
పటమట: బస్సు ప్రయాణంలో పొరపాటున మారిన ఓ లగేజ్ బ్యాగ్‌లో భారీగా పేలుడు పదార్థాలు బయటపడటం విజయవాడలో కలకలం రేపింది. 46 జెలాటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రిక్ డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి పండిట్ నెహ్రూ బస్‌స్టాండ్ పోలీస్ అవుట్ పోస్టు వద్దకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆఫిక్ ఆలి అనే ప్రయాణికుడు వచ్చాడు. తాను నరసరావుపేట నుంచి బస్సులో విజయవాడకు వస్తుండగా.. తన లగేజ్ బ్యాగ్ మరో ప్రయాణికుడి బ్యాగ్‌తో పొరపాటున మారిపోయిందని పోలీసులకు తెలిపాడు. అయితే, ఆ బ్యాగ్‌ను పరిశీలించిన పోలీసులకు అందులో అనుమానాస్పద పేలుడు పదార్థాలు కనిపించాయి. తనిఖీ చేయగా 46 జెలాటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, బ్యాగ్ ఎవరిది? ఈ పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.