

- శాంసంగ్ గెలాక్సీ A56 5జీ ధర భారీగా తగ్గిందోచ్
- 6.7-అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ డిస్ప్లే
- 5,000mAh బ్యాటరీ, 50MP మెయిన్ కెమెరా సెటప్
Samsung Galaxy A56 5G : శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. రూ.35 వేల బడ్జెట్లో మంచి శాంసంగ్ 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ A56 5జీ ఇప్పుడే కొనేసుకోవచ్చు.
ఈ ఫోన్‌పై ప్రస్తుతం ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ A56 5జీ ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999గా ఉంది. పూర్తి ఫోన్ ఆఫర్లు, ధరకు సంబంధించి వివరాలివే..
దీనికి అదనంగా PNB క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే.. రూ.2వేలు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. తద్వారా ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.32,999కు తగ్గుతుంది. లాంచ్ ధరతో పోలిస్తే దాదాపు రూ.9 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.
Read Also : Honor Play 11 Launch : 8300mAh బ్యాటరీతో హానర్ కొత్త ఫోన్.. నీటిలో పడినా నో టెన్షన్!
ఫీచర్ల విషయానికి వస్తే.. :
ఈ శాంసంగ్ ఫోన్లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ + సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్లో ఎక్సినోస్ 1580 ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7తో రన్ అవుతుంది. కెమెరా పరంగా 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 5MP మాక్రో కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా లభిస్తుంది.
బ్యాటరీ విషయానికి వస్తే.. :
5,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. IP67 రేటింగ్ కూడా ఎంది, వాటర్, డస్ట్ నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. మొత్తంగా రూ.35 వేలలో శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్న వారికి గెలాక్సీ A56 5జీ అదిరిపోయే ఆప్షన్. సెల్ఫీలు వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, NFC, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.




