
హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు ( Chandrababu )ను హైదరాబాద్‌లోని నివాసంలో మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్‌ 22న జరిగే అలయ్-బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. ‘అలయ్-బలయ్’.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని.. వివిధ రాజకీయ, సామాజిక వర్గాల మధ్య స్నేహం, సోదరభావం, ఐక్యతను పెంపొందించే వేదికగా ఈ కార్యక్రమం కొనసాగుతోందని దత్తాత్రేయ తెలిపారు. తన ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించిన చంద్రబాబు.. ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చినట్లు దత్తాత్రేయ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, తెలుగు ప్రజల ఐక్యత, పరస్పర సహకారం తదితర అంశాలపై చర్చించినట్లు చెప్పారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. నల్గొండ (Nalgonda) జిల్లా నేరడుగొమ్ము మండలం వైజాగ్‌ కాలనీలో ఓ కారు (car) బీభత్సం సృష్టించింది. జగిత్యాల(Jagitial) జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ మరోసారి తన ప్రతిభను చాటారు.



