
Infinix Hot 70 Pro 5G : ఈ ఫోన్లో అద్భుతమైన ఫీచర్ ఉంది. బ్యాక్ సైడ్ యాక్టివ్ మ్యాట్రిక్స్ క్యూబ్ (AMC). ఇన్కమింగ్ కాల్స్, మెసేజ్‌లు, ఛార్జింగ్, బ్యాటరీ అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.. పూర్తి ఆఫర్ల వివరాలివే..

Vivo Y400 5G : మీరు వివో Y400 5జీని ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1600 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. పూర్తి ఆఫర్ వివరాలివే..

Bank of Baroda Recruitment 2026 : బ్యాంకులో ఉద్యోగం కావాలా? ఈ బ్యాంకులో 1,100 రెగ్యులర్ పోస్టులు ఖాళీగా ఉండగా భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. వెల్త్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ అనలిస్ట్ పోస్టులకు సెప్టెంబర్ 24 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.

మారుతి బాలెనో ఫేస్ లిఫ్ట్ ధర రూ.6.10 లక్షలు !

Couple kills finance firm manager | రూ.6 లక్షల రుణం నుంచి తప్పించుకునేందుకు.. ఫైనాన్స్ సంస్థ మేనేజర్‌ను హత్య చేసిన జంట
ఈవారం డివిడెండ్ ఇస్తోన్న 150 కంపెనీలు.. లిస్టులో కల్యాణ్ జువెలర్స్, IREDA.. ఒక్కో షేరుకు రూ.60 వరకు చెల్లింపు!

OnePlus Nord CE 6 : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కొంటున్నారా? క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 4 ప్రాసెసర్‌తో కొత్త ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఈ అద్భుతమైన ఆఫర్ మీకోసమే.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఈ ఫోన్ 8000mAh బ్యాటరీతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ధర తగ్గింపుతో మొత్తంగా రూ. 35వేల కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6పై తగ్గింపులు, ఆఫర్లు, ధర వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ధర, ఆఫర్లు : వన్‌ప్లస్ నార్డ్ సీఇ 6 ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 36,920 ధరకు లిస్టు అయింది. బ్యాంక్ ఆఫర్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్డులపై రూ. 34,720 తగ్గింపు పొందవచ్చు. దాంతో ధర రూ. 29,250కు తగ్గుతుంది. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ. 29,250 వరకు తగ్గించవచ్చు. కానీ, ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్ బట్టి రేటు ఉంటుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6లో 6.78-అంగుళాల 1.5K ఎఫ్‌హెచ్‌డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉంది. రిజల్యూషన్ 2772×1272 పిక్సెల్స్, 144Hz రిఫ్రెష్ రేట్, 450ppi పిక్సెల్ డెన్సిటీ, 19.6:9 యాస్పెక్ట్ రేషియో, 3840Hz పీడబ్ల్యుఎం డిమ్మింగ్, 3600 నిట్స్ వరకు బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ అడ్రినో 810 జీపీయూతో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. Read Also : Redmi 17 5G Launch : వారెవ్వా.. కొత్త రెడ్మి 17 5G ఫోన్ అతి చౌకైన ధరలో.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే? వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 16పై రన్ అవుతుంది. కొలతలు 16.25 సెం.మీ

Womens Asia Cup 2026 : మహిళల ఆసియాకప్ 2026లో భాగంగా దుబాయ్ వేదికగా హాంగ్‌కాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన (124 ; 64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో చెలరేగింది. ఈ క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. దీంతో హాంగ్‌కాంగ్ ముందు 194 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. HUNDRED! 💯 Vice-Smriti Mandhana brings up her second T20I century 🥳 Updates ▶️ | #INDvHK — BCCI Women (@BCCIWomen) September 3, 2026 Rohit Sharma : మీటింగ్‌కు రాని అజిత్ అగార్కర్.. రోహిత్ శర్మ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక వ్యాఖ్యలు.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ (28; 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు తొలి వికెట్‌కు శుభారంభాన్ని అందించారు. 7.6 ఓవర్లలో 74 పరుగులు జోడించారు. వేగంగా ఆడే క్రమంలో షఫాలీ ఔటైంది. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రతీకా రావల్ (10), రిచా ఘోష్ (11), హర్మన్‌ప్రీత్ కౌర్(10) విఫలమైనప్పటికి కూడా మరో ఎండ్ స్మృతి మంధాన తనదైన శైలిలో దూకుడుగా ఆడింది. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బౌండరీ వరద పారించింది. 57 బంతుల్లోనే సెంచరీ సాధించింది. టీ20ల్లో మంధానకు ఇది రెండో శతకం. సెంచరీ తరువాత కూడా స్మృతి దూకుడుగా ఆడింది. ఆఖరి ఓవర్లో రనౌట్ అయింది. స్మృతి రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. హాంగ్ కాంగ్ బౌలర్లలో మరీనా లాంప్లో రెండు వికెట్లు తీసింది. రుచిత వెంకటేష్, జోయిలీన్ కౌర్‌లు చెరో ఓ వికెట్ సాధించారు

ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్‌గా మోహిత్ జైన్ ఎన్నికయ్యారు. బెన్నెట్ కోల్మన్ అండ్ కో లిమిటెడ్ (బీసీసీఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పబ్లిషింగ్), బోర్డు... న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్‌గా మోహిత్ జైన్ ఎన్నికయ్యారు. బెన్నెట్ కోల్మన్ అండ్ కో లిమిటెడ్ (బీసీసీఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పబ్లిషింగ్), బోర్డు సభ్యుడిగా ఉన్న మోహిత్ జైన్ 2026-27 సంవత్సరానికి గాను ఏబీసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 43 ఏళ్ల తర్వాత బీసీసీఎల్‌కు చెందిన ప్రతినిధి మరోసారి ఏబీసీ చైర్మన్ పదవిని చేపట్టినట్లయింది. ప్రింట్ మీడియా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న మోహిత్ జైన్.. ప్రచురణ, వ్యాపార కార్యకలాపాలు, పరిశ్రమ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కెమికల్ ఇంజనీరింగ్‌తో పాటు ఎంబీఏ చదివిన జైన్.. 2021-22లో ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) అధ్యక్షుడిగా సేవలందించారు. రెండు దశాబ్దాలకు పైగా ఐఎన్ఎ్సతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రపంచ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ గ్లోబల్ సూపర్వైజరీ బోర్డులోనూ మోహిత్ జైన్ మూడేళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ దక్షిణాసియా విభాగం బోర్డు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కాగా, ఏబీసీ డిప్యూటీ చైర్మన్‌గా విక్రమ్ సఖుజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

ఇంటర్నెట్ డెస్క్: బంగారం అక్రమ రవాణా (Gold Smuggling)కు స్మగ్లర్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా కేరళంలోని ఓ విమానాశ్రయంలో 8 నెలల చిన్నారిని స్మగ్లింగ్‌కు ఉపయోగించుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. శిశువు డైపర్‌లో దాదాపు రూ.50లక్షల విలువైన బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆ ‘నవ్వే’.. పదేళ్లకు అతణ్ని కుటుంబంతో కలిపింది! యూఏఈలోని రస్ అల్ ఖైమా విమానాశ్రయం నుంచి మలప్పురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి కరిపుర్ (కాలికట్) అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు.. ఎనిమిది నెలల శిశువు, మరో ఇద్దరు చిన్నారులతో వచ్చిన సదరు వ్యక్తిని అడ్డుకున్నారు. తనిఖీ చేయగా శిశువు డైపర్‌లో రూ.50లక్షల విలువైన బంగారంతోపాటు అతడి వద్ద మరింత బంగారం లభించింది. మొత్తం విలువ రూ.కోటి ఉంటుందని అంచనా వేశారు. బంగారం స్మగ్లింగ్ మూలాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు.. శిశువును ఉపయోగించి గతంలో ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. లఖ్‌నవూలో మాజీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ నివాసం సమీపంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది

HDFC బ్యాంక్ రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా వడ్డీ రేటును పెంచింది. 3 సంవత్సరాల 1 రోజు నుంచి 4 సంవత్సరాల 7 నెలల లోపు కాలపరిమితి ఉన్న FDలపై వడ్డీని 0.10 శాతం పెంచింది. గతంలో ఈ కాలపరిమితిలో సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీ లభించేది. ఇప్పుడు దానిని 7.10 శాతానికి పెంచారు. ఈ కొత్త రేట్లు ఆగస్టు 19 నుంచి అమల్లోకి వచ్చినట్లు సమాచారం. HDFC బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్లకు FD కాలపరిమితిని బట్టి 3.25 శాతం నుంచి గరిష్టంగా 7.10 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. అలాగే 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న FDలపై 6.65 శాతం వడ్డీ అందుతోంది. సాధారణ కస్టమర్లకు గరిష్టంగా 6.50 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. ఫెడరల్ బ్యాంక్ కూడా రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. కొత్త రేట్ల ప్రకారం సీనియర్ సిటిజన్లకు కాలపరిమితిని బట్టి 3.50 శాతం నుంచి గరిష్టంగా 7.20 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. ఫెడరల్ బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్లకు అందుతున్న కొన్ని ముఖ్యమైన FD వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 7 నుంచి 29 రోజులకు 3.50%గా ఉండగా, 30 నుంచి 45 రోజులు 3.75%, 46 నుంచి 90 రోజులకు 4.75%, 91 నుంచి 180 రోజులకు 5%, 181 రోజులకు 6.50%, ఏడాదికి 6.75%, 1 సంవత్సరం కంటే ఎక్కువ నుంచి 15 నెలల లోపు 6.90%, 15 నెలలకు గాను 7.15%, 15 నుంచి 24 నెలలకు 6.90%, 24 నెలల కంటే ఎక్కువ నుంచి 48 నెలల లోపు పెట్టుబడికి 7%, 48 నెలలకు 7.20% వడ్డీ లభిస్తుంది. అదే 48 నెలల కంటే

గ్లోబల్ ఇన్వెస్టర్లు తిరిగి భారత మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల్లోనే ఏకంగా 49 కొత్త ఎఫ్‌పీఐలు సెబీలో నమోదు కావడం విశేషం. ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 2: భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPI) కొనుగోళ్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు పకడ్బందీ వ్యూహంతో తిరిగి భారత మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల్లోనే(జూలై-ఆగస్టు) ఏకంగా 49 కొత్త ఎఫ్‌పీఐలు సెబీ(SEBI)లో నమోదు కావడం విశేషం. పెరిగిన ఎఫ్‌పీఐల సంఖ్య: 2026 మొదటి ఆరు నెలల్లో (జనవరి-జూన్) 52 ఎఫ్‌పీఐలు మాత్రమే నమోదవగా, జులై, ఆగస్టు నెలల్లో ఆ సంఖ్య 49కి చేరింది. దీంతో భారత మార్కెట్లలో మొత్తం ఎఫ్‌పీఐల సంఖ్య 12,243కి పెరిగింది. మళ్లీ నెట్ బైయర్లు: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ. 2 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించిన విదేశీ పెట్టుబడిదారులు, జులై, ఆగస్టు నెలల్లో భారీగా కొనుగోళ్లు జరిపారు. జులైలో రూ.40,031 కోట్లు, ఆగస్టులో రూ.25,492 కోట్ల విలువైన సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. నెలవారీ సగటు: ఈ ఏడాది ఆరంభంలో నెలకు సగటున కేవలం 8 కొత్త ఎఫ్‌పీఐలు నమోదు కాగా, గత రెండు నెలల్లో ఆ వేగం పెరిగి నెలకు 25 కొత్త ఫండ్లు నమోదు కావడం గమనార్హం. విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో పలు కీలక సడలింపులు, నిర్ణయాలు ప్రకటించింది. 1. పన్ను మినహాయింపులు(Tax Exemptions): జూన్ 5న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సెక్యూరిటీలలో(G-Secs) పెట్టుబడి పెట్టే ఎఫ్‌పీఐలకు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, వడ్డీ ఆదాయంపై పూర్తి పన్ను మినహాయింపును ప్రకటించింది. 2. FAR రూట్ విస్తరణ: లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు, గ్లోబల్ పెన్షన్ ఫండ్లు, సోవరిన్ వెల్త్ ఫండ్లను ఆకర్షించడానికి 15, 30, 40 ఏళ్ల జారీలతో

90ల్లో పుట్టి పెరిగిన చాలామంది ఇప్పుడు 30స్లో ఉన్నారు. వీళ్లంతా చిన్నతంలో హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు చూస్తూ పెరిగారు. అయితే 'మమ్మీ' ఫ్రాంచైజీ వీళ్లని చాలానే భయపెట్టింది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే పలు భాగాలు రిలీజయ్యాయి. కానీ అవన్నీ అడ్వెంచర్ కామెడీ తరహాలో తెరకెక్కాయి. ఈ ఏడాది ఈ జానర్ నుంచి హారర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఓ మూవీ వచ్చింది. అదిప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రకటన చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) లీ క్రోనిన్ దర్శకత్వం వహించిన 'ద మమ్మీ' సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. హారర్ సినిమా లవర్స్‌ని ఆకట్టుకుని పర్లేదనిపించింది. అనంతరం మే నెలలో విదేశాల వరకు అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో అద్దె విధానంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మన దేశంలో మాత్రం ఈ నెల 17 నుంచి హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చూడొచ్చు. 'ద మమ్మీ 2026' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తన కూతురు తిరిగి రావడం చూసి ఓ కుటుంబం చాలా ఆనందపడుతుంది. కానీ ఆమెలో ఉన్న రాక్షస శక్తులు సదరు కుటుంబాన్ని దారుణంగా ఇబ్బంది పెడతాయి. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో హారర్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా భయపెట్టేలా ఉన్నాయి. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్‌లో పెట్టుకుంటే.. మళ్లీ

దులీప్ ట్రోఫీ2026లో భాగంగా అద్భుత ప్రదర్శన చేసిన కెప్టెన్ తిలక్ వర్మ తన జట్టు సౌత్ జోను ఒంటిచేత్తో ఫైనల్ చేర్చాడు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. స్పోర్ట్స్ డెస్క్: దులీప్ ట్రోఫీ2026లో భాగంగా అద్భుత ప్రదర్శన చేసిన కెప్టెన్ తిలక్ వర్మ తన జట్టు సౌత్జోను ఒంటిచేత్తో ఫైనల్ చేర్చాడు. నార్త్ జోన్‌తో జరిగిన సెమీ ఫైనల్లో సౌత్ జోన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జట్టును విజయపథంలో నడిపించిన తిలక్ వర్మ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు సొంతం చేసుకున్నాడు. ప్రజంటేషన్ సందర్భంగా తిలక్ వర్మ టెస్ట్ క్రికెట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘రెడ్ బాల్ క్రికెట్ ఆడడాన్ని ఎంతో ఇష్ట పడుతా. నాకు టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. వైట్‌బాల్ క్రికెట్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానని నేనెప్పుడు కల కనలేదు. అదంతా దేవుడే ప్లాన్ చేశాడని భావిస్తున్నాను. తొలుత టీ20ల ద్వారా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన నేను తర్వాత వన్డే క్రికెట్ కూడా ఆడాను. కానీ టెస్ట్ క్రికెట్లో నా బలాన్ని నిరూపించుకోవాలని ఎదురుచూస్తున్నా' అని తిలక్ పేర్కొన్నాడు. 'ఎప్పటికైనా భారత టెస్టు క్రికెట్ జట్టులో ఆడాలన్నదే నా కల. అది త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నాను. ఐపీఎల్ కారణంగా వైట్‌బాల్ క్రికెట్లో టీమిండియాకు ఎంపికయ్యాను. కానీ ఐపీఎల్‌కు రాకముందే రెడ్ బాల్ క్రికెట్లో చాలా కష్టపడ్డాను. అందుకే టెస్టు క్రికెట్ ఆడడాన్ని ప్రేమించడంతో పాటు ఎంజాయ్ చేస్తాను. రంజీ ట్రోఫీ ఆడాలనుకుంటున్నప్పటికీ అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా అదీ జరగడం లేదు. అందుకే అవకాశం వచ్చినప్పుడే టెస్ట్ క్రికెట్లో వీలైనంత మేర రాణించాలని భావించాను' అని తిలక్ వెల్లడించాడు. కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. నలుగురి బెయిల్ పిటిషన్ల డిస్మిస్

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. YSR Awards 2026: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ఒక కోరిక తీరకుండానే మరణించాడని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ఆయన జీవిత లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఆ కోరిక తీరలేదని చెప్పారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్‌కు నిజమైన నివాళి అని ప్రకటించారు. దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ ఆశయాల సాధనకు తాము పనిచేస్తామని తెలిపారు. ఢిల్లీలో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026 కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. 'రైతులకు ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేసిన గొప్ప వ్యక్తి వైఎస్సార్. ఆనాడు రూ.1,300 కోట్లు విద్యుత్ బకాయిలు రద్దు చేసి.. రైతులపై కేసులు ఎత్తివేసి రైతుల గుండెల్లో వైఎస్సార్ రారాజుగా నిలిచారు' అని రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణలో సాగునీరు అందిచేందుకు ప్రాణహిత చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రారంభించిన ఘనత వైఎస్సార్‌ది' అని వివరించారు. ఆనాడు వైఎస్సార్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్బీసీ ఆగిపోయాయని.. ఆయన ఆశయాలను నూటికి నూరు శాతం కొనసాగిస్తామని ప్రకటించారు. 'వైఎస్సార్ చివరి కోరిక ఇంకా నెరవేరలేదు. ఆయన రెండోసారి ప్రమాణస్వీకారం చేశాక ఒకే ఒక్క మాట చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఆయన జీవిత లక్ష్యం అని ఒకే ఒక్క మాట చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్‌కు నిజమైన నివాళి. ఆయన చివరి కోరిక నెరవేర్చాలంటే రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని

ప్రముఖ రైడ్ హైలింగ్ కంపెనీ ఉబర్ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో సుమారు 3,300 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ రైడ్ హైలింగ్ కంపెనీ ఉబర్ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో సుమారు 3,300 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతానికి సమానం. మేనేజ్మెంట్ స్థాయిలను తగ్గించడం, సంస్థాగత నిర్మాణాన్ని సరళీకరించడం, భవిష్యత్ వ్యాపారాలపై పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది (Uber layoffs 2026). గత ఏడాది చివరి నాటికి ఉబర్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజా లేఆఫ్స్‌తో ఉద్యోగుల సంఖ్య 30 వేల కంటే దిగువకు చేరనుంది. 2021లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య ఏ స్థాయిలో ఉందో దాదాపు అదే స్థాయికి ఇప్పుడు చేరనుంది. కోవిడ్ మహమ్మారి తర్వాత ఉబర్ చేపడుతున్న అతిపెద్ద ఉద్యోగాల కోత ఇదే. 2020 మేలో కరోనా కారణంగా రైడ్ హైలింగ్ డిమాండ్ కుప్పకూలడంతో కంపెనీ సుమారు 6,700 ఉద్యోగాలను తొలగించింది (Uber job cuts). ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కంపెనీలోని మేనేజర్ల సంఖ్యను 20 శాతం తగ్గించనున్నారు (Uber manager layoffs). అయితే వీరందరూ ఉద్యోగాలు కోల్పోతారని కాదు. కొంతమంది మేనేజర్లను మేనేజ్మెంట్ బాధ్యతల నుంచి తొలగించి వేరే పాత్రల్లోకి మార్చనున్నారు. ఉద్యోగాల కోత మాత్రం మేనేజర్లకే పరిమితం కాకుండా ఇతర ఉద్యోగులపైనా ప్రభావం చూపనుంది. సంస్థను మరింత సరళంగా, వేగంగా మార్చడమే తాజా పునర్వ్యవస్థీకరణ లక్ష్యమని ఉబెర్ సీఈవో దారా ఖోస్రోషాహి తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

560GHz బ్యాండ్‌తో ఈ 112 Gbps స్పీడ్ 5జీ టెక్నాలజీతో పోలిస్తే 20 రెట్లు వేగం భారీ ఫైల్స్‌ను వేగంగా డౌన్లోడ్ చేయొచ్చు Japan 6G Device : 5G కాదు.. 6G వస్తోంది.. ఇక సెకన్లలో కాదు.. క్షణాల్లో భారీ డేటా ట్రాన్స్ ఫర్ చేయొచ్చు.. ఇటీవలే కొత్త కమ్యూనికేషన్ టెక్నాలజీపై జపాన్ సంచలన ప్రయోగం చేసింది. టోకుషిమా యూనివర్సిటీ రీసెర్చర్లు 560GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో ఏకంగా 112Gbps డేటా ట్రాన్స్మిషన్ సాధించారు. ఈ సక్సెస్ 6G భవిష్యత్తుపై భారీ అంచనాలను పెంచుతోంది. దాంతో 6జీ టెక్నాలజీపై మళ్లీ ఆసక్తి పెరుగుతోంది. 5జీ కన్నా 20 రెట్లు స్పీడ్? : ఈ ప్రయోగంలో సాధించిన 112Gbps స్పీడ్ అనేది ప్రస్తుతం వినియోగంలో ఉన్న 5జీ టెక్నాలజీతో పోలిస్తే భవిష్యత్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఎంత వేగంగా ఉండొచ్చో చెప్పొచ్చు. అంటే.. భారీ మొత్తంలో డేటాను చాలా తక్కువ సమయంలో ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. అయితే, ప్రస్తుతం మన ఫోన్లలో లభించే 6G స్పీడ్ కాదు. ఇది ల్యాబ్ స్థాయిలో చేసిన ప్రయోగం మాత్రమే. 6Gతో ఏం మారొచ్చు? : 6జీ కమర్షియల్‌గా వస్తే.. భారీ ఫైల్స్ డౌన్లోడ్లు, హై-క్వాలిటీ వీడియో స్ట్రీమింగ్, VR/AR, క్లౌడ్ గేమింగ్ వంటి డేటా-హెవీ సర్వీసులు మరింత వేగంగా పనిచేస్తాయి. రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రియల్‌టైమ్ కమ్యూనికేషన్ వంటి రంగాల్లోనూ కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ఇంత స్పీడ్ ఎలా? : 560GHz వంటి అత్యంత హై ఫ్రీక్వెన్సీల వద్ద ట్రెడిషనల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లకు లిమిట్స్ ఎదురవుతాయి. ఇలాంటివి అధిగమించేందుకు రీసెర్చర్లు లేజర్ ఆధారిత ఆప్టికల్ టెక్నాలజీ, ఆప్టికల్ మైక్రోకోంబ్ వంటి విధానాలను వాడారు. వైబ్రేషన్లు, టెంపరేచర్ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఆప్టికల్ ఫైబర్లను సిలికాన్ నైట్రైడ్ మైక్రోరెసోనేటర్ చిప్‌కు నేరుగా ఇంటిగ్రేట్ చేశారు. Read Also : Ration Card Update : రేషన్ తీసుకోలేకపోయారా? మరో ఛాన్స్
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. జనసేన జైకొట్టు లోగో ఆవిష్కరణ జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం పిఠాపురంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ యువజన విభాగం ‘జై కొట్టు’ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యకర్తలకు ఆడియో సందేశం ఇచ్చారు. చెయ్యొత్తి జై కొట్టు నినాదం మనందరినీ ఎంతో కదిలిస్తుంది. ఆ స్ఫూర్తిని మీకు అందించాలనే అధినేత పవన్ ఈ లోగో పెట్టారు. జై కొట్టు నినాదంతో ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రాజకీయాల్లో యువతకు ప్రత్యేక స్థానం కల్పించాలనే ఈ విభాగాన్ని ఏర్పాటు చేశాం. అరుపులు.. కేకలు కాదు.. క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. అధినేత ఆదేశాలను జనసైనికులు క్రమశిక్షణతో పాటించాలి అని సూచించారు. ఈ వార్తకు సంబంధించిన
మేష రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి కృష్ణ జన్మాష్టమి వేళ కన్నయ్యకు ఎరుపు రంగు దుస్తులతో అలంకరించొచ్చు. ఇలా చేయడం వల్ల మీ వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు మానసికంగా ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు, కాబట్టి కృష్ణాష్టమి వేళ లడ్డూ గోపాలుడి అలంకరణ కోసం వెండి ఆభరణాలు లేదా వస్తువులను ఉపయోగించొచ్చు. ఇలా చేయడం వల్ల బాల వేణుమాధవుడి ప్రత్యేక ఆశీస్సులు పొందొచ్చు. మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు, కాబట్టి కృష్ణాష్టమి రోజున లడ్డూ గోపాలుడిని లహరియ(అలల వంటి లేదా చారల) డిజైన్ కలిగిన వస్త్రాలతో అలంకరించాలి. ఇలాంటి అలంకరణ ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది కన్నయ్యకు ఎంతో ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. శ్రీ కృష్ణ జన్మదినోత్సవం రోజున బాల గోపాలుడిని తెల్లని దుస్తులతో అలంకరించాలి. ఇలా చేయడం వల్ల మీరు ప్రతి పనిలో విజయం సాధించే అవకాశం ఉంది. సింహ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి కృష్ణ జన్మాష్టమి రోజున బాల గోపాలుడిని గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించొచ్చు. ఇలా చేయడం వల్ల మీకు సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కన్య రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి కృష్ణా జన్మాష్టమి రోజున బాల గోపాలుడిని పచ్చని రంగు దుస్తులతో అలంకరించాలి. ఇలా చేయడం వల్ల మీకు కన్నయ్య ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. తులా రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ బాల గోపాలుడిని కుంకుమ రంగు(కాషాయం వంటి) రంగు వస్త్రాలతో అలంకరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. వృశ్చిక రాశి

భారత పేస్ బౌలర్ ఆకిబ్ నబీ ఇంగ్లండ్ కౌంటీల్లో అరంగేట్రం చేశాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా యార్క్‌షైర్‌తో మ్యాచ్ సందర్భంగా సర్రే జట్టు తరఫున ఎంట్రీ ఇచ్చాడు. కాగా కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్ వన్-2026లో భాగంగా లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో సర్రే- యార్క్‌షైర్ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన సర్రే తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. యార్క్‌షైర్ బ్యాటింగ్‌కు దిగింది. రంజీల్లో దుమ్ములేపాడు జమ్మూ కశ్మీర్‌కు చెందిన 29 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్ జట్టు తొలిసారి రంజీ టైటిల్ గెలవడంలో అతడిదే కీలక పాత్ర. గత రెండు సీజన్లలో కలిపి వందకు పైగా వికెట్లు తీసి ఆకిబ్ నబీ తానేంటో నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో భారత్-ఎ తరఫున ఇటీవలే అరంగేట్రం చేసిన ఆకిబ్.. శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా వైదొలగగా.. అతడి స్థానంలో సెలక్టర్లు నబీని ఎంపిక చేశారు. అయితే, లంకతో రెండు టెస్టులు ఆడిన భారత తుదిజట్టులో మాత్రం నబీకి చోటు దక్కలేదు. కివీస్ టూర్ సన్నాహకాల్లో భాగంగా ఇక టీమిండియా తదుపరి టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు అక్కడికి వెళ్లనుంది. కివీస్ టూర్లో బౌన్సీ పిచ్‌లపై నబీ సేవలను వాడుకోవాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఆ సన్నాహకాల్లో భాగంగానే అతడు ఇంగ్లండ్ కౌంటీల్లో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం చేసినట్లు వార్తలు వచ్చాయి. కాగా ఆకిబ్ నబీ సర్రే తరఫున యార్క్‌షైర్‌తో పాటు.. హోవ్ వేదికగా సస్సెక్స్‌తో.. సర్రే సొంతమైదానంలో గ్లామోర్గాన్ జట్టుతో జరిగే మ్యాచ్‌లలో పాల్గొననున్నాడు. ఇదిలా ఉంటే.. సర్రే తరఫున ఆకిబ్ నబీ తాజాగా అరంగేట్రం చేయగా.. భారత ఆటగాడు రాహుల్ చహర్ కూడా తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇదే జట్టులో ఉన్న భారత ఆల్‌రౌండర్ మహిపాల్ లామ్రోర్

‘‘పుట్టామా..ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ లాంటి చదువులు చదివామా? మంచి ఉద్యోగం సంపాదించామా... జీవితం సక్సెస్’’ ఇది ఒకప్పటి బతుకు ఫిలాసఫీ. కానీ జెన్-జీలు ఇలా కాదంటోంది తాజా అధ్యయనం. అంతర్జాతీయ విద్యా సంస్థ ఎమిరైటస్ ‘‘ఇండియాస్ జెన్-జీ ఔట్లుక్ 2026: రీ కాల్కులేటింగ్ ఎడ్యుకేషన్, ఆంబీషన్ అండ్ సక్సెస్’’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనం నవతరం గురించి పలు ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. 1997- 2012 మధ్య పుట్టిన వాళ్లను మనం జెన్-జీ అని పిలుస్తున్నాం కదా.. వీరు దేశంలోని ప్రధాన మెట్రోల్లోని 15 - 28 ఏళ్ల మధ్య వయసున్న సుమారు వెయ్యి మందిని ప్రశ్నించి వారి ఆశలు, ఆశయాలు, విజయానికి నిర్వచనాలను సేకరించింది. ముందు తరం నడిచిన బాటను కాదని కొత్త అడుగులు వేస్తున్న వారి గురించి స్థూలంగా. మునుపటిలా చిన్న ఉద్యోగంతో మొదలుపెట్టి అంచలంచెలుగా పైకి ఎదగాలన్న సూత్రానికి వీరు విరుద్ధం. ఉద్యోగమిచ్చే మేనేజర్, జీఎం, వీపీ, ఛైర్మన్ వంటి హోదాల కంటే పనికి - జీవితానికి మధ్య బ్యాలెన్స్ ఉండాలనుకుంటున్న జెన్-జీలు సుమారు 74 శాతం. అసలు సక్సెస్ఫుల్ కెరియర్‌కు ఎగ్జిక్యుటివ్ లీడర్ కావాల్సిన అవసరమే లేదన్నది 65 శాతం మంది నమ్మకం. వీరి దృష్టిలో విజయం అంటే... నైపుణ్యాలు. అవసరానికి తగ్గట్టు మారిపోగలగడం. సంతృప్తినిచ్చే, అర్థవంతమైన పని లోకలే మేలు... ఒకప్పుడు ఎంతో పాప్యులర్ అయిన విదేశీ చదువులపై జెన్-జీకి పెద్ద ఆశలేం లేవు. పెరిగిపోతున్న ఖర్చులు, వీసా నిబంధనల్లో వస్తున్న మార్పులు, చదువు తరువాత ఉద్యోగాలు వస్తాయన్న గ్యారెంటీ లేకపోవడం వంటి కారణాల వల్ల నాణ్యమైన లోకల్ విద్యే మేలని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాలేజీ ముందునాటి చదువులు చదువుతున్న వారిలో 87 శాతం, కాలేజీల్లోకి అడుగుపెడుతున్న వారిలో 92 శాతం లోకల్ కోర్సులకు జై అంటున్నారు. విదేశీ విద్యా సంస్థలు స్థానికంగా అందించే కోర్సుల్లో చేరేందుకు అభ్యంతరం లేదని సుమారు 69

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు, చంద్రుల కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఇది వ్యక్తుల జీవితంలో అదృష్టం, సంపద, కీర్తి, పురోగతి వంటి సానుకూల మార్పులను తెస్తుంది. ముఖ్యంగా, గజకేసరి యోగం ఏర్పడినప్పుడు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. సమాజంలో గౌరవం, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటాయని నమ్మకం. పండితుల ప్రకారం సెప్టెంబర్ 7 చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఆ రాశిలో ఉన్న గురుడితో కలిసి గజకేసరి యోగం ఏర్పరుస్తాడు. చంద్రుడికి సొంత రాశి అయిన కర్కాటకంలో ఈ యోగం ఏర్పడటం వల్ల 5 రాశులవారి అదృష్టం రెట్టింపవుతుంది. మరి ఆ రాశులేవో తెలుసుకోండి. వృషభ రాశి వారికి గజకేసరి యోగం ఆర్థికంగా మంచి రోజులు తీసుకురానుంది. ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలు కనిపిస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు, కష్టానికి సరైన గుర్తింపు లభిస్తుంది. ఊహించని విధంగా కొత్త బాధ్యత లేదా ముఖ్యమైన అవకాశం మిమ్మల్ని వరించవచ్చు. వ్యాపారం చేసే వారికి కొత్త కస్టమర్లు లేదా బిజినెస్ కాంటాక్ట్‌ల ద్వారా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇంటికి సంబంధించి చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్న కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. మకర రాశి వారికి గజకేసరి యోగం అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇప్పటివరకు మనసులో ఉన్న గందరగోళం తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. భాగస్వామితో ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గి, అవగాహన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. ఆదాయం, పొదుపు సంబంధిత విషయాలలో సానుకూల మార్పులు వస్తాయి. కన్య రాశి వారికి ఈ గజకేసరి యోగం పురోగతికి కొత్త దారులు తెరుస్తుంది. ముఖ్యంగా డబ్బు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి

Silver: వెండి కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త.. ఈ విషయం తెలుసుకోకపోతే మీకే నష్టం.. చాలామంది ఇది పట్టించుకోరు.. ఈ వార్తకు సంబంధించిన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూసుకుంటూనే, మరోవైపు.. కేంద్రమంత్రులతో సమావేశం అవుతున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో డీఆర్డీఎల్ ఆధ్వర్యంలో చేపట్టనున్న రక్షణ ప్రాజెక్టుకు భూమి కేటాయింపు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు, అలాగే హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026, రక్షణ ఎక్స్పో-2026పై సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో చర్చించారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరు కావాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. డిసెంబర్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నిర్వహించే రక్షణ ఎక్స్పో-2026ను ప్రారంభించాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు.రక్షణ ఎక్స్‌పోలో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సులతో పాటు ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శన, అత్యాధునిక భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. దేశవ్యాప్తంగా రక్షణ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రక్షణ ఎక్స్పోను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించేందుకు కేంద్ర రక్షణశాఖ సహకారం అందించాలని కోరారు. ఎయిర్‌షోకు అవసరమైన గగనతల అనుమతులు ఇవ్వడంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాలు పాల్గొనేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రదర్శనకు సహకరించాలని.. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఎక్స్‌పోలో ప్రదర్శించాలని కోరారు. త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హెచ్ఏఎల్

ఆంగ్ల చిత్రం 'స్ట్రీట్ ఫైటర్' ఇప్పుడు తెలుగులోనూ రాబోతోంది. అక్టోబర్ 16న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ తెలుగు ట్రైలర్ నూ తాజాగా రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు పారామౌంట్ పిక్చర్స్, లెజెండరీ ఎంటర్టైన్మెంట్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘స్ట్రీట్ ఫైటర్’. అక్టోబర్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్‌తో పాటు భారతదేశంలో హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా టోక్యోలోని షింజుకు యునికా విజన్ స్క్రీన్స్‌పై గ్రాండ్‌గా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. దర్శకుడు కిటావో సకురాయ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జేసన్ మోమోవా, డేవిడ్ డాస్ట్‌మల్చియన్, విద్యుత్ జమ్వాల్, 50 సెంట్, కోడి రోడ్స్, రోమన్ రీన్స్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ సైతం విడుదలైంది. 1993 నేపథ్యంలో సాగే ఈ కథలో ర్యూ, కెన్ మరోసారి పోరాటంలోకి దిగుతారు. వరల్డ్ వారియర్ టోర్నమెంట్ చుట్టూ సాగే కథలో ఓ ప్రమాదకరమైన కుట్ర వారిని ఎదురెదురుగా నిలబెడుతుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను యూట్యూబ్‌లో తొలిసారిగా ‘ప్లే చేయగలిగే ట్రైలర్’గా అందుబాటులోకి తీసుకొచ్చారు. స్ట్రీట్ ఫైటర్ కాంబో ఛాలెంజ్ ద్వారా అభిమానులు ట్రైలర్ ను చూస్తూనే గేమ్ ఆడే అవకాశం కల్పించారు. ఈ సినిమాలో నోహ్ సెంటినియో కెన్ మాస్టర్స్‌గా, ఆండ్రూ కోజి ర్యూగా, కాలినా లియాంగ్ చున్-లిగా నటిస్తున్నారు. 200 కోట్ల క్లబ్‌లోకి ‘ఇరుముడి’.. మణికంఠుడి పోస్టర్ వైరల్ ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బండ్లన్న మళ్లీ స్టార్ట్ చేశాడ్రోయ్ పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటేనే పండగ.. ఈసారి మునుపటి కంటే మిన్నగా

దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2026లో సౌత్ జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. నార్త్ జోన్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో సౌత్‌జోన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్పోర్ట్స్ డెస్క్: హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో దులీప్ ట్రోఫీ 2026లో సౌత్ జోన్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-2 వేదికగా నార్త్ జోన్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో సౌత్ జోన్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 182 పరుగుల లక్ష్యాన్ని సౌత్ జోన్ 43.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 267 స్కోరుతో బుధవారం ఆటను కొనసాగించిన నార్త్ జోన్.. 297 పరుగులకే ఆలౌటైంది. అనంతరం181 పరుగుల లక్ష్యాన్ని సౌత్ జోన్ 43.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రికీ భుయ్ (42), నారాయణ్ జగదీశన్ (43) శుభారంభం అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన కెప్టెన్ తిలక్ వర్మ (51*) రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో రాణించాడు. రవిచంద్రన్ స్మరన్ (32*) తిలక్ వర్మకు సపోర్టుగా నిలిచి.. జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో నార్త్ జోన్ 195 పరుగులకే ఆలౌటైంది. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ (116 నాటౌట్; 250 బంతులు) శతకంతో మెరవడంతో తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 312 పరుగులు చేసి.. 117 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అదరగొట్టిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలి సెమీ ఫైనల్లో సెంట్రల్ జోన్‌పై 4 వికెట్ల తేడాతో ఈస్ట్ జోన్ గెలిచిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 6 నుంచి చెపాక్ స్టేడియంలో దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది. తుదిపోరులో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్‌తో సౌత్ జోన్ తలపడనుంది

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Janmashtami 2026 Famous Temples: శ్రీకృష్ణుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, భక్తులు భారతదేశం అంతటా ఉన్న ప్రసిద్ధ కృష్ణ దేవాలయాలను సందర్శిస్తుండటంతో, జన్మాష్టమి 2026ను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. జన్మాష్టమి భారతదేశంలోని అత్యంత ఆనందకరమైన, ఆధ్యాత్మిక శక్తితో నిండిన పండుగలలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ సందర్భం కోసం దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు రంగురంగుల అలంకరణలతో అద్భుతంగా ముస్తాబవుతాయి. అందమైన అలంకరణలు, గుంపులు గుంపులుగా తరలివచ్చే భక్తులు, గాలిలో మారుమోగే భజనలు, మీరు ఊహించిన దానికంటే చాలా సేపటి వరకు సాగే అర్ధరాత్రి వేడుకలు ఈ పండుగ ప్రత్యేకత. ఈ సమయంలో మీరు కృష్ణ దేవాలయాన్ని సందర్శించగలిగితే, అది మీ మదిలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అద్భుతమైన అనుభూతిగా మారుతుంది. దైవ ఆశీస్సుల కోసం మీరు తప్పక సందర్శించవలసిన 7 ప్రసిద్ధ ఆలయాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 1) బాంకే బిహారీ దేవాలయం (బృందావన్) బృందావన్‌కు అనేక విధాలుగా ఇది ఒక కిరీటం వంటిది. ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధ కృష్ణ దేవాలయాలలో ఒకటి, జన్మాష్టమి సమయంలో ఈ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఇక్కడి భక్తి శక్తి ఉప్పొంగే విధానాన్ని వర్ణించడానికి అద్భుతం అనే పదం కూడా సరిపోదు. 2) కృష్ణ జన్మభూమి ఆలయం (మథుర) ఇది శ్రీకృష్ణుని అసలైన జన్మస్థలం అని నమ్ముతారు. అందుకే ఇక్కడ జన్మాష్టమి జరుపుకోవడం అనేది ఇతర ఆలయాలు సరిపోల్చలేని ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సంప్రదాయం ప్రకారం కృష్ణుడు జన్మించాడని చెప్పే అర్ధరాత్రి సమయంలో ఇక్కడ ప్రధాన పూజలు

T20 Centuries: సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ క్వింటన్ డికాక్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2026)లో సెంచరీతో విరుచుకుపడ్డాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టీ20 క్రికెట్లో పది సెంచరీలు పూర్తి చేసుకుని భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ప్రపంచంలో పది అంతకంటే ఎక్కువ టీ20 సెంచరీలు చేసిన ఐదో బ్యాటర్‌గా డికాక్ నిలిచాడు. సెప్టెంబర్ 1న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. బార్బడోస్ ట్రైడెంట్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన డికాక్ కేవలం 57 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 రన్స్ చేశాడు. గ్రౌండ్ నలుమూలలా విరుచుకుపడుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచిన ఈ ఇన్నింగ్స్ అతని టీ20 కెరీర్లో 10వ సెంచరీ నమోదైంది. డికాక్ మెరుపులతో బార్బడోస్ జట్టు 217 పరుగుల భారీ స్కోరు సాధించింది. డికాక్ బాదిన భారీ సెంచరీతో జట్టు విక్టరీ సాధిస్తుందని భావించినప్పటికీ మ్యాచ్ ఫలితం భిన్నంగా వచ్చింది. జేసన్ హోల్డర్ కెప్టెన్సీలోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జాన్సన్ చార్లెస్ 78 పరుగులతో రాణించగా, ఆండ్రీ ఫ్లెచర్ కేవలం 8 బంతుల్లో 3 సిక్సర్లతో 22 పరుగులు చేసి జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. లీగ్‌లో డికాక్ అత్యధిక పరుగులు చేస్తున్నప్పటికీ బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి రెండు విజయాలకే పరిమితమైంది. టీ20 ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో డికాక్ ఇప్పుడు విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ సరసన నిలిచాడు. వీరిద్దరి ఖాతాలోనూ చెరో 10 టీ20 సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో క్రిస్ గేల్ 22 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ 13 సెంచరీలతో రెండో స్థానంలో

సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'రోమాంచకం'. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ ఈ సినిమాలో జంటగా నటించారు. రేపు(సెప్టెంబర్ 3) థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ మూవీ, ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా పూర్తిగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో, ఇక్కడి యాసతో సాగే ఒక ఫ్రెష్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. కథలో హీరో అన్వేష్ (సుమంత్ ప్రభాస్) తన ఫ్రెండ్స్‌తో సరదాగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఒక డేటింగ్ యాప్ స్టార్టప్‌ను ప్రారంభిస్తాడు. అయితే ఈ డేటింగ్ యాప్ బిజినెస్ ద్వారా చెన్నైకి చెందిన అమ్మాయి (అనంతిక)తో అతను ఎలా కనెక్ట్ అయ్యాడు? ఆన్లైన్ అండ్ ఆఫ్‌లైన్ రొమాన్స్‌లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తల్లిదండ్రులు మెచ్చేలా ఎలా నిలిచాడు అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి UA16+ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే 16 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాను హ్యాపీగా చూడొచ్చు.ఇక ఈ సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే.. ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టించకుండా కథను ఎంతో గ్రిప్పింగ్‌గా 2 గంటల 22 నిమిషాలు (142 నిమిషాలు) రన్టైమ్తో ఫిక్స్ చేశారు. సుమంత్ ప్రభాస్ - అనంతిక మధ్య కెమిస్ట్రీ, వాసుకి వైభవ్ మ్యూజిక్, అద్భుతమైన కామెడీ టైమింగ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ కాబోతున్నాయి. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ వంటి అంశాలతో ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారట. జెన్-జీ ఆడియెన్స్‌ను మాత్రమే కాకుండా ఫ్యామిలీస్‌ను కూడా మెప్పించేలా ఉన్న ఈ 'రోమాంచకం' థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూడాలి. 'వండర్ వుమెన్' గాల్ గాడోట్ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి!
5/5దులీప్ ట్రోఫీ 2026/27 సీజన్లో సౌత్ జోన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. నార్త్ జోన్‌తో జరిగిన సెమీ ఫైనల్లో కెప్టెన్ తిలక్ వర్మ అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు. ఏడు వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందించి, టైటిల్ పోరుకు అర్హత సాధించేలా చేశాడు. సెప్టెంబర్ 6 నుంచి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఫైనల్లో ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్ జోన్‌తో సౌత్ జోన్ తలపడనుంది.మ్యాచ్ చివరి రోజు 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ జోన్‌కు కెప్టెన్ తిలక్ వర్మ (79 బంతుల్లో 51 నాటౌట్) అండగా నిలిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కీలకమైన సెంచరీ (116 నాటౌట్)తో జట్టును ఆదుకున్న తిలక్, రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే బాధ్యతాయుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. రవిచంద్రన్ స్మరణ్ (32 నాటౌట్)తో కలిసి నాలుగో వికెట్‌కు అబేధ్యంగా 80 పరుగులు జోడించి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు.అంతకుముందు నాలుగో రోజు ఆట ప్రారంభించిన నార్త్ జోన్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని భావించింది. అయితే, సౌత్ జోన్ పేసర్ ఎండీ నిధీశ్ వారి ప్రణాళికలను దెబ్బతీశాడు. వరుస విరామాల్లో వికెట్లు తీసి నార్త్ జోన్ పతనాన్ని శాసించాడు. చివరి మూడు వికెట్లను పడగొట్టి, ఇన్నింగ్స్‌లో మొత్తం 5 వికెట్లు (5/56) సాధించాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అతనికి ఇది 10వ ఐదు వికెట్ల ప్రదర్శన. దీంతో నార్త్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌట్ అయింది.లక్ష్య ఛేదనలో సౌత్ జోన్‌కు ఓపెనర్ రికీ భుయ్ (42) దూకుడైన
Pankaj Barman Nepal Flood : ఆగస్టు 26వ తేదీన నేపాల్ దేశాన్ని అతలాకుతలం చేసిన ప్రళయకర ఆకస్మిక వరదల నుంచి అస్సాంకు చెందిన ఒక పవర్ స్టేషన్ ఉద్యోగి అద్భుత రీతిలో ప్రాణాలతో బయటపడ్డాడు. అస్సాంలోని నల్బారీ జిల్లాకు చెందిన పంకజ్ బర్మన్ అనే యువకుడు.. నేపాల్‌లోని ఒక జలవిద్యుత్ కేంద్రంలో పనిచేస్తుండగా ఊహించని రీతిలో వరదలు విరుచుకుపడ్డాయి. మృత్యువు అంచుల వరకు వెళ్లి.. కొండపై నాలుగు రోజుల పాటు నరకయాతన అనుభవించిన ఆయన ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుని తన కుటుంబాన్ని కలుసుకున్నారు. ఈక్రమంలోనే తన భయానక అనుభవాలను పంచుకుంటూ.. నాలుగు రోజుల పాటు కొండపై బిస్కెట్లు మాత్రమే తింటూ గడిపానని వివరించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.పరిగెత్తు పంకజ్ పరిగెత్తు..ఆగస్టు 26వ తేదీన పవర్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో పాటు బురద, పెద్ద పెద్ద రాళ్లతో కూడిన వరద నీరు కేంద్రంలోకి దూసుకొచ్చింది. ఆ సమయంలో తోటి ఉద్యోగి ఒకరు "పరుగెత్తు పంకజ్.. పరుగెత్తు!" అని గట్టిగా కేకలు వేయడంతో తాను తక్షణమే బయటకు పరుగులు తీసినట్లు పంకజ్ గుర్తు చేసుకున్నారు. వరద ఉధృతికి రోడ్లు, వాహనాలు, నిర్మాణాలు కళ్ల ముందే కొట్టుకుపోవడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి ఎత్తైన ప్రాంతమే శరణ్యమని భావించి.. సమీపంలో ఉన్న ఓ కొండ పైకి పరుగు తీసినట్లు పేర్కొన్నారు.ఇదీ చూడండి: నేపాల్ రెస్క్యూ మిరాకిల్.. మూడ్రోజులు మట్టి దిబ్బల కింద నలిగినా సజీవంగా బయటపడ్డ ఆరేళ్ల చిన్నారి!మంచినీళ్లు, బిస్కెట్లతో 4 రోజుల నరకయాతనసుమారు వంద మందికి పైగా బాధితులు ఆ కొండపైన చిక్కుకుపోయినట్లు వివరించారు. వరద తగ్గుముఖం పట్టే వరకు ఏమీ తినడానికి లేక, కేవలం బిస్కెట్లు, మంచి నీళ్లతోనే నాలుగు రోజుల పాటు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడిపామన్నారు. నీటి ఉధృతి కాస్త తగ్గిన తర్వాత నేపాల్ రెస్క్యూ బృందాలు తమను సురక్షితంగా ఖాఠ్మాండులోని ఒక హోటల్‌కు తరలించాయని
September 2026 Festivals : హిందూ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ మాసంలో శ్రీ క్రిష్ణాష్టమి, వినాయక చవితి వంటి పెద్ద పండుగలొచ్చాయి. ఇదే సమయంలో ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. మరో విశేషం ఏంటంటే, పితృ పక్షం కూడా ఈ నెలలోనే ప్రారంభం కావడం విశేషం. అంతేకాదు ఈ మాసంలోనే విశ్వ గురు జయంతి, గురు ప్రదోష వ్రతం వంటి విశేషమైన పండుగలు రానున్నాయి. ఇదిలా ఉండగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, తొమ్మిదో నెల అయిన సెప్టెంబర్ మాసంలో ప్రధానమైన పండుగలు ఏయే తేదీల్లో వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.శ్రీ క్రిష్ణా జన్మాష్టమి, సెప్టెంబర్ 4ఈ నెలలో సెప్టెంబర్ 4వ తేదీన శుక్రవారం నాడు శ్రీ క్రిష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటారు. అంతకంటే ముందు సెప్టెంబర్ 2న బలరామ జయంతి జరుపుకోనున్నారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో క్రిష్ణ మాసంలో అష్టమి తిథి నాడు, రోహిణి నక్షత్రంలో కన్నయ్య జన్మదిన వేడుకలను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజునే క్రిష్ణుడు జన్మించాడని నమ్ముతారు.అజ ఏకాదశి, సెప్టెంబర్ 7అజ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల అశ్వ మేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది. ఈ ఉపవాసం సమయంలో ఉపేంద్ర రూపమైన విష్ణువును పూజిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల రాజయోగం లభిస్తుంది.పొలాల అమావాస్య, సెప్టెంబర్ 11శ్రావణ అమావాస్యను పొలాల అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్యతోనే శ్రావణ మాసం ముగుస్తుంది. ఆ తర్వాత శ్రీ క్రిష్ణుడికి ఎంతో ఇష్టమైన భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో శ్రీ క్రిష్ణుడిని పూజిస్తారు. ఇదే సమయంలో పితురులకు తర్పణం సమర్పిస్తారు.గణేష్ చతుర్థి, సెప్టెంబర్ 11ఈ పవిత్రమైన రోజు నుంచి 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో హిందువులలో చాలా మంది ఇళ్లలో వినాయకుడిని ప్రతిష్టించనున్నారు. ఈ సమయంలో వినాయకుడు భూలోకానికి వచ్చి భక్తుల బాధలను తొలగిస్తారని నమ్ముతారు.విశ్వ కర్మ జయంతి, సెప్టెంబర్ 17ప్రతి

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Mamitha Baiju Hospitalised News: చిత్రసీమలో వరుస విజయాలతో అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ యువ కథానాయిక మమితా బైజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటన రద్దు..వేడుకలు వాయిదా.. సెప్టెంబర్ 5న ఆస్ట్రేలియాలో అత్యంత వైభవంగా జరగాల్సిన 'క్లైడ్ ఓనం 2026' వేడుకలకు మమితా బైజు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో, వైద్యుల సలహా మేరకు ఆమె తన ఆస్ట్రేలియా పర్యటనను పూర్తిగా రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని 'క్లైడ్ మలయాళీ అసోసియేషన్' సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటిస్తూనే, ఆమె లేకపోవడంతో ఓనం వేడుకలను కూడా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అభిమానులకు క్షమాపణలు చెప్పిన మమిత.. ఈ మేరకు క్లైడ్ మలయాళీ అసోసియేషన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మమితా బైజు ఈ వీడియోలో స్వయంగా మాట్లాడుతూ.. అనారోగ్య కారణాల వల్ల, వైద్యుల సూచనల మేరకు తాను ప్రయాణం చేయలేకపోతున్నానని తెలిపారు. ప్రయాణాలు చేయడం వల్ల శారీరక నొప్పులు, అలర్జీలు పెరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించవద్దని డాక్టర్లు హెచ్చరించారని, పూర్తి విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారని చెప్పారు. తనను ఎంతగానో ఆహ్వానించిన నిర్వాహకులకు, ఆస్ట్రేలియా అభిమానులకు క్షమాపణలు చెబుతూ, త్వరలోనే పూర్తిగా కోలుకుని కలుసుకుంటానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రేజ్.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో
గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో అమెరికా అంతటా ‘తెలుగుకు పరుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వల్లభాపురపు బాలాజీ, అల్లం శ్రీదేవి నాయకత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే సందేశాన్ని సమాజానికి అందించడమే ఈ పరుగు ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయస్సుల వారు ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాషపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు భాషను భావితరాలకు అందించాలనే సంకల్పంతో భాషా సైనికులు, స్వచ్ఛంద సేవకులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మనబడి ‘తెలుగుకు పరుగు’ నిర్దేశకుడు వల్లభాపురపు బాలాజీ మాట్లాడుతూ మనబడి నిర్వహిస్తున్న తెలుగు భాషా తరగతులు, 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నమోదు వివరాలను వెల్లడించారు. తెలుగు భాషను నేర్పడం, నేర్చుకోవడం ప్రతి తెలుగు కుటుంబ బాధ్యత అని గుర్తుచేశారు. మనబడి అధ్యక్షుడు కులపతి చమర్తి రాజు మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన వారందరికీ అభినందనలు తెలిపారు. ‘భాషా సేవయే భావితరాల సేవ’ అనే నినాదాన్ని గుర్తుచేస్తూ ఇప్పటివరకు లక్షా 10 వేల మందికి పైగా విద్యార్థులు మనబడి ద్వారా విద్యను పూర్తి చేసుకున్నారని చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ రెండో వారంలో 10 దేశాల్లో దాదాపు 300 కేంద్రాల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరానికి ఇప్పటివరకు 12,500 మంది పిల్లలు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఉత్తర అమెరికాలో మనబడికి పాశ్చాత్య పాఠశాలలు, కళాశాలల సంఘం గుర్తింపుతో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధ గుర్తింపు ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. ‘రన్ ఫర్ తెలుగు’ పోటీలను రెండు విభాగాల్లో నిర్వహించారు. ప్రతి ప్రాంతంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలను మనబడి పతకాలతో సత్కరించారు. పాల్గొన్న వారందరికీ ధ్రువపత్రాలు అందజేసి, ఆయా ప్రాంతాల్లో అల్పాహారం
Gold Price Fall : గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఒక్కసారిగా పతనమవుతున్నాయి. బులియన్ మార్కెట్లో వరుసగా 4 రోజుల్లో తులం బంగారం (24 క్యారెట్లు) ధర ఏకంగా రూ.9110 మేర పడిపోయింది. ఆగస్టు 29వ తేదీన దాదాపు రూ.3 వేలు దిగొచ్చిన బంగారం ధర ఆ తర్వాత వరుస సెషన్లలో భారీగా పడిపోతూ వస్తోంది. దేశంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న తరుణంలో బంగారం ధరలు ఇలా భారీగా తగ్గుతుండడం కొనుగోలుదారులకు ఊరటగా చెప్పవచ్చు. వెండి రేటు రూ.10 వేలు తగ్గి రూ.2.50 లక్షల స్థాయికి మళ్లీ దిగివచ్చింది. అయితే, బంగారం ధరలు భారీగా పడిపోయేందుకు గల కారణాలేంటి? ఇంకా తగ్గుతాయా? బులియన్ మార్కెట్ విశ్లేషకులు ఏం చెబుతున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.నేటి బంగారం ధరలు ఇలాదేశీయ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా నాలుగో రోజూ తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ ఒక్కరోజే రూ.2070 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో తులం బంగారం ధర రూ.1,52,020 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల నగల తయారీ బంగారం రేటు ఈరోజు రూ.1900 మేర పడిపోయింది. దీంతో తులం రేటు రూ.1,39,350 వద్దకు పడిపోయింది. ఇక కిలో వెండి ధర రూ.10 వేలు తగ్గడంతో రూ.2,50,000 వద్ద ట్రేడవుతోంది.ఆ ఒక్క కారణంతోనే భారీ పతనంఇరాన్పై అమెరికా భీకర దాడులు చేపడుతుండడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. దీంతో మార్కెట్లు ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఒక వైపు ముడి చమురు ధరలు పెరుగుతుండగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు డిమాండ్ తగ్గుతోంది. దీంతో పసిడి ధరలు భారీగా దిగివస్తున్నాయి. సాధారణంగా యుద్ధం జరిగితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ, పశ్చిమాసియా యుద్ధం విషయంలో క్రూడ్ ఆయిల్ ప్రధాన పాత్ర పోషించడంతో రివర్స్ జరుగుతోంది. బంగారం, వెండి వండి విలువైన ఖనిజాల ధరలు
జ్యోత్స్నని సూరజ్ మోసం చేయడానికి, ఆమె పెళ్లి ఆగిపోవడానికి దీప, కార్తీక్‌లే కారణం అని శివన్నారాయణ అనడం కాదు.. దశరథ్ కూడా అదే మాట అనడంతో తల్లడిల్లిపోతారు దీప, కార్తీక్‌లు. ఈరోజు (సెప్టెంబర్ 02) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. ‘నా కుటుంబాన్ని ప్రమాదంలో పడేశారు. దీప... ఈ దశరథ్, సుమిత్రల కన్న కూతురని నేను ఈ జన్మలో నోరు తెరిచి చెప్పలేనమ్మా.. ఎందుకంటే జ్యోత్స్నకి అంత అన్యాయం చేశారు’ అని అంటాడు దశరథ. ఈ నిజం బయటపడిన రోజు సుమిత్ర ఆనంద పడదు.. బాధపడుతుంది. ఎందుకంటే.. అంత ప్రేమగా చూసుకున్న కూతురికి నువ్వే అన్యాయం చేశావ్ అని తెలిస్తే.. తట్టుకోలేదు. అప్పుడు నా భార్య నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది’ అని అంటాడు దశరథ. ఆ మాటతో దీప.. ‘మీరు నా జీవితంలో ఉన్నా లేకపోయినా మీరు బావుండాలనే నేను కోరుకునేది నాన్నా’ అని ప్రవచనం మొదలుపెట్టడంతో.. ‘నీతో నేను మాట్లాడలేనమ్మా’ అని దండం పెట్టేస్తాడు దశరథ. చూడు కార్తీక్.. నీ భార్యని తీసుకుని వెళ్లిపో.. అని అనేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు దశరథ. దాంతో దీప.. ఏంటి బావా ఇదీ?? నాన్న నన్ను ఇంత పరాయి దాన్ని చేసి మాట్లాడుతున్నాడు అంటూ కన్నీటిపర్యంతం అవుతుంది.నా కోసం.. నా ప్రేమ కోసం నువ్వు వస్తావని తెలుసు సూరజ్.. పరిస్థితులే అలా చేయిస్తున్నాయి.. మామయ్య పరిస్థితే ఇలా ఉంటే.. అక్కడ జ్యోత్స్న పరిస్థితి ఎలా ఉందో అని అంటాడు కార్తీక్. కట్ చేస్తే.. జ్యోత్స్న.. సూరజ్ విసిరి కొట్టిన తాళిని తీసుకుని కన్నీళ్లతో అతని ఊహల్లోనే ఉంటుంది. ఇంతలో సూరజ్ వస్తాడు. వచ్చావా సూరజ్.. నాకోసం వస్తావ్ అని తెలుసు.. నీ ప్రేమ నన్ను మార్చినప్పుడు.. నా ప్రేమ నిన్ను ఎందుకు మార్చదు అని అంటుంది జ్యోత్స్న. ‘లేదు.. నన్ను మర్చిపో అని చెప్పడానికి వచ్చాను’ అని అంటాడు సూరజ్. ‘నన్ను దూరం

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. వీటివల్ల కొన్ని రాశులకు సానుకూల ఫలితాలు, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. అక్టోబరు నెలకు సంబంధించి మేష రాశి, వృషభ రాశి జాతక ఫలం ఎలా ఉందనే వివరాలను తెలుసుకుందాం.మకర రాశి, కుంభ రాశి, మీన రాశి 2026 సెప్టెంబరు నెల సమగ్ర జాతక ఫలంమేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)మేష రాశి వారికి అక్టోబరు 2026 నెల మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. పోటీ రంగాలలో విజయం లభించినప్పటికీ, ఆర్థికంగా, వృత్తిపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఉద్యోగంలో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఆరో ఇంట్లో సూర్య, బుధుల ప్రభావం వల్ల పోటీదారులపై విజయం సాధిస్తారు ఆఫీసులో మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది. అయితే, సహోద్యోగులతో అనవసరమైన వాదనలు, తొందరపాటు నిర్ణయాలు నివారించడం మంచిది. సంపాదన పెరిగినప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఈ నెలలో ఆస్తులు, వాహనాలు లేదా కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి.వ్యాపారులకు పెట్టుబడుల విషయంలో కొంత సమయం చూసి ముందడుగు వేయడం శ్రేయస్కరం. దాంపత్య జీవితం సాధారణంగా సాగుతుంది. నెల ద్వితీయార్థంలో భాగస్వామ్యంతో పర్యటనలు చేసే అవకాశం ఉంది. ప్రేమికులకు అనుకూలంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న అపార్థాలు రాకుండా సంభాషణల్లో స్పష్టత పాటించాలి. నిద్రలేమి, అధిక ఒత్తిడి లేదా కడుపు సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఆహార నియమాలు పాటించడం ముఖ్యం. అంగారకుడి ప్రభావం కోసం రోజూ హనుమాన్ చాలీసా పఠించడం లేదా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం శుభ ఫలితాలనిస్తుంది.తులా రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి 2026 సెప్టెంబరు నెల సమగ్ర జాతక ఫలంవృషభ రాశి (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1

Mamitha Baiju: మలయాళ బ్యూటీ మమితా బైజు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆమెకు సంబంధించిన ఆస్ట్రేలియా పర్యటన రద్దు కావడంతో పాటు, మెల్బోర్న్లో జరగాల్సిన ఓనం వేడుకలను కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మమితా బైజు మెల్బోర్న్లో నిర్వహించనున్న Clyde Onam 2026 వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమం కోసం ఆమె ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. దీంతో మమితా పాల్గొనాల్సిన ఓనం వేడుకను కూడా నిర్వాహకులు వాయిదా వేసినట్లు సమాచారం. మమితా బైజు ప్రస్తుతం వైద్యుల సలహాలను పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే ఆమె నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సక్సెస్‌ను అందుకున్నారు. మమితా ఆస్పత్రిలో చేరిన విషయం తెలియడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమెకు ఎదురైన అనారోగ్య సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్పత్రిలో ఎంతకాలం ఉండాల్సి వస్తుందనే విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం బయటికి రాలేదు. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు మాత్రమే తెలుస్తోంది. మమితా త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఆస్ట్రేలియాలో వాయిదా పడిన ఓనం వేడుకకు సంబంధించిన కొత్త తేదీని నిర్వాహకులు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులోకి వచ్చాడు. అటు యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా చోటు దక్కించుకున్నాడు. దీంతో ఓపెనింగ్ జోడీపై ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల ఈ యువ సంచలనం బ్యాటింగ్ చూడటానికి రెండు కళ్లు సరిపోవు. భారీ షాట్లతో బౌలర్లను బెంబేలెత్తించే వైభవ్.. అత్యంత పిన్న వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 13 నుంచి టీమిండియా.. అఫ్గానిస్థాన్‌లో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించిన జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అటు వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో ఉన్నాడు. దీంతో అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో భారత ఓపెనింగ్ జోడీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన సంజును జట్టు నుంచి తప్పించి వైభవ్‌కు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు అభిషేక్ శర్మ-వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఇంగ్లండ్‌పై నిరాశపరిచిన వైభవ్.. జింబాబ్వేపై చెలరేగాడు. అయితే అఫ్గాన్ సిరీస్‌లో సంజు రాకతో వైభవ్ సూర్యవంశీకి షాక్ తగిలే అవకాశం ఉంది. ఎప్పటిలాగే సీనియర్ ప్లేయర్లు సంజు శాంసన్-అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తే.. వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. అక్కడ సంజు లేదా అభిషేక్ విఫలమైతేనే వైభవ్‌కు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు, దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6 నుంచి ఫైనల్ మ్యాచ్‌లో ఆడనున్నారు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. ఆ వెంటనే అఫ్గానిస్తాన్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇషాన్ కిషన్ ఈస్ట్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ ఇద్దరూ అఫ్గాన్ సిరీస్ కల్లా సిద్ధంగా ఉంటారా? లేదా? అనేది

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Nepal Floods: నేపాల్‌లో సృష్టించిన వరదల వల్ల ఆ దేశం చెప్పుకోలంతగా అల్లకల్లోలమైంది. నేపాల్‌లో సంభవించిన వరదలు ఆ దేశాన్ని కోలుకోలేకుండా చేశాయి. వరదల ధాటికి ఊర్లకు ఊర్లకు కొట్టుకుపోయాయి. మరోవైపు పెద్ద పెద్ద భవనాలు సైతం పేక మేడల్లా కళ్ల ముందు కూలి పోయాయి. అప్పటి వరకు హాయిగా సంతోషంగా ఉన్న వారి జీవితాలు ఒక్కసారిగా తల్లకిందులు అయ్యాయి. ఇంట్లో చెట్టుకొరకు.. పుట్టకొకరు అన్నట్టు తయారైంది పరిస్థితి. కొంత మంది కుటుంబ సభ్యులను కోల్పోయి ఎందుకు బతికున్నామా అంటూ రోదిస్తున్న సన్నివేశాలు కంటతడి పెట్టిస్తున్నాయి. తాజాగా నేపాల్ పోలీసులు వెల్లడంచిన సమాచారం ప్రకారం.. రసువాలో 45, నువాకోట్‌లో 155, ధాడింగ్‌లో 59, చిత్వాన్‌లో 348, గోర్ఖాలో 66, తనహున్లో 38, తూర్పు నవల్పరాసిలో 217 మరియు పశ్చిమ నవల్పరాసిలో 190 మృతదేహాలను వెలికితీశారు. ఆయా మృతదేహాల నుంచి డీఎన్ఏ శాంపిల్ సేకరించి వాటి ఫోటోలను తీసి భద్రపరుస్తున్నారు. ఆ తర్వాత కళ్లిన మృతదేహాలను దహనం కాకుండా సామూహికంగా ఖననం చేస్తున్నారు. భారత్‌లో కూడా తొమ్మిది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు నేపాల్ పోలీసులు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాలలో కేవలం 95 మందిని మాత్రమే గుర్తించి, వారి ఫ్యామిలీస్‌కు అప్పగించడం జరిగింది. వరదల్లో మృతి చెందిన వారి మృతదేహాలను (గుర్తింపు లభించని వారితో సహా) చట్టపరంగా , శాస్త్రీయ పద్ధతుల ద్వారా అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు నేపాల్ ప్రధాని బాలేంద్ర షా అంతకుముందు తన సామాజిక మాధ్యమాల్లో

Quinton de Kock: సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్ టీ20 క్రికెట్లో మరో అరుదైన ఘనత సాధించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో బార్బడోస్ ట్రైడెంట్స్ తరపున సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 బంతుల్లో 106 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో డికాక్ తన టీ20 కెరీర్లో 10వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ సరసన నిలిచాడు. ఈ ముగ్గురి ఖాతాలో ఇప్పుడు చెరో 10 టీ20 శతకాలున్నాయి. టీ20ల్లో అత్యధిక సెంచరీల జాబితాలో డికాక్ సంయుక్తంగా మూడో స్థానానికి చేరాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. 185.96 స్ట్రైక్‌రేట్‌తో ఆడిన డికాక్ ధాటికి బార్బడోస్ 20 ఓవర్లలో 217/4 పరుగులు చేసింది. అయితే ఈ భారీ స్కోరును కూడా ఆ జట్టు కాపాడుకోలేకపోయింది. డికాక్ 57 బంతుల్లో 106 పరుగులు చేయగా.. 54వ బంతికి తన సెంచరీ పూర్తి చేశాడు. బార్బడోస్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే తొలి వికెట్ మూడు పరుగుల వద్ద పడినా, డికాక్, జకరీ కార్టర్ కలిసి రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. కార్టర్ 36 బంతుల్లో 57 పరుగులు చేయడంతో బార్బడోస్ భారీ స్కోరు సాధించింది. Team India: 24 గంటల్లోనే మరో గాయం.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..? కేవలం 18 బంతుల్లో 80 పరుగులు, సెంచరీకి ఎన్ని బంతులంటే? క్వింటన్ డి కాక్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌పై 106 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అందులో 80 పరుగులను కేవలం 18 బంతుల్లోనే సాధించాడు. ఈ 18 బంతులు సిక్సర్లు, ఫోర్లతో నిండిపోయింది. డి కాక్ తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టి, 185.96 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. అతని

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. AP Rural Drinking Water Citizen Charter 2026:గ్రామాల్లో మంచినీటి సమస్యలు ఎదుర్కొనే ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాగునీటి సరఫరాలో సమస్యలు, పైప్‌లైన్ లీకేజీలు, మోటార్ల రిపేర్లు వంటి సమస్యలకు ఇక ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా కొత్త విధానం తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు “రూరల్ డ్రింకింగ్ వాటర్ సిటిజన్ ఛార్టర్ 2026 (G.O. 829)”ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం ప్రజలు తమ సమస్యను అధికారులకు ఫిర్యాదు చేసిన వెంటనే దానికి కంప్యూటర్ రసీదు లేదా కంప్లైంట్ నంబర్ ఇవ్వాలి. దీంతో తమ ఫిర్యాదు నమోదు అయిందా లేదా అనే విషయంలో ప్రజలకు స్పష్టత ఉంటుంది. అలాగే సమస్య పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించాలో కూడా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. చిన్నపాటి నీటి సరఫరా సమస్యలను 24 గంటల్లోనే పరిష్కరించాలి. గ్రామాల్లో నీటి సరఫరాకు ఉపయోగించే మోటార్లలో సమస్య వస్తే దాన్ని 48 గంటల్లోపు రిపేర్ చేయాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. దీంతో మోటార్ సమస్యల కారణంగా ఎక్కువ రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోయే పరిస్థితులు తగ్గే అవకాశం ఉంది. పైప్‌లైన్ లీకేజీల విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన గడువును నిర్ణయించింది. చిన్న లీకేజీలను 24 గంటల్లో, పెద్ద లీకేజీలను 72 గంటల్లోపు సరిచేయాలి. దీనివల్ల నీటి వృథాను తగ్గించడంతో పాటు ప్రజలకు నీటి సరఫరా త్వరగా పునరుద్ధరించే అవకాశం
Delhi Bus Safety Guidelines 2026 : దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న స్లీపర్ బస్సులో మైనర్ బాలికపై డ్రైవర్, కండక్టర్ దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కారు మంగళవారం రోజు సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పబ్లిక్, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికులు, మహిళల రక్షణకు సంబంధించిన నిబంధనలను అత్యంత కఠినతరం చేసింది. ఢిల్లీలో నడిచే స్థానిక బస్సులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అన్ని బస్సుల్లోనూ.. పానిక్ బటన్లు కచ్చితంగా పని చేయాల్సిందేనని, అలాగే కిటికీలకు పర్దాలు కూడా ఉంచకూడదని స్పష్టం చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.దారుణ ఘటనతో కదిలిన యంత్రాంగం..!ఆగస్టు 4వ తేదీ రాత్రి గ్రేటర్ నోయిడాలో బస్సు ఎక్కిన మైనర్ బాలికపై డ్రైవర్, కండక్టర్ అత్యాచారానికి పాల్పడ్డారు. దాడి అనంతరం బాధితురాలిని దాదాపు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాశ్మీరీ గేట్ సమీపంలో పడేసి పారిపోయారు. ఈ ఘటన జరిగిన బస్సు కిటికీలకు లోపలి దృశ్యాలు బయటకు కనిపించకుండా ఉండేందుకు కిటికీల పర్దాలు కప్పి ఉంచడం, అలాగే నిబంధనల ప్రకారం పనిచేసే సీసీటీవీ కెమెరా వ్యవస్థ లేకపోవడం నేరస్థులకు కలసివచ్చింది. 2012 నాటి నిర్భయ ఘటన జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసిన ఈ ఉదంతంతో.. ఢిల్లీ ప్రభుత్వం తక్షణమే మేల్కొని నిబంధనలను కఠినతరం చేసింది.పర్దాలపై నిషేధం.. పానిక్ బటన్స్ తప్పనిసరినూతన నిబంధనల ప్రకారం.. బస్సు కిటికీలకు ఉండే పర్దాలు, నిబంధనలకు విరుద్ధంగా వేసే విండో ఫిల్మ్‌లను పూర్తిగా నిషేధించారు. విండ్‌షీల్డ్, వెనుక అద్దాలు, పక్క కిటికీల పారదర్శకత చట్టబద్ధంగా ఉండాల్సిందే. బస్సుల్లో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్‌లు, పానిక్ బటన్లు నిరంతరం పనిచేసే స్థితిలోనే ఉండాలని ఆదేశించారు. ప్రయాణికులకు సులభంగా అందుబాటులో ఉండేలా పానిక్ బటన్లను అమర్చాలి. వీటితో పాటు పని చేసే అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు

మన భూగోళంపై ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో మండిపోతున్నాయి. ఇన్నాళ్లూ మనం అనుకున్న ప్రమాద ఘంటికలు దాదాపు దగ్గరపడ్డాయి. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే భూమి సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని దాటేస్తుందని ఐక్యరాజ్యసమితి (యుఎన్ఈపీ) సరికొత్త నివేదిక ద్వారా అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. పారిస్ ఒప్పందం పెట్టుకున్న లక్ష్యం దాటిపోతుండటం ఖాయమని తేలిన నేపథ్యంలో.. ఇకపై ఉష్ణోగ్రతల పెంపుదల వ్యవధిని ఎంత తగ్గించగలమనే దానిపైనే ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చింది. లక్ష్యం దాటినా సరే.. ధైర్యం కోల్పోకుండా ఉష్ణోగ్రతలను మళ్లీ తగ్గించే దిశగా పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది.ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు దాటిపోయే కాలాన్ని వీలైనంత తక్కువగా, చిన్నదిగా మార్చడమే ఇప్పుడు మన ముందున్న ఏకైక మార్గమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తేల్చిచెప్పారు. ఈ వేసవిలో నమోదైన దారుణమైన ఎండలు, భయంకరంగా వ్యాపించిన అడవుల కార్చిచ్చు, ఆకస్మిక వరదలే భవిష్యత్తులో భూమి ఎంత దారుణంగా మారబోతోందో చెప్పే నమూనా అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 1.5 డిగ్రీలు దాటడమంటే ప్రపంచం అక్కడితో అంతమైపోతుందని కాదని, అయితే ప్రతి అర డిగ్రీ పెరుగుదల మానవాళిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఐరాస స్పష్టం చేసింది.వాతావరణంలో ముంచుకొస్తున్న విపత్తులుఒకవేళ ఉష్ణోగ్రత పెరుగుదల 1.8 డిగ్రీలకు చేరుకుంటే మాత్రం కోలుకోలేని నష్టాలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తుపానులు, కరువులు తీవ్రతరం కావడం, ఆహారం-తాగునీటి కొరత ఏర్పడటం, మంచు పర్వతాలు కరిగి సముద్ర మట్టాలు పెరగడం వంటివి తీర ప్రాంత ప్రజలను శరణార్థులుగా మార్చే ప్రమాదం ఉందన్నారు. ప్రపంచంలో అత్యంత వినాశకరమైన రీతిలో అమెజాన్ అడవులు దెబ్బతినడం, సముద్ర ప్రవాహాలు మారిపోవడం వంటి సంచలన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.విశ్వంలో మరో రెండు కొత్త గ్రహాలు.. శాస్త్రవేత్తల మైండ్ బ్లాకింగ్ న్యూస్!బొగ్గు, పెట్రోల్ వినియోగానికి చెక్.. కార్బన్ నిర్మూలన తప్పనిసరి!భూమి ఉష్ణోగ్రతను మళ్లీ సాధారణ

చైనా మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో కెనడాకు చెందిన విక్టోర్ లాయ్ చేతిలో లక్ష్య వరుస గేముల్లో ఓటమి పాలయ్యాడు. ఇంటర్నెట్ డెస్క్: చైనా మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో కెనడాకు చెందిన విక్టోర్ లాయ్ చేతిలో లక్ష్య వరుస గేముల్లో ఓటమి పాలయ్యాడు. 14-21, 7-21 తేడాతో లాయ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఈ ఓటమితో 2026లో విక్టోర్ లాయ్‌తో లక్ష్య సేన్ హెడ్-టు-హెడ్ రికార్డు 1-3కు పడిపోయింది. ఈ ఏడాది లక్ష్యపై లాయ్‌కు ఇది వరుసగా మూడో విజయం కావడం గమనార్హం. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లోనూ లక్ష్యసేన్‌కు నిరాశే ఎదురైంది. రెండో రౌండ్లో అమెరికాకు చెందిన గారెట్ టాన్ చేతిలో ఓడిపోయాడు. చైనా మాస్టర్స్‌లో తొలుత లక్ష్యసేన్ ఫ్రాన్స్‌కు చెందిన అలెక్స్ లానియర్తో తలపడాల్సి ఉంది. అయితే ఢిల్లీలో టైటిల్ సాధించిన అనంతరం లానియర్ టోర్నీ నుంచి వైదొలగడంతో.. లక్ష్యకు మరోసారి విక్టోర్ లాయ్‌తో తలపడే అవకాశం వచ్చింది. ఈసారి కూడా ఫలితం లక్ష్యకు అనుకూలంగా రాలేదు. ఇదిలా ఉంటే.. మరో భారత స్టార్ కిదాంబి శ్రీకాంత్ మాత్రం చైనా మాస్టర్స్‌లో శుభారంభం చేశాడు. రౌండ్ ఆఫ్ 32లో చైనీస్ తైపీకి చెందిన చి యు-జెన్ను 21-16, 21-15తో వరుస గేముల్లో ఓడించి రౌండ్ ఆఫ్ 16లోకి దూసుకెళ్లాడు. 2023 సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్‌లో శ్రీకాంత్‌ను తొలి రౌండ్లోనే ఓడించిన యు-జెన్‌పై ఈసారి భారత షట్లర్ పైచేయి సాధించాడు. తొలి గేమ్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీకాంత్.. రెండో గేమ్‌లోనూ ప్రశాంతంగా ఆడి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ అదరగొట్టింది

హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు వెళ్లే జాతీయ రహదారి-65కు భారీ అప్‌గ్రేడ్‌కు మార్గం సుగమమైంది. మొత్తం 285 కిలోమీటర్ల మేర రహదారిని ఆరు వరుసలుగా అభివృద్ధి చేసే ప్రతిపాదనకు పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.12,073.99 కోట్లుగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత ఆందోల్ మైసమ్మ ఆలయం సమీపం నుంచి విజయవాడ గొల్లపూడి వరకు 181 కిలోమీటర్ల మార్గాన్ని తొలి ప్యాకేజీగా అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ నుంచి నందిగామ వరకు 45 కిలోమీటర్ల భాగం రెండో ప్యాకేజీలో, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 59.69 కిలోమీటర్ల మార్గం మూడో ప్యాకేజీలో ఉంటుంది. అధికారుల అంచనాల ప్రకారం తొలి ప్యాకేజీకి రూ.7,321.97 కోట్లు ఖర్చవుతాయి. రెండో ప్యాకేజీకి రూ.2,965.11 కోట్లు, మూడో ప్యాకేజీకి రూ.1,786.91 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.. భూసేకరణ, రహదారి నిర్మాణం, జీఎస్టీ తదితర అన్ని వ్యయాలను కలిపితే ఒక్కో కిలోమీటరుకు సగటున రూ.38 కోట్ల వరకు ఖర్చు కానుంది. తెలంగాణలో యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా ఈ రహదారి సాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో పనులు కొనసాగనున్నాయి. తెలంగాణ పరిధిలోని రెండు ప్యాకేజీలకు సంబంధించి భూసేకరణ కోసం రూ.1,453.88 కోట్ల వరకు అవసరమవుతుందని అంచనా వేశారు. ఈ రెండు ప్యాకేజీలకు కలిపి 1,387.628 హెక్టార్ల భూమి అవసరం కాగా.. ఇప్పటికే 1,174.295 హెక్టార్ల భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా 213.33 హెక్టార్ల భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉంటుంది. ఇక విజయవాడ-మచిలీపట్నం విభాగంలో 351.185 హెక్టార్ల భూమి అవసరం కాగా.. 344.685 హెక్టార్లు అందుబాటులో ఉంది. దీంతో అదనంగా సుమారు 6.50 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం మొత్తం మార్గాన్ని హైస్పీడ్ కారిడార్
Ayodhya Ram Temple First CEO 2026 : దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అయోధ్య రామాలయ పరిపాలన పరిధిలో ఒక చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకోనుంది. ఆలయ నిర్వహణను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చే దిశగా రామాలయ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ఎవరనే విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు బుధవారం అధికారికంగా వెల్లడించనుంది. ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్ నివాసంలో మధ్యాహ్నం నుంచి నిర్వహించే ముఖ్యమైన సమావేశంలో సీఈవో ఎంపిక కమిటీ తమ తుది నివేదికను సమర్పించనుంది.5,500కి పైగా దరఖాస్తులు.. ముగ్గురి పేర్లతో తుది జాబితా!ఆలయ తొలి సీఈవో స్థానం కోసం ఏకంగా 5,585 దరఖాస్తులు అందినట్లు నిపుణుల కమిటీ తెలిపింది. ఈ భారీ సంఖ్యలోని అభ్యర్థుల అర్హతలను నిశితంగా పరిశీలించిన ఎంపిక కమిటీ.. చివరి దశకు చేరుకున్న 16 మంది అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించింది. రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కొహ్లీ, రిటైర్డ్ ఎల్జీ విష్ణుకాంత్ చతుర్వేది, నిపుణులైన సురేష్ హావ్డేలతో కూడిన ఈ ప్రత్యేక కమిటీ సభ్యులు ఇప్పటికే అయోధ్యకు చేరుకుని సమావేశానికి సిద్ధమయ్యారు. వీరు ప్రతిపాదించిన ముగ్గురి పేర్లతో కూడిన షార్ట్‌లిస్ట్ నుంచి ఒకరి పేరును ట్రస్టు తుది నిర్ణయంగా ఖరారు చేయనుంది.రాజీనామాలు, ఖాళీల నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణ..!ఇటీవల కాలంలో అయోధ్య రామాలయంలో భక్తులు అందించే కానుకలు, విరాళాల చోరీకి సంబంధించి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తి వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, అలాగే ట్రస్టీ అనిల్ మిశ్రాలు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. మరోవైపు ట్రస్టు సభ్యుడిగా సుదీర్ఘ సేవలు అందించిన విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్ర అకాల మరణం చెందారు. ఇలా ఒకేసారి ఏర్పడిన మూడు కీలక పదవుల ఖాళీలను భర్తీ చేయడంతో పాటు ట్రస్టు ప్రధాన కార్యదర్శి, ఇద్దరు నూతన సభ్యుల పేర్లను కూడా ఈ సమావేశంలో స్పష్టం చేయనున్నారు.ముందువరుసలో జగదీశ్ ఆఫ్లే పేరుట్రస్టు తొలి

తిరుమల తిరుపతి దేవస్థానం వర్గాల్లో ఉదయాన్నే ఒక వార్త పిడుగులా పడింది. టీటీడీ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే బలమైన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేయడమే కాకుండా, తిరుపతితో పాటు వివిధ ప్రాంతాల్లోని ఆయన నివాసాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. శనివారం తెల్లవారుజామున 6 గంటలకే రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు ఒకేసారి పలు చోట్ల తనిఖీలు చేపట్టడంతో తిరుమలలో తీవ్ర సంచలనం వ్యక్తమవుతోంది.ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో మొత్తం 7 ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు ఈ దాడులను అత్యంత రహస్యంగా నిర్వహించారు. తిరుపతిలోని పెదకాపు లేఅవుట్లో ఉన్న లోకనాథం ప్రధాన నివాసంలో సోదాలు చేస్తున్న సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. దీంతో పాటు తిరుపతి ఎస్టీవీ నగర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఉన్న ఆయన లాకర్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం ఆయన ఇల్లే కాకుండా.. తిరుమలలోని ఆయన డిప్యూటీ ఈవో ఆఫీస్, వసతిగృహంతో పాటు బంధువుల ఇళ్లను కూడా ఏసీబీ వదల్లేదు. అవినీతి ముత్యం @రూ.200 కోట్లు.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 14రోజుల రిమాండ్ బంధువుల ఇళ్లపైనా విరుచుకుపడ్డ బృందాలులోకనాథంకు చెందిన బినామీ ఆస్తులు, కీలక పత్రాల అన్వేషణలో భాగంగా ఆయన నెట్‌వర్క్‌పై ఏసీబీ నిఘా పెట్టింది. తిరుపతిలోని ఆయన ఇద్దరు బావమరుదుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా.. ఏర్పేడు మండలం చెల్లూరులోని ఆయన సోదరుడి ఇంట్లో కూడా ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. కీలక ఆధారాలు, నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పాస్తుల డాక్యుమెంట్లను సీజ్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.డీఎస్పీ భీంరెడ్డి ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే షాక్.. తొలిరోజే రూ.200 కోట్లకు పైనే 15 ఏళ్ల తర్వాత టీటీడీలో మళ్లీ ఏసీబీ ప్రకంపనలు!తిరుమల శ్రీవారి దేవస్థానంలో దాదాపు 15 సంవత్సరాల సుదీర్ఘ
