
కరీంనగర్: వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన కుమారుడితోనే ఆస్తి వివాదం తలెత్తడంతో ఓ వృద్ధ దంపతులు ఇంటి ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. ‘‘ఈ వయసులో మేమెక్కడికి వెళ్లాలి.. మా పరిస్థితిని అర్థం చేసుకుని న్యాయం చేయండి’’ అంటూ వారు అధికారులను వేడుకున్నారు. కోతిరాంపూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.





