
ఆదిలాబాద్ సాంస్కృతికం: హిందూ పండుగలను సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహిస్తామని సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని బ్రహ్మం గారి ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. తనపై నమ్మకంతో నాల్గోసారి అధ్యక్ష పదవి కట్టబెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం, సమితి సభ్యుల సహకారంతో రానున్న దసరా, బతుకమ్మ, దీపావళి, కార్తిక దీపోత్సవం వంటి హిందూ పండుగలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి రేణికుంట రవీందర్, గౌరవ అధ్యక్షులు కందుల రవీందర్, మామిడి రాజు, కోశాధికారి సంతోష్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



