
Team India: భారత క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ అనుసరిస్తున్న ఎంపిక విధానంపై మాజీ క్రికెటర్, చీఫ్ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌లను జట్టులో పక్కన పెడుతున్న తీరుపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు.





