
అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రోజుకి ఒక అరటిపండు తినడం వల్ల శరీరంలో అదనపు సోడియం తొలగుతుంది. రక్తపోటు కంట్రోల్ అవుతుందని హెల్త్‌లైన్ తెలిపింది. బీట్రూట్లో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. ఇవి రక్తనాళాలను వెడల్పు చేసి రక్తప్రసరణను ఈజీ చేస్తాయి. దీంతో బీపీ తగ్గుతుంది. పాలకూర, తోటకూర, బచ్చలికూర వంటి ఆకుకూరల్లో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి సోడియం స్థాయిలను తగ్గిస్తాయి. బీపీని అదుపులో ఉంచుతాయి. ఓట్స్‌లో బీటా గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటును తగ్గిస్తుంది. బ్లూ బెర్రీస్, స్ట్రా బెర్రీస్, రాస్ప్ బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తనాళాలను రిలాక్స్‌గా ఉంచుతుంది. వెల్లుల్లి తింటే బీపీ తగ్గుతుంది. నారింజ, బత్తాయి, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. సిట్రస్ పండ్లు తింటే రక్తపోటు స్థిరంగా ఉంటుంది. బాదం, పిస్తా, అవిసె గింజలు, గుమ్మడి గింజలు తినడం వల్ల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి అందుతాయి. నట్స్ తింటే రక్తపోటు కంట్రోల్ అవుతుంది. పెరుగులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటివి ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బీపీని కంట్రోల్ చేస్తాయి.





