
ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్‌ బొల్లారం కంటోన్మెంట్‌లోని మద్రాస్‌ రెజిమెంట్‌ 20వ బెటాలియన్‌లో ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు, ఆర్మీ మాజీ హవల్దార్‌ మల్లేశ్‌ను పోలీస్‌ కస్టడీకి సికింద్రాబాద్‌ కోర్టు అనుమతించింది. ఆయుధాల చోరీ వెనక ఉన్న అసలు కుట్ర, నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని కోరగా 7 రోజుల పాటు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15న మల్లేశ్‌ను బొల్లారం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ప్రధాన నిందితుడితో పాటు ఇతర నిందితులను కలిపి విచారించనున్నారు. చోరీ చేసిన ఆర్మీ ఆయుధాలను మల్లేశ్‌ ఎవరికి అప్పగించాలనుకున్నాడనే కోణంలో విచారించన్నట్లు సమాచారం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




