© 2026 nimisham.in

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Mamitha Baiju Hospitalised News: చిత్రసీమలో వరుస విజయాలతో అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ యువ కథానాయిక మమితా బైజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఆస్ట్రేలియా పర్యటన రద్దు..వేడుకలు వాయిదా.. సెప్టెంబర్ 5న ఆస్ట్రేలియాలో అత్యంత వైభవంగా జరగాల్సిన 'క్లైడ్ ఓనం 2026' వేడుకలకు మమితా బైజు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో, వైద్యుల సలహా మేరకు ఆమె తన ఆస్ట్రేలియా పర్యటనను పూర్తిగా రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని 'క్లైడ్ మలయాళీ అసోసియేషన్' సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటిస్తూనే, ఆమె లేకపోవడంతో ఓనం వేడుకలను కూడా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
అభిమానులకు క్షమాపణలు చెప్పిన మమిత.. ఈ మేరకు క్లైడ్ మలయాళీ అసోసియేషన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మమితా బైజు ఈ వీడియోలో స్వయంగా మాట్లాడుతూ.. అనారోగ్య కారణాల వల్ల, వైద్యుల సూచనల మేరకు తాను ప్రయాణం చేయలేకపోతున్నానని తెలిపారు.
ప్రయాణాలు చేయడం వల్ల శారీరక నొప్పులు, అలర్జీలు పెరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించవద్దని డాక్టర్లు హెచ్చరించారని, పూర్తి విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారని చెప్పారు. తనను ఎంతగానో ఆహ్వానించిన నిర్వాహకులకు, ఆస్ట్రేలియా అభిమానులకు క్షమాపణలు చెబుతూ, త్వరలోనే పూర్తిగా కోలుకుని కలుసుకుంటానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రేజ్.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో మమితా బైజు కెరీర్ అద్భుతంగా సాగుతోంది. మలయాళంలో 'సూపర్ శరణ్య', 'ప్రేమలు' వంటి చిత్రాలతో అద్భుతమైన విజయాలు అందుకున్న ఆమె, జి.వి. ప్రకాష్ కుమార్ సరసన 'రెబెల్' సినిమాతో తమిళంలో ప్రవేశించారు. ఆ తర్వాత వచ్చిన 'డ్యూడ్' సినిమా కూడా తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ 2026 సంవత్సరంలోనే ఆమె నటించిన నాలుగు సినిమాలు విడుదల కాగా, నెల రోజుల వ్యవధిలో విడుదలైన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.200 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించాయి.
ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఇంతటి బిజీ షెడ్యూల్స్, సినిమా విడుదల ఉన్న తరుణంలో నటి ఆసుపత్రిలో చేరడం ఆమె అభిమానులను కలవరపెడుతోంది. ఒకే ఏడాదిలో ఇన్ని వరుస విజయాలు అందించిన మమితకు దిష్టి తగిలి ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.