
టీమిండియా సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ సోదరుడు మహమ్మద్ కైఫ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో పరిధిలోని ఆషియానా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బెంగాల్ (Bengal) రంజీ ట్రోఫీ (Ranji Trophy) జట్టులో ఆడుతున్న కైఫ్, గత ఆరేళ్లుగా పెళ్లి పేరుతో తనను మోసం చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ విడాకులు తీసుకున్న మహిళ ఆరోపించారు. ఎయిర్‌లైన్స్ సంస్థలో కేబిన్ క్రూగా విధులు నిర్వహిస్తున్న తనతో బలవంతంగా ఉద్యోగం కూడా మాన్పించాడని బాధితురాలు పేర్కొన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) వేలం పూర్తయిన తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పి, ఆపై కుటుంబ సభ్యులతో కలిసి బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో వెల్లడించారు.





