
మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కొడుకుకు ఓటేసిన ఆ తల్లి.. మరుసటి రోజే ప్రాణాలు కోల్పోయింది. ఒక్క ఓటు తేడాతో బీజేపీ అభ్యర్థిపై గెలిచిన కుమారుడు.. అమ్మ తనను గెలిపించిందని తెలిసి భావోద్వేగానికి లోనయ్యాడు. హోరాహోరీగా సాగిన పోరులో అమ్మ తనను గెలిపించి మరునాడే కన్నమూయడంతో అతడితోపాటు కుటుంబ సభ్యులు, ఆ ప్రాంత ప్రజలు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటన రాజస్థాన్లోని నద్బాయి మున్సిపాలిటీలో చోటు చేసుకుంది.




