
విజయవాడ కృష్ణలంక పరిధిలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. ఓ బ్యాగ్లో 46 జిలెటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను గుర్తించి స్వాధీనం చేసుకొన్నారు. యూపీ చెందిన ఆసిఫ్ అలీ నరసరావుపేట నుంచి విజయవాడకు బస్సులో వెళ్తూ.. అక్కడ తన బ్యాగ్ బదులు మరొకరి బ్యాగ్ ఉండటం గుర్తించి దాన్ని తెరిచిచూడగా, అందులో బాంబులు ఉండటం గమనించి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీనిపై కేసు నమోదుచేసిన కృష్ణలంక పోలీసులు ప్రయాణికుల వివరాలు, సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.




