
రాయగడ గ్రామీణం: ఉపాధి కోసం సొంత ఊరు వదిలి వలస కూలీగా పనిచేసేందుకు తమిళనాడు వెళ్లిన రామారావు కుల్షిక (30) అనే యువకుడు అనారోగ్య కారణాలతో సోమవారం మృతి చెందాడు. మృతుడిది రాయగడ జిల్లా కల్యాణసింగ్పూర్ బ్లాక్, సునాఖుంటి పంచాయతీ పరిధిలోని ఖజురీగుడ. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. 15 రోజుల క్రితమే రామారావు కూలీ పనుల కోసం తమిళనాడులోని ఈరోడ్‌కు వెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి రామారావు మృతదేహం స్వగ్రామానికి ఎలా తీసుకురావాలన్న ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. మరోవైపు కుమారుడి మృతి వార్త తెలుసుకున్న వృద్ధ తల్లి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రామారావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి జిల్లా యంత్రాంగం తరఫున సహాయం అందిస్తామని రాయగడ జిల్లా కార్మిక అధికారి రవీంద్రనాథ్ త్రిపాఠి తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




