
చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల ట్రైగ్లిజరాయిడ్స్ స్థాయిలు పెరుగుతాయి. మనం తినే అదనపు చక్కెరను కాలేయం ట్రై గ్లిజరాయిడ్స్గా మార్చుతుంది. కాబట్టి షుగరీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని క్లీవ్‌లాండ్ క్లీనిక్ తెలిపింది. మైదాతో చేసే ఫుడ్, వైట్ బ్రెడ్, పాస్తా వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరాయిడ్స్ పెరుగుతాయి. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల చక్కెర శోషణ తగ్గుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ తగ్గుతాయి. ఓట్స్, బీన్స్, ఆకుకూరల్లో ఫైబర్ ఉంటుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ తగ్గుతాయి. సాల్మన్, ట్యూనా, వాల్నట్స్, అవిసె గింజల్లో ఒమేగా-3 లభిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. రోజుకి 30 నిమిషాల చెప్పున్న వారానికి 150 నిమిషాల పాటు వ్యాయామం చేయండి. దీంతో చెడుకొవ్వు, ట్రైగ్లిజరాయిడ్స్ కరుగుతాయి. అధిక బరువు పలు సమస్యలకు కారణం అవుతుంది. మీరు ఊబకాయంతో బాధపడుతున్నట్లయితే మీ బరువులో 5 శాతం తగ్గితే చాలు.. ట్రైగ్లిజరాయిడ్స్ స్థాయిలు గణణీయంగా తగ్గుతాయి. మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆల్కాహాల్లో కేలరీలు, చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఆల్కాహాల్ సేవించడం వల్ల ట్రైగ్లిజరాయిడ్స్ పెరుగుతాయి. రోజులో 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోండి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలోని కణాలు ఆరోగ్యంగా మారుతాయి. ట్రైగ్లిజరాయిడ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఒత్తిడి వల్ల బాడీలో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి కాలేయం నుంచి ట్రైగ్లిజరాయిడ్స్ ఎక్కువగా విడుదల అయ్యేలా చేస్తాయి. కాబట్టి ఒత్తిడి తగ్గించుకోండి. ధ్యానం, డీప్బ్రీత్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది.



