
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో సోమవారం భారీ వర్షం కురవడంతో వాగులు ఉప్పొంగుతున్నాయి. కుసుంబాయి తండా- జాలుతండ తండా మధ్య వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఖిలాషాపురం నుంచి ఆంధ్ర తండాకు వెళ్లే ప్రధాన రహదారిలో కల్వర్టు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడి రైతుల పంట పొలాలు నీట మునిగాయి. పలు గ్రామాల చెరువులు అలుగు పోస్తున్నాయి. హైదరాబాద్-వరంగల్ 163 జాతీయ రహదారిపై రఘునాథపల్లి వద్ద వాగు పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




