
సుమారు 270 క్లినికల్ ట్రయల్స్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం కార్డియో (వాకింగ్, రన్నింగ్), వెయిట్ లిఫ్టింగ్ లేదా హెచ్ఐఐటీ (HIIT) వర్కౌట్లతో పోలిస్తే, రక్తపోటును తగ్గించడంలో ఐసోమెట్రిక్ వ్యాయామాలే అత్యుత్తమ ఫలితాల్ని ఇస్తున్నట్లు వెల్లడైంది. "రోజువారీ జీవనశైలిలో 60 సెకన్ల పాటు ప్లాంక్ చేయడం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఐసోమెట్రిక్ వ్యాయామాలు పెద్ద కండరాల సమూహాలను దృఢంగా మార్చి, రక్త ప్రసరణను వేగవంతం చేస్తాయి. వీటిని క్రమంతప్పకుండా చేస్తే విశ్రాంతి రక్తపోటు స్పష్టంగా తగ్గుతుంది." అని ఎయిమ్స్ స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ (ACSM) పరిశోధనల ప్రకారం, ప్లాంక్ లేదా వాల్ సిట్ వేస్తున్న సమయంలో శరీరంలో తాత్కాలికంగా రక్తపోటు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి:





