
అమరావతి: ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత పురుష ఆర్చర్‌గా ధీరజ్ బొమ్మదేవర చరిత్ర సృష్టించారని సీఎం చంద్రబాబు ( Chandrababu ) కొనియాడారు. విజయవాడ ఆర్చరీ గ్రౌండ్స్ నుంచి మెక్సికోలోని ప్రపంచ వేదిక వరకు ధీరజ్ అద్భుత ప్రస్థానం సాగిందని అభినందించారు. పట్టుదల, ఏకాగ్రత, కఠోర సాధనతో ప్రపంచస్థాయి విజయాన్ని అందుకున్న ధీరజ్.. రాష్ట్రంలోని యువ ప్రతిభకు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. ధీరజ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ధీరజ్ బొమ్మదేవరకు మంత్రి నారా లోకేశ్‌ అభినందనలు తెలిపారు. ఆయన విజయం ఆంధ్రప్రదేశ్ క్రీడా కీర్తిని ప్రపంచస్థాయికి చాటిందన్నారు. మరోవైపు మహిళల ఆసియా కప్ టీ20 విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు కూడా లోకేశ్‌ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో అద్భుతంగా రాణించి ఎనిమిదో సారి టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీ చరణి నాలుగు వికెట్లు తీసి సత్తా చాటడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వినాయక చవితి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. సోమవారం పండగ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేశారు. భిన్న రూపాల్లో తీర్చిదిద్దిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆ ఫొటోలు మీ కోసం..





