
IND vs AFG : స్వదేశంలో అఫ్గనిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్ కాసేపట్లో మొదలవ్వనుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు. అందరూ ఊహించినట్టే వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) బెంచ్‌కే పరిమితయ్యాడు. రెగ్యులర్ ఓపెనర్ సంజూ శాంసన్‌ను పక్కన పెట్టడంపై విమర్శలు వస్తున్న వేళ.. ఈసారి వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అఫ్గన్ టీ20 కెప్టెన్‌గా తొలి సిరీస్ ఆడుతున్న ఇబ్రహీం జద్రాన్ మాట్లాడుతూ.. భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తామని చెప్పాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు స్వదేశంలో పంజా విసరాలనుకుంటోంది. వరసగా రెండు సిరీస్‌లు చేజారినందున అఫ్గనిస్థాన్‌పై క్లీన్‌స్వీప్ లక్ష్యంగా ఆడనుంది టీమిండియా. ఆదివారం తొలి టీ20ని విజయంతో మొదలెట్టాలని భావిస్తున్న శ్రేయాస్ అయ్యర్ సేన బౌలింగ్ తీసుకుంది. ఫిట్నెస్ నిరూపించుకున్న నితీశ్ రెడ్డి, సుందర్, బుమ్రాలు తుది జట్టులోకి రాగా.. వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అఫ్గనిస్థాన్ కూడా మూడేళ్ల తర్వాత పునరాగమనం చేయాలనుకున్న నవీన్ ఉల్ హక్‌ను తీసుకోలేదు. India’s world cup openers get the nod against Afghanistan 🤝 Vaibhav Sooryavanshi is on the bench pic.twitter.com/BDp3O2kWU6 — Cricinfo (@cricinfo) September 13, 2026 భారత తుది జట్టు: సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సుందర్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి. అఫ్గనిస్థాన్ తుది జట్టు: ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సెడీకుల్లా అటల్, డార్విష్ రసూలి, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్ నయీబ్, నబీ, రషీద్ ఖాన్, ముజీబ్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫారూఖీ.






