
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరంగా అత్యధిక కాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సేవలందిస్తున్నారని వ్యాఖ్యానించారు.
అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు (Nirmala Sitharaman) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరంగా అత్యధిక కాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సేవలందిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత ఆర్థిక ప్రస్థానం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు.
భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది..
నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. నారీ శక్తికి ప్రతీకగా నిర్మలా సీతారామన్ ప్రస్థానం కొనసాగుతోందని కితాబు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆర్థిక ప్రగతికి ఆమె సకాల సహకారం అందిస్తున్నారని కొనియాడారు. నిర్మలా సీతారామన్‌కు అమ్మ దుర్గ ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యం, శక్తి, దీర్ఘాయువు కలగాలని ఆకాంక్షించారు. దేశ సేవలో నిర్మలా సీతారామన్ మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని పవన్ కల్యాణ్ అభిలాషించారు.
నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం
అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Read Latest AP News And Telangana News And National News





