
ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: బెట్టింగ్‌ యాప్‌ మోసానికి గురైన బాధితుడు ఆన్‌లైన్‌ ద్వారా సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నంకు చెందిన శివ.. తాను క్యూవీఎస్‌ఈ యాప్‌లో రూ.50వేలు పెట్టుబడి పెట్టానని.. మొదట్లో యాప్‌లో డాలర్లు కనిపించాయని, ఆ తర్వాత నుంచి యాప్‌ ఓపెన్‌ కావడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై విచారణ చేపట్టిన ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం బాధితుడి వద్ద వివరాలు సేకరించారు. మరి కొంత మంది విద్యుత్తు సంస్థకు చెందిన ఉద్యోగులు కూడా యాప్‌లో సభ్యులుగా ఉన్నట్లు ఆయన గుర్తించారు. చైన్‌లింక్‌ ద్వారా అనేక మంది యాప్‌లో ఉన్నందున బాధితులు మరి కొందరు బయటకు వస్తారని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు విద్యుత్తు ఉద్యోగులను రహస్యంగా విచారిస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




