
Vaibhav Sooryavanshi: అంతర్జాతీయ క్రికెట్ వేదికగా భారత క్రికెట్ జట్టు (Team India) తో చారిత్రక పోరుకు సిద్ధమవుతున్న వేళ జపాన్ క్రికెట్ జట్టు (Japan Cricket Team) సారథి కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ (Kendel Kadowaki-Fleming) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సెప్టెంబర్ 22న ఇరు జట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్ జరగనుంది. దూకుడైన ఆటతీరుతో అండర్-19 స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ వేదికపై పలు రికార్డులు నెలకొల్పిన 15 ఏళ్ల లెఫ్టార్మ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే అతడిని నిలువరించడం తమకు పెద్ద సవాల్ కాదని జపాన్ కెప్టెన్ పేర్కొన్నారు. గతంలో అండర్-19 ఆసియా కప్ (Asia Cup) పోరులో తమ 17 ఏళ్ల యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ చార్లీ హరా-హింజ్ (Charlie Hara-Hinze) బౌలింగ్లో వైభవ్ ఔటైన విషయాన్ని గుర్తు చేస్తూ, అతడిని పెవిలియన్ పంపేందుకు సరైన ప్రణాళిక ఉందని వెల్లడించారు.





