© 2026 nimisham.in

OnePlus Nord CE 6 : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కొంటున్నారా? క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 4 ప్రాసెసర్‌తో కొత్త ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఈ అద్భుతమైన ఆఫర్ మీకోసమే.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఈ ఫోన్ 8000mAh బ్యాటరీతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ధర తగ్గింపుతో మొత్తంగా రూ. 35వేల కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6పై తగ్గింపులు, ఆఫర్లు, ధర వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ధర, ఆఫర్లు : వన్‌ప్లస్ నార్డ్ సీఇ 6 ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 36,920 ధరకు లిస్టు అయింది. బ్యాంక్ ఆఫర్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్డులపై రూ. 34,720 తగ్గింపు పొందవచ్చు. దాంతో ధర రూ. 29,250కు తగ్గుతుంది. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ. 29,250 వరకు తగ్గించవచ్చు. కానీ, ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్ బట్టి రేటు ఉంటుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6లో 6.78-అంగుళాల 1.5K ఎఫ్‌హెచ్‌డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉంది. రిజల్యూషన్ 2772×1272 పిక్సెల్స్, 144Hz రిఫ్రెష్ రేట్, 450ppi పిక్సెల్ డెన్సిటీ, 19.6:9 యాస్పెక్ట్ రేషియో, 3840Hz పీడబ్ల్యుఎం డిమ్మింగ్, 3600 నిట్స్ వరకు బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ అడ్రినో 810 జీపీయూతో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. Read Also : Redmi 17 5G Launch : వారెవ్వా.. కొత్త రెడ్మి 17 5G ఫోన్ అతి చౌకైన ధరలో.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే? వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 16పై రన్ అవుతుంది. కొలతలు 16.25 సెం.మీ
పొడవు, 7.75 సెం.మీ వెడల్పు, 0.85 సెం.మీ మందం, బరువు 215 గ్రాములు ఉంటుంది. సేఫ్టీ కోసం ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.
కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C 2.0 పోర్ట్ ఉన్నాయి. బ్యాటరీ బ్యాకప్ పరంగా, నార్డ్ సీఈ 6లో 8000mAh బ్యాటరీ ఉంది. 80W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ 27W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.