
హైదరాబాద్‌: బొల్లారంలోని ఆర్మీ మద్రాస్‌ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ హవిల్దార్‌ మల్లేశ్‌ను సికింద్రాబాద్‌ కోర్టు కస్టడీకి అనుమతించింది. ఎల్లుండి నుంచి మల్లేశ్‌ను కస్టడీలోకి తీసుకోనున్నారు. ఆయనతో పాటు మరికొందరినీ పోలీసులు విచారించనున్నారు. ఆయుధాల చోరీ వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌పై ఆరా తీయనున్నారు. మల్లేశ్‌ వెల్లడించే వివరాల ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేపట్టనున్నారు. ఆయుధాలను ఎవరికి అప్పగించాలనుకున్నాడనే అంశంపై విచారించనున్నారు. నిందితుడు చెప్పే కీలక వివరాలను ఎన్‌ఐఏకు రాష్ట్ర పోలీసులు అందించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





