
సింగపూర్ బృందం తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో వెల్లడించింది. అసెంబ్లీ ఛాంబ సింగపూర్ బృందం తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో వెల్లడించింది. అసెంబ్లీ ఛాంబర్లో జరిగిన ఈ సమావేశంలో, సింగపూర్ ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ నేతృత్వంలో ఉన్న ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకుంది. ఈ సందర్భంగా, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ఆర్థిక సహాయం అందించడానికి, అలాగే పెట్టుబడులు పెట్టడానికి సింగపూర్ బృందం ప్రాధాన్యతను చూపించాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన అంశాలను, ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల గురించి కూడా సీఎం వారికి వివరించారు. ముఖ్యంగా, రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. సంగమ స్థలమైన గాంధీ సరోవరం వరకు మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా చేపట్టిన పనుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ ప్రతినిధులకు వివరించారు. నదీ తీరం అభివృద్ధి, నైట్ ఎకానమీ వ్యవస్థను ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీని నెట్ జీరో నగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తామని సీఎం చెప్పారు.





