
రవాణా రంగ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వచ్చిన డిమాండ్‌కు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త రవాణా వాహనాల రిజిస్ట్రేషన్లపై ప్రత్యేక సెస్ విధించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆటోలు, క్యాబ్‌లు, లారీలు, బస్సులపై సెస్ విధించి వచ్చే ఆదాయాన్ని బోర్డుకు వినియోగించాలని భావిస్తోంది. డ్రైవర్లు, క్లీనర్లు, కండక్టర్లు, లోడింగ్ కార్మికులు, గ్యారేజీ సిబ్బందికి బీమా, విద్యా సహాయం వంటి పథకాలు అందే అవకాశం ఉంది. కర్ణాటక, కేరళల్లో ఇప్పటికే ఇలాంటి విధానాలు అమల్లో ఉన్నాయి.



