
Sanjiv Goenka Comments on Vaibhav Sooryavanshi: ఆఫ్ఘానిస్తాన్ జట్టుతో తలపడేందుకు భారత జట్టు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో అందరి ఫోకస్ టీమిండియా యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) పై నిలిచింది. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఓనర్ సంజీవ్ గోయెంకా (Sanjiv Goenka) బుడ్డోడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) వేలంలో వైభవ్‌ను దక్కించుకోలేకపోవడంపై తన పశ్చాత్తాపాన్ని వెల్లడిస్తూ, అతడిలోని ప్రత్యేక ప్రతిభను కొనియాడారు.






