
ప్రతిరోజూ ధ్యానం, డీప్ బ్రీతింగ్ వంటి శ్వాస వ్యాయామాలు చేయండి. దీంతో కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పి కంట్రోల్ అవుతుందని క్లీవ్‌లాండ్ క్లీనిక్ తెలిపింది. డీహైడ్రేషన్ వల్ల మెదడు అలసిపోతుంది. తలనొప్పి వస్తుంది. కాబట్టి ప్రతిరోజూ సరిపడా నీరు తాగండి. రోజుకి 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోండి. దీని వల్ల మెదడుకు తగిన విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. టెన్షన్ తలనొప్పులు తగ్గుతాయి. నిద్రపోయేటప్పుడు సరైన భంగిమను ఫాలో అవ్వండి. వెన్నెముకను నిటారుగా ఉంచేలా దిండును ఉపయోగించండి. దీంతో కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. టెన్షన్ తలనొప్పులు తగ్గుతాయి. ఆఫీస్‌లో వర్క్ చేసేటప్పుడు నిటారుగా కూర్చోండి. కంప్యూటర్ స్క్రీన్‌ను మీ కంటి స్థాయిలో ఉంచండి. దీని వల్ల బాడీ, మైండ్ రిలాక్స్ అవుతాయి. ఆఫీస్‌లో పని చేస్తున్నప్పుడు రెగ్యులర్‌గా విరామాలు తీసుకోండి. ప్రతి అరగంటకు 5 నిమిషాల పాటు విరామం తీసుకోండి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. భోజనం స్కిప్ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి. దీంతో తలనొప్పి వస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా భోజనం చేయండి. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి స్థాయిలు తగ్గుతాయి. దీని వల్ల తలనొప్పి వస్తుంది. కాబట్టి కాఫీలు తాగడం తగ్గించండి. రోజులో అప్పుడప్పుడు స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయండి. దీని వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. కండరాల ఒత్తిడి తగ్గుతుంది. టెన్షన్ తలనొప్పి తగ్గుతుంది.



