినల్ కోర్టు తీర్పు ఇచ్చింది. అస్సాద్ తో పాటు దేరా ప్రావిన్స్ మాజీ పొలిటికల్ సెక్యూరిటీ విభాగం అధిపతి అతెఫ్ నజీబ్‌కు కూడా కోర్టు ఇదే శిక్షను ఖరారు చేసింది.ట్రంప్ కు నెతన్యాహు మరో షాక్..! కథ మళ్లీ మొదటికి..!సిరియాలో దశాబ్దాల పాటు సాగిన అణచివేత, సొంత పౌరులపైనే సాగించిన దారుణాలపై విచారణ జరిపిన క్రిమినల్ న్యాయస్థానం.. ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది. అస్సాద్ హయాంలో స్వదేశీ ప్రజలపై నరమేధం సృష్టించడంతో పాటు రసాయన దాడుల ద్వారా తీవ్ర అణచివేతకు పాల్పడినట్లు ఆయనపై తీవ్ర అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో ఆయనను మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన దోషిగా కోర్టు నిర్ధారించింది. ప్రస్తుతం అస్సాద్ సిరియాలో అందుబాటులో లేకపోవడంతో, ఆయన గైర్హాజరీలోనే ఈ విచారణను పూర్తి చేసి శిక్షను ఖరారు చేశారు. మరో నిందితుడు అతెఫ్ నజీబ్‌పై పథకం ప్రకారం పౌరులను హత్యచేయడం, ఖైదీలను చిత్రహింసలు పెట్టడం వంటి నేరాలు రుజువయ్యాయి. ట్రంప్ కు ఎంత కష్టం ?- ఫుడ్ ట్రక్కులో దాక్కుని-తన విమానం వదిలేసి..!స్వదేశంలో తిరుగుబాటు దళాల ముట్టడితో 2024 డిసెంబర్లో బషర్ అల్ అస్సాద్ ప్రభుత్వం పూర్తిగా కుప్పకూలింది. దీంతో దేశాన్ని వదిలి పారిపోయిన అస్సాద్‌కు రష్యా ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. డమాస్కస్ నగరాన్ని విపక్ష దళాలు స్వాధీనం చేసుకునే క్రమంలో ఆయన ప్రత్యేక విమానంలో మాస్కోకు పారిపోయారు. అప్పటి నుంచి ఆయన తన కుటుంబంతో కలిసి రష్యాలోనే ఉంటున్నారు. ఈ కేసులో దోషిగా తేలిన అతెఫ్ నజీబ్.. సిరియా విప్లవానికి మూలకేంద్రమైన దేరా ప్రావిన్స్‌లో అత్యంత క్రూరమైన అధికారిగా ముద్రపడ్డారు. శాంతియుతంగా నిరసనలు వ్యక్తం

టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. 2000లో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎస్సీఏ) నుంచి తనను బయటకు పంపడానికి దారితీసిన ఘటనపై తాజాగా స్పందించాడు. ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. 2000లో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎస్సీఏ) నుంచి తనను బయటకు పంపడానికి దారితీసిన ఘటనపై తాజాగా స్పందించాడు. ఎన్సీఏలో శిక్షణ పొందిన తొలి బ్యాచ్ ఆటగాళ్లలో హర్భజన్ కూడా ఉన్నాడు. బీసీసీఐలో తమ మాటకు ఎదురు చెప్పేవారిని సహించలేని కొందరు ఉండేవారని భజ్జీ ఆరోపించాడు. డైట్ చార్ట్‌ను అనుగుణంగా ఆహారం అందించకపోవడంతో ప్రశ్నించానని.. అందుకే తనను ఎన్సీఏ నుంచి పంపించేశారని వెల్లడించాడు. 1998లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన భజ్జీ.. అతడి కెరీర్లో 600 వికెట్లు తీశాడు. 2016లో క్రికెట్‌కు గుడ్‌బై చేప్పాడు. తాజాగా భజ్జీ ఓ ఇంటర్వ్యూలో నాటి రోజుల గురించి మాట్లాడాడు. ‘అప్పట్లో ఎన్సీఏలో ఆటగాళ్ల కోసం ప్రత్యేక డైట్ చార్ట్ ఏర్పాటు చేశారు. అయితే అందుకు అనుగుణంగా ఆహారం అందించేవారు కాదు. అక్కడి ఆహారం కూడా సరిగ్గా ఉండేది కాదు. డైట్ చార్ట్ ప్రకారం భోజనం పెట్టాలని పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. దీంతో ఒకరోజు బాగా కోపమొచ్చింది. వెంటనే వెళ్లి ఆ డైట్ చార్ట్ చించేశా. నేను చేసిన ఏకైక తప్పు అదే. దీంతో నన్ను ఎస్సీఏ నుంచి బయటకు పంపించేశారు. నేను నా హక్కుల కోసం పోరాడా. నేను ప్రశ్నించకపోతే ఇప్పటికీ అదే డైట్ చార్ట్ ఉండేది. అదే ప్లాన్ కొనసాగేది. నేను ప్రశ్నించినందుకే నాపై చర్యలు తీసుకున్నారు. డైట్ ప్లాన్ మాత్రం మారింది. నన్ను బయటకు పంపడం వేరే విషయం. కానీ ఇందులో నా తప్పేమీ కాదు. ప్రశ్నించడం నా హక్కు

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి తీవ్రమైన బెదిరింపులు ఎదురయ్యాయి. తనను, తన భార్య డోనా గంగూలీని చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు హెచ్చరిక లేఖలు పంపారని, దీనిపై దాదా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన క్రీడా వర్గాల్లో, కోల్‌కతాలో తీవ్ర కలకలం రేపింది.సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఆరు నెలలుగా గంగూలీ పేరు మీద ఈ బెదిరింపు లేఖలు వస్తున్నాయి. అయితే, వాటిని తొలుత అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, నిన్న తన కార్యాలయానికి అందిన రెండు లేఖల్లో "నిన్ను, నీ భార్యను చంపేస్తాం. నీకు సన్నిహితంగా ఉండేవారికి హాని తలపెడతాం" అని స్పష్టంగా ఉండటంతో గంగూలీ అప్రమత్తమయ్యాడు. వెంటనే తన మేనేజర్ ద్వారా కోల్‌కతాలోని ఠాకూర్‌పుకుర్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయించాడు.గంగూలీ ఫిర్యాదును తీవ్రంగా పరిగణిస్తున్నామని, వెంటనే దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఈ లేఖల మూలాలను, వాటిని పంపిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. లేఖల కంటెంట్‌తో పాటు వాటిని పంపిన విధానంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు ఓ అధికారి వివరించారు. ఈ లేఖలన్నీ ఒకే వ్యక్తి పంపాడా? లేక దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ప్రాథమిక విచారణలో కీలక సమాచారం లభించినట్టు తెలుస్తోంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బెల్ఘరియా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొరియర్ సర్వీస్ ద్వారా ఈ లేఖలను పంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు సీబీసీఐడీకి బదిలీ చేయాలని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు సూచించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు ఈ-మెయిల్లో తెలిపారు. హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు (Uday Krishna Reddy case) సీబీసీఐడీకి బదిలీ చేయాలని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు (Nageswara Rao) సూచించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు ఈ-మెయిల్లో తెలిపారు. ఈ కేసును సీబీసీఐడీ లేదా మరో స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని విజ్ఞ చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టుపై పలు కీలక ప్రశ్నలను నాగేశ్వరరావు లేవనెత్తారు. పోష్ చట్టం కింద అంతర్గత విచారణ పూర్తికాకముందే అరెస్టు ఎందుకు చేశారని నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టు సమయంలో నిందితుడు దర్యాప్తునకు సహకరించరా?, సాక్షులను ప్రభావితం చేస్తాడా?, పరారయ్యే అవకాశముందా? వంటి అంశాలను పరిశీలించారా అని నిలదీశారు. తొలుత బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుల్లో అత్యాచారం, హత్యాయత్నం ఆరోపణలు లేవని ప్రస్తావించారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తీవ్ర ఆరోపణలు చేర్చారని పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ స్వయంగా ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించారని ఆరోపణలపై ప్రశ్నించారు. ఈ కేసు దర్యాప్తుపై తలెత్తిన అనుమానాలకు స్వతంత్ర విచారణతోనే తెరపడుతుందని డీజీపీకి సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు
ఒంగోలులో కూటమి నేతలు మరోసారి రచ్చకెక్కారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ - మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాటల యుద్ధంతో మరోసారి ఒంగోలు హీటెక్కింది. బాలినేని వర్సెస్ దామచర్ల ఎపిసోడ్‌కు బ్రేక్ పడింది అని అందరూ అనుకున్నా.. తాజాగా ఒకరిపై మరొకరు వార్నింగ్‌లు ఇచ్చుకోవడంతో కూటమిలో కుమ్ములాట మరోసారి బహిర్గతమైంది. జనసేనలో చేరకుంటే బాలినేని ఎప్పుడో జైలుకు వెళ్లేవారని జనార్దన్ అంటే.. ఎమ్మెల్యే అయితే ఎవ్వర్నీ వదిలిపెట్టనంటూ బాలినేని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. బాలినేని చేసిన తప్పుల్ని ముద్రిస్తే పుస్తకాలే సరిపోవని దామచర్ల జనార్దన్ అంటే.. దామచర్ల చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయించాలంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో చేసినట్లు రౌడీయిజం చేస్తే ఎవ్వరూ ఒప్పుకోరని బాలినేని టార్గెట్‌గా దామచర్ల వ్యాఖ్యలు చేశారు. అయితే, తన వర్గం మనుషులను టార్గెట్ చేసి అరెస్టు చేయిస్తున్నారంటూ బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకర్ల సమావేశం పెట్టి మరీ ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకున్నారు."బాలినేని చేసిన తప్పులు ముద్రిస్తే కరపత్రాలే కాదు.. పుస్తకాలూ సరిపోవు. అమావాస్య, పౌర్ణమికి ఓసారి ఒంగోలు వస్తారు. నాపై వ్యక్తిగతం ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారు. కూటమిలో ఉన్నారని మౌనంగా ఉన్నా.. జనసేనలోకి వెళ్లకుండా ఉంటే అతను చేసిన పాపాలకు జైలుకు వెళ్లేవారు. బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి విద్యార్థులకు గంజాయి అలవాటు చేశారు. ఒంగోలులోనే ఉండాలని వెయ్యి సార్లు చెప్పా. గత ప్రభుత్వం బారు షాపులు సిండికేట్ చేసి బాలినేని, ఆయన కుమారుడు కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ అక్రమాలపై కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు వస్తా, మీరు వస్తారా?" అంటూ దామచర్ల జనార్దన్ సవాల్ విసిరారు."నా అనుచరులపై అక్రమ కేసులు పెట్టి దామచర్ల వేధిస్తున్నారు.. మళ్లీ నేను ఎమ్మెల్యే అయితే ఎవ్వర్నీ వదిలిపెట్టను. వచ్చే ఎన్నికల్లో నాతో పాటు నా కుమారుడు కూడా పోటీ చేస్తాడు. ఐదారు నెలల కిందట ఎమ్మెల్యే, ఆయన కుటుంబంపై

Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో మృతిచెందిన ఓ టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆమె వెళ్తున్న సమయంలో ప్రయాణిస్తున్న వాహనాన్ని నిరసనకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మమతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘చోర్’ అంటూ విమర్శలు చేసినట్లు సమాచారం. అనంతరం ఆమె కారుపై బురద, చెప్పులు, రాళ్లు, ఇటుకలు విసిరినట్లు తెలుస్తోంది. బిర్జూ అనే టీఎంసీ కార్యకర్తను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు కస్టడీలో ఉన్న సమయంలోనే అతడు మృతి చెందాడు. తన భర్తను లాకప్‌లో పోలీసులు కొట్టడం వల్లే మరణించారని బిర్జూ భార్య ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మమతా బెనర్జీ అక్కడికి బయలుదేరారు. ఆమె వెంట టీఎంసీ ఎంపీలు కల్యాణ్ బెనర్జీ, డోలా సేన్ కూడా ఉన్నారు. Read Also : Moto G06 Power Price : ఇది కదా డిస్కౌంట్.. ఈ మోటోరోలా G06 పవర్ ఫోన్ జస్ట్ రూ. 14వేలకే.. ఘటనపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. తన కారుపై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారని, చెప్పులు, బురద కూడా విసిరారని ఆరోపించారు. రాయి తలకు తగిలి ఉంటే తన ప్రాణాలకు ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాను వస్తున్న విషయం పోలీసులకు ముందుగానే తెలిసినా తగిన భద్రత కల్పించలేదని ఆరోపించారు. తనను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని, దీని వెనుక కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. మరోవైపు బీజేపీ మాత్రం మమతా బెనర్జీ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఉద్రిక్తతలను పెంచేందుకే ఆమె అక్కడికి వెళ్లారని విమర్శించింది. ఆమె రాకను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారని పేర్కొంది. దీంతో టీఎంసీ కార్యకర్త మృతి వ్యవహారం మరోసారి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది
చెక్ బౌన్స్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కి హైదరాబాద్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన రూ.34.23 లక్షల విలువైన చెక్ చెల్లకపోవడంతో నమోదైన క్రిమినల్ కేసులో ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. ఆగస్ట్ 7వ తేదీన హైదరాబాద్‌లోని ఫస్ట్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ మున్సిపల్ కోర్టు జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ్ ఈ తీర్పును వెలువరించారు. ఈ చెక్ బౌన్స్ కేసును ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఇంటెల్లిడెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున దాని ప్రతినిధి 2015లో దాఖలు చేశారు.2015కు ముందు రోహిత్ రెడ్డి ఆ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న సమయంలో సంస్థ వనరులతోపాటు.. సిబ్బందిని తన పర్సనల్ బిజినెస్ వ్యవహారాలకు వినియోగించారని.. దానివల్ల కంపెనీకి ఆర్థిక నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో ఆ సంస్థ ఆరోపించింది. కంపెనీ యాజమాన్యానికి ఈ వ్యవహారం తెలిసిన తర్వాత రోహిత్ రెడ్డిని ప్రశ్నించారని.. ఆ తర్వాత అడ్వైజరీ ఫీజు మొత్తాన్ని చెల్లించేందుకు ఆయన అంగీకరించినట్లు కోర్టు తీర్పులో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే 2014 ఫిబ్రవరి 7వ తేదీన సంస్థ డైరెక్టర్ పదవికి పైలట్ రోహిత్ రెడ్డి రాజీనామా చేసినట్లు వెల్లడించింది.ఆ తర్వాత ఆర్థిక బకాయిల పరిష్కారానికి ఒప్పందం కుదిరిందని.. మొత్తం రూ.34.23 లక్షలు చెల్లించేందుకు అంగీకరించిన పైలట్ రోహిత్ రెడ్డి 2014 ఆగస్టు 1వ తేదీన అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తీర్పులో ఉంది. ఈ మొత్తానికి సంబంధించి 2014 సెప్టెంబర్ 25వ తేదీన రోహిత్ రెడ్డి చెక్ జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. అయితే ఆ చెక్ 2014 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య 3 సార్లు బ్యాంకులో సమర్పించగా.. అకౌంట్లో తగినంత నిధులు లేకపోవడంతో క్లియర్ కాలేదని తెలిపింది. ఆ తర్వాత బకాయి మొత్తాన్ని చెల్లించాలని కోరుతూ పంపించిన న్యాయపరమైన నోటీసును స్వీకరించేందుకు రోహిత్ రెడ్డి నిరాకరించినట్లు ఫిర్యాదుదారు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో 2015లో క్రిమినల్

ఏపీ రాజకీయాల్లో గతంలో యాక్టివ్ గా ఉండి, వైసీపీ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా పనిచేసిన విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఆ తర్వాత ఆ పార్టీ అధికారం కోల్పోగానే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. అనంతరం బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించి .. అది కూడా సాధ్యం కాక తిరిగి రాజకీయాల్లో సొంత పార్టీ ద్వారా ఎంట్రీ ఇచ్చేందుకు సాయిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత ఎక్కువ తనపై అటెన్షన్ ఉండేలా చూసుకుంటున్నారు.UPI పేమెంట్స్ పై ఛార్జీలు ? కేంద్రానికి సాయిరెడ్డి హెచ్చరికలు..!ఇదే క్రమంలో ఆయన ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉన్న జెన్ జీ(Gen Z)పై సానుభూతి ప్రదర్శించాల్సిన అవసరం ఉందంటూ ఓ ట్వీట్ చేశారు. ఇందుకు గల కారణాలను కూడా విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో వెల్లడించారు. ఈ సందర్భంగా సాధారణంగా చర్చకు రాని పలు విషయాన్ని కూడా సాయిరెడ్డి బయటపెట్టారు. ఆయా కారణాలతో వారి మాటల్ని సానుభూతితో వినాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ తేల్చేశారు. 2.5 లక్షలకు PPF లిమిట్ ?- ఆర్థికమంత్రికి సాయిరెడ్డి కీలక ప్రతిపాదన..!మనం మన Gen Z మాటలను సానుభూతితో వినాలని సాయిరెడ్డి కోరారు. వారు అనిశ్చిత ఉద్యోగాలు, అందుబాటులో లేని ఇళ్లు, క్షీణిస్తున్న పర్యావరణం, కొరతగా ఉన్న వనరులు, ఉమ్మడి కుటుంబం, స్నేహం వంటి బలహీనపడుతున్న మద్దతు వ్యవస్థలతో కూడిన ప్రపంచాన్ని వారసత్వంగా పొందుతున్నారని సాయిరెడ్డి తెలిపారు. వారికి ఆశ, అవకాశాలు, వారి ఆందోళనలను తీవ్రంగా పరిగణించే విధానకర్తలు అవసరమన్నారు. తాను ఆ గొంతుకలలో ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నానని తన మనసులో మాటను కూడా సాయిరెడ్డి బయటపెట్టేశారు. తద్వారా తనను తాను జెన్ జీకి మద్దతుదారుడినని చెప్పుకునే ప్రయత్నం చేశారు

బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి హైదరాబాద్ కోర్టులో చుక్కెదురైంది. దాదాపు దశాబ్ద కాలం నాటి చెక్ బౌన్స్ కేసులో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ, న్యాయస్థానం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.ఇంటెల్లిడెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు సంబంధించిన రూ. 34.23 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఈ తీర్పు వెలువడింది. 2015లో రోహిత్ రెడ్డి ఆ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్న సమయంలో, సంస్థ వనరులను తన వ్యక్తిగత వ్యాపారాలకు వినియోగించి నష్టం కలిగించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వివాద పరిష్కారానికి ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా 2014 సెప్టెంబర్ 25న రోహిత్ రెడ్డి సదరు సంస్థకు చెక్కును అందజేశారు.అయితే, ఖాతాలో సరిపడా నిధులు లేకపోవడంతో ఆ చెక్ 2014 అక్టోబర్, డిసెంబర్ మధ్య మూడుసార్లు బౌన్స్ అయింది. దీనిపై సంస్థ పంపిన లీగల్ నోటీసులకు రోహిత్ రెడ్డి స్పందించకపోవడంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన హైదరాబాద్ మొదటి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (మున్సిపల్ కోర్టు), నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 కింద రోహిత్ రెడ్డిని దోషిగా నిర్ధారించింది.తీర్పు వెలువడే సమయంలో రోహిత్ రెడ్డి కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన అనంతరం శిక్షాకాలాన్ని ఖరారు చేయనున్నారు

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నల్లబెల్లికి రానున్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సోమవారం పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ సందర్భంగా నల్లబెల్లిలో నిర్వహించే సంతాప సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నారు. తెలంగాణ ఉద్యమానికి పెద్ది చేసిన సేవలను నేతలు ఈ సందర్భంగా స్మరించుకోనున్నారు