
ఇంటర్నెట్ డెస్క్: దివంగత నటి శ్రీదేవి (Sridevi) చెన్నై ఆస్తి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఆ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న ఈ స్థలంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. తదుపరి విచారణ వరకు అక్కడ యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశించింది. ఆస్తి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు సూచించింది. శ్రీదేవి 1988లో చెన్నై ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డులో 4.77 ఎకరాల స్థలాన్ని ముదలియార్‌ అనే వ్యక్తి కుటుంబం నుంచి కొనుగోలు చేశారు. దశాబ్దాలుగా ఇది శ్రీదేవి కుటుంబం ఆధీనంలోనే ఉంది. శ్రీదేవి మరణానంతరం 2023లో ఆస్తి మార్పిడి కోసం దరఖాస్తు చేసుకోగా.. ముదలియార్ రెండో భార్య పిల్లలైన ఎం.సి.శివగామి, ఆమె సోదరుడు ఈ ఆస్తిలో తమకూ వాటా ఉందంటూ చెంగల్పట్టు కోర్టులో సివిల్ కేసు వేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ శ్రీదేవి భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు (Sridevis Chennai Property Case). మొదటి భార్య ప్రాణాలతో ఉండగానే ముదలియార్ రెండో పెళ్లి చేసుకున్నారని, కాబట్టి రెండో భార్య పిల్లలకు చట్టపరంగా వారసత్వ హక్కులు ఉండవని వాదించారు. వారితో ఏకీభవించిన మద్రాస్ హైకోర్టు.. కింది కోర్టు తీర్పులో జోక్యం చేసుకుంటూ శివగామి వేసిన సివిల్ కేసును కొట్టివేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ శివగామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు ప్రాథమిక దశలో ఉండగానే హైకోర్టు లోతుగా విచారణ (మినీ-ట్రయల్) జరిపిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. కపూర్ కుటుంబం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. 1988లో జరిగిన కొనుగోలుపై ఇన్నేళ్ల తర్వాత (2025లో) కేసు వేయడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్లు 1995, 1999లోనే మేజర్లు అయ్యారని గుర్తుచేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఇందుకోసం ఓ విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తిని నియమిస్తామని తెలుపుతూ తదుపరి విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఇంటర్నెట్‌ డెస్క్: ఇండస్ట్రీలో క్యూట్‌ కపుల్‌ అనగానే గుర్తొచ్చేది సూర్య (Suriya)- జ్యోతిక జోడీనే. వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల ఘనంగా వేడుక చేసుకున్నారు. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆస్మాన్’.




