
అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 పోరులో సంజు శాంసన్ వికెట్ ఆరంభంలోనే పడిపోయినప్పటికీ, అభిషేక్ శర్మ ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా ఎదురుదాడి చేశాడు. కేవలం 22 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్, బంతుల పరంగా టీ20 క్రికెట్ చరిత్రలో రెండో వేగవంతమైన 6000 పరుగుల ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 3420 బంతుల్లోనే ఆరు వేల పరుగుల మార్కును అధిగమించి ఆండ్రీ రసెల్ (Andre Russell), టిమ్ డేవిడ్ (Tim David), ఫిల్ సాల్ట్ (Phil Salt) వంటి పవర్ హిట్టర్ల రికార్డులను తిరగరాశాడు. భారత క్రికెట్ జట్టు (Team India) తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు వివిధ టీ20 లీగ్‌లలో అతడు చూపించిన నిలకడైన దూకుడుతో ఈ అరుదైన ఘనత సాధ్యమైంది.





