
Ponguleti Srinivas Reddy | దాదాపు మూడేండ్లకే పాలేరు ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీద మొఖం మొత్తిందా? సిట్టింగ్ నియోజకవర్గం నుంచి పరారయ్యే ఆలోచనతో ఉ న్నారా? రాబోయే ఎన్నికల కోసం ఇప్పటినుంచే నియోజకవర్గ మార్పు కోసం పా వులు కదుపుతున్నారా?
© 2026 nimisham.in

Ponguleti Srinivas Reddy | దాదాపు మూడేండ్లకే పాలేరు ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీద మొఖం మొత్తిందా? సిట్టింగ్ నియోజకవర్గం నుంచి పరారయ్యే ఆలోచనతో ఉ న్నారా? రాబోయే ఎన్నికల కోసం ఇప్పటినుంచే నియోజకవర్గ మార్పు కోసం పా వులు కదుపుతున్నారా?
Ponguleti Srinivas Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): దాదాపు మూడేండ్లకే పాలేరు ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీద మొఖం మొత్తిందా? సిట్టింగ్ నియోజకవర్గం నుంచి పరారయ్యే ఆలోచనతో ఉ న్నారా? రాబోయే ఎన్నికల కోసం ఇప్పటినుంచే నియోజకవర్గ మార్పు కోసం పా వులు కదుపుతున్నారా? సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు ఆసరాగా చేసుకొని కొత్తగూ డెంలో అడ్డా పెట్టారా? ఖమ్మం జిల్లాలో జ రుగుతున్న పరిణామాలు, పొంగులేటి రా జకీయ అడుగులను గమనిస్తే..‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నదని ఖమ్మం కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. పాలేరు గడ్డపై పట్టు నిలుపుకొనేందుకు మంత్రి పొంగులేటి స్వయంగా చేయించిన రహస్య సర్వే ఫలితం ఆయన రాజకీయ భ విష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తినట్టు చెప్తున్నా రు. కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంక్ గా ఉన్న నియోజకవర్గంలోనే, సిట్టింగ్ మంత్రిపై ఊహించనంత ప్రజావ్యతిరేకత వ్యక్తం కావటం మంత్రిని దిగ్భ్రాంతికి గురిచేసినట్టు తెలిసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్థానిక అభివృద్ధి నిధుల కేటాయింపుల్లో పారదర్శకత లోపించిందని, కేవలం అనుచరులకే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు మంత్రికి ఇబ్బందిగా మారినట్టు స మాచారం. నాటినుంచి పార్టీ జెండా మోసి న సీనియర్లు, ద్వితీయ శ్రేణి నేతలు పూర్తి గా మూలనపడిపోవడంతో.. పాత, కొత్త నాయకుల మధ్య తీవ్ర అగాధం మండలాల వారీగా గ్రూపు తగాదాలకు దారితీసినట్టు సర్వేలు తేల్చాయని చెప్తున్నారు. మున్ముందు ఈ అంతర్గత సెగ మరింత రాజుకొని వచ్చే ఎన్నికల నాటికి తన గెలు పు అవకాశాలను గల్లంతు చేయడం ఖా యమని గ్రహించిన పొంగులేటి.. ఎదురుదెబ్బ తగులకముందే సేఫ్‌జోన్‌లోకి జారుకోవాలనే పకాప్లాన్తోనే కొత్తగూడెం వైపు కదులుతున్నారని చెప్తున్నారు. అధికార పీఠం దకిన నాటినుంచే పా లేరు ప్రజలకు పొంగులేటి అందని ద్రాక్షగా మారిపోయారని క్షేత్రస్థాయిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. సొంత నియోజకవర్గ ప్రజలు తమ గోడు వెళ్లబోసుకోవాలన్నా, గ్రామాల్లోని చిన్నాచితక సమస్యలు, అత్యవసర పనుల పరిషారం కోసం ఆయనను కలవాలన్నా అందుబాటులో ఉండటం లేదంటున్నారు. సచివాలయ గదులు, హైదరాబాద్ క్యాంప్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తు న్నదని విమర్శిస్తున్నారు. ఎలాగోలా అపాయింట్మెంట్లు సంపాదించి మంత్రి వద్దకు వెళ్లినా ఊరట అటుంచి తీవ్ర అసహనం, నిర్లక్ష్యం ఎదురవుతున్నదనే ఆరోపణలు న్నాయి. ఈ నేపథ్యంలో తన సిట్టింగ్ స్థానమైన పాలేరు చేజారిపోతున్నదని నిఘా వర్గాలు, అంతర్గత సర్వేలు హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో కొత్తగూడెం వైపు పరుగులు తీస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచిచూడాలని ప్రాథమికంగా భావించినప్పటికీ, పాలేరులో క్షేత్రస్థాయి సమీకరణలు వేగంగా ప్రతికూలం గా మారుతుండటంతో అకడ మళ్లీ బరిలోకి దిగడం రాజకీయంగా ఏమాత్రం క్షే మదాయకం కాదన్న తుది నిర్ణయానికి పొంగులేటి వచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో మైత్రి కట్టి కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఘన విజయం సాధించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నాటికి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్-సీపీఐ మధ్య పొత్తులు కుదిరినప్పటికీ, కొత్తగూడెంలో మాత్రం కుదరకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్, సీపీఐ వేర్వేరుగా బరిలోకి దిగడానికి పొంగులేటి తెరవెనుక రచించిన వ్యూహాలే కారణమని సీపీఐ నా యకత్వమే బహిరంగంగా ఆరోపించింది. భవిష్యత్తులో తన అడ్డాను సుస్థిరం చేసుకోవాలనే వ్యూహంతోనే కాంగ్రెస్‌ను ఒంటరిగా బరిలోకి దింపారని, మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను భుజసంధాలపై వేసుకుని మేయర్ పీఠం కోసం సర్వశక్తులూ ఒడ్డారనే ప్రచారం బలంగా జరిగింది. కొత్తగూడెంలో పట్టు సాధించాలంటే సింగరేణి శ్రామికవర్గం మద్దతు అత్యంత ఆవశ్యకం. గతంలో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లోనూ ఐఎన్టీయూసీ తరఫున పొంగులేటి కీలకంగా వ్యవహరించి పరపతిని పెంచుకున్నారంటారు. కార్మిక సంఘాలు, నేతలతో ప్రత్యేక నెట్వర్ను కొనసాగిస్తూ, పాలేరులో ఎదురవుతున్న తీవ్ర వ్యతిరేక పవనాల నుంచి తప్పించుకోవడానికి కొత్తగూడెంను రాజకీయ రక్షణ కవచంగా మలుచుకునేందుకే ఆయన పావులు కదుపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.





