
కంపేరిజన్ వల్ల అనేక సమస్యలు వస్తాయి. మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవద్దు. ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణం, జీవిత గమ్యం వేరుగా ఉంటాయని తెలుసుకోండి. దీన్ని తెలుసుకుంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవచ్చు. మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీసే పనులకు దూరంగా ఉండండి. మీరు చేయలేని, మీకు ఇష్టం లేని పనులు చేయకండి. అటువంటి పనులు మీకు అప్పగిస్తే వెంటనే నో చెప్పండి. రోజులో కొంతసేపు మీకు నచ్చిన పనులు చేయండి. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం వంటివి చేయండి. రోజులో కాసేపు కామ్‌గా కూర్చోండి. నిశ్శబ్ధంగా ఒక చోట కూర్చోని ఉండటం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. మిమ్మల్ని మీరు బాగా అర్ధం చేసుకోవచ్చు. గతంలో మీరు చేసిన తప్పులకు నిత్యం గుర్తు చేసుకుంటూ బాధపడవద్దు. తెలిసీ, తెలియక చేసిన తప్పుల్ని క్షమించుకోండి. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి. మీ పట్ల మీరు నిత్యం పాజిటివ్‌గా ఉండండి. మీ ఆలోచనలు కూడా పాజిటివ్‌గా ఉండేలా చూడండి. నెగటివ్ ఆలోచనలు వద్దు. నిత్యం నెగిటివ్‌గా మాట్లాడే వారు, చాడీలు చెప్పేవారికి నెగిటివ్‌గా ఆలోచించేవారికి దూరంగా ఉండండి. దీంతో మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు సాధించిన విజయాలను సెలబ్రేట్ చేసుకోండి. మీరు సాధించిన విజయాలు చిన్నవైనా అభినందనలు తెలుపుకోండి. దీంతో స్వీయ ప్రేమ పెరుగుతుంది. మీరు జీవితంలో సాధించిన అంశాల పట్ల కృతజ్ఙత వ్యక్తం చేయండి. మీలో ఉన్న మంచి విషయాలను, స్కిల్స్‌ను గుర్తించండి.



