
వినాయకచవితి అనగానే కోలాహలం మామూలుగా ఉండదు. ప్రతి కాలనీలో పదుల సంఖ్యలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి నవరాత్రులు పూజలు చేసి.. గణనాథుణ్ని గంగమ్మ ఒడికి పంపిస్తారు. అయితే వీటిలో ఎక్కువగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలు ఉండటమే సమస్యకు కారణం అవుతోంది. దీంతో పర్యావరణహితంగా.. పుణ్యక్షేత్రాల నుంచి సేకరించిన మట్టితో, సముద్ర ఉత్పత్తులతో వినాయకుణ్ని తయారు చేశారు ఎమ్మిగనూరు ప్రాంత వాసులు. మత్స్యావతారంలో ఈ మహాగణపతి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు.