చివరిగా అప్డేట్ చేసిన సమయం:
దక్షిణాది సీనియర్ నటి వడివుక్కరసి మరణించినట్లు సోషల్ మీడియాలో వ్యాపించిన వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఓ తమిళ ఛానల్‌తో మాట్లాడుతూ.. తాను పూర్తి ఆరోగ్యంతో, నిక్షేపంగా బతికే ఉన్నానని స్పష్టం చేస్తూ వదంతులకు చెక్ పెట్టారు. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 350కి పైగా సినిమాలు, 40కి పైగా సీరియల్స్‌లో నటించిన ఆమె, తెలుగులో ‘అమ్మోరు’ చిత్రంలోని క్రూరమైన ‘లీలమ్మ’ పాత్రతో చిరస్థాయిగా నిలిచిపోయారు. ‘శివాజీ’, ‘అశోక్’, ‘అందాల రాముడు’ చిత్రాలతో పాటు ఇటీవల ‘ఊరు పేరు భైరవకోన’, ‘స్వాగ్’ చిత్రాలతోనూ తెలుగు ప్రేక్షకులను అలరించారు.
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Samayam Telugu లో చూడండి