
విశాఖపట్నం సెంట్రల్ పార్క్ దగ్గర కరెన్సీ నోట్లు కుప్పగా పోయడం కలకలం రేపింది. పార్క్ ఎదురుగా రోడ్డు పక్కన పెద్ద మొత్తంలో చినిగిపోయిన కరెన్సీ నోట్లు కుప్పగా కనిపించడంతో పార్క్‌కు వచ్చిన వాకర్స్ గుర్తించారు. అక్కడ రూ.500, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లతో పాటు ఎల్ఐసీ రసీదులు, ఓ మహిళకు సంబంధించిన పాన్ కార్డు కూడా పడి ఉన్నాయి. ఒకే చోట భారీగా చినిగిన నోట్లు ఎవరు పడేశారనే చర్చ జరిగింది. వాకర్స్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కరెన్సీ నోట్లను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు.. ఆ నోట్లను ఎవరు పడేశారనే కోణంలో దర్యాప్తు చేశారు.మొత్తానికి ఈ నోట్ల మిస్టరీ వీడింది.. ఓ కిరాణా వ్యాపారి వాటిని తీసుకొచ్చి అక్కడ కుప్పగా పోసి వెళ్లినట్లు తేలింది. కేజీహెచ్ ఏరియా తాడివీధికు చెందిన ఆదిమూలం సూర్యారావు ఈ నోట్లను అక్కడ పారేసినట్టు తెలింది. వెంటనే పోలీసులు సూర్యారావు పిలిపించి ఆరా తీయగా.. ఆయన అసలు విషయం చెప్పారు. సూర్యారావు కిరాణా షాపులకు సరుకులను సరఫరా చేస్తున్నారు. ఆయన ఇంట్లో ఓ అట్ట పెట్టెలో కొంత కాలంగా డబ్బులు, ఎల్ఐసీ రసీదులు ఉంచారు. అయితే డబ్బులకు చెదపురుగులు పట్టడాన్ని ఆయన గమచించారు.




