
దివంగత నటి శ్రీదేవికి చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో 2.7 ఎకరాల స్థలం ఉంది. అయితే, ఇందులో తమకూ వాటా ఉందంటూ శివకామి అనే మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఇది విచారణకు అర్హత లేదని మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. దీంతో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం తాజాగా కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అలాగే, శ్రీదేవి భర్త బోనీ కపూర్, వారి ఇద్దరు కూమార్తెలకు నోటీసులు జారీచేసింది.