
మేష రాశి వారికి ఇంద్ర యోగం ప్రభావంతో ఈరోజు మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు విజయవంతం కావొచ్చు. మంచి మార్గాల ద్వారా నిధులను పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. అనేక రంగాల్లో మీకు అదృష్టం కలిసి రానుంది. అన్ని రంగాల్లో ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. మీకు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. కొత్త మంచి స్నేహితులను కూడా కలుసుకుంటారు. పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనుల్లో అధిక పనిభారం మోయాల్సి రావొచ్చు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు అప్పగించబడొచ్చు. మీ ఇంటి సభ్యులతో కొంత ఇబ్బందిగా ఉండొచ్చు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. వ్యాపారులు ఆశించిన లాభాలు రాకపోవచ్చు. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పరిహారం : ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో ఒక బాధ్యతాయుతమైన పని లభిస్తుంది. మీకు సహోద్యోగుల నుంచి సహకారం లభించొచ్చు. ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు చేసిన పనికి ప్రశంసలు కూడా లభిస్తాయి. దీంతో మీరు సంతోషిస్తారు. మరోవైపు మీరు అనుకోకుండా మీ ప్రియమైన వారిని కలుసుకోవచ్చు, అయితే వారికి వెంటనే సహాయం చేయవలసి రావచ్చు. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, బలహీనంగా భావించకండి. చాలా ఓపికతో వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. పరిహారం : ఈరోజు మీ శక్తి మేరకు దానధర్మాలు చేయాలి. కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో నిరాశ ఎదుర్కోవాల్సి రావొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కొన్ని సందర్భాల్లో ఆకస్మిక ప్రేరణ ప్రభావంతో తీవ్రమైన తప్పులు చేయొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే గురువులు, సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పరిహారం : ఈరోజు ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేయాలి. సింహ రాశి వారికి ఈరోజు ఇంద్ర యోగం ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి. మీరు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. కన్య రాశి వారికి ఈరోజు ఇంద్ర యోగం ప్రభావంతో చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు రావొచ్చు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. మరోవైపు మీ ప్రేమ జీవితంలో సాధారణంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు సీనియర్ల నుంచి ఆశించిన సహకారం లభించొచ్చు. వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. పరిహారం : ఈరోజు హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేయాలి. తులా రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనుల్లో కొంత గందరగోళం ఏర్పడొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మనసులో ఏదో ఒక విషయం గురించి ఆందోళన ఉండొచ్చు. మీరు చేసే పనుల్లో నిరాశ ఎదురుకావొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే బయటి ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఇంద్ర యోగం ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనుల్లో మెరుగైన ఫలితాలు రావొచ్చు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలు పొందొచ్చు. అయితే మీ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పరిహారం : ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. ధనస్సు రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనుల్లో కొంత గందరగోళం ఉండొచ్చు. కాబట్టి మీ పనులు పూర్తి చేయడంలో తొందరపడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ పనులు మరింత ఆలస్యం కావొచ్చు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. అయితే ఉద్యోగులు మాత్రం కార్యాయలంలో తమకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేయొచ్చు. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. పరిహారం : మీ శక్తి, సామర్థ్యాల మేరకు దానధర్మాలు చేయాలి. మకర రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఇంద్ర యోగం ప్రభావంతో మీ కోరికలలో ఒకటి నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు. ఏదైనా ఆలయంలో మొక్కుబడి చేసి ఉంటే, దానిని వెంటనే నెరవేర్చడానికి వెంటనే బయలుదేరండి. ఉద్యోగులు ఈరోజు మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే బయటి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిహారం : ఈరోజు శని మంత్రాలను పఠించాలి. కుంభ రాశి వారికి ఈరోజు రాహువు, గురువు అనుగ్రహంతో మెరుగైన ఫలితాలు రానున్నాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించొచ్చు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి లభించే అవకాశాలున్నాయి. కెరీర్ పరంగా మంచి పురోగతి లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. అయితే బయటి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంచాలి. పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే చాలా కష్టపడాలి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు నివారించాలి. నిరుద్యోగులు ఉద్యోగం కావాలంటే మరింత కష్టపడాలి. మీరు ప్రత్యర్థులపై విజయం సాధించొచ్చు. పరిహారం : ఈరోజు హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేయాలి. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Astrology News and Telugu News




