
Samsung | శాంసంగ్ తన ‘ఫ్యాన్ ఎడిషన్ (FE)’ అయిన గెలాక్సీ S26 FE ఫోన్‌ను సోమవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గతేడాది విడుదల చేసిన S26 మోడల్‌కు తరువాతి వెర్షన్‌గా దీన్ని తీసుకువచ్చింది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్‌తో 6.7 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2X డిస్ప్లే కలిగి ఉంది. OISతో 50 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 8 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరాలు ఉన్నాయి. మూడింతల ఆప్టికల్ జూమ్ వ్యవస్థ ఉంది. 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత One UI 9తో పనిచేస్తుంది. అదేవిధంగా ఈ ఫోన్ Exynos 2500 ప్రాసెసర్, 4900 సామర్థ్యం గల బ్యాటరీని కలిగి ఉంది. ధర 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో, పిస్తాచియో (Pistachio), బ్లూబెర్రీ, గ్రాఫైట్ రంగుల్లో లభించే ఈ ఫోన్ ధర రూ. 79,999గా ఉంది. 128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 69,999. పాత ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా రూ. 8000 తగ్గుతుంది. ప్రముఖ బ్యాంకుల ద్వారా 30 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయంతో పాటు అదనంగా రూ. 3000 బోనస్ పొందే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రముఖ బ్యాంకుల కార్డులపై రూ. 7000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది.





