
సరైన ఆరోగ్యం కోసం నిద్ర అనేది అత్యంత ముఖ్యమైన అంశం. అయితే, ఆధునిక జీవనశైలిలో చాలా మంది సరైన నిద్ర పొందడంలో కష్టపడుతున్నారు. దీనికి కారణం వారి రోజువారీ అలవాట్లు సరైన ఆరోగ్యం కోసం నిద్ర అనేది అత్యంత ముఖ్యమైన అంశం. అయితే, ఆధునిక జీవనశైలిలో చాలా మంది సరైన నిద్ర పొందడంలో కష్టపడుతున్నారు. దీనికి కారణం వారి రోజువారీ అలవాట్లు కావచ్చు. చాలా మంది తమ నిద్ర నాణ్యతను పాడుచేసే కొన్ని చిన్న చిన్న విషయాలను గమనించడం లేదు. అందువల్ల, ఈ అలవాట్లు ఏవీ, వాటిని ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. మొదటగా, ఫోన్‌ను ఎక్కువగా చూడడం వల్ల నిద్రకు తీవ్ర ప్రభావం పడుతుంది. ఫోన్ స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది, ఇది నిద్రకు అవసరమైన హార్మోన్. అందువల్ల, రాత్రి పడుకునే ముందు కనీసం 60 నిమిషాల ముందు ఫోన్, ల్యాప్‌టాప్ వంటి స్క్రీన్లను దూరంగా ఉంచడం మంచిది. ఇది మెదడుకు విశ్రాంతి ఇవ్వడానికి సహాయపడుతుంది. మరొక ముఖ్యమైన విషయం, సాయంత్రం 4 గంటల తర్వాత కాఫీ లేదా టీలో ఉన్న కెఫీన్‌ను తాగడం. కెఫీన్ శరీరంలో చాలా గంటల పాటు నిలుస్తుంది, ఇది రాత్రి నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి, మధ్యాహ్నం లేదా సాయంత్రం 4 గంటల తర్వాత కెఫీన్ ఉన్న పానీయాలను తీసుకోవడం మానేయడం మంచిది. అలాగే, మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోవడం కూడా రాత్రి నిద్రను పాడుచేస్తుంది. 20-30 నిమిషాల కునుకు మంచిది, కానీ 2-3 గంటల పాటు నిద్రపోతే, అది రాత్రి నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. పడుకునే ముందు ఎక్కువగా నీళ్లు తాగడం కూడా ఒక సమస్య. ఇది రాత్రి 2-3 సార్లు వాష్‌రూమ్‌కు వెళ్లాల్సి రావడంతో నిద్ర చక్రాన్ని భంగపరుస్తుంది.



