
India vs Afghanistan: భారత క్రికెట్ జట్టు (Team India) మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakaravarthy) దురదృష్టవశాత్తూ మరోసారి గాయపడ్డాడు. ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) తో ఢిల్లీ వేదికగా ముగిసిన తొలి టీ20 మ్యాచ్లో బరిలోకి దిగిన ఈ 35 ఏళ్ల స్పిన్నర్.. కేవలం ఒకే మ్యాచ్ ఆడి గాయం బారిన పడి సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గతంలో తగిలిన గాయం కారణంగా జింబాబ్వే (Zimbabwe) పర్యటనకు సైతం దూరమైన వరుణ్, బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (BCCI Centre of Excellence – CoE) లో దాదాపు 2 నెలల పాటు పునరావాసం పొందాడు. ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. తొలి పోరులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, మ్యాచ్ ముగిశాక గాయం తిరగబెట్టడంతో మిగిలిన రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు.





