
మాంసాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి పల్లెటూర్లలో తరతరాలుగా వస్తున్న ఒక చక్కటి సంప్రదాయ పద్ధతి వట్టి తునకలు లేదా వట్టి ముక్కల తయారీ.. ప్రత్యేకించి ఎండబెట్టిన మాంసం ముక్కలు (Dry Meat) మంచి మటన్‌తో వీటిని తయారుచేస్తారు. మేక మాంసంతో చేసిన వట్టితునకలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర వండుకోవడానికి చాలా అనుకూలం.. వట్టి తునకల్లో ఎన్నో పోషకాలు దాగుంటాయి. వట్టి తునకల్లో ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ B12 సమృద్ధిగా ఉంటాయి. దీంతోపాటు క్యాల్షియం, ఫాస్పరస్ కూడా ఉంటాయి. ఇవి కండరాల బలానికి, పెరుగుదలకు తోడ్పడటంతోపాటు.. రక్తహీనతను తగ్గించి, రక్తాన్ని వృద్ధి చేస్తాయి.. ఇంకా శరీర రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.. నరాల బలహీనత తగ్గి.. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. నీరసం, అలసటను తక్షణమే తగ్గించి.. ఎముకలకు పుష్టిని అందిస్తుంది. అందుకే.. బాలింతల నుంచి చిన్నా పెద్దా అందరూ.. నెలకు .. రెండు సార్లైనా తినాలని చెబుతుంటారు పెద్దలు..



