
హైదరాబాద్, సెప్టెంబర్ 14: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) కీలక ప్రకటన చేసింది. సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీలను తాజాగా విడుదల చేసింది. CEN No. 03/2026 కింద మొత్తం 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షను అక్టోబర్ 12, 13 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు RRB వెల్లడించింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచే పరీక్షకు సంబంధించిన సూచనలు, షెడ్యూల్ను పరిశీలించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.




